Friday, November 22, 2013

నూటొక్కటి !!


కృష్ణశాస్త్రి వారికి ఆ యొక్క అప్రాప్త మనోహారిణి ప్రసాదించిన
                                               హృదయ దళనములొక్క శతము,
అరుదెంచిన జగద్పతిని అలుకబూని తాచిన సత్యభామ ఆపై  సైచిన
                                               వేదనయందొక్క సహస్రాంశము,
ఇవి,
ఊహించని నిన్నటి మీ దర్శన భాగ్యమున మాకొరిగిన వరవిశేషములు!!

Monday, November 18, 2013

ఉన్నాను వేచి !!


నీ రాకకై రోజులు వేచి,
హృదయాన కవన లతావితానముల పెంచి,
విరహపు విరులు పూయగా తుంచి,
నీవొస్తావని దారంతా పరచి,
మాలగా కూర్చి,
తోరణాలు తీర్చి,
ఉన్నాను వేచి,  నీకై కాచి !!
                           -/2/11.

పాపం, She broke-up with him !!


పిలుద్దామనుకుంటాను, పలకవేమొనని ఆగిపోతాను.
కలుద్దామనుకుంటాను, కరగవేమొనని కదలిపోతాను.
కవన కన్నీళ్లతో కాగితంపై ఇలా కాలమంతా కుమిలిపోతాను !

మరువ యత్నిస్తాను;
విఫలమేనని తెలిసినా,  మరళ మరళ యత్నిస్తాను. 
మది గది తలుపుల తరలే నీ తలపుల తరంగిణిలో ఇలా తరలిపోతాను !!
                                                                    -/9/10.

Thursday, October 24, 2013

మంచింగ్ మాటలు - మొదటి పొట్లం !


తమ్ముళ్లూ, తొందర పడండ్రోయ్ !, లేకపోతే
సముద్రమంత  ప్రేమ, సాములోరి సెంబులో నీరైపో గలదు సుమా!!
-------------------------------------------------------------------------------------------- 1

అబ్బే,
నల్లపూసలు గుచ్చుకోకుండా నిద్దరెలా పడుతుంది చెప్పు !!
 **************************************
జనాభీష్టం మేరకు, జరిగిన కథ:

ఒకానొక sitting setting పీకేసి, pack-up చెప్పాక :
మావోడికి నిద్దరట్టడం లేదు, నా చావుకొచ్చింది.
ఎందుకడద్ది, King Arthur లో Keira Knightleyలా ఉంటదట మరి మావోడి Queen. ( ఆడే అన్నాళ్లెండి ).
ఒకవేళట్టినా, అది నిద్దరగాదంట.
'అదేంట్రా ??'  అన్నట్టు చూశాక, పై లాగా అన్నాడనమాట.
------------------------------------------------------------------------------------------- 2

మర్చిపోకొరేయ్, మనసు as it is manifest అయిపోద్ది. అదే secret, మరింకేం లేదు.
-------------------------------------------------------------------------------------------- 3



ఒకడు     :       వీడేంట్రా, నడకబావుందనీ, పాదాలు బావున్నాయనీ, gold medals వచ్చాయని ఇంత bend అవుతాడు ?
మావాడు :        అప్రాచ్యపు వెధవ !!
                   ఏమంటివి ఏమంటివి ? ఇప్పుడు కొత్తగా bend అవ్వడమా ?
                   ఈఫిల్ లాంటి ఈగో tower ఏనాడో ఒదిగిపోయింది, ఉరగలోకపు వీధుల్లో, కడు ఒయ్యారంగా !!
                   కాగా నేడు కొత్తగా  bendu bendu అంటూ bore కొట్టకు...!! కూచో !! 
ఉంకోడు :        ఎవర్రా అది??,   సావగొడుతున్నావ్!!
మళ్లీ మావాడు :   ఎవరా...
                   నా రే వనంలో పూసిన రంగుల కల, రావణంలో విభీషణంలా !!   చాలా !?!?
------------------------------------------------------------------------------------------- 4

మళ్లీ దీనమ్మ జీవితం,
ఎందుకు బాధవుతుందో మరెందుకు బాగవుతుందో అస్సలు అర్థంకాదు ;
తడి ముద్దులు - పిడి గుద్దులు,
Houseflies - Butterflies  అన్నీ ఉండే తీరాలనుకుంటా !!

------------------------------------------------------------------------------------------- 5

"ఏంట్రా నీ బాధ ?, ఇందాకట్నుంచీ silentగా సావగొడుతున్నావ్ !!"
"నా బాధంతా ఏంటంటే, ఆ వచ్చేవాడు నా బంగారం విలువ తెలుసుకుంటాడో లేదో, తెలుసుకున్నా గుర్తుంచుకుంటాడో లేదో ఒకవేళ గుర్తుంచుకున్నా behave చేస్తాడో లేదో !?!? అని"

-------------------------------------------------------------------------------------------- 6

Sunday, October 6, 2013

కత్తిపీట.... కాపురం.... లాంటి, ఓ కథ ....!


శాన్నాల్లనుంచి అనుకుంటూన్నారా శివగా, నీకో post dedicate చేద్దామని.
మరెందుకు late అయిందంటావేమో....
నిన్ను రాయడామంటే నన్ను రాసుకోడమేగదా!! (ఏంటి నమ్మవా ?  కింద చదివితే నువ్వే నమ్ముతావులేరా..!!)
పైగా మనకు publicity ఇష్టముండదు (ప్చ్, జనాలకు తెలిసిందేగదా).
అలా అయితే, ఇప్పుడు రాయడమెందు కంటున్నావా?
అంటావ్ రా,  ఈమధ్య ఎక్కువ సదువుతున్నావుగదా!! అడుగుతావ్.

ప్రతి శుక్రవారం సాయంత్రం cell phone లో balance ఉందోలేదో check చేసుకుంటున్నాను చూడు, అందుకు.
కష్టమనిపించి నపుడల్లా, కాదు కాదు...కష్టపడాలనిపించినపుడల్లా కనిపిస్తావ్ చూడు, కర్ణుడిలాగ, అందుకోసం.
అన్న ఓ సినిమాలో చెప్పాడొరే (ఇక్కడ ), మనలోని idiotని మనకి చూపించేవాడేరా మన friend అని, నువ్వు అక్కడితో ఆగిపోలేదుచూశావా, అందుకు.
బిర్యాని అన్నా, బీరన్నా, బ్రహ్మి అన్నా నువ్వే గుర్తుకొస్తావ్ చూడు అందుకు. కేవలం నిన్ను గుర్తుచేసుకోడానికే పంచతంత్రం సినిమా చూస్తాను చూడు, అందుకు.
నా familyకే తెలీకుండా నాకో familyఇచ్చావుచూడు, అందుకు.
Freeగా sociology క్లాసులెవడు చెబుతాడురా, చెప్పు !! అందుకు.
నాలుగేళ్లుగా ప్రతివారం ఓ చింతామణి నాటకం వినిపిస్తున్నావు చూడు, phoneలో, అందుకు. ( మీ పెసిడెంటు కూతురు, మూడో పాప గురించి, last week update ఇవ్వలేదు ఎదవ !!, next week మర్చిపోకొరే. )
కాదొరే, నీకు 'కమ్మ'గా ఉండడం అంటే తెలుసా? చెప్తాను చూడు.
మూడో తరగతిలోనో, నాల్గో తరగతిలోనో  ఓసారి నాకు జ్వరమొచ్చింది (పులివెందుల వాళ్లకి కూడా జ్వరాలొస్తాయ్ రోయ్ :P). వారం రోజులున్నిందనుకుంటా. జ్వరం పోయి, ఇంక బాగవుతున్న time అది. సాయంత్రం, DD తెలుగులో వార్తలొస్తున్నాయ్, urduలో. వంటింట్లో రసమన్నం నా ముందు పెట్టి పాలుకాస్తోంది అమ్మ. ఓ రెండు ముద్దలు తినంగానే ఇంక తినలేననిపించింది. పడేద్దామని పైకిలేచా, పొంగుతున్న పాలమీద నీళ్లుపోసి నాదగ్గరికొచ్చింది అమ్మ. ఎందుకు పడేస్తున్నావని అడిగితే, నోరంతా చేదుగా ఉంది, తినబుద్ధికావడంలేదని చెప్పా. అందులో కొద్దిగా గట్టి పెరుగు (అపుడు పాడి ఉండేదొరేయ్)  కలిపి కమ్మగా ఉంటుంది కూచోమని చెప్పి, మొత్తం తినిపించిది నాచేత. అప్పటినించి, 'కమ్మగా' అనే పదం వింటే, వెంటనే ఆరోజు తిన్న taste తగులుతుందిరా అబ్బాయ్ మనసులో. సరే ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటున్నావా, నువ్వు పిలిస్తే నాపేరు కూడా అంతే కమ్మగా ఉంటుందిరా సంటి.
ఇయ్యన్నీ కాదెహే, నన్ను ఎనిమేళ్లుగా ఏగుతున్నావుగదా!!  చాలదా!?!


కత్తిపీట గురించి, కాపురం గురించి చెప్పిన జనాలు, స్నేహం గురించి చెప్పలేదేంట్రా? వయసొచ్చేకొద్దీ విడుగుతూనే ఉంటుందని. పోన్లే, నేంజెప్పాననుకో...,మీ ఊరి స్కూల్లో, compound గోడలమీద రాయించొరే ...!!(నాపేరు లేకుండా ).

Thursday, September 19, 2013

మరీ....అలా చూడకు, నే సాయంజేస్తాలే.....!



సినిమాలూ,నవలల్లోనన్నా లవ్ సీన్లు చూన్నీవేఁ నన్ను,
చూసేంతవరకూ ఓటి,  చూస్తున్నంత సేపూ ఇంకోటి, చూశాక మరో.....బాధ. సంపుతున్నావుగదే...!
అసలు ఏ ఉద్దేశంతో మొదలెడతానోగానీ,
చూస్తున్నంతసేపు నా లోపలి అవ్యక్తాస్పష్ట శూన్యం నా రక్తమాంసాల్ని మరింత తిని, తను విస్తరిస్తున్నట్లు తోస్తుంది.

కసిగా, కనీ...సం కనికరమైనా లేకుండా, ఆ కోల కళ్లతో కాటేసినపుడే కక్కుదామనుకున్నా, కుదర్లేదు.
ఆ నీ అందమైన అడుగుల్లోని అమాయకత్వానికి అమ్ముడుపోయినప్పుడైనా అందామనుకున్నా, అవలేదు.
ఇపుడు చెబుతున్నా విను, ఆ నా శున్యం మొత్తం నిపాల్సిన భాధ్యత నీదే, (మరీ...'అమ్మాయ 'కంగా చూడకలా , నేనూ సాయంజేస్తాలే.....! !!)

Tuesday, August 13, 2013

Simple and Charming - 6

బెంగుళూరు,
13/8/13.


ఇదిగో నిన్నే,


ఎన్నెల్లో ఆడుకునే ఆడపిల్లల్ని నేంజూల్ల (నీకసైన్మెంట్లతోనే తీరిక లేదనుకుంటాలే, ఇంక ఆటలేమాడుకుంటావ్ !),
వర్షంలో తడిసే సంద్రాన్నీ నేంజూల్ల (గొడుగున్నట్టుందిగా మనకు),
నడిరాత్రి సంద్రపు సడిగూడ నేనిన్ల (మాటాడి సస్తేగా ఎపుడన్నా; నన్నేలే!!).

పాలకడలి కెరటాల్నేంతాకల (ఆ నీ చెప్పులేంజేసుకున్నాయో గదా!),
పైడి కొండన్నేంతడమల (ఆ చూడిదార్ సంగతేం చెబుతాం!!),
ప్రబంధాల్నీ నేన్జదవల (పన్జరిగితే,  చదవడమేం ఖర్మ, నేనే ఓటి రాహేద్దును గదా!!!)

"ఐతేంట"ంటున్నావా ??  చెబుతున్నా, సదువుకో,

నీ నడక (ఓ రెండడుగులంత) రేపిన రచ్చలో, (Actualగా, ఒకడుగనే రాద్దును, కానీ, అడుక్కీ అడుక్కీ, మధ్యన, నడక్కే అందం తెచ్చే ఓ చి.....న్న pause ఉంటుంది జూశావు,  అదొచ్చి నా కళ్లలో కూచుంది. తన గురించి రాయక పోతే సంపేస్తానంటోంది.) బయల్పడిన పై నా దౌర్భాగ్యాన్ని, ప్రపంచానికి ప్రదర్శించుదామని ఈ నా ప్రయత్నం.

"ఐతే నాకు రాయడమేంటం"టున్నావా?

అయ్యో అమ్మాయీ!!, నువ్వేగా మరి నా ప్రపంచం.

నీ 
నేను

Thursday, July 11, 2013

Simple and Charming-5


అదేదో చిరునవ్వు లాగా...నే ఉంటుంది.కానీ Actualగా చిరునవ్వు కాదు.
మొదట్లో కళ్లతో నవ్వుతోందేమోలే అనుకునేవాణ్ణి, అట్టే తెలిసిపోయింది, అదికూడా కాదని.

అబ్బే, ఇదేదో Abstract material అనుకున్నా, అందువల్లే అందంగా ఉందేమో అని కూడా అనుకున్నా.
కానీ, చాలా తేలిగ్గా(అంటే lightగా అనమాట), నెమ్మదిగా, చల్లగా ఉంటుంది. And భలే మెల్లగా గిల్లుతుంది కూడా.
simpleగా (క)అనిపించే గొప్ప సంపద అనమాట, మట్టితో చేసిన దేవుడి విగ్రహం లాగ.

తనకి తెలీ...కుండానే దోచుకోవలని నా(కళ్ల)కెంత ఆరాటమో ?!

తను hi చెబుతున్నపుడు చూడాలి(నాకే లెండి), "పోలా, అద్దిరిపోలా ?!" అనిపిండేస్తుంది, మళ్లీ 'అదే'.
ఆస్తులే..మక్ఖర్లేదు, అది చాలు.

రాత్రి(?) మూడింటికి  పడుకున్నా, మళ్లీ పొద్దున్నే తొమ్మిదింటికి lab కొస్తుంటే, నేనెంత హార్డు వర్కరో అనుకుంటున్నారు మా జనాలు, పాపం ఎనిమిదింటికి mess లో మళ్లీ 'అదే' అని తెలీక.

పదో తరగతిలో తెలుగు వ్యాకరణం అర్థంకాలేదని ఏడ్చినట్టు గుర్తు (ఎవరూ చూడకుండా లెండి !!) , ఆ తర్వాత అర్థం కాకుండా అంత పని చేయిస్తోంది మాత్రం 'ఇదే'.

శాలా సూశామంటారేమో, పర్లేదు అలాగే బతికెయ్యండి, ఇటేపు రాకండి, ఇది మాత్రం నాకేనాకే.

కళ్లు కలిపినపుడు కదా, 'దాని' అసలు పనితనం;
ప్రపంచానికం....తటికి ప్రాణాలు పోయి, ఆ మొత్తం వచ్చి నాలో పొంగుతాయ్.
(ఇంకో మొత్తం ఇంకెక్కడైనా పొంగుతోందేమో అని నా అనుమానం, మీరేం entertain చెయ్యకర్లేదు).

Sunday, June 23, 2013

ఆగిపోతూ......నే ఉన్నా..!!


ఎన్నో చెబుదామనుంటుంది, అంతా చెప్పినా  I Love you అనే అవుతుంది.
అందులో కొత్తేముందని ఆగిపోతాను.

అందరు మీ(అమ్మాయిల) కళ్లని చూడమంటారు, నాకేమో నీ పాదాలు చూస్తూ  Propose చేద్దామనుంటుంది.
పిచ్చోడనుకుంటావేమో అని ఆగిపోతాను.

నా ప్రేమ కనిపించీ కనిపించకుండా మాటలు కడదామనుంటుంది.
తీపి కాస్తా వెగటైపోతుందేమో అని ఆగిపోతాను.

ఇలా,
ఆగి,పోతూ......నే ఉన్నా, నీవైపుకే. 

Thursday, June 6, 2013

చెట్టు + చిరునవ్వు = చీమ


ప్రాణేశ్వరీ!  (Heavyగా ఉందా, తప్పలేదు, feeling అలాంటిది మరి)
"భరించరాని ఈ విరహాగ్ని కన్నా, ఆ పాపాగ్నే మాకు సమ్మతము" అనెప్పుడో SVR గారు అంటుంటే ఏమో అనుకున్నా, కష్టమే సుమా!!
మెడని వీలైనంతా వెనక్కి సాచి,కళ్లుమూసుకుని  ఆకాశం వంక చూస్తూ, పిడికిళ్లు బిగించిన రెక్కలు రెండూ విరిగిపోతాయెమో అనేంతగా విరుచుకుని, గుండెంతా నిండిన విరహాన్ని ఒక్క నిట్టూర్పుతో విశ్వంలోకి విసిరేస్తూ.....బానే ఉంది ఓ క్షణం.
కానీ, మరుక్షణం నిండిపోతావే, మదినిండా! కాస్తంత కనికరమైనా లేదు, కన్యకా నీకు!!
నీటి కొంగని చేప మింగడమంటే ఇదేగదా!
చెట్టంత మగాన్ని, చీమని నలిపేసినట్టు నలిపేశావే, చిరునవ్వు ఖర్చుతో....!!  
నా చాతిని తవ్వి, గుండె ని తీసి గంతులేయిస్తున్నట్లుంది నాముందే (Gulmoharరోడ్డు లో),
మరీ అన్నిసార్లు కనిపించకు Please, చూస్తూ సచ్చిపోతానేమో...!

Thursday, April 4, 2013

కొన్నుంటాయ్, ఈ శాస్త్రాలూ - అవీ, ఉంటాయ్...!


My sincere and special thanks to Rhonda Byrne,  Trivikram Sreenivas and Sreenu Vaitla.

ఇవాళ్టికి(అంటే ఇది రాసుకున్నప్పటికి; upload చేసినప్పటికి కాదని మనవి) మూడు రోజుల ముందు :

ఆవేళ ఎందుకో మన yashwanthగాడు గుర్తొచ్చాడు (sittingలాంటివేం plan చేసుకోలేదు లెండి; అయినా గుర్తొచ్చాడు). System,mobile మొత్తం వెదికాను, ఎక్కడా వాడూ,నేనూ ఉన్న జ్ఞాపకాలు(అనగా photoలు) దొరకలేదు. Suddenగా గుర్తొచ్చింది, అంతే, అప్పుడెప్పుడో మర్చిపోయిన orkut openచేసి KGPలో ఉన్నపుడు upload చేసిన అన్ని photos(ఇప్పటికీ ఉన్నయ్, కావాలంటే చూసుకోవచ్చు) మనసారా చూసుకున్నాను. Image Processingకి భగవద్గీత  అయినటువంటి Gonzalez పుస్తకం గుర్తొచ్చింది. అందులో మొదటి chapter introductionలో  "One picture is worth more than ten thousand words" గుర్తుకొచ్చింది. మనసుని ముంచెత్తే జ్ఞాపకాల వరదొకటి మొదలైంది. అందులో కొన్ని తుంపరలు ఇక్కడ విదిల్చుతున్నాను(కంగారు పడకండి,  మీ screenలకేమీ కాదు). 

yashwanthగాన్ని తలచుకుంటే మొట్టమొదట గుర్తొచ్చేది cricket. Indian cricket కి sachin-ganguly, sehwag-gambhir ల pairs ఎలాగో, మన JNTUK ECE05-09 cricket teamకి నేను-yashwanthగాడు అలాగ. అదేంటో మన captain peelid(వాడు నా slam bookలో అలాగే రాశాడు), first overలోనే ఎవరో ఒకరు (maximum yashwanthగాడు, కనీసం నా satisfaction కోసం!!) out అవుతారని తెలిసినా, కాకినాడలో ఆడిన (దాదాపు ) అన్నిmatchలకి మా opening pairని disturb చెయ్యలేదు. అంటే basicగా మన team కూడా అలా అలవాటు పడిపోయారు లే. First year లో అయితే, sunday ఒకటే holiday అవడం వల్లనూ, అప్పట్లో అందరూ class లకి attend అవడం వల్లనూ sunday మాత్రమే ఆడుకునే వాళ్లం. సరిగ్గా ఆరోజే, yashwanth గాడింట్లో పూజలుండేవి. వాడికోసం ఇంటికి phoneలు, వచ్చేదాకా ground లో waiting లు(ఏంటి, ఇవన్నీ ఎలాగూ first overలోనే out అవుతాడని తెలిసినా). వాడేమో late గా వచ్చి, ఆ black ax n dx సైకిల్ park చేస్తూ "ఏం చెయ్యనురా, ప్రసాదమన్నా తీసుకోవాలిగా, అందుకే పూజ అయ్యేదాకా ఆపారు" అనేవాడు.(పాపం ఆ cycle, GATE exam ముందు, రమణయ్యపేటలోని మా room దగ్గర park చేసి, పోగొట్టుకున్నాడు).

cricket అంటే చెప్పుకోవాల్సింది మన yashwanthగాడి keeping .వాడు మనకి దొరికిన ఓ  మంచి keeper. అందుకనే KGPలో నేను captaincy చేసిన (~)100  matchల్లో (ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు), >50 matchలకి వాడే మా keeper, ఆ మిగిలిన < 50 కూడా, వాడు  TT, shuttle ఆడుకున్నాడు కాబట్టి, నేను వేరే వాళ్లతో చేయించుకోవాల్సి వచ్చింది.
ఇక్కడ ప్రేక్షకులు చదవాల్సింది ఏమిటంటే, actualగా ఆ మొదటి >50 matchలు కూడా, నేను phoneచేసి బలవంతంగా రమ్మండం మూలాన వచ్చాడేమో అని నా అనుమానం. (కారణం, ఆ time లో, వాణ్ణి phoneలో ఇబ్బంది పెట్టిన పిల్ల వల్ల కావచ్చు, guide AB వల్ల కావచ్చు, లేదూ TT మీద మక్కువ ఎక్కువ అవడం కావొచ్చు)
ఇలా yashwanthగాడు నా cricket lifeలో కీలకమైన role ఆడాడనమాట.

Next గురొచ్చేది sitting setting; ఆగండాగండి, పాపం వాడేం పుచ్చుకునేవాడు కాదు.

మా sittingలంటే ఆషామాషీ యవ్వారమమేం కాదు. Planning ఎంత perfectగా ఉండేదంటే ఆమీర్ఖాన్ cinema తీసినట్లుగా ఉండేది. మా batchలో ఎవడికి మూడొచ్చినా, 4 నిమిషాల్లో 5 calls వెళ్లేవి, 6 నిమిషాల్లో  ఇద్దరు ద్రవాహారం తేవడానికీ, ఇంకో ఇద్దరు ఘణాహారం తేవడానికి వెళ్లేవాళ్లం. నేనెప్పుడూ ఆ  ద్రవాహారం  batchలోనే ఉండేవాడిని (మరి, మా జనాలు stuff select చేసే విషయంలో నాయొక్క అభిమానులు). అంతా సర్దుకుని రమారమి 8గంట్లకి కూర్చుని మెల్లిగా మొదలుపెట్టి, ఓ మూడు మిగిల్చే లోపు, ఒకన్ని తర్వాత ఒకన్ని center చేసి celebrate చేసుకుంటూ, ఒక్కోడి performance  మాంచి peakలో ఉన్నపుడు cool drink(అనగా, Sprite )అయిపోతుంది. అప్పటికే 11 కొట్టేసుంటుంది. అంటే కొట్లు కట్టేసుంటాయని కాదు. ఎవడికీ కిందకెళ్లి(మా room 4th floorలో ఉంటుంది లెండి) తెచ్చే ఇది ఉండదు. Cool drink లేకపోతే ముందుకి కదలలేని పరిస్థితి. అందులో ఓ నలగరం cool drink లేకపోయినా waterతో "ఓ! yes" అనేవాళ్లం, కానీ మిగిలిన ఆ ఒక్కడూ cool drink లేకపొతే చాలా  కష్టపడే వాడు. కురు సభలో దుశ్శాసనుడు చీరలాగుతున్నపుడు, ద్రౌపది అదే సభలో ఓ మూలన ఉన్న తన భర్తలు ధర్మ రాజు దగ్గిర నుంచి, సహాదేవుని వరకూ ఒక్కొకరి వైపూ  చూసి కాపాడమని వేడుకుని, ఎవరూ ముందుకు రాకపోయేసరికి, చివరకి "అన్నా'"అని wireless లో శ్రీ కృష్ణుని వేడుకున్నట్లు, మేమెవరం కదలక పోయేసరికి నా mobile నా ముందు పడేసి, నా వైపు ఆర్ద్రంగా చూసేవాడు. ఇంక తప్పదనుకుని అప్పటికో గంట ముందే పడుకున్న మన yashwanth గాడికి call చేసి లేపి, వాడి చేత తెప్పించేవాళ్లం. వాడొచ్చాక వాడి కాళ్లమీద పడ్డంత పంజేసే వాళ్లం. ఓసారైతే, నేను మరుసటి రోజు ఉదయం పదింటికి మజ్జిగ packet కూడా తెప్పించుకున్నాను. అది పరాకాష్ట. Packet చేతికిచ్చాక చాలా చిరాగ్గా face పెట్టి మన yashwanth గాడన్నాడు"నువ్వింక మానాల్రా" అని .(Sceneలో sentiment ఎక్కువైందని censor చెయ్యడం జరిగింది, కానీ గ్రహించ వలసిన విషయం ఏంటంటే, extra అయ్యిందనుకున్న మొదటిసారే  వాడు నిర్మొహమాటంగా నాకా విషయం చెప్పడం).

అలా మన yashwanth గాడు, మా sitting cinema climax sceneలో శ్రీకృష్ణుని అవతారమెత్తేవాడు.

Next గుర్తొచ్చే scene మా ఊళ్లో. 2011 May 14, KGP నుంచి జైత్రయాత్ర ముగించుకుని, మా ఊళ్లో పడ్డాను. అప్పుడు మాఇంటికి తీవ్రమైన మరమత్తులు చేస్తున్నాం. Juneలో అనుకుంటా, మన yashwanth గాడు ఇడుపులపాయ IIIT లో join అయ్యాడు. నేనోరోజు ఇంటికి రమ్మని phone చేశాను. వాడు ఓ శనివారం సాయంత్రం call చేశాడు, రేపు బయల్దేరుతున్నానని. నేను మా అమ్మకి చెప్పాను రేపు వాడొస్తున్నాడని. పక్కనే ఉన్న మా పాలేరు విని, సందకాడ నాటుకోడి తెస్తాను, జొల్ల(అనగా,పెద్ద వెదురు గంప) బయట పెట్టమన్నాడు. లేదు, వాడు vegetarian అన్నా. Brahmin ఏమో అనుకుని మా అమ్మ కంగారుపడిపోయింది.(అంటే, మరి మా ఇల్లు repair లో ఉండటం మూలాన, దగ్గర్లోనే ఓ చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని(అదో పాతబడ్డ ఇల్లు) అందులో ఉంటున్నాం, అక్కడ వసతులేం సరిగాలేవ్) .మరి, సద్బ్రాహ్మనుడు  శివుడితో సమానంగదా. .ఇంతలో నేను వాడు brahmin కాదని చెప్పేసరికి కుదుట పడింది. సుబ్బరంగా పప్పు, రసం, ఇంకో కూరతో పాటూ ఓ sweet చెయ్యమన్నా. (ఇంటి)పనికొచ్చే కూలోల్లకీ, ఇంటోల్లకీ ఒకే అన్నం కుండ కాబట్టి, వాడిక్కూడా అందులోనే వండేసింది. మా పక్కూరికి బండేసుకెళ్లి మన yashwanth గాన్ని ఎక్కించుకొచ్చాను. (మా ఊరికి bus లేదనుకునేరు, అరగంటకోటుంది. కానీ వాడికి, నేను ఈత నేర్చుకున్న కుంటలూ, ఆడుకున్న బీళ్లు, రేగుపళ్లు ఏరుకున్న గుట్టలూ, గేదెల్ని తోలుకెళ్లిన బయళ్లూ చూపించొచ్చని నా plan). అలా, అవన్నీ చూపించి, మా ఇంటిముందు దింపాను. మరి మనవాడు top to bottom Reebokలో ఉన్నాడు. Laser treatment అవజేసుకుని కళ్లజోడు తీసేసి Reebok goggles పెట్టుకున్నాడు, కిందేమో Reebok shoes, మధ్యలో Reebok back pack, చేతికి fast track. ఇది వాడి అవతారం(Actualగా, నాలాంటోడు ఆగిపోయేవాడేమో, కనీ...సం ఆలోచించేవాడేమో,కానీ మన yashwanth గాడు చాలా clearగా చెప్పాడు, అవన్నీ offer లో వాళ్ల Daddy కొన్నారని.). అలా వచ్చినవాడు, fresh అవడానికి వెళ్లేసరికి పరుగుపరుగున వచ్చిన మా అమ్మ, నాకో లుంగీ, వాడికో టవల్ ఇస్తూ "బాగా సావుకార్లా ?" అని  (నన్ను)అడిగింది(లోగొంతుకలో). నేనన్నాను"మరేమనుకున్నావ్, రాజమండ్రిలో రెండిళ్లున్నాయ్, కాకినాట్లో కూడా కొన్నారు ఇంకో రెండు flatలు ".
"మరి, నీకెలా పరిచయం ?".
"నాతో Cricket ఆడేవాడులే, వాళ్లమ్మ కాకినాడ కలక్టరేట్లో పంజేస్తార"ని చెప్పా. ఇంక చూస్కో, బాపణోన్నేమిటి, బ్రహ్మ దేవున్నే చుసినట్లు feel అయ్యిందంటే నమ్మాలి. అలా భోజనమవజేసుకుని, మళ్లీ బండేసుకుని, నేను చదువుకున్న బడి, మా పొలాలు, ఊరి బయట శివాలయం అన్నీ చూపించి తీసుకొచ్చాను. అదో మరచిపోలేని రోజు. చివరగా మరమత్తులు జరుగుతున్న మా ఇంటికి తీసుకెళ్లాను. అక్కడ మా నాన్న ని పరిచయం చేసేలోపే "నమస్కారం  uncle" అనేసరికి, అక్కడ పంజేసుకుంటున్న వాళ్లకి ఏదో cinema చూస్తున్నట్లు ఉంది.మరలాంటి మర్యాదలు మేము పుస్తకాల్లో చదువుకోడమూ, cinemaల్లో చుసుకోవడమే.
సాయంత్రం మళ్లీ పక్కూరికి తీసుకెళ్లి, పులివెందుల bus ఎక్కించాను. ఇంటికొచ్చిన నాతో మా అమ్మ, ఇంటి పని పుర్తయ్యాక ఇంకోసారి తప్పకుండా రమ్మనమని చెప్పింది. మరి వాడి simplicity అటువంటిది and  మా అమ్మని మొట్టమొదటి సారి Aunty అని పిలిచినవాడు కూడా  మన yashwanth గాడే. అయితే, అసలే గోదావరి యాసకి తోడు,మన వాడి speedకి, వాడేమ్మాట్లాడు తున్నాడో మాత్రం మావాళ్లకి అర్థమవ్వలేదు, అది వేరే విషయం.
అన్నట్లుగానే, ఇళ్లు ready అయ్యాక కూడా మరోసారి మా ఇంటికొచ్చాడు మన yashwanthగాడు.
(Actualగా ఇంకా చాలా incidents ఉన్నాయ్, కానీ ఇక్కడ type చేసీ చేసీ వేళ్ల కీళ్లు నొప్పిస్తున్నాయి,కాబట్టి వాటిని గురించి ఇంకెప్పుడైనా విప్పుకుందాం)
ఇలా గుర్తొచ్చిన yashwanthగాన్ని, బాగా miss అవుతున్నానని feel అవుతూ orkutలోనుండి, వాడు examకి kerchief మీద formulae రాసుకెళ్లినపుడు తీసుకున్న photo లు downloadచేసి facebookలో మన group లో post చేశా.

మొన్న:

సాయంత్రం 4గంట్లకి meetingలో ఉన్నపుడు మన yashwanth గాడి నుంచి call వచ్చింది, cut చేశా. Meeting అయ్యాక వాడి సంగతి మర్చిపొయా. మళ్లీ రాత్రి 10:30 కి చేశాడు. అప్పటికే మన group లో comments అవీ జరుగుతూ ఉండడంతో, సరదాగా మాట్లాడాలని పించిందేమో అనుకుంటూ pick చేశా. "ఒరే banglore వస్తున్నా, bus లో ఉన్నా"అన్నాడు. సర్ప్రయిజే మరి. ఏదో interview ఉంది morning 9కి, అయ్యాక instituteకి వస్తాను అన్నాడు.

నిన్న:

అన్నట్టుగానే interview అయ్యాక కలిశాడు, కలిసి మా room కి వెళ్లి చాలా కబుర్లు చెప్పుకున్నాం. మధ్యానం భోజనం చేశాక నేను labకి వెళ్తూ rest తీసుకోమని చెప్పా. సాయంత్రం 6:30 కి వచ్చేసరికి మన yashwanthగాడు పడుకుని ఉన్నాడు. లేపి,Yashwanthpur market లో కొద్దిగా తిరిగి, snacks తిని, room కొచ్చి, మళ్లీ మరిన్ని కబుర్లు చెప్పుకుని, 9:30 కి బయల్దేరి బయట mushroom masala, Naans తిని, వర్షం లో Majestic bus ఎక్కించి(వాడికి 11 కి వేంపల్లి కి bus ఉంది) room కొచ్చాను. వర్షం పడుతూ ఉండడంతో, labకి light తీసుకుని ఆలోచించడం మొదలుపెట్టా, మూడురోజులప్పుడు వీడిగురించి ఆలోచించడమేంటి, ఓసారి కలిస్తే బావుండు అనుకోడమేంటి(పెద్ద కష్టమేం కాదు,ఉగాదికి ఇంటికొచ్చినపుడు,వాన్ని మా ఇంటికి రమ్మనొచ్చు ), sudden గా వీడే call చేసి వస్తున్నానని దిగిపోడమేంటి అనుకుంటూ, కుర్చీ మీద కూర్చుందామని, cot మీద ఉన్న దిండు లాకున్నాను. దాని వెనక నుంచీ 3 పుస్తకాలు కింద పడ్డాయ్. వాటిలో మొదటిది The secret, రెండవది The power ,మూడవది Train your brain. మధ్యాహ్నం మన yashwanth గాడు చదవడానికి shelf నుంచీ తీసిన్నట్లు ఉన్నాడనుకుని, వాటిని సర్దేసి కుర్చీ లో కూర్చునే సరికి తట్టింది sequence.

మొదటి scene, ఖలేజా లో అలీ, మహేష్ బాబుని అడుగుతాడు "The Secret" అనే పుస్తకం చదివావా అని. బాబు అప్పటికేదో comedy చేశాడుగానీ, Trivikram లాంటోడు అడిగించాడు కదా అని ఆలోచించి, cinemaఅయ్యాక చదివాడనమాట. ఆనక scene, శ్రీను వైట్ల దూకుడు లో, వెన్నెల కిషోర్ వాళ్ల బామ్మ power తెలుసుకుని అంటాడు "అవునోయ్ శాస్త్రి, కొన్నుంటాయ్, ఈ శాస్త్రాలూ - అవీ, ఉంటాయ్...!" అని.


Monday, April 1, 2013

First Half




తెలుగు ప్రేక్షకుల సౌకర్యార్థం, రాజమౌళి, చంబల్ లోయలో జరిగిన కథని తెలుగులోనే చూపించినట్లు, నేను మొన్న సెల్ ఫోన్లో, English లో   టైప్ చేసిన సీన్లని తెలుగులోనే రాస్తున్నాను, చదువుకోండి.

Sunday కదాని, తనకో good morning message forward చేసి, ఈనాడు పేపర్ చదువుతున్నాను.
నిముషంలోపే reply వచ్చింది. open చేశాను.
"ఇంతకీ నేనెన్నోదాన్ని?"
అర్థంగాక, sent messagesకి వెళ్లి, పంపిన message ఒసారి చూసుకున్నా.అదో మామూలు morning message .
ఎక్కడో కొడుతున్నా, పొరపాటున పంపిందేమో అనుకుంటూ, "అబ్బే అర్థంగాల!!" అని పంపి champion పేజి open చేశాను. ఈ sachin retirement గురించి రాసేవాళ్లని చంపేయాలనుకుంటుండగా, నా korea mobile మోగింది, "అదే, నీ list లో నా నంబరెంత?" అని .
ఇపుడు కొద్దిగా అర్థమౌతున్నట్లే ఉన్నా,
"నా  list తెలిసిందే గా ,అమ్మ నాన్న, అన్న నువ్వు, నీ దయవల్ల ఏమైనా కలిగితే ఈ list కి append చేసే ఆలోచన కూడా ఉంది :P , అయినా ఇవ్వన్నీ ఎందుకిప్పుడు?" అని పంపి, దాన్ని silent చేశాను.

ఈసారి "నువ్ Blog రాస్తావా?" అని reply.
ఓహో ఆ title లేని trailor ఈ సినిమా దా? అనుకుంటూ
"ఆ, అప్పుడప్పుడూ; ఎవరు చెప్పారు?"
"నువ్వెందుకు చెప్పలేదు?"
"చెప్పకూడదనేం కాదు, అలా...అంతే!" ఈ ఆదివారానికేదో అయ్యేట్లే ఉందనుకుంటూ అందమైన android లో send ని touch చేశా.

5 నిముషాలైనా mobile vibrate అవ్వకపొయేసరికి,నా mobile కి రావాల్సిన vibration నాకు మొదలయ్యింది.
"ఇంతకీ ఎవరు చెప్పారో చెప్పలేదు"  అని ప్రయత్నం చేశా.
"ముందు నాకెందుకు చెప్పలేదో చెప్పు!!"
"నేను తెలుగులో రాస్తానుగా అందుకని, మా అత్తగారి భాష నేర్చుకుని, నీకొక love letter రాసి post చేద్దామనుకున్నాను. ఇంతలో నువ్వే తొందర పడ్డావ్..!, అయినా అదేమంత పెద్ద విషయం కాదుగదా !!"
"అంతేనా, నీ పాత love story ల గురించి తెలిసిపోతుందనా?"
Ready, reverse swing మొదలయ్యింది .
ఇంతకీ, దీనికి రాత్రికి రాత్రి దొరికిన ఆ భువన చంద్ర ఎవరో కనుక్కోవాలి అనుకుంటూ (రాత్రి 7గంట్లప్పుడు laptop లో alaipayuthey చూస్తున్నా అని message పెట్టిందిలెండి, అంటే అప్పటి వరకూ బానే ఉందికదా !!)
"అవి love story లేంటి? ఏదో time pass కి రాసుకున్నవి, comedy గా"అంటూ defence మొదలుపెట్టాను.
"ఆహా, చాలా simple and charming గా అబద్దాలు కూడా చెప్పగలరు sir మీరు!"
sir ఆ, ఎన్నమ్మా, sledging also started ఆ.....! అన్నుకుని,
"ఏయ్, నిజంగానే అవన్నీ comedy గానే రాసినవి, అయినా, ఆ translate చేసిన వాళ్లు చెప్పలేదా funny గానే ఉన్నాయని?"
"ఆ, చెప్పారు, చెప్పారు, tenth class నుంచీ మీ పోరాటాలన్నీ చెప్పారు"
"కరక్టే, అవన్నీ కేవళం నా పోరాటాలే తప్ప,అందులో నీ ఆరాటానికేమీ అర్థం లేదు. ఆ time ని గుర్తు చేసుకోడానికి నేనెంచుకున్న ఒక మార్గం ఆ blog, అంతే"

మీరు చదువుతున్న screen మధ్యలోంచి I,L,N,A,T,V,E,R అక్షరాలు ఒక్కొక్కటే వచ్చి ఒకటి ఎడమవైపుకి, ఒకటి కుడి వైపుకు వెళ్లాయనుకోండి, ఏమౌతుంది?
ఇపుడు అదే అయింది అనమాట !!

Thursday, March 21, 2013

అది, ఏదైనా, నీది..!


నువు సంపాదించుకునే ధన'మది'
నువు సాధించుకునే నిధాన'మది'
నువ్వెంతగానో ఇదయ్యే ను'వ్వది'
నిన్నే పెట్టుబడిగా పెట్టి పొందే ప్రతిఫల'మది'
'అది' అనర్ఘమైనప్పుడే నువు అమూల్యమయ్యేది
నువు చూడని పెళ్లిల్లు, చేయని పండగలు 'అది'
ఆడని Matchలు కూడా 'అదే'.
మరి చూస్కో, 'అదె'లా ఉండాలో....!
సమయాన్నంతా వెచ్చించి తెచ్చుకునే 'అది', తేలిపోతే,
నీ సమయానికేదీ   ఇది,
మరొక్కసారి చూస్కో, 'అదె'లా ఉండాలో,
ఇంక చేస్కో అందంగా  'అది'.

Thursday, February 21, 2013

Simple and Charming-4


ఎప్పుడూ mess మూలల్లో ఒంటరిగా మురిసిపోడానికి అలవాటుపడిపోయిన మనసుకి మొన్న bumper offer తగిలింది. Enter అయ్యి, queue ఎలా ఉందో అని line వైపు చూసే సరికి చివర్లో కనిపించింది మన చూడిదార్. మరాపూటకి చేతులు కడగలేదు,ఈ లోపు ఎవరన్నా join అవుతారుగదా.

దగ్గరికి నడుస్తున్నకొద్దీ,
నే చూస్తున్న తన పాదాల (నిజంగానే) resolution  పెరుగుతున్న కొద్దీ,
body లో ప్రతి cell dehydrate అయ్యేలాగా vibrate అవుతున్న కొద్దీ,
అణువణూవూ పొంగిన అమృతంతో వికసించిన ఈ నాయొక్క నేను, oh....!, I love him, మా ఊరి కోటలో కొలువున్న కోదండ రాములవారు కోప్పడినా (తన పాదాలనైనా ఇంతగా ధ్యానించలేదని).

శ్రీ సూర్యా మూవీస్ వారి telugu dubbed tamil సినిమా పాటలు తొలిసారి ఆలకించినప్పుడు,
straight drive four కొట్టినపుడు హుందాగా అభినందించే రాజేష్ అన్న లాంటి bowler తో ఆడినపుడు,
half-boiled omlete తో  సంతకం (Signature) తీసుకున్నపుడు,....
ఇలాంటి listకి ఈ feeling కూడా append చేస్తూ..... ఉన్నాను,

ఈలోపు ఎక్కణ్నించీ వచ్చారో తెలీదు,  ఈ భావకవులు మనసులో పడి బావులు తవ్వేస్తారు.అదో రాయలవారి సీమ, రాళ్లే దొరుకుతాయ్, రత్నాల్లాంటివి.
చపాతీల దగ్గర ఎప్పుడూ late చేసి చిరాకు పెట్టే mess వాడు, ఈ పూటకి మన friend .వాడి దయవల్లే line ఆగిపోయింది మరి.
ఇంతలో, "అందమైన వేళ్లు, మకుటాల్లాంటి గోళ్లు" అంటూ ఎక్కణ్నించో గోకుతాడు శివగణేశ్. మరి వాటి అందమటువంటిది.చూస్తూ సచ్చిపోవచ్చు.
కేవలం ఆ పాదాల్ని పెళ్లి చేసుకొవచ్చు.<చిరాగ్గా మొహం, మీదే లెండి>"పాదాల్ని పెళ్లి చేసుకొవడమేంటా"?
మరదేగా చెబుతోంది, పిచ్చెకిస్తాయని.

ఆ కాశీ తాడుంది జూశావూ,కళ్లని కట్టి పడెయ్యట్లేదూ...!
కళ్లు తిప్పుకోడానికి నేపడిన కష్టముంది జూశావూ,
wait wait, కాశీనాథుని విశ్వనాథ్ చూపించాక చూశారంటే, ఇప్పటికిప్పుడో నంది ఇచ్చేస్తారు, ఇలా... retire అయిపోయినా, ఇంకో ముప్పయ్యేళ్లకి Life time achievement అందిస్తారు.మరా freshness అటువంటిది.

ఇంతలో, అదేదో జలియన్ వాలాబాగ్ లో ఉన్న మమ్మల్ని జాలిగా చూసి, గేటు తాళాలు విసిరి నట్లు ఓ ముప్పయ్ చపాతీలు తెచ్చి పడేశాడు, ఆ mess వాడు.

అవో రెండేసుకుని వెళ్తున్న తనని చూసి, నాలోంచి ఇంకో   నేను బయటికొచ్చి తనన వెనక వెళ్లట్లేదేంటా(ప్చ్, అదే, సినిమాల్లో హీరోయిన్, హీరో ని cross చేసి వెళ్లాక వాడిలోచి ఇంకోడు బయటికొచ్చి తనని follow అవుతాడు గదా, అలాగ..) అనుకుంటూ, ఓ మూడు చపాతీలు వేసుకుని ఓ మూలకెళ్లాను, చాలా మామూలుగా.
(సశేషమో, నిశ్శేషమో. చెప్పలేం )

Wednesday, January 16, 2013

మిలియన్ డాలర్లు


వాడన్నాడు "వాడిన పూల"ని,
నేనన్నాను "అబ్బే కాద"ని
వాడన్నాడు "మరేంట"ని?
నేనన్నాను "మరదలు మోసిన మల్లెల"ని
<...ఈసారి వాడేమన్నాడో వినపడ లేదు...>
నేనే అన్నాను, "చేస్తాయో  మిలియన్ డాలర్ల"ని....!

Sunday, January 13, 2013

ఇంకానా...?!


ఇంకేం కావాలని, నా గుండే నీ కాలనీ(colony);
ఇంకెంత దూరం రావాలని, నీ ఒళ్లోనే రాలనీ;