Friday, January 22, 2010

Just Like that....

కవన కన్నీళ్ళు కార్చే కవి - రాహువు నోట చిక్కిన రవి
మండు వేసవిలో మాఊరి బావి - మదన భస్మం ముందర రతీదేవి
విలువల్లేని కలియుగం - వలువల్లేని రాతియుగం...

ఓ రఘునాథా!


నా కను తామరలకు తుమ్మెదవా...?
అవి నీ శ్యామసుందర వదనారవింద దర్శనానికై తపిస్తున్నయి....!
ఆకొన్న నా కర్ణ యుగ్మానికన్నపూర్ణవా...?
అవి కఠోర పాశాన ద్రవీకరణాలైన నీ కీర్తులకై అలమటిస్తున్నాయి...!
నా మనో నెలత కి నాథుడవా ...?
ఓ రఘునాథా!
అది రవి రంజన సమానమై,
శివాది దేవ సన్నుతమై,
రావణాది అసుర భీకరమైన నీ స్వరూపమునే స్మరించు చున్నది....!

Tuesday, January 5, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు....


ప్రియమైన నా మిత్రులందరికీ నూతన సంవత్సరం సందర్బంగా...........
భయాక్రాంతం కాని మనోభూమిని,
శాశ్వతమైన సత్శీలాన్నీ,
చెదరని, చెరపలేని చిరునవ్వు ని,
విధికి వదిలేయని విధానాన్నీ,
శ్రేయస్సు నొసగే శాస్త్రాన్నీ,
బలాన్ని పెంచే బంధాల్ని,
కలతలుండని కాలాన్ని,
కదిలించే, కవ్వించే కవనాల్ని,
ఆశీర్వచనాలనే ఐశ్వర్యాన్నీ,
విలువైన స్నేహాల్ని,
సజ్జన సమ్మిళితమైన సమయాన్ని,
సడలని సంయమనాన్ని,
వెరవని ఓరిమిని,
జీవితం మీద ఆశలు పెంచే అశయాల్ని,
రాజకీయ రక్కసులుండని రేపటిని,
ప్రసాదించమని ప్రహ్లాద పూజితున్ని ప్రార్థిస్తున్నాను.......