Showing posts with label Simple and Charming. Show all posts
Showing posts with label Simple and Charming. Show all posts

Friday, March 23, 2018

Simple and Charming -10


ఎంతోసేపు pen పట్టుకుని కూర్చున్నాగానీ మాటలు పెగలడంలేదు. ఎలా మొదలు పెట్టాలో తెలియక మనసు మూగపోయింది పాపం. తన జ్ఞాపకాల్లోని నీ charming personalityని, తనకొచ్చిన simple మాటలు సరిగ్గా చూపించలేవేమోనని చిన్నబుచ్చుకుంది. అయినా, చూపించితీరాలన్న కోరిక వల్ల కలిగిన అలజడి ఆగక చేసిన ప్రయత్నమిది.


"ఏంటీ పిచ్చిమాటలు" అనిపించొచ్చేమో, సాయంత్రం ఇంటికెళ్ళి, స్నానమయ్యాక, singleగా చదువుకో, నీవల్ల బద్ధలైన కొన్ని defence wallsలోనించి బయటపడ్డ bricksని నీకు souvenirsగా present చేస్తున్నట్లు అనిపిస్తాయి.

ఆమధ్య ఎప్పుడో చదివిన Pride and Prejudiceలో Ms.Bennet గుర్తొస్తుంది నాకు, నీ గురించి ఆలోచించినప్పుడల్లా. వెంటనే Mr.Darcyలోని గొప్ప qualities ఏంటా అని కూడా ఆలోచిస్తా, నాకేమైనా chance ఉందేమోనని. ఆవెంటనే, Mr.Benent అనే మాటలు కూడా గుర్తొస్తాయి, "could not have parted with youmy Lizzy, to anyone less worthy" అని. అవును, అంతటి అపురూపమే మీరిద్దరూ. ప్రేక్షకుల స్థాయిని పెంచిన సిరివెన్నెల గారిలాగా, నీగురించి తెలిసిన మగపిల్లల్లో నువ్వూ ఓ వెన్నెల్లా మిగిలిపోతావు.

నిజానికి, నీగురించి రాయడానికి సరైన ఉపమానాలేవీ నాదగ్గర లేవు. "అలాగ" అని అద్భుతమైన వర్ణనదాకా వెళ్లకపోయినా, "ఇలాగ" అని easyగా వివరించడానికే అవడం లేదు నాతో.  I must say, you are so damn special, and I am sure, not just to me. నువ్వో గోదావరి సినిమా, నువ్వో Dhoni batting.

 అరవిరిసిన మొగ్గతో పోల్చబుద్ధి కావడంలేదు, Achillisగాడి cousinలాగా కూడా కనిపిస్తూంటే. అడవిపూల అందం కనిపిస్తున్నా, అది కొదమ సివంగిలాంటి నీ చురుకుదనం వెనక్కెళ్లి దాక్కుంది. Routineగా గుర్తొచ్చే పనస తొనలు, బాపు బొమ్మలూ బదులు, paradise biryani గుర్తొస్తోంది.

First time foreign వెళ్లినప్పటి feeling గుర్తొచ్చింది. సద్గురు పాముపట్టుకుని నాగదోషాల గురించి explain చేస్తున్నంత ముచ్చటగా ఉంది నిన్ను చూశినా.

అంతకుముందు చాలా బావుంది అనిపించికూడా, ఎక్కడా ఉపమానాలుగా వాడలేక అలాగే ఉండిపోయిన కొన్ని, నిన్నుచూశాక సరికొత్తగా బయటికొస్తున్నాయి. For example, ఘర్షణ సినిమాలో, "Why me Maya?" అని DCP అడిగే సీన్‌లో, మాయ "నీకర్థం కాదు, It's a girl thing, light తీస్కో!" అని నీ voiceలో విపిస్తోంది.

దారుణం అబ్బా నువ్వు, brainలో new connections form అవుతున్నట్లు ఉంది, అంత కొత్తగా ఉన్నాయి నా ఈ పోలికలన్నీ.

Tuesday, August 8, 2017

Simple and Charming - 9



ఈ seriesలో "ఇదో" outlier అవుతుందేమోనని అనుమానమున్నా, ఎవరో ఒకరు చదువుకునేలా, కనీసం ఇక్కడన్నా రాయకపోతే, రాయైపోతానేమోనని రాస్తున్నా.

అంత సింపులేం కాదు, కానీ మంచి శార్మింగ్. ఈపాటికే ఎన్ని "కొండ"లెక్కేసిందోననే అనుమానం కలిగేలా అ(క)నిపిస్తుంది. ఏం మంత్రమో వేసేసింది. (ఏం మంత్రమో తెలీదనేం కాదు). లేకపోతే ఇదేంటి? ఇలాగ అరెష్టయి పోతున్నాను, వరష్టుగా.

పక్కనెవరు కూర్చుంటారో నాకు తెలీదా, కానీ ఎందుకు అడుగుతున్నాను? ఎందుకు పదే పదే పిల్లోన్నైపోతున్నాను? పనెందుకు బాగా చేస్తున్నాను? పొద్దున్నే పరిగెడుతున్నాను (I mean jogging). పనికేసుకెళ్లడానికి puma shoes కొన్నాను.

సింపుల్‌గా పిచ్చెక్కించేంత శార్మింగ్. చెప్పుకున్నాంగా ఆ మంత్రం, బెంగుళూరులోనే బేలూరు చూపించేస్తుంది ఈ బాలిక. ఆపై, నే శిలనైపోయి, ఇలా అక్షరాలు చెక్కుకోవడమే.

బాగా off the trackవెళ్లకుండా, ఈ పూటకి ఇక్కడే ఆగిపోదాం.

చెన్నకేశవా!

Tuesday, May 6, 2014

Simple and Charming - 8


"ఏరా సంటీ, ఈమధ్య కవితలు రాయడం లేదు ?"
"మరి తనక్కడ కళ్లలోకి చూస్తేనేగద, మనకిక్కడ కాగితాలు నిండేది!"
"ఎక్కడ ?"
"ఇక్కడనేం లేదు, ఎక్కడ ఎదురైనా చూడొచ్చు."



Juice cornerలో కనిపించిందనుకో, జీవితం తగలడాలసిందే. Dairy Milk chocolate తీసుకుంటునప్పుడు తన చేతివేళ్లు చూశావనుకో(నేంజూశాలే!), కళ్లలో పొడిచి, గుండెలో కెలుకుతాయి. ఆ RPM ముందు, Juice cornerలోని mixer grinderలు కూడా 'అబ్బే, light తీసుకోవాల్సిందే', అంత ruthlessగా ఉంటుంది చిన్నా! 

ఎలాగోలా తట్టుకుని, E-block దగ్గరికెళ్తాననుకో, అక్కడ "ఎవర్రావీడు?, ఎక్కడో చూశామే??" అన్నట్టు చూస్తుంది. ఆ చూడ్డం కూడా ఎలాగనుకున్నావ్? గంటలు గంటలు చాగంటి వారిని విన్నాగానీ అర్థమవని జన్మ రాహిత్యం, దాదాపుగా అర్థమైపొతుందనుకో, ఆకాసేపూ! అంత powerful. గత ఏడుజన్మల్లో చేసిన పుణ్యకార్యాలన్నింటికీ, తెలియకపోయినా Thanks చెప్పుకుని బయట పడతాను.

ఈసారి ఆ ఎదర Gulmohar రోడ్లో కనిపిస్తుంది, ఇంతకుముందెప్పుడో చెప్పినట్లు, చాతీని తవ్వి, గుండెని తీసి, గంతులేయిస్తుంది, నాముందే. అదో ముచ్చటనుకుంటా తనకి. చాలా playful మరి!

Tataగార్ని దాటుకుని BSNL office దగ్గర తేలుతానా? Earbudsలో 'నా....కెంతో నచ్చే గీతాలన్నీ నేడే  నీ....వు నేను కలిసే విందాం!!' అని melody play అవుతుండగా, "ఏడిశావ్, ఎదవ!"  అని మళ్లీ ఎదురై ఏడిపిస్తుంది. వే..రి(very) tough!
మా ఊరి కోటలోని కోదండ రాములోరు కొంటెగా 'Hi' చెబుతారు, (అంటే, మనం ఇక్కడ 'దే...వుడా!' అనేసుంటాం, తెలీకుండానే.)

ఆ బాధతోనే బాదాం రోడ్లో వెళ్తూ ఉంటానా (సరదాగోసారి సచ్చిపోదామని!!), జీన్స్ వేసుకున్న మహాలక్ష్మిలా, లంకెబిందెలకు బదులు ఏవో chemicals ఉన్న dessicator పట్టుకెళ్తూంటుంది. లోపలున్న నాలుగు పదాలూ పీకి బయట పడేసి, నా మనసును కూడా దాంట్లో వేసుకుని పోతుంది. అలా వెళ్తున్న తన కొప్పుని చూసుకుంటూ, రోడ్డు మీద పడిన ఈ నాలుగు పదాల్నీ, ఇదిగో ఇక్కడ displayలో పెట్టుకోవడమే, కనీ...సం acknowledge చెయ్యకుండా!

Friday, November 22, 2013

నూటొక్కటి !!


కృష్ణశాస్త్రి వారికి ఆ యొక్క అప్రాప్త మనోహారిణి ప్రసాదించిన
                                               హృదయ దళనములొక్క శతము,
అరుదెంచిన జగద్పతిని అలుకబూని తాచిన సత్యభామ ఆపై  సైచిన
                                               వేదనయందొక్క సహస్రాంశము,
ఇవి,
ఊహించని నిన్నటి మీ దర్శన భాగ్యమున మాకొరిగిన వరవిశేషములు!!

Tuesday, August 13, 2013

Simple and Charming - 6

బెంగుళూరు,
13/8/13.


ఇదిగో నిన్నే,


ఎన్నెల్లో ఆడుకునే ఆడపిల్లల్ని నేంజూల్ల (నీకసైన్మెంట్లతోనే తీరిక లేదనుకుంటాలే, ఇంక ఆటలేమాడుకుంటావ్ !),
వర్షంలో తడిసే సంద్రాన్నీ నేంజూల్ల (గొడుగున్నట్టుందిగా మనకు),
నడిరాత్రి సంద్రపు సడిగూడ నేనిన్ల (మాటాడి సస్తేగా ఎపుడన్నా; నన్నేలే!!).

పాలకడలి కెరటాల్నేంతాకల (ఆ నీ చెప్పులేంజేసుకున్నాయో గదా!),
పైడి కొండన్నేంతడమల (ఆ చూడిదార్ సంగతేం చెబుతాం!!),
ప్రబంధాల్నీ నేన్జదవల (పన్జరిగితే,  చదవడమేం ఖర్మ, నేనే ఓటి రాహేద్దును గదా!!!)

"ఐతేంట"ంటున్నావా ??  చెబుతున్నా, సదువుకో,

నీ నడక (ఓ రెండడుగులంత) రేపిన రచ్చలో, (Actualగా, ఒకడుగనే రాద్దును, కానీ, అడుక్కీ అడుక్కీ, మధ్యన, నడక్కే అందం తెచ్చే ఓ చి.....న్న pause ఉంటుంది జూశావు,  అదొచ్చి నా కళ్లలో కూచుంది. తన గురించి రాయక పోతే సంపేస్తానంటోంది.) బయల్పడిన పై నా దౌర్భాగ్యాన్ని, ప్రపంచానికి ప్రదర్శించుదామని ఈ నా ప్రయత్నం.

"ఐతే నాకు రాయడమేంటం"టున్నావా?

అయ్యో అమ్మాయీ!!, నువ్వేగా మరి నా ప్రపంచం.

నీ 
నేను

Thursday, July 11, 2013

Simple and Charming-5


అదేదో చిరునవ్వు లాగా...నే ఉంటుంది.కానీ Actualగా చిరునవ్వు కాదు.
మొదట్లో కళ్లతో నవ్వుతోందేమోలే అనుకునేవాణ్ణి, అట్టే తెలిసిపోయింది, అదికూడా కాదని.

అబ్బే, ఇదేదో Abstract material అనుకున్నా, అందువల్లే అందంగా ఉందేమో అని కూడా అనుకున్నా.
కానీ, చాలా తేలిగ్గా(అంటే lightగా అనమాట), నెమ్మదిగా, చల్లగా ఉంటుంది. And భలే మెల్లగా గిల్లుతుంది కూడా.
simpleగా (క)అనిపించే గొప్ప సంపద అనమాట, మట్టితో చేసిన దేవుడి విగ్రహం లాగ.

తనకి తెలీ...కుండానే దోచుకోవలని నా(కళ్ల)కెంత ఆరాటమో ?!

తను hi చెబుతున్నపుడు చూడాలి(నాకే లెండి), "పోలా, అద్దిరిపోలా ?!" అనిపిండేస్తుంది, మళ్లీ 'అదే'.
ఆస్తులే..మక్ఖర్లేదు, అది చాలు.

రాత్రి(?) మూడింటికి  పడుకున్నా, మళ్లీ పొద్దున్నే తొమ్మిదింటికి lab కొస్తుంటే, నేనెంత హార్డు వర్కరో అనుకుంటున్నారు మా జనాలు, పాపం ఎనిమిదింటికి mess లో మళ్లీ 'అదే' అని తెలీక.

పదో తరగతిలో తెలుగు వ్యాకరణం అర్థంకాలేదని ఏడ్చినట్టు గుర్తు (ఎవరూ చూడకుండా లెండి !!) , ఆ తర్వాత అర్థం కాకుండా అంత పని చేయిస్తోంది మాత్రం 'ఇదే'.

శాలా సూశామంటారేమో, పర్లేదు అలాగే బతికెయ్యండి, ఇటేపు రాకండి, ఇది మాత్రం నాకేనాకే.

కళ్లు కలిపినపుడు కదా, 'దాని' అసలు పనితనం;
ప్రపంచానికం....తటికి ప్రాణాలు పోయి, ఆ మొత్తం వచ్చి నాలో పొంగుతాయ్.
(ఇంకో మొత్తం ఇంకెక్కడైనా పొంగుతోందేమో అని నా అనుమానం, మీరేం entertain చెయ్యకర్లేదు).

Thursday, February 21, 2013

Simple and Charming-4


ఎప్పుడూ mess మూలల్లో ఒంటరిగా మురిసిపోడానికి అలవాటుపడిపోయిన మనసుకి మొన్న bumper offer తగిలింది. Enter అయ్యి, queue ఎలా ఉందో అని line వైపు చూసే సరికి చివర్లో కనిపించింది మన చూడిదార్. మరాపూటకి చేతులు కడగలేదు,ఈ లోపు ఎవరన్నా join అవుతారుగదా.

దగ్గరికి నడుస్తున్నకొద్దీ,
నే చూస్తున్న తన పాదాల (నిజంగానే) resolution  పెరుగుతున్న కొద్దీ,
body లో ప్రతి cell dehydrate అయ్యేలాగా vibrate అవుతున్న కొద్దీ,
అణువణూవూ పొంగిన అమృతంతో వికసించిన ఈ నాయొక్క నేను, oh....!, I love him, మా ఊరి కోటలో కొలువున్న కోదండ రాములవారు కోప్పడినా (తన పాదాలనైనా ఇంతగా ధ్యానించలేదని).

శ్రీ సూర్యా మూవీస్ వారి telugu dubbed tamil సినిమా పాటలు తొలిసారి ఆలకించినప్పుడు,
straight drive four కొట్టినపుడు హుందాగా అభినందించే రాజేష్ అన్న లాంటి bowler తో ఆడినపుడు,
half-boiled omlete తో  సంతకం (Signature) తీసుకున్నపుడు,....
ఇలాంటి listకి ఈ feeling కూడా append చేస్తూ..... ఉన్నాను,

ఈలోపు ఎక్కణ్నించీ వచ్చారో తెలీదు,  ఈ భావకవులు మనసులో పడి బావులు తవ్వేస్తారు.అదో రాయలవారి సీమ, రాళ్లే దొరుకుతాయ్, రత్నాల్లాంటివి.
చపాతీల దగ్గర ఎప్పుడూ late చేసి చిరాకు పెట్టే mess వాడు, ఈ పూటకి మన friend .వాడి దయవల్లే line ఆగిపోయింది మరి.
ఇంతలో, "అందమైన వేళ్లు, మకుటాల్లాంటి గోళ్లు" అంటూ ఎక్కణ్నించో గోకుతాడు శివగణేశ్. మరి వాటి అందమటువంటిది.చూస్తూ సచ్చిపోవచ్చు.
కేవలం ఆ పాదాల్ని పెళ్లి చేసుకొవచ్చు.<చిరాగ్గా మొహం, మీదే లెండి>"పాదాల్ని పెళ్లి చేసుకొవడమేంటా"?
మరదేగా చెబుతోంది, పిచ్చెకిస్తాయని.

ఆ కాశీ తాడుంది జూశావూ,కళ్లని కట్టి పడెయ్యట్లేదూ...!
కళ్లు తిప్పుకోడానికి నేపడిన కష్టముంది జూశావూ,
wait wait, కాశీనాథుని విశ్వనాథ్ చూపించాక చూశారంటే, ఇప్పటికిప్పుడో నంది ఇచ్చేస్తారు, ఇలా... retire అయిపోయినా, ఇంకో ముప్పయ్యేళ్లకి Life time achievement అందిస్తారు.మరా freshness అటువంటిది.

ఇంతలో, అదేదో జలియన్ వాలాబాగ్ లో ఉన్న మమ్మల్ని జాలిగా చూసి, గేటు తాళాలు విసిరి నట్లు ఓ ముప్పయ్ చపాతీలు తెచ్చి పడేశాడు, ఆ mess వాడు.

అవో రెండేసుకుని వెళ్తున్న తనని చూసి, నాలోంచి ఇంకో   నేను బయటికొచ్చి తనన వెనక వెళ్లట్లేదేంటా(ప్చ్, అదే, సినిమాల్లో హీరోయిన్, హీరో ని cross చేసి వెళ్లాక వాడిలోచి ఇంకోడు బయటికొచ్చి తనని follow అవుతాడు గదా, అలాగ..) అనుకుంటూ, ఓ మూడు చపాతీలు వేసుకుని ఓ మూలకెళ్లాను, చాలా మామూలుగా.
(సశేషమో, నిశ్శేషమో. చెప్పలేం )

Saturday, October 27, 2012

Simple and Charming-3


అంతందమేంటే,
ద్దూపద్దూ లేకుండా, బ్బాయిలంటే జాలీ దయా లేకుండా.
అంతేనా? అంతకన్నా  ఎక్కువ,
లవిమాలిన భిజాత్యం,మరి రాల్తీకుండా ఎలా ఉంటాం?
క్కడితో గితేనా,
డవిపూల మాయకత్వం, టికి Unileverలు, P&Gలు వసరం లేదు గదా!
సలే, ర్డినరి మ్మాయిల్ని, అంతరించిపోతున్న రుదైన జాతుల్లో చేర్చేశారు.(నైక్య బ్బాయిల సమితి వారు.)
టువంటి సమయంలో, మొన్నామధ్య మన పూరి గారిని కలిసి వేర్నెస్ కల్పించమని శ్వేతపత్రం సమర్పిస్తే, నిన్న మన Power Star గారితో పలికించారు, ది వేరె విషయం.
యినా, కృష్ణ శాస్త్రి కవిత్వానికి కాసులపేరెందుకు?  ఖర్చుదండగ కాకపోతే..!
దే కారణంచేత, నువు కేవలం కాశీతాడు కటుకొచ్చినా, చూసిన నా కళ్లు సల్లబడుతున్నాయి.

అండర్ వాటర్ ఆక్సిజన్ ఎలాగో, స్తమానం నువు నాకలాగ.
ర్థం జేసుకోవు,
యినా బాధలేదు, దో Optimism. 

Thursday, September 20, 2012

Simple and Charming-2


(ఈసారి కొద్దిగా Seriousగా)
మరీ మిగిలిన ప్రపంచం మొత్తం పట్టించుకోకూడదంటే ఎలాగరా?
ఎటేపు తిరిగినా తనేనంట,
తనెళ్లే timeకి నేను start అవ్వాలంట,
ఎప్పుడు ఏదార్లో వెళ్తుందో గుర్తుంచుకోవాలంట,
తనెప్పుడు చెప్పిందో..., నేనెలా విన్నానో..., అన్నీ అచ్చం అలానే జరిగిపోతున్నాయ్ రా.
బాబోయ్, నేను నామాటే వినకుండా చేసేసింది.
మనలో మన మాట, మానాన్న మాట కూడా ఇలా వినిపించుకుంది లేదు.ఇది మరీ దారుణం.
అదో నడిసే నయాగరా సిన్నా, తడిపేసేలోపు ముంచేసిద్ది, మరింకేం మిగలం, మనకిమనం.
Suddenగా Newton గుర్తొచ్చాడు, వీడి 3వ మాటని భయంకరమైన Rocket లైనా వింటాయ్ గానీ,అందమైన అమ్మయిలు మాత్రం అస్సలు ఆలకించవు.
పొగురు, బలుపు, కొవ్వు, బిరుసు, ఇంకేదైనా. కాకపొతే ఏంట్రా, ఇక్కడింత contaminationతో కొట్టుమిట్టాడుతోంటే కొద్దిక్కూడా reactionలేదు.
పైగా hi చెబితే "optimization class మీకు అర్థమౌతోందా?" అనడుగుతుంది. అవదు, దీనికి మన బాధ అస్సలు అర్థమవదు.
అవయవాల అమరిక అద్భుతంగా కాకపోయినా, అందంగానే ఏడ్చింది గదా(అదిన్నూ ,అందరికి అర్థమయ్యే అందం కూడా కాదుగదా, అదో Esoteric Aesthetics), లోపల Hormoneలే సరిగ్గున్నట్లు లేవు దీనికి.  
తెలీట్లా దానికి...., ఒక్కసారి సరిగ్గా నాకళ్లలోకి తొంగిచూస్తే, తెలిసొచ్చి తరిస్తుంది బుజ్జిముండ.
పోనీ భగవంతున్నేమన్నా బతిమాలుకుందామా అంటే, లోక కళ్యాణం కోసమే....కోరుకోమంటాడాయన,
మా కళ్యాణనికే దిక్కులేదు, తొక్కలోది లోకకళ్యాణం ఎవడిక్కావాలి?
(సశేషం).

Tuesday, August 28, 2012

Simple and Charming-1


కొత్త పుస్తకంలో రాసేప్పుడు మొదటి పేజీ వదిలేసినట్టు, తెలీ...కుండానే, చాలా తే...లిగ్గా జరిగిపోయిందిరాబ్బాయ్..!
ఇది వరకు mess కెళ్తే, ఎన్ని జీన్సులు, ఎన్ని టాప్ లు, అబ్బో....టాపు లేచిపోయేది, అదో రాయలనాటి రసికత.
మరిప్పుడో...., ఒక్కటంటే ఒక్కటే, అదీ చూడీదార్.
దీన్నేమంటారా.........? ఇదో కవి హృదయపు కటకట.
           అంటే నా ఏడుపు నేనేదో miss అవుతున్నానని కాదు.
అదేంటో, "నేను, దాన్ని వెదకడమేంటి?" అనుకుంటూ mess మెట్లు ఎక్కుతూ ఉంటానా,
కానీ ఆపాటికే నా కళ్లు mess అంతా కలియతిరుగుతూ ఉంటాయ్, ఆకలిగా.
ఇదిగో ఇలాగే, మన ego దెబ్బ తింటోంది. అదీ మన బాధ.
ఆ పై lineలో , "దాన్ని"  అని రాయడానికి లోపల ఎంత రచ్చ జరిగిందో నేనిక్కడ రాయలేను.
       నాకీ మధ్య రోజూ హోలీ యే. మరది రోజుకో రంగుతో కొడుతోందిగా.
ఎన్ని చూడీదారులు చూడలేదు మనం,...... ఏదీ కళ్లను దాటెల్లి ఇంత కల్లోలం జెయ్యలేదే.
అందమంతా దాని అమాయకత్వంలో ఉందిరా. ఆ క్యారీ...యింగ్ ఉంది జూశావు, కళ్లప్పగించవ లిసిందే చిన్నా. సితక్కొట్టేంత సింపులెహె, కాని సంపేసేంత శార్మింగ్(charming) రోయ్.
నడక, ప్చ్, ఇది నికోటిన్నే(nicotine) నాకించ్చేద్ది, నాడీమండలం రిలాక్సయ్యేంత నాజూగ్గా ఉంటది నాయనా,
చాలా నెమ్మదిగా, ఉప్పుడు ...మందగమనం అంటారు సూడు అద్గదే,
 శాస్త్రి గారు తప్ప, సమకాలీనులెవరి సేతా కాదురా, సెప్పాలంటే. మరది.
మొన్నోరోజు, Gulmohar Roadలో అగుపడింది, ఒంటరిగా. అదలా నడుస్తుంటే BP పడిపోయింత స్పీడ్ గా, Frame Rate పెరిగిపోయి, Vertigo effect లో ఊపేసిందంతే. ఊపిరి ఆగిపోయింది కాసేపు. కానే...మి జరగనట్లు, మెల్లిగా Meditate చేస్తున్నట్లుగా ఎళ్లిపోయిందంతే. మతొచ్చాక చూసుకుంటే ముర్తి గారి Matrix Theory క్లాసైపోయింది.
(సశేషం).