జ్ఞాపకమొచ్చినప్పటి నుంచీ ఇంత ఒంటరిగా ఎప్పుడూ లేనేమో అనిపిస్తోంది😶. I know; ఊరు మారిన ప్రతిసారీ కొత్తలో అనిపించేదే ఐనా, ఆరేళ్ళ తర్వాత మారానేమో, మనసు పొరల్లోని Mathikere వేళ్లని పెకలించిన బాధ. దాచి ఉంచిన memories అన్నీ తిరిగిపడుతున్నాయి చెల్లాచెదురుగా.
వారం ఆరు దినాలూ ఆనందంగా పనిచేసింతర్వాత (Saturday కూడా work చేసేవాన్ని), ఆరో రోజు సాయంత్రం ఏడింటికళ్లా meetingలో ఉండగానే మొదలయ్యే missed callలు, messageలు అన్నీ ఒక్కొక్కటే గుర్తొస్తున్నాయ్. Peak timeలో KR weekends, 3/4 weeks advanceగా book అయ్యేవి. అలా ఉండేది యవ్వారం. 'ఈ వారం కుదరదేమో రా' అంటే, జనాలు గొడవ పెట్టే వాళ్లు, time ఇవ్వడం లేదని. ఆ ముచ్చట్లు అంత మురిపెం. మనసులు తప్ప, మనుషులు ఎక్కడ ఉండేవాళ్లు మా మీటింగుల్లో. మాటలు కావవి, మనసుల కౌగిలింతలు. ఆ time లో అడగాలి ఎవరైనా వరాలు, ఆపడానికి అర డజను మంది రుక్మిణులు కావాలేమో. అలాంటిది, ఇవాళ Edinburghలో, ఎవరూ లేక, సాయం సంధ్య జారిపోతుంటే, mobile phoneతో నిద్రపోబోతున్న Indiaని కదపడం ఇష్టంలేక, ఈ missing feelingని పక్కకి నెట్టడానికి 'మిస్సమ్మ' cinema start చేశానేగాని.....
MSR రోడ్డంతా పరుచుకున్న ప్రాణం రానంటే రానంటోంది. రోజుకు ఒకసారైనా వెళ్లే వాడినే, ఇకమీద పోలేనంటే తట్టుకోగలదా? It takes a lot of time and effort to build genuine friendships, luckily, అలాంటివి చాలానే దొరికాయ్ mathikereలో. IIScలో అనొచ్చు, కానీ, maximum తినింది, తిరిగింది, తాగింది mathikereలోనే కదా! ఒక్క, దొరికింది మాత్రం మల్లేశ్వరంలో.
సరదాగా సాయంత్రం బండిమీద వెళ్లి తిన్న MTC పునుగులు, తాగిన మలయాళీ టీలు, mess miss అయ్యాక హడావుడిగా తినొచ్చే pot బిర్యానీలు, amzad bhai అర ఉడికిన hyderabadi బిర్యానీ, plan వేసుకొని వెళ్లొచ్చే Akshaya Deluxe, rice పెట్టుకొని తెచ్చుకునే రంగెక్కువైన 'రుచి' curries, ఈ మధ్య Mehi&Co అలవాటు చేసిన అనఘ mess, మరీ lateగా అలవాటైన BEL road restobars, నిలబడి పలకరించే నేస్తంలాంటి NIAS gate, ఆ రెండు దున్నపోతుల్లాంటి speed breakersలు, campusలో మాత్రమే నడిచే లాగా cheapగా repair చేయగల మన yash bikes, messలో భోంచేసి, 9:10కి ఆరాంగా బయల్దేరి cinema చూసొచ్చే మన home theater మురళీ గోకుల, అప్పుడప్పు అలరించే Orion మాల్, త్రివేణి టీలు, చివరగా వారానికింత చొప్పున installmentsలో కొన్ని వేలు తగలేసిన Wholesale spirits, ఇలా తెలీకుండానే జీవితాన్ని పెనవేసుకున్న ప్రదేశాలు, వ్యక్తులు screen మీద కనిపిస్తున్నాయ్. ఇంతకీ, ఆ వ్యక్తులు కనపడటం లేదని వెతుకుతున్నారా! వారి కోసం వెదికితే మీరు వారు కాదని అర్థం. ఆ వారికి, ఈ పాటికి వారు కనిపించే ఉంటారు, ఆ అన్ని ప్రదేశాల్లో నాతో కలిసి. ఇది వారికోసం, వారి నేను రాసుకున్నది, కాబట్టి వారెవరో వేరేవాళ్లకి చెప్పకుండానే ముగిస్తా.
మరేం పర్లేదు, తొందర్లోనే settle అయిపోతా, కంగారేం అక్కర్లేదు, కొద్దిగా time పడుతుంది అంతే. తర్వాత Edinburgh గురించి రాద్దాం ఇంకోచోట కూచుని, ఇంకొకరితో.

ఇది మీకోసం మీరు వ్రాసుకొన్నా, మనందరం మనల్ని జీవితంలో ఎప్పుడోకప్పుడు కోల్పోతూ ఉంటాం. అది బాగా ప్రస్ఫుటించింది.
ReplyDelete