అంతందమేంటే,
అద్దూపద్దూ లేకుండా, అబ్బాయిలంటే జాలీ దయా లేకుండా.
అంతేనా? అంతకన్నా ఎక్కువ,
అలవిమాలిన ఆభిజాత్యం,మరి ఆరాల్తీకుండా ఎలా ఉంటాం?
అక్కడితో ఆగితేనా,
అడవిపూల అమాయకత్వం, ఆటికి Unileverలు, P&Gలు అవసరం లేదు గదా!
అసలే, ఆర్డినరి అమ్మాయిల్ని, అంతరించిపోతున్న అరుదైన జాతుల్లో చేర్చేశారు.(అనైక్య అబ్బాయిల సమితి వారు.)
అటువంటి సమయంలో, మొన్నామధ్య మన పూరి గారిని కలిసి అవేర్నెస్ కల్పించమని శ్వేతపత్రం సమర్పిస్తే, నిన్న మన Power Star గారితో పలికించారు, అది వేరె విషయం.
అయినా, కృష్ణ శాస్త్రి కవిత్వానికి కాసులపేరెందుకు? ఖర్చుదండగ కాకపోతే..!
అదే కారణంచేత, నువు కేవలం కాశీతాడు కటుకొచ్చినా, చూసిన నా కళ్లు సల్లబడుతున్నాయి.
అండర్ వాటర్ ఆక్సిజన్ ఎలాగో, అస్తమానం నువు నాకలాగ.
అర్థం జేసుకోవు,
అయినా బాధలేదు, అదో Optimism.
No comments:
Post a Comment