Wednesday, October 5, 2016

శంభో, తవారాధనం!

జీవితంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు, సరదావి కొన్ని, seriousవి ఇంకొన్ని, blogలో postsలాగా రాయడానికి inspire చేస్తూ ఉంటాయి. కానీ, ఈ మధ్య విన్న శ్లోకంలోని అంత్యపాదం, వినగానే ఎంతగా నచ్చిందంటే, ఒక 2-3 రోజుల వరకూ, నా ఆలోచనల్లోంచే పోలేదంటే అతిశయోక్తి కాదు. Seriousగా ఇబ్బంది పడ్డా. ఇబ్బందంటే కష్టమైన ఇబ్బంది కాదు, ఇష్టమైన ఇబ్బందే. అసలు నన్నొదిలిపోందే! చివరికి, blog open చేసి, "త్వరలో" అని రాసిపెట్టి, "నిను పుర్తిగా వదిలేయడంలేదు, కంగరు పడకు (నన్ను పెట్టకు), కొద్దిగా వీలు దొరికిన తర్వాత వస్తాను, నీకు జరగాల్సిన న్యాయం, ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే తీరతాను" అని చెప్పిన తర్వాతగానీ, మామూలు మనిషినవలేక పోయాను.  ఇదంతా జరిగికూడా already 5 నెలలైంది. ఈలోపు ఎన్నోసార్లు attempt చేశానేగానీ, అనుకున్నంతగా న్యాయం జరగలేదని ఆపేశాను. ఈసారి ఎలాగైనా గౌరవించుకోవాలని పూనుకొని రాస్తున్న ప్రయత్నమిది.

ఈమధ్య కాలంలో, మన తెలుగు రాష్ట్రాల్లో (బయట కుడా అనుకుంటా) బాగా ఎక్కువైన పిచ్చి, భక్తి. అనుమానాలేం పెట్టుకోకండి, నేను నాస్తికున్ని కాను, గర్వపడే హిందువుని, అక్షరాలా ఆస్తికున్ని. Just clarity కోసం. పొద్దున లేచిన దగ్గర్నుంచి, జనాలు, భక్తి చానెళ్లూ, వాటిలో ప్రొగ్రాంలూ చూస్తూ, వాళ్లు వడ్డించే భయాలు, మూఢనమ్మకాలు, breakfastలాగా తింటూ, ఇంటిల్లిపాదికీ సుఖం లేకుండా చేస్తున్నారని నా గట్టి నమ్మకం. మా అమ్మ దేవతే నాకొక proof. మీక్కూడా తప్పకుండా గుర్తొచ్చేఉంటారు మీ కుటుంబంలో ఇలాంటి వాళ్లు.

వీళ్ల దేవుని concept నాకు నచ్చదు, వీళ్ల పూజ,పునస్కారాలు కొన్ని (కాదు చాలా) సార్లు నన్ను ఇబ్బంది (ఈసారి నిజంగానే ఇబ్బంది) పెడతాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే విన్నానేమో, ఇందాక చెప్పిన ఆ శ్లోకపాదం నన్నిట్టే ఆకట్టుకుంది, "అర్రే, ఇదేగా నేనంటోంది" అనుకునేలా చేసింది.

మొక్కులు (అనగా, బలుల లాంటివి కూడా), ఉపవాసాలూ (అనగా, తినకుండా ఉండటాలు; దేవునికి దగ్గరగా ఉండటం కాదు), పూజలూ, అవయ్యేదాకా ఇంట్లో వాళ్లకి పస్తులు, ఏవైనా కొన్ని పనులు అలానే చేయాలి ఇంకోలా చేయరాదు, ఫలితం రాకపోగా, పాపం వస్తుంది అని భయాలు, బ్లాక్‌మెయిల్లూ, వాస్తులు, జాతకాలు (వీటి గురించి చెప్పనవసరం లేదు), గోత్రాలు, ఎదురు రావడాలు, లచ్చిందేవి ఇంట్లోకి వచేప్పుడు కనపకుండా మన చెప్పులు దాచడాలు (అవి అడ్డుంటే ఆవిడ రాదంట. అడ్డదిడ్డంగా పడేస్తే చూడ్డనికి బాగోదుగానీ, ఎలా ఉన్నా, అసలు అక్కడ ఉండొద్దు అంటే ఎలాగా ?), మాంసం తిన్న మరుసటి రోజు ఇళ్లు కడగటాలు (శుభ్రం చేయడం),.........., ఈ list వాళ్ల పిచ్చంత పెద్దది.

నా వరకైతే, "పూజల్లాంటి పనులు చేయడానికి తపించాలికానీ, వీల్లేంటో పనులన్ని మానేసి పూజలు చేసేస్తూ ఉంటారు. దేవుడికి చేసే అర్చనల్లా జనాలతో చేసే పనులు దివ్యంగా చేస్తే ఎంత బావుంటుంది ? మాట్లాడే మాటలు మొండిగా, ఆలోచనారహితంగా కాకుండా, మంత్రాల్లా మెత్తగా, పవిత్రంగా ఉంటే ఎంత బావుంటుంది ? అనవసరమైన (అనగా అడ్డమైన) పనులకి, తిరక్కుండా, ప్రదక్షిణ చేస్తున్నంత జాగ్రత్తగా ఒళ్లు దగ్గిర పెట్టుకొని నడుచుకొంటే ఎంత బావుంటుంది ? ఇవన్నీకాదు, ఏ ఏ పనులు నేను చేస్తున్నానో, ఆ ఆ పనులన్నీ, పూజ చేసినంత ప్రియంగా, ఆ దేవున్ని సంతోషపెడుతున్నట్లుగా చేస్తే ఎంత బావుంటుంది ?" అని చెప్పాలనిపించింది."

ఇంతకీ ఆ పాదం ఏంటనేనా ? శంకరాచార్యుల విరచితం, మీకోసం.

"యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం!"

ఆత్మాత్వం గిరిజామతిః పరిచరాః ప్రాణాః శరీరం గృహం
పూజాతే విషయోప భోగ రచనా నిద్రా సమాధిస్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః, స్తోత్రాణి సర్వాగిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం
 
‘నా ఆత్మ నీవు, నా మతి పార్వతి, నా పంచప్రాణాలు పరిచారికలు, నాకు ఏయే విషయాల మీద ఆసక్తి కలదో అవన్నీ నీకు పలు పూజలు. నేను సమాధి స్థితిని చేరునది నిద్రించునప్పుడే. నా పాదాలు భూమిని సంచరించినదంతా నీకు ప్రదక్షిణములే. నా పలికినపలుకులన్నీ నీ స్తోత్రాలే. నేను చేసే కర్మలన్నీ నీకు నేచేసే ఆరాధనలే’ అంటారు శంకరులు ‘శివ మానసిక పూజాస్తోత్రం’లో [1].

[1]  ఆంధ్రజ్యోతి వారికి, మేఘశ్యామ గారికి కృతజ్ఞతలు.

No comments:

Post a Comment