శాన్నాల్లనుంచి అనుకుంటూన్నారా శివగా, నీకో post dedicate చేద్దామని.
మరెందుకు late అయిందంటావేమో....
నిన్ను రాయడామంటే నన్ను రాసుకోడమేగదా!! (ఏంటి నమ్మవా ? కింద చదివితే నువ్వే నమ్ముతావులేరా..!!)
పైగా మనకు publicity ఇష్టముండదు (ప్చ్, జనాలకు తెలిసిందేగదా).
అలా అయితే, ఇప్పుడు రాయడమెందు కంటున్నావా?
అంటావ్ రా, ఈమధ్య ఎక్కువ సదువుతున్నావుగదా!! అడుగుతావ్.
ప్రతి శుక్రవారం సాయంత్రం cell phone లో balance ఉందోలేదో check చేసుకుంటున్నాను చూడు, అందుకు.
కష్టమనిపించి నపుడల్లా, కాదు కాదు...కష్టపడాలనిపించినపుడల్లా కనిపిస్తావ్ చూడు, కర్ణుడిలాగ, అందుకోసం.
అన్న ఓ సినిమాలో చెప్పాడొరే (ఇక్కడ ), మనలోని idiotని మనకి చూపించేవాడేరా మన friend అని, నువ్వు అక్కడితో ఆగిపోలేదుచూశావా, అందుకు.
బిర్యాని అన్నా, బీరన్నా, బ్రహ్మి అన్నా నువ్వే గుర్తుకొస్తావ్ చూడు అందుకు. కేవలం నిన్ను గుర్తుచేసుకోడానికే పంచతంత్రం సినిమా చూస్తాను చూడు, అందుకు.
నా familyకే తెలీకుండా నాకో familyఇచ్చావుచూడు, అందుకు.
Freeగా sociology క్లాసులెవడు చెబుతాడురా, చెప్పు !! అందుకు.
నాలుగేళ్లుగా ప్రతివారం ఓ చింతామణి నాటకం వినిపిస్తున్నావు చూడు, phoneలో, అందుకు. ( మీ పెసిడెంటు కూతురు, మూడో పాప గురించి, last week update ఇవ్వలేదు ఎదవ !!, next week మర్చిపోకొరే. )
కాదొరే, నీకు 'కమ్మ'గా ఉండడం అంటే తెలుసా? చెప్తాను చూడు.
మూడో తరగతిలోనో, నాల్గో తరగతిలోనో ఓసారి నాకు జ్వరమొచ్చింది (పులివెందుల వాళ్లకి కూడా జ్వరాలొస్తాయ్ రోయ్ :P). వారం రోజులున్నిందనుకుంటా. జ్వరం పోయి, ఇంక బాగవుతున్న time అది. సాయంత్రం, DD తెలుగులో వార్తలొస్తున్నాయ్, urduలో. వంటింట్లో రసమన్నం నా ముందు పెట్టి పాలుకాస్తోంది అమ్మ. ఓ రెండు ముద్దలు తినంగానే ఇంక తినలేననిపించింది. పడేద్దామని పైకిలేచా, పొంగుతున్న పాలమీద నీళ్లుపోసి నాదగ్గరికొచ్చింది అమ్మ. ఎందుకు పడేస్తున్నావని అడిగితే, నోరంతా చేదుగా ఉంది, తినబుద్ధికావడంలేదని చెప్పా. అందులో కొద్దిగా గట్టి పెరుగు (అపుడు పాడి ఉండేదొరేయ్) కలిపి కమ్మగా ఉంటుంది కూచోమని చెప్పి, మొత్తం తినిపించిది నాచేత. అప్పటినించి, 'కమ్మగా' అనే పదం వింటే, వెంటనే ఆరోజు తిన్న taste తగులుతుందిరా అబ్బాయ్ మనసులో. సరే ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటున్నావా, నువ్వు పిలిస్తే నాపేరు కూడా అంతే కమ్మగా ఉంటుందిరా సంటి.
ఇయ్యన్నీ కాదెహే, నన్ను ఎనిమేళ్లుగా ఏగుతున్నావుగదా!! చాలదా!?!
కత్తిపీట గురించి, కాపురం గురించి చెప్పిన జనాలు, స్నేహం గురించి చెప్పలేదేంట్రా? వయసొచ్చేకొద్దీ విడుగుతూనే ఉంటుందని. పోన్లే, నేంజెప్పాననుకో...,మీ ఊరి స్కూల్లో, compound గోడలమీద రాయించొరే ...!!(నాపేరు లేకుండా ).
Mopuri mee iddari sneham chusi naaku kannillu(edhava kannillu ante eersha tho kadhu, anandha bashpalu) vastunnay Mopuri.
ReplyDeleteLOLLLLL
Delete