Showing posts with label TSS Cricket Club. Show all posts
Showing posts with label TSS Cricket Club. Show all posts

Sunday, September 22, 2019

First Interview - The Face off

ఇంతలో, welcome చెబుతున్న uncleని చూసి , "మరీ అంచు పంచెలు expect చేయలేదులేకానీ, ఇలా night pants, T-shirtని కూడా expect చెయ్యలేదే" అనుకున్నా, బాగా... chill అవుతున్న అయన్ని చూసి. "సర్లే, అవంత important కాదులే, uncle అంటే ముసలాడనుకున్నా, పర్లేదు" అనుకొని, hallలో ఉన్న sofa setలో (sofa కాకుండా, oppositeలో) విడిగా ఉండే (రెండింటిలో) ఒక chair మీద కూచున్నా. అయన నాకెదురుగా sofaమీద కూచున్నాడు, మధ్యలో teapoy ఉంది. ఒకట్రెండు నిముషాలు కుశల ప్రశ్నలూ, పొద్దున్న జరిగిన defence గురించి అడిగి, kitchenలో నుంచి వచ్చిన తన భార్యని పరిచయం చేశాడు. నవ్వుతూ వచ్చి, ఆవిడ నాకు కొద్ధి దూరంలో left side, మా ఇద్దరినీ face చేస్తూ కూచున్నారు. ఇంతలో, లో...పలి నుంచి ఇంకో జంట వచ్చారు. "వీళ్లెవరో?" అనుకుంటూ చూస్తుండగానే, uncle పరిచయం చేశాడు, వీళ్లు తన అక్కాబావలని. అనగా, candidateకి అమ్మానాన్నలు అనమాట. పైకి లేచేందుకు ప్రయత్నిస్తూ "నమస్కారం అండి!" అని పైకని, "ఆహా!, చేశాడుగా uncle మనల్ని గట్టిగా!" అని లోపలనుకున్నా. "పర్లేదు బాబు కూచోండి" వాళ్ళ reply. వాళ్లు మరీ chill బట్టలు కాకుండా, officeకి వేసుకెళ్ళేవే కట్టుకున్నారు.

"Candidate వాళ్ల family APలో ఉంటుంది, వాళ్లంతా ఎందుకు, ముందు తను నీతో మాట్లాడాలంటోంది, బెంగుళూరులో మా ఇంట్లో కలిసి మాట్లాడుకోండి, పెద్దోళ్ల కథ తర్వాత చూద్దాం అని simpleగా tempt చేసి పిలిపించి, అందరి ముందు పడేసి, అడ్డంగా book చేశావుగా uncle" అనుకుంటున్నా. ఇంతలోనే అంతా వినిపించినట్లు ఓ నవ్వు నవ్వి, "నీకు తక్కువ time ఉంది కదా, పెళ్లికి attend అయ్యి వెళ్ళిపోతా అన్నావని, వీళ్లు కూడా వస్తామన్నారు నిన్న; ఇవాళ పొద్దున్నేreach అయ్యారు" అని సంజాయిషీ ఇచ్చాడు uncle. ఏమంటాం, "ఓహో!" అని ఊరుకున్నాం. ఇంతలో ఇంకొకరొచ్చారు hallలోకి, "తను వీళ్లబ్బాయి" అని అతణ్ని కూడా పరిచయం చేశాడు uncle, "ఈయన (candidateకి తమ్ముడు) ఈ రాష్ట్రంలోనే  చదువుకుంటున్నాడు, పొద్దుటే వచ్చాడు" అని. Uncle లాగే night dressలో chill కొడుతున్న brotherకి కూడా ఓ హాయ్ చెప్పేసి, ఇంకెవరైనా వస్తారేమోనని చూస్తుండగా,  uncle పిల్లలిద్దరూ వచ్చారు. వాళ్ళు మరీ చిన్నపిల్లలు, పాపం, అందుకని పరిచయం చేయలేదు. "పోన్లే భయ్యా, బామ్మలు, తాతయ్యలు కూడా వస్తారేమో అని భయపడ్డా. మొత్తానికి, మాంచి sketch వేసి, నన్ను బోనులోకి లాగి అందరూ చుట్టుముట్టారుగా, let's get started" అని దీర్ఘశ్వాస ఒకటి తీసుకున్నా. నా ఎదురుగా sofa మీద, uncle, అయన పక్కన candidate వాళ్ళ నాన్న, hallకి కొద్దిగా దూరంగా, dining table దగ్గర వాళ్ళ అమ్మ, నాకు ఎడమపక్కన uncle భార్య, ఆమె పక్కన candidate వాళ్ళ brother కూచున్నారు.  అందరూ నన్నే చూస్తున్నారు, చూడటంకాదది, తినడం అన్నా తక్కువే. "VIP treatment భయ్యా, అడిగావుగా, enjoy మాడి!" ఎవరో వెటకారిస్తున్నట్లు వినిపించింది. కొత్తగ్గా వయసొచ్చిన కాకినాడరోజుల్లో, అప్పుడప్పుడూ కొద్దిగా insensitiveగా చేసిన సౌందర్య అన్వేషణ మరియు ఆరాధన యొక్క కర్మఫలమేమో అనుకున్నా.

ఇంతలో uncle instruction మీద refreshments arrangements మొదలయ్యాయి. వాళ్ళావిడ మంచినీరూ, T తేవడానికి వెళ్లారు, దాంతోపాటు రవ్వలడ్డు కూడా (తెచ్చాకే తెలిసాయిలెండి items ఇవని). "హ్మ్, మీ ప్రస్థానం ఏమిటో మాట్లాడుకుందామా?" అని నన్నే మొదలుపెట్టమన్నాడు uncle. "ఉండు, మన family గురించి చెబుదాం, పరిచయాలకి continuation లాగా ఉంటుంది" అని వాళ్ల బావగారు కల్పించుకొని వాళ్ల వంశం రెండువైపులా (అనగా, వారిది, వాళ్ళావిడ వాళ్ళది) చెప్పుకుంటూ వచ్చారు. మాంచి హుషారుగా ఉన్నాడాయన. అటువైపు, ఇటువైపు కూడా ఉద్యోగస్తులమే, పేరుమోసిన వాళ్ళమేనన్న కించిత్ 'ఇది' ధ్వనించింది. తప్పేంకాదు, చెప్పుకోడానికే కదా కలుసుకుంది, కాబట్టి, అంతా attentiveగా విన్నా. అలా పెద్దలగురించి అయ్యాక, పిల్లల దగ్గరికొచ్చేసరికి, "ఇద్దర్ని వేరే రాష్టాల్లో చదివించాం" అని ఈసారి ఇంకొంచెం 'ఇది'గా చెప్పేసరికి, చాలా సహజంగానే అనుమానమొచ్చింది, "బహుశా EAMCETలో మంచి seat రాలేదేమో ఇద్దరికీ" అని. అక్కడికే వస్తున్నా అన్నట్లు, "ఇద్దరికీ seat వచ్చినా, మంచి చదువులకోసం, communication skills కోసం (నేనూ, మీరూ కూడా సరిగ్గానే విన్నాం) అని అలా plan చేశా" అన్నాడు. Particularly అబ్బాయి medical seat గురించి, "సీమలోని famous private collegeలో government seat వచ్చినా, బయటే prefer చేశాం" అన్నాడు.  "సర్లే భయ్యా! seriousగా తీస్కోవద్దు, ఏదో కాలం బాలేదు,  ఇప్పుడంతా మితిమీరిన marketing నడుస్తోంది కదా అని, ఎవర్ని నమ్మాలో నమ్మకూడదో తెలీక అనుమానించా అంతే!" అనుకున్నా, పైకి ఊకొడుతూ. ఏదేమైనా, ఈ setup అంతేలా ఉంది. తప్పదు ఎవరికైనా. Generalగానే జనాలు personal brandingకి పరాకాష్ఠ చూపిస్తున్నారు. ఇదంతా అర్థమైనట్లు uncle వారి బావగారిని ఆపేసి, ఇంక నా గురించి చెప్పామన్నారు.

నా స్వార్థపూరిత ప్రయోజనం నడిపిస్తుండగా, నేనేమీ జంకకుండా (#NoFilters), సంక్షిప్త సుందరంగా, సమాచారం మాత్రమే వెల్లడయ్యేలాగా (show-offలా కనపడకుండా) CV బయటపెట్టా, వ్యక్తిగతము, వృత్తిగతమూనూ. నాకంటే రెట్టింపు ఉత్సాహంగా విన్నారు అందరూ, I liked it. విజయవాడ శ్రీచైతన్యలో, "లెక్కలు చేయడం ఒక art" అంటూ blackboard, chalk piece రెండూ తానే అయ్యి class చెప్పే KSగారి period అంత animatedగా (+ve గానే; uncle గారి బావగారి వల్ల) నడిచింది ఆ episode. అపుడు మరోసారి, పొద్దున్న KK అడిగిన questions కనిపించాయి కళ్ళముందు. "మరేం పర్లేదు, process important participants అందరికీ" అనుకొని proceed అయ్యా.

ఇలాగా family విషయాలు, professional plans గట్రా మాట్లాడుకున్నాక, ఒకట్రెండు నిమిషాల pause వచ్చేసరికి, నాకేదో అర్థమైనట్లుగా "main round interview ఎక్కడై ఉంటుందబ్బా!, పెరడూ గట్రా ఉండవుకదా ఇలాంటిచోట్ల!" అనుకుంటున్నా. మరి మనకేమో కొత్త; సినిమాల్లో అలాగే చూపిస్తారు కదా, పెరట్లోనో, balconyలోనో అవుతాయి meetings అని expect చేస్తున్నా. తనకోసమే ఈ Pre-planned pause అన్నట్లు, దగ్గర్లోవున్న bedroom నుంచి అంతా follow అవుతున్న candidate, మేమంతా ఉన్న hallలోకి enter అయ్యింది. ఓహో! అంటే అన్నిసార్లు ఈ ఆడంగులే లోపలికెళ్ళి  తీసుకురావాలనేం లేదన్నమాట అనుకుంటుండగా, "మీరిద్దరూ మాట్లాడుకోండి, మేము అలా పక్కకెళతాం" అంటూ uncle అనేసరికి అందరూ లేచి dining వైపు వెళ్తున్నారు, ఒక్కరు తప్ప, uncle wife. ఆవిడ అక్కడే కూచున్నారు. పక్కనున్న brother వెళ్లిపోగా, ఆ placeలో కొత్త శాల్తీ settle అయ్యింది. "అనగా, మనకి లభించే maximum privacy ఇంతే అనమాట!" అని అర్థంచేసుకుంటూ, dining table దగ్గర, చెవులిటు పడేసి వాళ్ళల్లో వాళ్లే ఏదో మాట్లాడుకుంటున్నట్లు కనిపించిన జనాన్ని చూసి, "This is cheating భయ్యా! మరీ రోడ్డుమీదకి కాకపోయినా, కొంచెం దూరమైనా వెళ్లాలిగా"  అనుకొని, వెంటనే, "wait, ఈ pre-meditated షాట్లే ఆడకూడదు, let's face it! ఇవాల్టికి బెంగుళూరే గ్వాలియర్, మనమే దేవుడు; స్టెయిన్, పార్నెల్ పిచ్చ light; ఓ అద్భుతానికి అవకాశమో, సాక్ష్యమో ఇచ్చినట్లు feel అయిన కల్లిస్ లాగా uncle కూడా feel అవ్వాల్సిందే ఈ పూటకి," అనుకొని, హాయ్ చెప్పా.

"చదువుకోడం కాకుండా ఇంకేమైనా చేస్తారా మీరు?" మొదటి ప్రశ్న. అంచనా లేని pitch కదా, ఈ unexpected bounceకి కొంచెం surprise అయ్యాం. Offend అయ్యాం అనుకున్నారో ఏమో, "అంటే, అలా కాదు, మీకున్న illustrious academic careerకి కొంచెం ఎక్కువ dedication కావాలేమో కదా! అందుకని other hobbiesకి time దొరకదేమో అని అలా అడుగుతున్నా" damage control exert చేశారు. (కంగారు పడకండి, exact language ఇది కాదు, భావం చెడిపోకుండా నేను అందమైన పదాలతో decorate చేశా, ఎంతైనా మనగురించి కదా!) .

"అలా ఏం లేదు, in fact నేనింకా, నా career కోసం ఇవ్వాల్సినంత time ఇవ్వడంలేదని feel అవుతుంటా" అన్నా.

"Seriously, with a PhD, you are saying you don't study enough?" అన్నట్లు చూసేసరికి,

"Damn Yes, I am not kidding. మనకున్న cotton businessల వల్ల research output is taking a toll. కవిత్వం చదవాలి, cricket ఆడాలి, రోడ్డుమీద పడి రాచకార్యాలు చేయాలి, cycling, biking, కొత్తగా zoom-car-ing, trekkingలు చేయాలి, friendships కావాలి, dark sides చూడాలి, simpleగా, nuclear science నుంచి nude woman దాకా అన్నీ నాకే కావాలి, ఇంకెప్పుడు careerకి ఉపయోగపడే పనులుచేసేది. నోట్లో స్పూను, దాంట్లో నిమ్మకాయ పెట్టుకొని, Balance Balance అంటూ పరుగెత్తడానికి ప్రయత్నిస్తున్నాం", కంగారు పడకండి, ఆవేశంగా అన్నీ లోపలే అనుకున్నా, పైకి ఏమీ అనలేదు.

"I mean, చిన్న చిన్న hobbies గట్రా ఉంటాయి కదా" అని, పైనున్న listలోంచి, చెప్పుకోగలిగినవి మాత్రమే, చెప్పాల్సిన విధంగా చెప్పడం జరిగిందనమాట.

Suddenగా ఇంకో విషయం గుర్తొచ్చింది, Indiaకి వచ్చేముందే శర్మగారని, ఒకానొక  wise friendతో పెళ్లి గురించి కొంచెం gyan ఇవ్వమంటే, "పెద్ద పెద్ద shockingలకి ready ఉండు" అన్నారు. "ఎందుకని?" అంటే, చెప్పారు, "మీ(family) దగ్గరికి pilot profile కానీ, సినిమాలో పనిచేసే assistant director profile కానీ, జిల్లా కలెక్టర్ (IAS) profile కానీ వచ్చిందనుకో ఎలా feel అవుతారు?" అని అడిగారు. నా surprise cum shockని అర్థంచేసుకొని, ఆయనే అన్నారు మళ్లీ,  "కొద్దిగా uncomfortableగా feel అయ్యి, match అవ్వమేమోలే అని hesitate చేస్తారు కదా, అలానే, నీలాంటి, SEEMINGLY studious, PhD profile చూస్తే, typical family, ఇంకా particularగా, BTech and software engineer అమ్మాయిలు అలానే feel అవరంటావా?" అన్నారు.

"నిజమేనేమో, మనం కొంచెం కొత్తగా, unfamiliarగా అనిపించొచ్చేమో. Ultimateగా,  academic jobని, లేదా, కంపెనీల్లో scientist jobని కూడా దూరంగానే feel అవుతారా?"

"నీ చేతుల్లోనే ఉంది, IITలు, IIScలు, scientist, research papers, academic conferenceలు, postdocలు గట్రా అంటూ భయపెడితే  వాళ్లకి తెలీని కొత్త ప్రపంచం అనుకొని risk feel అవ్వొచ్చు మరి, familyలో ఇవి తెల్సిన వాళ్లు ఉంటే, no problem. కొద్దిగానైనా తెలిసిన జీవితంలోకి అడుగుపెట్టాలని అనుకుంటారు కానీ, పూర్తిగా unfamiliar terrain కోరుకోరుగా. Anyway, play it simple, Good luck!" అని కొంచెం జ్ఞానదానం చేశారు. In this case, it seems, he was close.

Back to Gwalior...

ఆ తర్వాత, interestలు, likingలు, time passలు, friends,  అలవాట్లు, వేషధారణలు, professional plans అబ్బో, అన్ని variations ఎదుర్కోవాల్సి వచ్చింది. Workshop paperలో మన researchని beautify చెయ్యకుండా, disadvantagesని cover చేయడాలు గట్రా పెట్టుకోకుండా, pros cons అన్నీ వీలైనంత  nakedగా చూపించినట్లే చర్చలు నడిచాయి. Entertainment value మెండుగా ఉందని గుర్తించినా, పాఠకులు నిరుత్సాహపడతారని తెలుస్తున్నా, కొన్ని limitations వల్ల ఈ విషయం ఇలా తెగ్గొట్టాల్సి వస్తోంది. కానీ, రుచి తెలుసుకోవడం కోసం ఒక మెతుకు చూద్దాం. నేనడిగిన ఒక ప్రశ్నకి నా దగ్గరున్న జనాలు "దానిగురించెందుకు నీకెందుకు?" అన్నట్లు చూశారు, dining table దగ్గర జనాలు అందరూ "ఏం చెబుతాడో విందాం" అన్నట్లు silent అయిపోయారు. వాళ్లు initialగా ఇచ్చిన informationతో నాకు సమాధానం దొరకలేదు, అందుకే particularగా అడగాల్సి వచ్చిందీ ప్రశ్న: "మీ parents పెళ్లి మేనరికమా?" అని.  మనకెందుకా? నేను next generationకి ఇచ్చే ఆస్తిపాస్తులంటూ పెద్దగా ఏమీ ఉండదు, ఆరోగ్యం, చదువు మాత్రమే ఇవ్వాలని అనుకుంటా. అక్కడ మాత్రం రాజీపడను, అందుకోసమే అడిగా. మరి ఆరకంగా, candidate ఆరోగ్యం కూడా మనకి important కదా! Genuineగానే అనిపించిందేమో, జనాలెవరూ Affect అయినట్లు అనిపించలేదు.

మంచి పరిణామమేంటంటే, "At least కొంతమంది candidates homework చేసి వస్తున్నారు interviewsకి. వాళ్లకేం కావాలో స్పష్టత ఉన్నట్లుగా ఉంటోంది" అని బయట talk. People would like to believe that nothing is obvious, అందువల్ల, "ఫలానా వేషధారణ మీకేమైనా అభ్యంతరమా?", "నేను Job చేయడం గురించి మీ expectations ఏంటి, మీ family expectations ఏంటి?", "నాకున్న ఫలానా interest గురించి మీ అభిప్రాయమేంటి?" లాంటి ప్రశ్నలు అవలీలగా అడిగేస్తున్నారు. In fact, అందరూ ఉండటం వల్ల అడగలేకపోయిన ఒకానొక ప్రశ్నని (అదేమిటో మీ ఊహకి వదిలేస్తున్నా), తర్వాత uncle ద్వారా message చేయించి మరీ అడిగారు నా caseలో, అదీ మరి పరిస్థితి.  Completeness కోసం concluding remark: semi-privateగా నడిచినందువల్ల ఈ గంట timeకి, U certificate మాత్రమే సాధ్యపడింది. అనగా, old ball వల్ల వచ్చే reverse swingని face చేయాల్సిరాలేదు.

ఆవిధంగా, diplomaticగా కార్యక్రమం ముగించుకొని, dinnerకి late అవుతోందని సెలవు తీసుకునేందుకు ready అయ్యా. ఈమాటు మాత్రం వారికోరికని మన్నించి, వారి వాహనంలోనే  వెనుదిరుగ వలెనని నిశ్చయించుకొని బయలుదేరితిమి. వారి చోదకుడు తెలుగు నెరిగినవాడు, మరియు, మా సందర్శనార్థము బహు చక్కగా ఎరిగిన వాడునూ అవడంచేత,  మమ్ములను మిక్కిలి గౌరవముతో వ్యవహరించినాడు. వారి రెడ్ల (యజమానుల) యెడల ఆతని సానుకూల్యతని, స్వామిభక్తిని వ్యక్తపరిచినాడు. సర్లెమ్మని, మా ఆలోచనలని మరోవైపు మళ్లించడం కోసం, "music ఏమైనా ప్లే చేస్తారా" అని రిక్వెస్ట్ చేస్తే, "తప్పకుండా" అని, జేబులో ఉన్న, personal collection pen-drive insert చేస్తూ, "కొంచెం పాత పాటలు, పర్లేదా!" అన్నారు పాపం నొచ్చుకుంటూ, "అయ్యో దానికేముంది, నేను కూడా వింటా ఆనందంగా" అన్నా.

"ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాక్కున్నావో వెన్నెల గువ్వా, వెన్నెల గువ్వా, ఇవ్వాళే చూశా నిన్ను వెన్నెల గువ్వా, వెన్నెల గువ్వా " అంటున్నారు ఇంకో రెడ్డిగారు పాటలో. "అయ్యో, లేదండి (SV)కృష్ణారెడ్డిగారు, మనకి ఇంకా time ఉంది ఈ పాట పాడటానికి" అనుకుంటూ ఆ journey కొనసాగించాం New BEL roadకి.


PS: పనులుచేస్తేనే పొరపాట్లూ జరుగుతాయి. కాబట్టి, ఏమైనా పొరపాటుగా అనిపిస్తే, వాటివెనకాల ఉన్న "పనిచేయాలన్న నా పట్టుదలని" పెద్దమనసుతో అర్థంచేసుకొని, పొరపాట్లని క్షమిస్తారని (anonymous participantsతో సహా) ప్రజలందరికీ మనవి. విచ్చలవిడిగా వాడుకోనిచ్చినందుకు KKకి ధన్యవాదాలు. 

Friday, September 20, 2019

First Interview - Gradual Building up


అలా 9:30కి తయారవ్వడం మొదలుపెట్టి, అయ్యాక, ఎక్కువ time లేదు కాబట్టి, ఈ పూట ప్రకృతిలో coffee skip చేసి, directగా department దగ్గర దిగేసరికి 10:30. 

"ఏంది మచ్చా, నీకన్నా ఆడోళ్లు నయం, గంటసేపు ready అయ్యావ్" time చూస్తూ KK విసుక్కున్నాడు.

"మా మతం భోజనాన్ని ఆస్వాదించడాన్ని తప్పుపట్టిందేమోగాని, స్నానాన్ని ఆస్వాదించమనే చెప్పింది మచ్చా" అన్నా.

"ఇట్టాంటివి బాగ చెబుతావ్ సామి నువ్వు!" అనుకుంటూ నన్ను వదిలిపెట్టి labకి వెళ్ళిపోయాడు. ఆయన ఏడుపు మయాంక్ దగ్గర attendanceకి late అయ్యిందని. అనవసరంగా acknowledge చేశా thesisలో, campusలోనే ఉండి, colloquiumకి, defenceకి రెంటికీ రాలేదు, ఏం ఉపయోగం?  

ఇంతలో, Mr. Kanhar "ಚೆನ್ನಾಗಿದ್ದಿರಾ Sir?" అనుకుంటూ security postలోంచి బయటికొచ్చాడు నవ్వుకుంటూ. "ಚೆನ್ನಾಗಿದ್ದಿನಿ Sir, ನೀವು ಹೇಗಿದ್ದಿರಾ?" అని క్షేమసమాచారం పంచుకొని, late అవుతోందని, తర్వాత మాట్లాడదాం అని చెప్పి తొందరగా departmentలోపలికి బయలుదేరా. "ಸರಿ sir, ಆಮೇಲೆ ಮಾತಾಡೋಣ" అంటూ ప్రసన్నంగా departmentలోకి సాగనంపాడు.

ఆయనెవరా? అయన SERC/CDS దగ్గర security guard, కనీసం 3-4 ఏళ్లుగా, అప్పటికి. PhD రోజుల్లో Late nights roomకి వచ్చేముందు కా...సేపు మాట్లాడితే చాలు, పాపం, తెగ సంబరపడిపోతాడు. ఒడిశా నుంచి వచ్చి, నెలకి కేవలం 8వేల జీతానికి పనిచేస్తూ, అందులోనే ఎంతోకొంత మిగిల్చి ఇంటికి పంపాలని బాగా ఇరుకు గదుల్లో ఉంటూ, ఏదో తింటూ, చాలామందే (post-office వెనకాల) బతుకుతున్నారని చెప్పేవాడు. ఏదోరకంగా సాయపడాలనే చిన్న ఇది వల్ల, friend చేసుకున్నా. అడిగి మరీ, నా institute wifi credentials share చేశా, అవసరమైతే తన friends (other guards) కూడా share చేయమని చెప్పా. IPL season అప్పుడు అయన ఆనందం చూడాలి (MSD fan). Security guard కాబట్టి ప్రతిరోజు న్యూజ్ (అయన యాసలో News) చూడాలి, workout చేయాలి అనేవాడు, చేసేవాడునూ. ఒకానొక శనివారం సాయంత్రం చీకటిపడ్డాక lab meeting ముగించుకొని ఆత్రంగా hostelవైపు (ఇంకో meetingకని) వెళ్లబోతుంటే duty చేస్తూ కనిపించాడు. Shift (second) అయిపోయాక M-blockలో నా room దగ్గరికి రమ్మని చెప్పా. 10:15కి, roomలో, మనోళ్లందరూ మూడు-నాలుగు రౌండ్స్ అవగొట్టి, మాంచి రచ్చరచ్చగా ఉన్నపుడు door కొట్టాడు. Open చేసిన మనోళ్లు, noise ఎక్కువై, securityకి అనుమానమొచ్చి check చేస్తున్నాడేమో అనుకొని కంగారుపడ్డారు. ఇప్పుడీయన గడ్డము పట్టుకొని బతిమాలుకోమన్నట్లు cornerలో ఉన్న నావైపు చూసారు, మరది నా రూమ్ కదా! కంగారు పడొద్దని చెప్పి, door వేయమని, ఆయన్నికూడా మాతో కూచోబెట్టుకొని, order చేసిన extra paradise single mutton biryani ఇచ్చి తినమన్నా. మా చేతుల్లో ఉన్న గ్లాసులు చూసి, security అయ్యిఉండి students చేస్తున్న ఇంత రచ్చలో involve అవడానికి ఆయనకి భయమేసి, just 2నిముషాలు కూచుని వెళ్తా, ఇంటికెళ్లి తింటా అన్నాడు పాపం. సరే అని ఇచ్చి పంపించాం, అందరూ relax అయ్యారు. ఆ తర్వాత జరిగిన IDCCలో security teamకి, practiceకి kit, matchesకి bats ఏ team supply చేసిందో మీరు easyగానే guess చేయొచ్చు.

సరే, back to present(ation)...

MRC దగ్గర తమిళ్ T తాగుతూ ఇదంతా చూస్తున్న మా lab-mate Ramగాడు, తాగడం అవజేసి, నా వెంటరాగా department లోపలికి enter అయ్యాం. Guideని కలవడం కంటే ముందు, officeలోకెళ్ళి, staff కోసం తెచ్చిన chocolates ఇవ్వడం చూసి, "మెట్ల దగ్గరినుంచి, మాట్లాడే మైకు దాకా మంచి కర్మ మూటగడుతున్నట్లు ఉన్నావ్!" అన్నాడు మావాడు. "మంచిదేగా" అనుకుంటూ ముందుకెళ్ళాం.

మన exam time తెలిసినందువల్ల "Good luck with your presentation!" అని సాయంత్రం కలవాల్సిన (interview) జనాల దగ్గరినుంచి message. కంగారు పడకండి, candidate నుంచి కాదు, వాళ్ళ uncle దగ్గరినుంచి (వాళ్ళ ఇల్లే interview location). comedy వరకు OKకానీ, అంత romance promise చేయలేం storyలో; just to set the expectations right. 

ఉన్న అరగంటలో slides చూడటం గట్రా పెట్టుకోలేం అని, తొందరగా guideకి ఓసారి కనిపించి, presentationకి set-up arrange చేస్తా అని చెప్పి, labలోకెళ్లి lab-matesకి కేవలం కనిపిం(చాననిపిం)చి అట్నుంచటే auditoriumకి బయలుదేరా. నావెంటే మా lab సైన్యమంతా వచ్చింది, అది rule, lab presentationsకి attendance mandatory. Laptop, projector set చేస్కుని మన శ్రేయోభిలాషుల ఆశీస్సులతో  దివ్యంగా కార్యక్రమం ముగించుకొని, guide, examinerతో faculty clubలో భోంచేసి, మళ్లీ departmentలో submit చేయాల్సిన forms అన్ని చేసి, hostelకి వచ్చేసరికి 3PM.

"ఛ! Interviewకి ఖచ్చితంగా lateగానే వెళ్లే"దని decide అయిపోయా. Immediateగా బయలుదేరినా easyగా 4 దాటేస్తుంది, మరి మనం స్నానం చేసి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంతలో మళ్ళీ వాళ్లే, ఈసారి call, వాళ్ళ vehicle పంపిస్తాం location share చేయమని. ఇదిగిదిగో, ఇదే VIP treatment అంటే. సెలవులకి ఇంటికెళ్తూ, "అర్ధరాత్రి bus ఉంది మచ్చా, bikeలో Hebbal police station దగ్గర దింప"మని అడిగే అలవాటుపడిన మనకి (Uber/Olaకి ముందు; పదిదాటాక బెంగుళూరులో city బస్సులు ఉండవని అలవాటు పడిన జీవితాలు), pick-upకి car పంపిస్తామంటే, "ఈ చిన్న చిన్న ఆనందాలే కదా జీవితమంటే" అనుకుంటాం. ఇదివరకే, మనమిచ్చే talks/tutorials కోసం company vehicles hostelకొచ్చి మరీ pick-up చేసుకున్న సందర్భాలున్నాయి. Concept same అయినా, context వేరబ్బా! Convince అవ్వండి.

స్వభావరీత్యా చాలా అల్పసంతోషులం కాబట్టి, అదేంవద్దని, "almost start అయిపోయా" అని సొల్లుచెప్పి, ready అవ్వడానికి సిద్ధమవుతున్నా. అవుతూనే ఆలోచిస్తున్నా, "అయినా, ఈ uncle ఏందీ, ఆయనేమో American citizen అంటాడు, candidate ఏమో కొంచెం modern అంటాడు, మొదటి round interviewకి family రచ్చ లేకుండా, సుబ్బరంగా ఏ cafeలోనో arrange చేయొచ్చు కదా! మనకి ఏ anxiety లేకుండా ఉండేది" అనుకుంటున్నా. "అయినా, ఇదే betterలే, మనకి జనాలతో అనుభవం అయినట్లు ఉంటుంది, పైగా, only aunt and uncle అన్నాడుగా, పెద్ద జనాలు ఉండరు కాబట్టి OK" అనుకుంటూ cab ఎక్కేసరికి 3:45PM. బెంగళూరు trafficలో ఈదుతూ interview locationకి వెళ్లేసరికి 4:35PM. Rich gated community, ఇంటిముందు Audi car, దానిపక్కన safari dressలో driver, ఇంటిలోపల తళతళలాడుతున్న furnishing, ఓడియమ్మ, uncle రచ్చ చేసాడుగా,  అవున్లే, green card అంటున్నాడు, companyకి GM అంటున్నాడు, ఈ మాత్రం శబ్దం చేస్తాడులే అనుకుంటున్నా. ఇంతలో....

(సశేషం)

Thursday, September 19, 2019

First Interview - Prologue

ఏం, తొలిప్రేమలే చెప్పుకోవాలా? తొలి interview మాట్లాడుకోకూడదా?

సాగరసంగమం సినిమా గురించి మాట్లాడుతూ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇలా అన్నారు ఓచోట "అదొక failure story. Success storyని ఎవరైనా చెబుతారు. పోనీ, hero failure అని చివరిదాకా దాస్తారా అంటే, సినిమా మొదటి sceneలోనే ప్రేక్షకులకి అర్థమైపోతుంది, hero పెద్ద failure అని. K. విశ్వనాథ్ గారు, ఆ failure storyనే ఎంతో గొప్పగా చెప్పి hit చేశారు. అంతేనా, సంవత్సరాలు గడిచినా, మళ్ళీ మళ్ళీ చూసేలా చేశారు" అని. అలాగే, నేను కూడా ముందే చెబుతున్నా, నాకు ఇదే చివరి interview కాదు. అయినా, మొదటిది ఎంతైనా ప్రత్యేకం; కనీసం, నాకు.

February 14, ప్రేమికుల దినోత్సవం, తెల్లవారుఝామున 5, Mekhri circle, lightగా చలి, phoneలో మాట్లాడుతున్నా "బుద్ధి బుర్ర లేవు మచ్చా నీకు, airport నుంచి వస్తున్నా అని తెలుసు, junctionలో,  RT nagar వైపు ఉన్నా అని చెప్పినా, సావగొడుతున్నావ్ ఎక్కడ, ఎక్కడ అని".

"సర్లే మచ్చా, నిద్దట్లో ఉన్నా, పొద్దున్నే మొదలు పెట్టావ్" అంటూ, నేను ఉన్నవైపు వచ్చాడు KK తన bike మీద.

రెండు పెద్ద bags మధ్యలో వేసుకొని బండి start అయ్యింది, IISc campus వైపు. విశాలమైన ఆ road మీద వెళ్తోంటే బెంగుళూరులో ఉన్నప్పుడు enjoy చేసిన road trips, ఆ early morning empty roads, చలి,..... ఆ సమయాలు అన్నీ గుర్తుచేసుకునే లోపే hostel వచ్చేసింది, దిగి, KK గది లోపలికెళ్ళి ఫటాఫట్ కాలకృత్యములు తీర్చుకొని, హడావుడిగా, మళ్ళీ బండివేసుకుని బయలు దేరాము, ఈసారి నేను తీసా. త్రివేణి టీకొట్టు దగ్గర ఆగి, ఇంకా చీకటి ఉండగానే పనులకి వెళ్లే వాళ్లతో కలిసి T తాగితే, ఆ feel వేరబ్బా, try చేయండి, highly recommended, యశ్వంతపూర్ soul చిక్కుతుంది ఆ timeలో అక్కడ. ఇప్పటికీ, ఆ టీకొట్టు వల్ల ఆ roadకి (triveni road) పేరొచ్చిందో, ఆ road వల్ల కొట్టుకి పేరొచ్చిందో తెలీదు, ఒకరిద్దరిని అడిగినా, "అవునా, good observation" అని పులిహార కలిపారే తప్ప, వివరం చెప్పలేదు. ఆ కొట్టువాన్నే అడుగుదామంటే, వాడు ఎక్కడలేని busy, very unwelcoming. అందువల్ల ఎప్పుడూ కుదరలేదు.

"ఏంది మచ్చా నువ్వు, 11కి Thesis defence అంటున్నావ్, 4కి first interview అంటున్నావ్? Night friendsతో dinner అంటున్నవ్, ఇప్పుడీ match ఆడటం అంత అవసరమా? Scotland నుంచి 12 గంటల flight తీస్కొని  వచ్చావు హాయిగా rest తీస్కొని freshగా కనిపించకుండా, నిద్రా, పాడు లేకుండా, match ఆడేసి, defence అవజేసుకొని, నిద్దర మొఖంతో ఇంటర్వ్యూ ఇవ్వడం, ఇంత అల్లరి ఎందుకంటావ్?" అన్నాడు KK.

"హ్మ్, defend చేసుకున్న thesisకి సార్థకత చేకూరాలంటే, అంకితమిచ్చిన teamకి ఈ match ఆడాల్సిందే! అయినా ఓసారి ఆలోచించు మచ్చా, సరిగ్గా, external examinerకి వీలయ్యేలాగా మరియు మనం match ఆడే working day (Thursday)నే defence plan చేసి, అంతేనా, సాయంత్రం schedule చేసిన interview participantsకి కూడా set అయ్యేలా కుదిరి, వీటన్నిటినీ meet అయ్యేలా, airindia flight plan చేసి, ఇదంతా చూస్తుంటే మనపాలిటి దశావతారం cinema story లాగా కనపడట్లా నీకు?" అనేసరికి,

"అవును మచ్చా , కొంపదీసి ప్రకృతి కూడా సహకరించి సాయంత్రం interview set అవుద్దంటావా? పనిలో పని, మీవోడి పెళ్లి అయ్యాక నువ్వు కూడా చేసుకొని తీసుకెళ్తావా ఏంది?" అని KK ఆశ్చర్యపోయాడు.

"ఏడిసావ్, logic miss అయ్యావ్, సరిగ్గా చూడు, events అన్నీ, మనం plan చేసినవే, butterfly effects ఏం లేవిక్కడ, నీతో comedy చేస్తున్నా అంతే. Actually, సాయంత్రం interview కూడా నాకు net practice లాంటిది, serious interview కాదు. వాళ్ళ సంగతేమోగానీ, నాకు ముందే తెలుసు నేను రిజెక్ట్ చేస్తానని, అయినా, ముఖ్యంగా అనుభవం కోసం మరియు కాసేపు VIPలాగా feel అవ్వడం కోసం ఈ exercise" అన్నా.

"దారుణం మచ్చా నువ్వు, ఆమాత్రం దానికి ఇంటర్వ్యూ attend అవ్వడం దేనికి, అంతమందికి time బొక్క" అరిచాడు KK. "అరె, చెప్పాగా, experience and  VIP treatment. నావరకూ నాక్కావలసినవి దొరుకుతాయి, నో failure. For 50% parties, it is success. in fact, at least 50% parties అనాలి, వాళ్ళకి కూడా కలిసి మాట్లాడాక దాని ఉపయోగం పట్ల సంతృప్తి కలగొచ్చు. మనం నచ్చడమో నచ్చకపోవడమో జరుగుతాయి కదా!" అనగానే,

"కరెక్టేప్పా, నువ్వేమో నీ సరదా తీర్చుకోడానికి వెళ్లి, వాల్లేమో seriousగా నిన్ను కావాలనుకుంటే, అప్పుడేంది పరిస్థితి, అనవసరంగా వాళ్ళకి time and effort బొక్కకదా! " intelligent ప్రశ్నయేగా అన్నట్లు teasingగా చూశాడు నావైపు, T గ్లాసు మూతికి అంటించుకుంటూ.

"see, this is all part of the game! process మీద concentrate చేద్దాం, result మీద కాదు, వాళ్ళైనా, మనమైనా. ఏమో, నా preliminary feeling అలా ఉంది, చూద్దాం, అనుకున్నదానికంటే differentగా ఉంటే, practiceని matchలాగా మార్చేద్దాం."  అని vivaలో questionకి సమాధానం చెప్పినట్లు చెప్పా.

"ఇంతకీ, already ఎందుకు డిసైడ్ అయ్యావ్ reject అని, candidate చూడటానికి నచ్చలేదా, profile బాలేదా?"

"candidate అందం కంటే ఆరోగ్యం ముఖ్యం మచ్చా మనకి. On the positive side, family looks interesting"

"ఏంది మచ్చా, profileలో medical reports కూడా పెడతారా! " ఈసారి వెకిలి నువ్వుకూడా add చేసాడు teasing చూపుకి.

"అదే మరి; photos, bio-data share చేస్తారు కదా మచ్చా! కేవలం వాటితోనే ఆగిపోకుండా, profileలోని detailsతో internet మీద, మన contacts మీదా పడిపోతే, ఎంతోకొంత unedited, raw information దొరకబట్టొచ్చనమాట! "

 "అక్కడ పచ్చి నిజాలు దొరుకుతాయంటావ్!"

"దొరికే chance (మాత్రమే) ఉంది అంటున్నా, అంతే. ఎందుకంటే, interviewకి కూచునే ముందే, అందరూ వాళ్ళ వాళ్ళ online జీవితాలని, గట్టిగా edit చేసి, colouring ఇస్తారు, part of the homework." ఇప్పటికి ఇది చాలు, time అవుతున్నట్లు ఉంది, పద అని మళ్ళీ campusలోకి పయనమయ్యాం.

NBH వెనకాల bike park చేసి, gymkhana వైపు bridge మీదకి పరుగుపరుగున వెళ్ళాం. అప్పటికే ఆరుంబావు దాటేసి పావుగంట అయ్యింది. Matchకి lateగా వెళ్లడం తప్పలేదు ఆవాళ్టికి. Match అయ్యాక, A-messలో కలిసి పొంగల్ తింటానని friendకి ఇచ్చిన మాట గుర్తున్నా, for old times sake, teamతో C-messలో omelette, అందాలు నంజుకుంటూ breakfast తీరిగ్గా అవజేసి, hostelకి వచ్చేసరికి 9:30 అయ్యింది.

 (సశేషం)

Monday, July 8, 2019

ఎంత పనిచేసావ్ మచ్చా, ShanLanj!

మచ్చా ,
ఎంత పనిచేసావ్ మచ్చా!

"అన్న, తమ్ముడు, బావ, బామ్మర్ది, ఏంది భయ్యా ఇదంతా?
KR అనేస్తా ఎంచక్కా, పిచ్చ light!" అన్నోడివి, ఆనాటినుంచి నన్ను KRని చేసినోడివి, open mindedగా ఉండాలన్నోడివి, ఉన్నోడివి,
ఇంత పిచ్చి పని, అసలు ఎవరికీ నమ్మకమే కుదరడంలేని పని, ఎలా చేసావ్ మచ్చా ?

ఆరేళ్లుగా, అత్యంత సన్నిహితంగా, తిన్నాం-తిరిగాం, cricket ఆడాం-కబుర్లూ ఆడాం, కూర్చున్నాం-ఖాళీ చేసాం, సినిమా కెళ్ళాం-సైకిల్ తొక్కామ్, బైక్ రైడ్ కెళ్ళాం-hikeలు trekలు చేసాం, ఈతకొట్టాం-eager గా wait చేశాం, పనికొచ్చే పనులు-పనికిమాలిన పనులూ చేసాం, publications గురించి మాట్లాడుకున్నాం-police station experience గురించీ comedy చేసుకున్నాం, సమాజం గురించి చర్చించాం - substance abuse చేసాం, భవిష్యత్తు గురించి-బాధల గురించీ బొచ్చెడుసార్లు మంతనాలు జరిపాం, hot stuff-cold stuff తేడాలేకుండా share చేసుకున్నాం, ఇంకా కలిసి ఏం చేయలేదని నాకు చెప్పుకోకుండా ఇలాంటి పనిచేసావ్ మచ్చా నువ్వు?

అయినా నువ్వు గొప్పోడివి మచ్చా. నువ్వు కలిసి మనందరి timeని happy time చేసావ్, కలిసి లేనప్పుడు, నీ happy timesని share చేసి మమ్మల్ని సంతోష పెట్టావ్. కానీ, నువ్వు బాగాలేవని మాత్రం, ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేక పోయావ్ మచ్చా ?
మేము బాధ పడతామనా ?
అయితే ఇప్పుడేం చేసావో చూడు; ఒకేసారి అందర్నీ గొప్ప దుఃఖంలో తోసేసావ్.

"No free lunch భయ్యా!" అనేవాడివి; కానీ, నువ్వు మాకందరికి చాలా easyగా దొరికేశావే అనుకున్నాం. ఆ price ఇప్పుడు pay చేస్తున్నాం, నువ్వింక లేకుండా పోయాక;
నువ్వు కూడా postpaid plan లాంటోడివే మచ్చా, always hated them.

మొన్నటికి మొన్న, మూడు గంటలు call మాట్లాడి, stone అయ్యి చేసిన తుంటరి experiments కూడా చర్చించుకున్నాక, చెప్పుకోడానికి ఇంకేం లేవని పెట్టేసాం అనుకున్నా కానీ, చెప్పుకోలేక పెట్టేశావ్ అనుకోలేదు మచ్చా.

ఆర్నెల్లప్పుడే, A-Mess పైన, dry day అయినా కూడా, యశ్వంతపూర్ లో shutter కొట్టి సాధించుకొచ్చిన cheapest liquor తాగలేక తాగుతూ, నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయ్ మచ్చా, అదంతా నువ్వు చెప్పలేక చెప్పుకున్న అంతరంగమని. ఇంకొంచెం తెలివిగా ప్రవర్తించాల్సిందేమో అనిపిస్తున్నా, ఇప్పుడిక ఏమీచేయలేను.

 2012లో, ఇంకా పిల్లబచ్చాగా ఉన్నపుడే,  football groundలో, నిక్కరేసుకొని నా teamలో cricket  ఆడినప్పుడు వర్మని మింగడంతో start చేసిన మన రచ్చ, ఆ మధ్య మా ఊర్లో గడిపిన holiday, ఇంట్లో తిన్న సంగటి-సీలు, కుంటలో కొట్టిన ఈత, నిన్న మొన్న European winter nightsలో share చేసుకున్న పొగ పరిమళం వరకూ అన్నీ పచ్చిగానే ఉంటాయి నాకు, ఎప్పటికీ.

జ్ఞాపకం వచ్చాక నన్నింతగా కదిలించిన బ్రతుకూ, చావూ రెండూ నీవే మచ్చా.


(To one of our best friends, from the rest of the pack)

మనందరి అంజి!

 "ఆగు తమ్ముడూ"  అన్నా, "అదేంటన్నా" అన్నా,   మన అంజి ప్రయివేటు చెప్పడానికి సిద్దమవుతున్నాడని అర్థం. ఇంక, చెయ్యెత్తి "నువ్వుండ్రా క్రాంతి" అన్నాడంటే, నాయాల్ది, క్రిష్ణంరాజు లెవెల్లో, KK ని 'కిందేసి కొడతా'డన్నమాటే.

Comedy కాసేపు పక్కన పెడితే, మన TSS clubకి, గొప్ప ఆస్తి మన అంజి. One of the most  important  veterans అని చెప్పుకోవచ్చు.  వెనకటి రోజుల్లో, అనగా, అంజి బాగా flatగా ఉన్న రోజుల్లో, అలవాటు లేక (నేను) first spell లో వాడుకోలేదు గాని, అడగ్గానే wicket ఇచ్చే slow bowler మనకి. Peak formలో ఉన్నపుడు (ఆ అదృష్టం captainగా నాకే దక్కింది, మాంచి primeలో ఉన్న అంజిని మీరు చూడలేదేమో అని నా feeling), matchకి రెండు కన్నా తక్కువ wickets ఎప్పుడూ లేదు, ఐదు నిముషాల్లో అవగొట్టే వాడు over, (అందులోనే, అప్పుడప్పుడు umpireకి ఒకట్రెండు జోకులు కూడా చెప్పేసే వాడు, I mean ప్రయివేటు) అంతటి మోసంచేశాడు అవలీలగా, opponent batsmenని.

Fieldingలో అయితే, తన signature  క్యాచ్ taking మనందరికీ సుపరిచయమే. Reverse cup లాగా, ఆ శైలిని 'అంజి take' అని గుర్తించాలి. కాలక్రమేణా, మెల్లగా, 30 yards లోపలికి వచ్చేసినా, అంజి బలమైన ఫీల్డర్.

Organiserగా, మనకి ఎనలేని సేవలందించాడు మన అంజి. అసలు, ఏ announcement కైనా, first respond అయ్యేది మన అంజి. Tournamentsని, Clubని బాధ్యతగా నిర్వహించడం దగ్గరినుంచి, అందరం ఒంట్లో కొద్దిగా భయం (discipline) ఉంచుకునేలా చేయడం వరకు (నేను కూడా :-P), TSS cricket అనే industryలో, చాన్నాళ్లుగా, చాలా పాత్రలు పోషించిన character artist మన అంజి. భవిష్యత్తులో మన club, ఒకవేళ lifetime achievement awards ఇవ్వాల్సి వస్తే, గుర్తుంచుకొని మరీ గౌరవించుకోవాల్సిన member అనమాట. White and white outfit, ముక్కుసూటి మనస్తత్వం, అమీర్ ఖాన్ లాంటి perfectionism, guideకే rules నేర్పించే తెగింపు (సింహస్వప్నం సుమీ), అన్నీ వెరసి, మన అంజి మర్చిపోలేని స్ఫురద్రూపి.
(On Hemanjaneyulu's birthday, on behalf of the TSS Cricket Club, IISc Bangalore)

మా బుల్లి ముత్యానికి!

గౌతమ్; అనగానే ఈగలు తోలే యవ్వారమేలే అని light తీస్కుంటారేమో, ఆగండి, చాలా struggle ఉంది ఇక్కడ. లేకపోతే, బొంగులో beamer boyని పట్టుకుని, Indiaకి దేవెగౌడని PM చేసినట్లు,  TSSకి captain అయ్యేలా  చేసిన king maker ఆయన. అంతేకాదు, మనపాలిట Mitchel Johnsonని కూడా చేశాడంటే మామూలు విషయం కాదుకదా! అంతేనా, ఆదిమ మానవుడి అంత కష్టపడకుండానే దొరికిన fireని బహుబాగా వాడుకున్న 'బాహుబలి'. (ఇక్కడ బాహుబలి cinemaలో పరదాలకి నూనెపూసి opposition మీదకి వదిలే scene వేసుకోండి అందరూ).  మరి, limited  resources ఉన్న teamని గెలిపించడంలో మిగిలిన వాళ్ళకంటే 'మనవాడు' గౌతమ్ దే ముఖ్యపాత్ర అన్నది అందరికి తెలిసిందే. On the field encourage చేయడంలో చుపించే creativity, mind blowing కాదనగలమా? ఒక్కోసారి, తెలుగు industryని ఇంకా "పంచులు వాడుకోవడం"  ద్వారా బతికిస్తున్నాడేమో అనే అనుమానం రాకపోదు. మరి సొంతంగా ప్రయోగించే పంచులు (e.g. 180 strike rate, nothing but the best, bro, నువ్వు English లో మాట్లాడొద్దు bro etc. లాంటివి) KK కొంచెం అతిగా enjoy చేసినా (ఏ కారణం చేతనైనా :- ), అవికూడా తక్కువేమి కాదు.

మరి తనకున్న enthusiasm గురించి, తన Youtube video ఎంత చెబుతుందో, KKని గెలిపించడంలో (Rohiతో కలిసి ఆడినపుడు తననికూడాలే) అంతకంటే ఎక్కువే చూశాం కదా! అలాంటి శ్రద్ధ ప్రదర్శించినపుడే, పరిస్థితులు కూడా ఆ rangeలో cooperate చేస్తాయేమో కదా! (నేను రోడ్లమీద ప్రదర్శించే దాని గురించి చెప్పడంలేదు). లేకపోతే, TPLలో ఆ David wicket ఏంది భయ్యా అది? అక్కడ fielder పెట్టడం ఏందీ, వాడు అక్కడికే catch ఇవ్వడం ఏందీ. Umpiring చేస్తున్న నేనేం feel అయ్యానో ఇప్పుడే కాదు, ఎప్పుడూ అడగొద్దు. Tournament నడపడానికి అందించిన సహకారం (civil వాడేలే, మనం పని కల్పించాంలే, అయినా సరే) గుర్తుంచుకోవాల్సిందే.  అంతా తానై నడిపించాడు అనకుండా ఉండగలమా? ఇక్కడ రాసుకున్న ఒకటీ, రెండే కాదు, ఎన్నో, ఎన్నెన్నో memories ని మనందరికీ పంచిన 'మనవాడు', మన 'ముత్యం' గౌతమ్ కి, we wish nothing but the best on his birthday!

(on Gautam Mutyala's birthday, on behalf of TSS Cricket Club, IISc Bangalore)

Friday, May 10, 2019

(అ)సంపన్న దాతృత్వం ?

సన్నివేశం 1: ద్వాపర యుగం, ద్వారక

శ్రీ కృష్ణుడు తన సిరిసంపదలతో, భార్యలతో ద్వారకానగరంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నపుడు, తనని కలవడానికి, బాల్యస్నేహితుడు, నెచ్చెలి, సహపాఠి, సద్బ్రాహ్మణుడు అయిన కుచేలుడు (సుదాముడు) వచ్చాడు. ఆ సమయంలో కుచేలుడు అత్యంత కఠినమైన దారిద్య్రంతో సతమతమౌతూ ఉన్నాడు. ఇంట్లో ఉన్న పసిపాప(ల)కి పెట్టడానికి కూడా సరిపడనంత మిక్కిలి లేమిలో ఉన్నాడు. సాయం కోసం, తన భార్య, స్నేహితుడైన శ్రీకృష్ణుని దగ్గరకి వెళ్లమని చెప్పడంతో (అడగడంతో?) అక్కడికి వచ్చాడనమాట. ధరించడానికి సరైన బట్టలుకూడా లేని కుచేలుడు, చిరిగిన బట్టలతోనే శ్రీకృష్ణుని కలవడానికి కాలినడకన వచ్చాడు. ద్వారందగ్గర ఉన్న భటులు ఆపితే, తాను వారి స్వామికి బాల్యమిత్రుడని చెబుతాడు. వారికి అనుమానమొచ్చినా, లోపలికి వెళ్లి, రుక్మిణీదేవి శయన మందిరంలో ఉన్న వారి యజమానికి (బయటినుంచే) విన్నవించారు. పేరు వినగానే, చయ్యన ద్వారం దగ్గరికి వెళ్లి, తానే స్వయంగా కుచేలుణ్ణి సాదరంగా పట్టుకొచ్చి, తానూ, రుక్మిణి తప్ప, అన్యులకి ప్రవేశంలేని శయన మందిరంలోకి తీసుకెళ్లి, తీసుకెళ్లడమేమిటి, అక్కడున్న 'వారి' పాన్పుమీద కూర్చోబెట్టి, అన్నీ తానై,సపర్యలతో మిత్రుడికి సేదతీర్చి మురిసిపోతున్నాడు. శ్రీకృష్ణుడంతటి వాడేమిటి, అన్నీ ఆపేసి, ఇలా ఒక పేదవాణ్ణి కూచోబెట్టి, ఎక్కడ? ఎవరికీ అనుమతిలేని పట్టమహిషి శయన మందిరంలో, ఇతర భార్యల సమక్షంలో; పాదాలుకడిగి, గంధంపూసి, విసనకర్రతో విసరడమేంటి; అసలు, సేవలు చేయించు కోవడం తప్ప, చేయడం ఎరగని ప్రభువు ఇలా ప్రవర్తించడమేంటి అని అక్కడున్న అందరూ నోళ్లు వెళ్ళబెట్టుకొని ఆశ్చర్యపడుతున్నారు. ఇంతా పొందడానికి ఈ కుచేలుడు చేసుకున్న పుణ్యవిశేషాలేమిటో  అని ఆలోచిస్తున్నారు. ఇంతలో, శ్రీకృష్ణుడు మిత్రుడైన తనకోసం ఏం తెచ్చావని కుచేలుణ్ణి అడుగుతాడు. పేదవాడైన కుచేలుడు ఏం తేగలడు? వస్తూ, వస్తూ తన భార్య మూటగట్టిన అటుకులు గుర్తుతెచ్చుకున్నాడు. కానీ, ఇంత సిరిసంపదలతో తులతూగుతున్న మిత్రునికి కేవలం అటుకులివ్వగలనా అని తెగ మథనపడతున్నాడు.  నీళ్లు నములుతున్న మిత్రునిచూసి, చొరవతో, శ్రీకృష్ణుడు కుచేలుని అంగవస్త్రంలోనున్న ఆ మూట చేతపుచ్చుకొని ఏముందోనని విప్పుతాడు. బయటపడిన ఆ అటుకులని చూసి ఆనందంతో ఒక పిడికెడు నోట్లోపోసుకొని తృప్తిగా నములుతాడు. ఈ సన్నివేశాన్ని బమ్మెర పోతన భాగవతంలో ఇలా వర్ణించాడు.

మురహరుడు పిడికెడటుకులు గరమొప్పగ నారగించి కౌతుకమతియై (కౌతూహలియై  ?)
మరియును (మరియొక ?) పిడికెడుగొన దత్కర మప్పుడు బట్టె గమల కరకమలములన్

భావం: శ్రీకృష్ణుడు, పిడికెడు అటుకులని తిని, ఇంకొన్ని తిందామని మరో పిడికెడు తీసుకుంటుండగా, ఇంక చాలు, వద్దని రుక్మిణి తనచేత్తో, శ్రీకృష్ణుని చెయ్యిపట్టుకొని ఆపింది.

అరెరే, అదేమిటి, ఇంకొన్ని తింటే ఏమౌతుంది, పాపం మిత్రుడు ప్రేమగా తెచ్చాడు, తిననివ్వాల్సింది, రుక్మిణి ఎందుకలా చేసింది అని ఆలోచిస్తున్నారా? లేక, already, పరిస్థితిని అర్థం చేసుకుని, పేద మిత్రునికి శ్రీకృష్ణుడు మరీ ఎక్కువ సాయం చేసేస్తాడేమో అని, కఠినంగా, వారిద్దరినీ విడదీయడానికి అలా చేసిందని అనుమానిస్తున్నారా?

సన్నివేశం 2: ప్రస్తుతం, బెంగుళూరు

ఆమధ్య PhD అయిపోతున్నపుడు, మా జనాలు చిన్న సైజు farewell party తీసుకుంటూ, 'KRతో కాసేపు' (tag line - 'order చేసిన బిర్యానీలు వచ్చేదాకా') అని ఒక ముఖాముఖి entertainment plan చేశారు. అప్పుడు ఒక interesting question అడిగారు. 'జీవితంలో సాధించలేనేమో అనిపించే ఆశయాలు ఏమైనా ఉన్నాయా?' అని. దానికి జవాబుగా, చాలా రోజులుగా నాలో ఉన్న ఒక ఆలోచన గురించి బయట పెట్టా.

నా అభిప్రాయంలో, దాతృత్వము అనేది చాలా గొప్ప మానవీయ అభివ్యక్తి (Manifestation of Humanity). మన పురాణాలు, ఇతిహాసాలు కూడా దాతృత్వాన్ని ఉదారమైన లక్షణంగా, శీలాలంకారిగా చెప్పడం మనకు తెలుసు. తరువాతి తరాలు (యుగాలు అనాలేమో) కూడా అప్పటి సుభాషితాల్లో, తత్వాల్లో మొదలుకొని, ఇప్పటి ప్రవచనాల దాకా, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, దధీచి, మొ||వారిగురించి గుర్తుచేసుకోవడం విన్నాం. ఇప్పుడైతే ప్రేమజీ, Tatas, బఫెట్, బిల్ గేట్స్, షకీరా, సచిన్, నానా, etc.ల దాతృత్వం గురించి చూస్తున్నాం. ఏకంగా గ్రామాలనే దత్తత తీసుకునే Reel-life శ్రీమంతులని, real-life శ్రీమంతులనికూడా చూస్తున్నాం (వాటి వెనకాల కారణాలు ఏమైనా, దానం జరగడం చూస్తున్నాం). పురాణేతిహాసాలను పక్కన పెడితే, ఈ కాలానికి గొప్ప దాతలని ఓసారి గమనిస్తే, అందరూ (at least చాలామంది) సుప్రసిద్ధ శ్రీమంతులే. ఇంకోరకంగా, చాలామంది ఏదో ఒక రంగంలో ప్రతిభ ప్రదర్శించి (వ్యాపారంలో కూడా ప్రదర్శించాలనే అనుకుంటున్నా), పేరు గడించి, తద్వారా సంపద గడించినవాళ్ళే. సంపద అంటే సామాన్యమైన మొత్తంలో కాదు, మధ్యతరగతి వర్గం ఊహించనంత అసాధారణమైన సంపద అనమాట. అనగా, కొన్ని వందల కోట్లు (వందల కోట్లు అయినపుడు, రూపాయలు అయినా, డాలరులు అయినా పెద్ద తేడా ఉండదుగా). ఇలా గొప్ప సంపన్నులు కొంతమంది, వాళ్ల సంపదలో కొంతభాగం (కొంత మంది చాలా భాగం) దానధర్మాలకు వెచ్చించడం అనేది వాదన అవసరంలేని మంచిపని. కానీ, ఎక్కువ పరిశోధన కూడా అవసరం లేకుండా గమనించగలిగే విషయం ఏంటంటే, వీళ్లలో చాలామంది (అందరూ?) క్రీడలు, వ్యాపారం, వినోదం లాంటి వేగంగా సంపద పోగేయగల వృత్తుల వాళ్లే. Notice my reader, నెలజీతాలవాళ్ళు లేరు. అనగా, జీతానికి పనిచేసే సాధారణ ఉద్యోగులు అనమాట. (కొంతమంది అసాధారణ నెలజీతగాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇందాక చెప్పుకున్న వేగంగా సంపద పోగెయ్యగల వారయివుంటారు. ఉదాహరణకి, ముకేశ్ అంబానీ నెల జీతం, 21వ శతాబ్దపు మొదటి దశకంలో, దాదాపుగా 3M USD). కొంచెం అనుభవం తర్వాత ఆరంకెల జీతం తీసుకున్నా, సాధారణ నెలజీతగాళ్ళు విపరీతమైన సంపద పోగెయ్యడం చాలా కష్టం అని నా అభిప్రాయం. మహా అయితే, అయిదో, పదో కోట్లు గడించగలరేమో, అంతే. అది కూడా అనుమానమే. ఒకవేళ సాధ్యపడినా, ఎప్పుడో జీవితం చివరిలో తప్ప, యవ్వనంలోనే పోగెయ్యగలరు అని చెప్పడం కూడా కష్టం.

ఇటువంటి సందర్భంలో, సమీప భవిష్యత్తులో, ఒక నెలజీతగాడిగానే కనిపిస్తున్న నేను, బాధ్యతాయుతమైన గృహస్తుగా ఉండికూడా, ఒక పెద్దమొత్తం (ఉదా|| ఒకటి రెండు కోట్లు) దానం చేయగలనా అనేదే ఇందాకటి నా ఆలోచన. సంపన్నులుగా ఉండి, ఉదారంగా దానం చేయడం ఒకటి, ఖచ్చితంగా గొప్పదే, అనుమానమేం లేదు; కానీ, సాధారణ జీతాలు, జీవితాలతో కూడా అలాంటి అనుభవాలు సాధ్యమేనా అన్నదే నా ఆలోచన. నాకూ ఒక రుక్మిణి వస్తుంది (ఒక్కతేలెండి); తప్పకుండా ఇలాంటి నా ఆలోచనలని దివ్యదృష్టి లాంటివేం లేకుండానే తెలుసుకుంటుంది (మనం చెప్పేస్తాం). మరప్పుడు (ఆలోచన తెలుసు కున్నప్పుడే), చేత్తో ఆపేస్తుందో, కాళ్ళు చేతులు విరిచేస్తుందోనని కొద్దిగా అనుమానం. ఆవిడ సంగతి పక్కన పెట్టినా, అసలు, ముందు నేను అంత నిస్వార్థంగా ఉండగలనా, almost impossible. అందుకేగా, సాధించలేనేమో అనే ఆశయాల్లో దీన్ని archive చేసింది. తెలుగులో అసంపన్న అనే పదం లేదేమో(?) (నా searchలో నాకు దొరకలేదు). ఈ ఆలోచన ఆచరించడం ఎంత అసంభావ్యమో సూచించడానికే అన్నట్లు, అలాంటి పదం వాడానేమో!

సన్నివేశం 3: ద్వాపర యుగం, ద్వారక  

(శ్రీకృష్ణుని చెయ్యిపట్టుకొని తినకుండా ఆపేసిన సన్నివేశం)

అవును, రుక్మిణి నిజంగానే, పరిస్థితిని అర్థంచేసుకుంది (ఆవిడ ఎవరు? మనం ఇంతసేపూ చర్చించుకున్న "సంపద"; లచ్చిందేవి). ఇక్కడ ఒక్క పిడికెడు అటుకులు తిన్నందుకే, అడగక పోయినా, దరిద్ర పీడితుడైన కుచేలునికి అక్కడ (కుచేలుని ఇంటి దగ్గర) కొన్ని తరాలు తిన్నా తరిగిపోని ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. ఇంకొన్ని తింటే, మమ్మల్ని (భార్యల్ని), తనని కూడా దాసులకింద ఇచ్చేస్తాడేమో అని భయపడి, శ్రీకృష్ణుడు తినకుండా ఆపేసిందన్నమాట. అంతేకానీ, పాత సినిమాలో సూర్యకాంతం, ఛాయాదేవి లాగా కాదన్నమాట.
(అలా శ్రీకృష్ణుడు తినగా మిగిలిన అటుకులని అక్కడున్న మిగిలిన వాళ్ళందరూ ప్రసాదంలాగా పంచుకున్నారు. తర్వాత ఇవన్నీ ఏమీ తెలియని కుచేలుడు, శ్రీకృష్ణుని ఏమీ అడగకుండానే మిత్రుని దగ్గర సెలవు తీసుకొని ఇంటికి తిరుగు పయనమవుతాడు. దారిలో, వచ్చిన పని నెరవేర్చుకోకుండానే తిరుగుపయనం అయ్యానే అని కొంచెం చింతిస్తాడు, కానీ, తర్వాత ఇంటికెళ్లి విషయం తెలుసుకొని సంతోషిస్తాడు.)

Saturday, January 5, 2019

To my OBSESSIVE and dear friend!

I started to think, "What comes to my mind when I think about you as the captain of our sweetheart, the TSS cricket team?". Believe me, "Obsession" is all that you painted before me.

ఆ రోజుల్లో, TSSకి captain కావాలన్న నీ sheer obsession నాకింకా గుర్తే. ఎన్ని sittingsలో మనం దీనిగురించి వాదించుకున్నామో, అప్పటి captainని నువ్వు ఎంత శాస్త్రీయంగా (scientific, if you will) ఖండించావో (censored :-)) స్పష్టంగా గుర్తుంది మచ్చా. మీ DESE జనాలముందు నువ్వు prove చేస్కోవడం and  మీ తురకపాలెం whatsapp groupలో share చేస్కోవడం అనే aspects పక్కన పెడితే, I must say, your approach towards that was very new and a bit intense, and that is where I started to see your 'obsession'. కారణం ఏమైనా, కొద్దిగా ఆలస్యమైనా, eventually, you led us, and lead us to multiple victories. See, I told you, ఇవన్నీ మీడియాలో చెప్పుకోడానికి బావుంటాయి మచ్చా అని, చూశావా!

Next thing is, your obsession to try out new things on the field, of course, we ended up doing it off the field too. ఎంత సేపూ, non-aggressive, routine, safe, defensive field setకి అలవాటు పడిన teamకి కొత్త రక్తం తెచ్చావేమో, stay on the ground, I am not finished yet. Slipsలో tight field, aggressive pace bowling, just కొన్ని ఉదాహరణలే. అసలు, limited oversయే అయినా, runs restrict చేయడం కంటే, opponent గురించి ఆలోచించకుండా, all-out చేయడం గురించి TSS ఆలోచించడం నీ నాయకత్వంలోనేనేమో. Now, I suppose it has become a habit to us. Again, full credit to your obsession. 


 అలా నువ్వు బాగా ప్రోత్సహించిన ఇంకో ఆసక్తికరమైన అంశం 'sledging'. I was initially sceptical about it. అంతకు ముందువరకు, cricket is gentlemen's game, మా heros (సచిన్,ద్రావిడ్,కుంబ్లే,లక్ష్మణ్,శ్రీనాథ్ etc.) were all less aggressive with on field talking, etc. ఇలాంటివి చెప్పుకుని,we did not practice it. రోహిత్ లాంటి young bloodని చాలా సార్లు (వేరే teamsతో ఆడేప్పుడు) control చేసేవాళ్ళం. కానీ, game evolves, I think, you brought that fire (:-P) with you. You remember, from behind the stumps how we got MCB Bharath out, not just once, but on multiple occasions. We did Lachith also that way. And the peak of that was, of course in KK-KR. Barring some small issues, that was one memorable tournament to cherish for a lifetime, again, must say, you did play a vital role among others to make it what it is.


Team composition was one thing, I as a captain and many other leaders, sort of given less importance to. బహుశా, మా కారణాలు వేరు, at least, in my case, winning was not the main motive, so, easy to understand. Players availability was also another reason, I guess, you had a luxury of options. ఏదేమైనా, teamకి best ఇవ్వడానికి తపించడం నేను చూశాను. ప్రకృతిలో ఒక వంద టీలు దానిమీదే ఖర్చుపెట్టాం అంటే అతిశయోక్తి కాదు.

I think you handled the seniors and juniors in the team very well. Many of us think that respect means listening to or obeying the seniors. But, no, I think respect means the courage to genuinely discuss the issues and to act with bigger picture in mind. Of all the people, I think,  I am the one who can best endorse you on that :-).

Another one of your obsessions is to celebrate on the field. You showed, at least to me, how to celebrate our hearts out. Of course, its just your expression, but yes, what is the whole point of sports, if you hold the expressions of joy that come out of an exceptional display of sporting skill. Having said that, I am gonna warn you about getting carried away with your dances, because we have uncles playing in the opposition :-P (I mean, one who plays in Praveen's team).


Captain గా చేయగలిగిన, చేయాల్సిన ఏకైక పని, players అందరి నుంచి best performanceని రాబట్టుకోవడం. జాగ్రత్తగా గమనిస్తే, many of us enjoyed their successful game during your time, if not their best. రోహిత్ ఐతే almost allrounder అయిపోయాడు, (this is one way to see the top order failure :-P).  వివేక్ ఐతే KK-KR లో super star with bagging the legend more than 4 times, if i am not wrong. గౌతమ్ ఫేర్ఫార్మెన్స్ చూసి అనిల్ కి డౌట్ వచ్చి ఉంటుంది, వరంగల్ నుంచి బెంగుళూరు కి వచ్చేలోపు ఏదోఅయిందని. CM was always a strong addition, provided he practices and plays. I know, how much you went after him to play. అలాంటి commitment ఉన్నపుడే IPL (IISc వాలా) లాంటి విజయాలు సాధ్యమవుతాయి, అనుమానమే లేదు, it was our commitment to team that made us the champions. You were most successful in making all of us (even the non playing lot) to own the team. I couldn't imagine the publicizing we did, sorry, YOU MADE US to do, over mails, FB walls, noticeboards, what not, every where. Whatsapp statusల గురించి చెప్పోద్దులే. And, it played,  played big time!

You are a perfect example of the modern day 'David-Golliath'. And, you proved that not just once, but twice: KK_KR and the IPL. Honestly, I think I speak not just for me but for all, when I say we had no idea that you will win the KK-KR or that we will win the IPL. Its just your Obsession to win. Seriously. We had no Ajays, no Naveens, no Karthiks. If we look back, all that we had was a shaky batting order backed by a decent bowling and a stronger fielding, if you will. Not the tools you would wish to have to be champions. But, then we had one extraordinary thing, your obsession to win. Be it, begging Bharath UG to play, making the legend to come back (I am sure, he was more than happy to do that) from Hyderabad to play the matches just days before his international travel, the professionalism that was inculcated into the team and manifested in many ways such as practising, learning, sharing, enjoying the games, etc. And, guess what, it was no anti-climax, we did! Of course, we hadn't done it in style, but thats it, most of the exceptional things happen in that fashion. I am pretty sure on that day we won not just the championship but a lot of respect and love in the campus as well.





  

(At the end of Karmel Kranthi (KK)'s captaincy term for the TSS Cricket Club, IISc Bangalore, on behalf of the club.)

Monday, November 12, 2018

Missing Mathikere, మిస్సమ్మ సాక్షిగా!

జ్ఞాపకమొచ్చినప్పటి నుంచీ ఇంత ఒంటరిగా ఎప్పుడూ లేనేమో అనిపిస్తోంది😶. I know; ఊరు మారిన  ప్రతిసారీ కొత్తలో అనిపించేదే ఐనా, ఆరేళ్ళ తర్వాత మారానేమో, మనసు పొరల్లోని Mathikere వేళ్లని పెకలించిన బాధ. దాచి ఉంచిన memories అన్నీ తిరిగిపడుతున్నాయి చెల్లాచెదురుగా.

వారం ఆరు దినాలూ ఆనందంగా పనిచేసింతర్వాత (Saturday కూడా work చేసేవాన్ని), ఆరో రోజు సాయంత్రం ఏడింటికళ్లా meetingలో ఉండగానే మొదలయ్యే missed callలు, messageలు అన్నీ ఒక్కొక్కటే గుర్తొస్తున్నాయ్. Peak timeలో KR weekends, 3/4 weeks advanceగా book అయ్యేవి. అలా ఉండేది  యవ్వారం. 'ఈ వారం కుదరదేమో రా' అంటే, జనాలు గొడవ పెట్టే వాళ్లు, time ఇవ్వడం లేదని. ఆ ముచ్చట్లు అంత మురిపెం. మనసులు తప్ప, మనుషులు ఎక్కడ ఉండేవాళ్లు మా మీటింగుల్లో. మాటలు కావవి, మనసుల కౌగిలింతలు. ఆ time లో అడగాలి ఎవరైనా వరాలు, ఆపడానికి అర డజను మంది రుక్మిణులు కావాలేమో. అలాంటిది, ఇవాళ Edinburghలో, ఎవరూ లేక, సాయం సంధ్య జారిపోతుంటే, mobile phoneతో నిద్రపోబోతున్న Indiaని కదపడం ఇష్టంలేక, ఈ missing feelingని పక్కకి నెట్టడానికి 'మిస్సమ్మ' cinema start చేశానేగాని.....



MSR రోడ్డంతా పరుచుకున్న ప్రాణం రానంటే రానంటోంది. రోజుకు ఒకసారైనా వెళ్లే వాడినే, ఇకమీద పోలేనంటే తట్టుకోగలదా? It takes a lot of time and effort to build genuine friendships, luckily, అలాంటివి చాలానే దొరికాయ్ mathikereలో. IIScలో అనొచ్చు, కానీ, maximum తినింది, తిరిగింది, తాగింది mathikereలోనే కదా! ఒక్క, దొరికింది మాత్రం మల్లేశ్వరంలో.

సరదాగా సాయంత్రం బండిమీద వెళ్లి తిన్న MTC పునుగులు, తాగిన మలయాళీ టీలు, mess miss అయ్యాక హడావుడిగా తినొచ్చే pot బిర్యానీలు, amzad bhai అర ఉడికిన hyderabadi బిర్యానీ, plan వేసుకొని వెళ్లొచ్చే Akshaya Deluxe, rice పెట్టుకొని తెచ్చుకునే రంగెక్కువైన 'రుచి' curries, ఈ మధ్య Mehi&Co అలవాటు చేసిన అనఘ mess, మరీ lateగా అలవాటైన BEL road restobars, నిలబడి పలకరించే నేస్తంలాంటి NIAS gate, ఆ రెండు దున్నపోతుల్లాంటి speed breakersలు, campusలో మాత్రమే నడిచే లాగా cheapగా repair చేయగల మన yash bikes, messలో భోంచేసి, 9:10కి ఆరాంగా బయల్దేరి cinema చూసొచ్చే మన home theater మురళీ గోకుల, అప్పుడప్పు అలరించే Orion మాల్, త్రివేణి టీలు, చివరగా వారానికింత చొప్పున installmentsలో కొన్ని వేలు తగలేసిన Wholesale spirits, ఇలా తెలీకుండానే జీవితాన్ని పెనవేసుకున్న ప్రదేశాలు, వ్యక్తులు screen మీద కనిపిస్తున్నాయ్. ఇంతకీ, ఆ వ్యక్తులు కనపడటం లేదని వెతుకుతున్నారా! వారి కోసం వెదికితే మీరు వారు కాదని అర్థం. ఆ వారికి, ఈ పాటికి వారు కనిపించే ఉంటారు, ఆ అన్ని ప్రదేశాల్లో నాతో కలిసి. ఇది వారికోసం, వారి నేను రాసుకున్నది, కాబట్టి వారెవరో వేరేవాళ్లకి చెప్పకుండానే ముగిస్తా.

మరేం పర్లేదు, తొందర్లోనే settle అయిపోతా, కంగారేం అక్కర్లేదు, కొద్దిగా time పడుతుంది అంతే. తర్వాత Edinburgh గురించి రాద్దాం ఇంకోచోట కూచుని, ఇంకొకరితో.

Friday, January 26, 2018

All it takes is one good innings!


అవును, bad formలో ఉన్న batsmen తమకి తాము పదే పదే చెప్పుకునే phrase. In fact, ఈ మధ్య match కోసం room నుంచి బయల్దేరినప్పటి నుంచి groundకి reach అయ్యేదాకా దాన్నే జపిస్తున్నా, మంత్రం లాగా. Stupid shotకి out అయ్యాక ఆ రోజంతా ఎంత చిర్రాగ్గా ఉంటుందో, అంతో ఇంతో cricket ఆడిన మనదరికీ అర్థమైపోతుందనుకుంటా. "అలా ఎలా ఆడాన్రా?" అని department toilet లోపలి అద్దం ముందర ఎన్నిసార్లు అడిగానో, house keeping staffకే తెలుసు. Lunchకి వెళ్తూ cycle మీద, labకి వెళ్తూ liftలో, room నుంచి వస్తూ corridorలో, ఇలా రోజంతా ఎన్నిసార్లు మనల్ని మనమే ఆ question వేసుకుంటామో అందరికీ జ్ఞాపకమే కదా!

It's such a bad feeling, right! మత్తికెరె petrol bunkలో మూడోసారి మోసపోయినట్టు. అదే పనిగా, అంతకు ముందు ఆడిన అద్భుతమైన inningsలు, bowlers ఇచ్చిన compliments, captains మనపై ఉంచుకున్న confidence, వెనక్కి తిరిగితే కనిపించే కొన్ని వందల మ్యాచ్లు చూసుకుని, గుర్తు తెచ్చుకుని, "All it takes is one good innings from you!" అని మనల్ని మనమే ఓదార్చుకుని, మాములు మనుషులయ్యేందుకు ప్రయత్నిస్తాం. అదీ సరిపోక, మధ్యాహ్నం messలోనో, రాత్రి గ్లాసుల దగ్గర friendsతోనో, ఆ యొక్క sitting setting పీకేశాక, whatsappలో "బంగారం"తోనో చెప్పుకున్నాక గానీ సల్లబడం.

మనక్కొద్దిగా fans ఎక్కువ కాబట్టి, ఇలా blogలో global audienceని reach అవుతామనమాట!
Remember, all it takes is one good innings!

Tuesday, November 7, 2017

దేవుడి బొమ్మ - ఇది నా రామాయణం!


రిలీజ్ రోజునే సినిమా చూడ్డం మానేసి కొన్నేళ్ళయింది, పెద్దోళ్లం అయిపోయంగా. కానీ ఈ మధ్యనే ఆ పనిచేసి మళ్ళీ బాల్యంలోకెళ్ళొచ్చా. అంతా ఆ దేవుడి దయ!

అందరూ కేరళ వెళ్లి FBలో post చేస్తారు, "Landed in God's own country!" అని. కానీ, నేను, Mumbai వెళ్ళినపుడు చెప్పా, "God's own cityలో ఉన్నా" అని. ఈపాటికి అర్థమై ఉంటుంది మీకు, ఆ నా  దేవుడు సచిన్ టెండూల్కర్ అని.

ఇప్పటికే చాలామంది చెప్పేసున్నారు, ఆయనెందుకు దేవుడో. కానీ ఈ రోజు నేను కూడా చెబుతా. మరి మనకి కొన్ని వందల రామాయణాలున్నాయిగా, ఎవరి భక్తి వారిది. సరే ఇలా మొదలుపెట్టాం కనక, ఇలానే continue అవుదాం. Sachinకి, రాముడికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని నా గట్టి నమ్మకం. మొన్నే ఓ friendతో అంటే, "అవునా, ఎలాగా?" అని వేళ్ళు మడిచి, లెక్క పెట్టడానికి ready అయిపోయాడు, వెటకారంగా. అప్పుడే చెప్పా,  "నువ్వు కంగారుపడకు, పెద్ద article రాసి మరీ చెబుతా!" అని. ఇది నా రామాయణానికి పీఠిక.

నామటుకి, sachin ఈ యుగంలో పుట్టిన రాముడే. అక్కడా అంతే, రాముడిలాంటి ఓ అద్భుతం జరగడానికి ఓ పెద్ద కాన్స్పిరేషనే జరిగింది. దేవదేవుడు దిగిరావడం అంటే మాటలా? దేవతలంతా directగా, indirectగా  కిందకొచ్చి అంతా సిధ్ధం చేశారుకదా! ఇక్కడా, రెండున్నర దశాబ్దాల పాటు చోటుచేసుకున్న ఓ అద్భుతం కోసం జరిగిన arrangements చర్చించి, నాకు నేనే promotion ఇచ్చుకుంటా.

రాముడికి ఎన్నో పేర్లున్నా, దాశరథి అంటేనే ఇష్టపడతాడు, అది ఆయనకి తండ్రి మీద ఉన్న భక్తి, ఇష్టం. sachinకి కూడా అంతే, 50గానీ, 100గానీ అయిన వెంటనే, ఆకాశం వంక చూసి, తన తండ్రికి అంకితమిస్తాడు. ఎన్నిసార్లు? ప్రతీసారి. అది మన సచిన్ "రమేశ్ " టెండూల్కర్.

రాముణ్ణీ, సోదరుడు లక్ష్మణున్నీ విడదీసి చెప్పడం వీలుకాదంటే అతిశయోక్తి కాదు. దశరథుడు చనిపోయాడని తెలిసాక, అడవిలో ఉన్న రాముడు, లక్ష్మణుడితో అంటాడు "తమ్ముడూ , నీకింక తండ్రి లేడు!" అని. మరి ఆయనకో? లక్ష్మణుడు ఉన్నాడుగా, తండ్రిలాగా కాపాడుకోవడానికి. సచిన్ లాంటి ఓ అద్భుతాన్ని create చేసిందీ, అన్ని సమయాల్లో తోడుండి ముందుకి నడిపింది, సోదరుడు అజిత్ టెండూల్కర్. కోచ్ దగ్గరికి తీసుకెళ్లడం దగ్గరి నుంచి, పాకిస్థాన్ పేస్ బౌలింగుకి ముక్కు చితికిపోయినప్పుడు, career ని దెబ్బతీసే గాయాల బారినపడినప్పుడ్డు, ఇలా ఎన్నోసార్లు. వీళ్ళని కూడా లోకంలోని సోదరులకు ఆదర్శం అనడంలో అతిశయోక్తిలేదు.

ఇప్పుడు అమ్మవారి గురించి. ఈ part నాపాలిటి "సౌందర్యలహరి". అంజలి. నిజంగానే దండం పెట్టాలి, తల్లికి. "మన పెళ్లి గురించి మా ఇంట్లో నేను మాట్లాడలేను, నువ్వే వెళ్లి అడగమంటే", వెళ్ళిపోయి అడిగేసిందంట, "మీ అబ్బాయీ , నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం " అని. అలా....ఒప్పేసుకున్నారు, మరెందుకు ఒప్పుకోరు? మాలక్ష్మి, తానే,  "మీ ఇంటికొద్దామనుకుంటున్నాను" అంటే. ఈ particular సంగతి వినగానే, నాకు వనవాసం ముందు scene గుర్తొచ్చింది. కైకమ్మ మందిరం నుంచి వార్త తెలుసుకొన్న రాముడు, సీతమ్మ దగ్గరకి వచ్చి, "నేను వనవాసం కోసం వెళ్తాను"  అని చెబుతాడు. "సరే పదండి, నేనూ వస్తాను" అంటుంది. "నువ్వెందుకు ? అక్కడ చాలా కష్టం, క్రూర మృగాలు కూడా ఉంటాయి, వద్దు" అని వారిస్తాడు. "క్రూరమృగాలా?, మా నాన్న, నన్ను ఒక మగాడికిచ్చి చేశాడనుకున్నానే ?" అంటుంది. "అనగలుగుతుంద"నమాట. సాక్షాత్తూ, వాల్మీకి మహర్షే ఇలా రాశాడని చెబితే మనలో చాలామంది నమ్మలేరేమో.

"రామో విగ్రహవాన్ ధర్మః" అన్నాడు రాక్షసుడైన మారీచుడు, రాముడి గురించి. 'రా'తో మొదలయ్యే పదం వినపడగానే, భయపడిపోయేవాడు. ఎంతో విధ్వంసకరంగా batting చేయగలిగిన batsmen చరిత్రలో చాలా మందే ఉన్నా, ఇలాంటి సంఘటనలు మాత్రం సచిన్ గురించే చెప్పుకున్నాం, shane warne సహకారంతో. Hayden ఐతే, ఏకంగా "ఇండియా వెళ్లి దేవున్ని చూసొచ్చాను, 4లో batting ఆడుతున్నాడు అక్కడ" అన్నాడంట.

ఆ కాలంలో, పూర్వభాషి అని చెప్పుకున్నా, సత్యమే పలికాడని చెప్పుకున్నా, దయాళు అన్నా, పరాక్రమశాలి అన్నా, ఏకపత్ని కలిగిన రాజు అన్నా, ఈ కాలంలో Alcoholని endorse చేయకుండా చాలా నష్టపోయాడనుకున్నా, controversy లేకుండా క్రమశిక్షణతో సుదీర్ఘమైన careerని కట్టుకున్నాడన్నా, ఉదాత్తమైన నడవడితో ఆదర్శంగా నిలిచాడన్నా, కాలాన్ని, కదిలే రైళ్లని, పెరిగే వయసుని (తనది, మనది కూడా) ఆటతో ఆపాడన్నా, వేరు కాదేమో!

మనిషి అనే ప్రక్రియకి, జీవితం అనే processకి, రాముడు ఒక ప్రమాణం. ఎలాగా? "ఔను మరి, ఈయనో శ్రీరామ చంద్రుడు", ఎన్నిసారు వినలేదు ఈమాటని? సచిన్ కూడా అంతే. ఇక మీద బాగా ఆడగలిగిన, ఆడుతున్న cricketers అందరికీ, ఈ దేవుడే ప్రమాణం. For example, ఈమధ్య, కోహ్లికి, సచిన్‌కి రోజూ జరుగుతున్న పోలిక మనకు కొత్తదేం కాదు.