Sunday, September 22, 2019

First Interview - The Face off

ఇంతలో, welcome చెబుతున్న uncleని చూసి , "మరీ అంచు పంచెలు expect చేయలేదులేకానీ, ఇలా night pants, T-shirtని కూడా expect చెయ్యలేదే" అనుకున్నా, బాగా... chill అవుతున్న అయన్ని చూసి. "సర్లే, అవంత important కాదులే, uncle అంటే ముసలాడనుకున్నా, పర్లేదు" అనుకొని, hallలో ఉన్న sofa setలో (sofa కాకుండా, oppositeలో) విడిగా ఉండే (రెండింటిలో) ఒక chair మీద కూచున్నా. అయన నాకెదురుగా sofaమీద కూచున్నాడు, మధ్యలో teapoy ఉంది. ఒకట్రెండు నిముషాలు కుశల ప్రశ్నలూ, పొద్దున్న జరిగిన defence గురించి అడిగి, kitchenలో నుంచి వచ్చిన తన భార్యని పరిచయం చేశాడు. నవ్వుతూ వచ్చి, ఆవిడ నాకు కొద్ధి దూరంలో left side, మా ఇద్దరినీ face చేస్తూ కూచున్నారు. ఇంతలో, లో...పలి నుంచి ఇంకో జంట వచ్చారు. "వీళ్లెవరో?" అనుకుంటూ చూస్తుండగానే, uncle పరిచయం చేశాడు, వీళ్లు తన అక్కాబావలని. అనగా, candidateకి అమ్మానాన్నలు అనమాట. పైకి లేచేందుకు ప్రయత్నిస్తూ "నమస్కారం అండి!" అని పైకని, "ఆహా!, చేశాడుగా uncle మనల్ని గట్టిగా!" అని లోపలనుకున్నా. "పర్లేదు బాబు కూచోండి" వాళ్ళ reply. వాళ్లు మరీ chill బట్టలు కాకుండా, officeకి వేసుకెళ్ళేవే కట్టుకున్నారు.

"Candidate వాళ్ల family APలో ఉంటుంది, వాళ్లంతా ఎందుకు, ముందు తను నీతో మాట్లాడాలంటోంది, బెంగుళూరులో మా ఇంట్లో కలిసి మాట్లాడుకోండి, పెద్దోళ్ల కథ తర్వాత చూద్దాం అని simpleగా tempt చేసి పిలిపించి, అందరి ముందు పడేసి, అడ్డంగా book చేశావుగా uncle" అనుకుంటున్నా. ఇంతలోనే అంతా వినిపించినట్లు ఓ నవ్వు నవ్వి, "నీకు తక్కువ time ఉంది కదా, పెళ్లికి attend అయ్యి వెళ్ళిపోతా అన్నావని, వీళ్లు కూడా వస్తామన్నారు నిన్న; ఇవాళ పొద్దున్నేreach అయ్యారు" అని సంజాయిషీ ఇచ్చాడు uncle. ఏమంటాం, "ఓహో!" అని ఊరుకున్నాం. ఇంతలో ఇంకొకరొచ్చారు hallలోకి, "తను వీళ్లబ్బాయి" అని అతణ్ని కూడా పరిచయం చేశాడు uncle, "ఈయన (candidateకి తమ్ముడు) ఈ రాష్ట్రంలోనే  చదువుకుంటున్నాడు, పొద్దుటే వచ్చాడు" అని. Uncle లాగే night dressలో chill కొడుతున్న brotherకి కూడా ఓ హాయ్ చెప్పేసి, ఇంకెవరైనా వస్తారేమోనని చూస్తుండగా,  uncle పిల్లలిద్దరూ వచ్చారు. వాళ్ళు మరీ చిన్నపిల్లలు, పాపం, అందుకని పరిచయం చేయలేదు. "పోన్లే భయ్యా, బామ్మలు, తాతయ్యలు కూడా వస్తారేమో అని భయపడ్డా. మొత్తానికి, మాంచి sketch వేసి, నన్ను బోనులోకి లాగి అందరూ చుట్టుముట్టారుగా, let's get started" అని దీర్ఘశ్వాస ఒకటి తీసుకున్నా. నా ఎదురుగా sofa మీద, uncle, అయన పక్కన candidate వాళ్ళ నాన్న, hallకి కొద్దిగా దూరంగా, dining table దగ్గర వాళ్ళ అమ్మ, నాకు ఎడమపక్కన uncle భార్య, ఆమె పక్కన candidate వాళ్ళ brother కూచున్నారు.  అందరూ నన్నే చూస్తున్నారు, చూడటంకాదది, తినడం అన్నా తక్కువే. "VIP treatment భయ్యా, అడిగావుగా, enjoy మాడి!" ఎవరో వెటకారిస్తున్నట్లు వినిపించింది. కొత్తగ్గా వయసొచ్చిన కాకినాడరోజుల్లో, అప్పుడప్పుడూ కొద్దిగా insensitiveగా చేసిన సౌందర్య అన్వేషణ మరియు ఆరాధన యొక్క కర్మఫలమేమో అనుకున్నా.

ఇంతలో uncle instruction మీద refreshments arrangements మొదలయ్యాయి. వాళ్ళావిడ మంచినీరూ, T తేవడానికి వెళ్లారు, దాంతోపాటు రవ్వలడ్డు కూడా (తెచ్చాకే తెలిసాయిలెండి items ఇవని). "హ్మ్, మీ ప్రస్థానం ఏమిటో మాట్లాడుకుందామా?" అని నన్నే మొదలుపెట్టమన్నాడు uncle. "ఉండు, మన family గురించి చెబుదాం, పరిచయాలకి continuation లాగా ఉంటుంది" అని వాళ్ల బావగారు కల్పించుకొని వాళ్ల వంశం రెండువైపులా (అనగా, వారిది, వాళ్ళావిడ వాళ్ళది) చెప్పుకుంటూ వచ్చారు. మాంచి హుషారుగా ఉన్నాడాయన. అటువైపు, ఇటువైపు కూడా ఉద్యోగస్తులమే, పేరుమోసిన వాళ్ళమేనన్న కించిత్ 'ఇది' ధ్వనించింది. తప్పేంకాదు, చెప్పుకోడానికే కదా కలుసుకుంది, కాబట్టి, అంతా attentiveగా విన్నా. అలా పెద్దలగురించి అయ్యాక, పిల్లల దగ్గరికొచ్చేసరికి, "ఇద్దర్ని వేరే రాష్టాల్లో చదివించాం" అని ఈసారి ఇంకొంచెం 'ఇది'గా చెప్పేసరికి, చాలా సహజంగానే అనుమానమొచ్చింది, "బహుశా EAMCETలో మంచి seat రాలేదేమో ఇద్దరికీ" అని. అక్కడికే వస్తున్నా అన్నట్లు, "ఇద్దరికీ seat వచ్చినా, మంచి చదువులకోసం, communication skills కోసం (నేనూ, మీరూ కూడా సరిగ్గానే విన్నాం) అని అలా plan చేశా" అన్నాడు. Particularly అబ్బాయి medical seat గురించి, "సీమలోని famous private collegeలో government seat వచ్చినా, బయటే prefer చేశాం" అన్నాడు.  "సర్లే భయ్యా! seriousగా తీస్కోవద్దు, ఏదో కాలం బాలేదు,  ఇప్పుడంతా మితిమీరిన marketing నడుస్తోంది కదా అని, ఎవర్ని నమ్మాలో నమ్మకూడదో తెలీక అనుమానించా అంతే!" అనుకున్నా, పైకి ఊకొడుతూ. ఏదేమైనా, ఈ setup అంతేలా ఉంది. తప్పదు ఎవరికైనా. Generalగానే జనాలు personal brandingకి పరాకాష్ఠ చూపిస్తున్నారు. ఇదంతా అర్థమైనట్లు uncle వారి బావగారిని ఆపేసి, ఇంక నా గురించి చెప్పామన్నారు.

నా స్వార్థపూరిత ప్రయోజనం నడిపిస్తుండగా, నేనేమీ జంకకుండా (#NoFilters), సంక్షిప్త సుందరంగా, సమాచారం మాత్రమే వెల్లడయ్యేలాగా (show-offలా కనపడకుండా) CV బయటపెట్టా, వ్యక్తిగతము, వృత్తిగతమూనూ. నాకంటే రెట్టింపు ఉత్సాహంగా విన్నారు అందరూ, I liked it. విజయవాడ శ్రీచైతన్యలో, "లెక్కలు చేయడం ఒక art" అంటూ blackboard, chalk piece రెండూ తానే అయ్యి class చెప్పే KSగారి period అంత animatedగా (+ve గానే; uncle గారి బావగారి వల్ల) నడిచింది ఆ episode. అపుడు మరోసారి, పొద్దున్న KK అడిగిన questions కనిపించాయి కళ్ళముందు. "మరేం పర్లేదు, process important participants అందరికీ" అనుకొని proceed అయ్యా.

ఇలాగా family విషయాలు, professional plans గట్రా మాట్లాడుకున్నాక, ఒకట్రెండు నిమిషాల pause వచ్చేసరికి, నాకేదో అర్థమైనట్లుగా "main round interview ఎక్కడై ఉంటుందబ్బా!, పెరడూ గట్రా ఉండవుకదా ఇలాంటిచోట్ల!" అనుకుంటున్నా. మరి మనకేమో కొత్త; సినిమాల్లో అలాగే చూపిస్తారు కదా, పెరట్లోనో, balconyలోనో అవుతాయి meetings అని expect చేస్తున్నా. తనకోసమే ఈ Pre-planned pause అన్నట్లు, దగ్గర్లోవున్న bedroom నుంచి అంతా follow అవుతున్న candidate, మేమంతా ఉన్న hallలోకి enter అయ్యింది. ఓహో! అంటే అన్నిసార్లు ఈ ఆడంగులే లోపలికెళ్ళి  తీసుకురావాలనేం లేదన్నమాట అనుకుంటుండగా, "మీరిద్దరూ మాట్లాడుకోండి, మేము అలా పక్కకెళతాం" అంటూ uncle అనేసరికి అందరూ లేచి dining వైపు వెళ్తున్నారు, ఒక్కరు తప్ప, uncle wife. ఆవిడ అక్కడే కూచున్నారు. పక్కనున్న brother వెళ్లిపోగా, ఆ placeలో కొత్త శాల్తీ settle అయ్యింది. "అనగా, మనకి లభించే maximum privacy ఇంతే అనమాట!" అని అర్థంచేసుకుంటూ, dining table దగ్గర, చెవులిటు పడేసి వాళ్ళల్లో వాళ్లే ఏదో మాట్లాడుకుంటున్నట్లు కనిపించిన జనాన్ని చూసి, "This is cheating భయ్యా! మరీ రోడ్డుమీదకి కాకపోయినా, కొంచెం దూరమైనా వెళ్లాలిగా"  అనుకొని, వెంటనే, "wait, ఈ pre-meditated షాట్లే ఆడకూడదు, let's face it! ఇవాల్టికి బెంగుళూరే గ్వాలియర్, మనమే దేవుడు; స్టెయిన్, పార్నెల్ పిచ్చ light; ఓ అద్భుతానికి అవకాశమో, సాక్ష్యమో ఇచ్చినట్లు feel అయిన కల్లిస్ లాగా uncle కూడా feel అవ్వాల్సిందే ఈ పూటకి," అనుకొని, హాయ్ చెప్పా.

"చదువుకోడం కాకుండా ఇంకేమైనా చేస్తారా మీరు?" మొదటి ప్రశ్న. అంచనా లేని pitch కదా, ఈ unexpected bounceకి కొంచెం surprise అయ్యాం. Offend అయ్యాం అనుకున్నారో ఏమో, "అంటే, అలా కాదు, మీకున్న illustrious academic careerకి కొంచెం ఎక్కువ dedication కావాలేమో కదా! అందుకని other hobbiesకి time దొరకదేమో అని అలా అడుగుతున్నా" damage control exert చేశారు. (కంగారు పడకండి, exact language ఇది కాదు, భావం చెడిపోకుండా నేను అందమైన పదాలతో decorate చేశా, ఎంతైనా మనగురించి కదా!) .

"అలా ఏం లేదు, in fact నేనింకా, నా career కోసం ఇవ్వాల్సినంత time ఇవ్వడంలేదని feel అవుతుంటా" అన్నా.

"Seriously, with a PhD, you are saying you don't study enough?" అన్నట్లు చూసేసరికి,

"Damn Yes, I am not kidding. మనకున్న cotton businessల వల్ల research output is taking a toll. కవిత్వం చదవాలి, cricket ఆడాలి, రోడ్డుమీద పడి రాచకార్యాలు చేయాలి, cycling, biking, కొత్తగా zoom-car-ing, trekkingలు చేయాలి, friendships కావాలి, dark sides చూడాలి, simpleగా, nuclear science నుంచి nude woman దాకా అన్నీ నాకే కావాలి, ఇంకెప్పుడు careerకి ఉపయోగపడే పనులుచేసేది. నోట్లో స్పూను, దాంట్లో నిమ్మకాయ పెట్టుకొని, Balance Balance అంటూ పరుగెత్తడానికి ప్రయత్నిస్తున్నాం", కంగారు పడకండి, ఆవేశంగా అన్నీ లోపలే అనుకున్నా, పైకి ఏమీ అనలేదు.

"I mean, చిన్న చిన్న hobbies గట్రా ఉంటాయి కదా" అని, పైనున్న listలోంచి, చెప్పుకోగలిగినవి మాత్రమే, చెప్పాల్సిన విధంగా చెప్పడం జరిగిందనమాట.

Suddenగా ఇంకో విషయం గుర్తొచ్చింది, Indiaకి వచ్చేముందే శర్మగారని, ఒకానొక  wise friendతో పెళ్లి గురించి కొంచెం gyan ఇవ్వమంటే, "పెద్ద పెద్ద shockingలకి ready ఉండు" అన్నారు. "ఎందుకని?" అంటే, చెప్పారు, "మీ(family) దగ్గరికి pilot profile కానీ, సినిమాలో పనిచేసే assistant director profile కానీ, జిల్లా కలెక్టర్ (IAS) profile కానీ వచ్చిందనుకో ఎలా feel అవుతారు?" అని అడిగారు. నా surprise cum shockని అర్థంచేసుకొని, ఆయనే అన్నారు మళ్లీ,  "కొద్దిగా uncomfortableగా feel అయ్యి, match అవ్వమేమోలే అని hesitate చేస్తారు కదా, అలానే, నీలాంటి, SEEMINGLY studious, PhD profile చూస్తే, typical family, ఇంకా particularగా, BTech and software engineer అమ్మాయిలు అలానే feel అవరంటావా?" అన్నారు.

"నిజమేనేమో, మనం కొంచెం కొత్తగా, unfamiliarగా అనిపించొచ్చేమో. Ultimateగా,  academic jobని, లేదా, కంపెనీల్లో scientist jobని కూడా దూరంగానే feel అవుతారా?"

"నీ చేతుల్లోనే ఉంది, IITలు, IIScలు, scientist, research papers, academic conferenceలు, postdocలు గట్రా అంటూ భయపెడితే  వాళ్లకి తెలీని కొత్త ప్రపంచం అనుకొని risk feel అవ్వొచ్చు మరి, familyలో ఇవి తెల్సిన వాళ్లు ఉంటే, no problem. కొద్దిగానైనా తెలిసిన జీవితంలోకి అడుగుపెట్టాలని అనుకుంటారు కానీ, పూర్తిగా unfamiliar terrain కోరుకోరుగా. Anyway, play it simple, Good luck!" అని కొంచెం జ్ఞానదానం చేశారు. In this case, it seems, he was close.

Back to Gwalior...

ఆ తర్వాత, interestలు, likingలు, time passలు, friends,  అలవాట్లు, వేషధారణలు, professional plans అబ్బో, అన్ని variations ఎదుర్కోవాల్సి వచ్చింది. Workshop paperలో మన researchని beautify చెయ్యకుండా, disadvantagesని cover చేయడాలు గట్రా పెట్టుకోకుండా, pros cons అన్నీ వీలైనంత  nakedగా చూపించినట్లే చర్చలు నడిచాయి. Entertainment value మెండుగా ఉందని గుర్తించినా, పాఠకులు నిరుత్సాహపడతారని తెలుస్తున్నా, కొన్ని limitations వల్ల ఈ విషయం ఇలా తెగ్గొట్టాల్సి వస్తోంది. కానీ, రుచి తెలుసుకోవడం కోసం ఒక మెతుకు చూద్దాం. నేనడిగిన ఒక ప్రశ్నకి నా దగ్గరున్న జనాలు "దానిగురించెందుకు నీకెందుకు?" అన్నట్లు చూశారు, dining table దగ్గర జనాలు అందరూ "ఏం చెబుతాడో విందాం" అన్నట్లు silent అయిపోయారు. వాళ్లు initialగా ఇచ్చిన informationతో నాకు సమాధానం దొరకలేదు, అందుకే particularగా అడగాల్సి వచ్చిందీ ప్రశ్న: "మీ parents పెళ్లి మేనరికమా?" అని.  మనకెందుకా? నేను next generationకి ఇచ్చే ఆస్తిపాస్తులంటూ పెద్దగా ఏమీ ఉండదు, ఆరోగ్యం, చదువు మాత్రమే ఇవ్వాలని అనుకుంటా. అక్కడ మాత్రం రాజీపడను, అందుకోసమే అడిగా. మరి ఆరకంగా, candidate ఆరోగ్యం కూడా మనకి important కదా! Genuineగానే అనిపించిందేమో, జనాలెవరూ Affect అయినట్లు అనిపించలేదు.

మంచి పరిణామమేంటంటే, "At least కొంతమంది candidates homework చేసి వస్తున్నారు interviewsకి. వాళ్లకేం కావాలో స్పష్టత ఉన్నట్లుగా ఉంటోంది" అని బయట talk. People would like to believe that nothing is obvious, అందువల్ల, "ఫలానా వేషధారణ మీకేమైనా అభ్యంతరమా?", "నేను Job చేయడం గురించి మీ expectations ఏంటి, మీ family expectations ఏంటి?", "నాకున్న ఫలానా interest గురించి మీ అభిప్రాయమేంటి?" లాంటి ప్రశ్నలు అవలీలగా అడిగేస్తున్నారు. In fact, అందరూ ఉండటం వల్ల అడగలేకపోయిన ఒకానొక ప్రశ్నని (అదేమిటో మీ ఊహకి వదిలేస్తున్నా), తర్వాత uncle ద్వారా message చేయించి మరీ అడిగారు నా caseలో, అదీ మరి పరిస్థితి.  Completeness కోసం concluding remark: semi-privateగా నడిచినందువల్ల ఈ గంట timeకి, U certificate మాత్రమే సాధ్యపడింది. అనగా, old ball వల్ల వచ్చే reverse swingని face చేయాల్సిరాలేదు.

ఆవిధంగా, diplomaticగా కార్యక్రమం ముగించుకొని, dinnerకి late అవుతోందని సెలవు తీసుకునేందుకు ready అయ్యా. ఈమాటు మాత్రం వారికోరికని మన్నించి, వారి వాహనంలోనే  వెనుదిరుగ వలెనని నిశ్చయించుకొని బయలుదేరితిమి. వారి చోదకుడు తెలుగు నెరిగినవాడు, మరియు, మా సందర్శనార్థము బహు చక్కగా ఎరిగిన వాడునూ అవడంచేత,  మమ్ములను మిక్కిలి గౌరవముతో వ్యవహరించినాడు. వారి రెడ్ల (యజమానుల) యెడల ఆతని సానుకూల్యతని, స్వామిభక్తిని వ్యక్తపరిచినాడు. సర్లెమ్మని, మా ఆలోచనలని మరోవైపు మళ్లించడం కోసం, "music ఏమైనా ప్లే చేస్తారా" అని రిక్వెస్ట్ చేస్తే, "తప్పకుండా" అని, జేబులో ఉన్న, personal collection pen-drive insert చేస్తూ, "కొంచెం పాత పాటలు, పర్లేదా!" అన్నారు పాపం నొచ్చుకుంటూ, "అయ్యో దానికేముంది, నేను కూడా వింటా ఆనందంగా" అన్నా.

"ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాక్కున్నావో వెన్నెల గువ్వా, వెన్నెల గువ్వా, ఇవ్వాళే చూశా నిన్ను వెన్నెల గువ్వా, వెన్నెల గువ్వా " అంటున్నారు ఇంకో రెడ్డిగారు పాటలో. "అయ్యో, లేదండి (SV)కృష్ణారెడ్డిగారు, మనకి ఇంకా time ఉంది ఈ పాట పాడటానికి" అనుకుంటూ ఆ journey కొనసాగించాం New BEL roadకి.


PS: పనులుచేస్తేనే పొరపాట్లూ జరుగుతాయి. కాబట్టి, ఏమైనా పొరపాటుగా అనిపిస్తే, వాటివెనకాల ఉన్న "పనిచేయాలన్న నా పట్టుదలని" పెద్దమనసుతో అర్థంచేసుకొని, పొరపాట్లని క్షమిస్తారని (anonymous participantsతో సహా) ప్రజలందరికీ మనవి. విచ్చలవిడిగా వాడుకోనిచ్చినందుకు KKకి ధన్యవాదాలు. 

Friday, September 20, 2019

First Interview - Gradual Building up


అలా 9:30కి తయారవ్వడం మొదలుపెట్టి, అయ్యాక, ఎక్కువ time లేదు కాబట్టి, ఈ పూట ప్రకృతిలో coffee skip చేసి, directగా department దగ్గర దిగేసరికి 10:30. 

"ఏంది మచ్చా, నీకన్నా ఆడోళ్లు నయం, గంటసేపు ready అయ్యావ్" time చూస్తూ KK విసుక్కున్నాడు.

"మా మతం భోజనాన్ని ఆస్వాదించడాన్ని తప్పుపట్టిందేమోగాని, స్నానాన్ని ఆస్వాదించమనే చెప్పింది మచ్చా" అన్నా.

"ఇట్టాంటివి బాగ చెబుతావ్ సామి నువ్వు!" అనుకుంటూ నన్ను వదిలిపెట్టి labకి వెళ్ళిపోయాడు. ఆయన ఏడుపు మయాంక్ దగ్గర attendanceకి late అయ్యిందని. అనవసరంగా acknowledge చేశా thesisలో, campusలోనే ఉండి, colloquiumకి, defenceకి రెంటికీ రాలేదు, ఏం ఉపయోగం?  

ఇంతలో, Mr. Kanhar "ಚೆನ್ನಾಗಿದ್ದಿರಾ Sir?" అనుకుంటూ security postలోంచి బయటికొచ్చాడు నవ్వుకుంటూ. "ಚೆನ್ನಾಗಿದ್ದಿನಿ Sir, ನೀವು ಹೇಗಿದ್ದಿರಾ?" అని క్షేమసమాచారం పంచుకొని, late అవుతోందని, తర్వాత మాట్లాడదాం అని చెప్పి తొందరగా departmentలోపలికి బయలుదేరా. "ಸರಿ sir, ಆಮೇಲೆ ಮಾತಾಡೋಣ" అంటూ ప్రసన్నంగా departmentలోకి సాగనంపాడు.

ఆయనెవరా? అయన SERC/CDS దగ్గర security guard, కనీసం 3-4 ఏళ్లుగా, అప్పటికి. PhD రోజుల్లో Late nights roomకి వచ్చేముందు కా...సేపు మాట్లాడితే చాలు, పాపం, తెగ సంబరపడిపోతాడు. ఒడిశా నుంచి వచ్చి, నెలకి కేవలం 8వేల జీతానికి పనిచేస్తూ, అందులోనే ఎంతోకొంత మిగిల్చి ఇంటికి పంపాలని బాగా ఇరుకు గదుల్లో ఉంటూ, ఏదో తింటూ, చాలామందే (post-office వెనకాల) బతుకుతున్నారని చెప్పేవాడు. ఏదోరకంగా సాయపడాలనే చిన్న ఇది వల్ల, friend చేసుకున్నా. అడిగి మరీ, నా institute wifi credentials share చేశా, అవసరమైతే తన friends (other guards) కూడా share చేయమని చెప్పా. IPL season అప్పుడు అయన ఆనందం చూడాలి (MSD fan). Security guard కాబట్టి ప్రతిరోజు న్యూజ్ (అయన యాసలో News) చూడాలి, workout చేయాలి అనేవాడు, చేసేవాడునూ. ఒకానొక శనివారం సాయంత్రం చీకటిపడ్డాక lab meeting ముగించుకొని ఆత్రంగా hostelవైపు (ఇంకో meetingకని) వెళ్లబోతుంటే duty చేస్తూ కనిపించాడు. Shift (second) అయిపోయాక M-blockలో నా room దగ్గరికి రమ్మని చెప్పా. 10:15కి, roomలో, మనోళ్లందరూ మూడు-నాలుగు రౌండ్స్ అవగొట్టి, మాంచి రచ్చరచ్చగా ఉన్నపుడు door కొట్టాడు. Open చేసిన మనోళ్లు, noise ఎక్కువై, securityకి అనుమానమొచ్చి check చేస్తున్నాడేమో అనుకొని కంగారుపడ్డారు. ఇప్పుడీయన గడ్డము పట్టుకొని బతిమాలుకోమన్నట్లు cornerలో ఉన్న నావైపు చూసారు, మరది నా రూమ్ కదా! కంగారు పడొద్దని చెప్పి, door వేయమని, ఆయన్నికూడా మాతో కూచోబెట్టుకొని, order చేసిన extra paradise single mutton biryani ఇచ్చి తినమన్నా. మా చేతుల్లో ఉన్న గ్లాసులు చూసి, security అయ్యిఉండి students చేస్తున్న ఇంత రచ్చలో involve అవడానికి ఆయనకి భయమేసి, just 2నిముషాలు కూచుని వెళ్తా, ఇంటికెళ్లి తింటా అన్నాడు పాపం. సరే అని ఇచ్చి పంపించాం, అందరూ relax అయ్యారు. ఆ తర్వాత జరిగిన IDCCలో security teamకి, practiceకి kit, matchesకి bats ఏ team supply చేసిందో మీరు easyగానే guess చేయొచ్చు.

సరే, back to present(ation)...

MRC దగ్గర తమిళ్ T తాగుతూ ఇదంతా చూస్తున్న మా lab-mate Ramగాడు, తాగడం అవజేసి, నా వెంటరాగా department లోపలికి enter అయ్యాం. Guideని కలవడం కంటే ముందు, officeలోకెళ్ళి, staff కోసం తెచ్చిన chocolates ఇవ్వడం చూసి, "మెట్ల దగ్గరినుంచి, మాట్లాడే మైకు దాకా మంచి కర్మ మూటగడుతున్నట్లు ఉన్నావ్!" అన్నాడు మావాడు. "మంచిదేగా" అనుకుంటూ ముందుకెళ్ళాం.

మన exam time తెలిసినందువల్ల "Good luck with your presentation!" అని సాయంత్రం కలవాల్సిన (interview) జనాల దగ్గరినుంచి message. కంగారు పడకండి, candidate నుంచి కాదు, వాళ్ళ uncle దగ్గరినుంచి (వాళ్ళ ఇల్లే interview location). comedy వరకు OKకానీ, అంత romance promise చేయలేం storyలో; just to set the expectations right. 

ఉన్న అరగంటలో slides చూడటం గట్రా పెట్టుకోలేం అని, తొందరగా guideకి ఓసారి కనిపించి, presentationకి set-up arrange చేస్తా అని చెప్పి, labలోకెళ్లి lab-matesకి కేవలం కనిపిం(చాననిపిం)చి అట్నుంచటే auditoriumకి బయలుదేరా. నావెంటే మా lab సైన్యమంతా వచ్చింది, అది rule, lab presentationsకి attendance mandatory. Laptop, projector set చేస్కుని మన శ్రేయోభిలాషుల ఆశీస్సులతో  దివ్యంగా కార్యక్రమం ముగించుకొని, guide, examinerతో faculty clubలో భోంచేసి, మళ్లీ departmentలో submit చేయాల్సిన forms అన్ని చేసి, hostelకి వచ్చేసరికి 3PM.

"ఛ! Interviewకి ఖచ్చితంగా lateగానే వెళ్లే"దని decide అయిపోయా. Immediateగా బయలుదేరినా easyగా 4 దాటేస్తుంది, మరి మనం స్నానం చేసి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంతలో మళ్ళీ వాళ్లే, ఈసారి call, వాళ్ళ vehicle పంపిస్తాం location share చేయమని. ఇదిగిదిగో, ఇదే VIP treatment అంటే. సెలవులకి ఇంటికెళ్తూ, "అర్ధరాత్రి bus ఉంది మచ్చా, bikeలో Hebbal police station దగ్గర దింప"మని అడిగే అలవాటుపడిన మనకి (Uber/Olaకి ముందు; పదిదాటాక బెంగుళూరులో city బస్సులు ఉండవని అలవాటు పడిన జీవితాలు), pick-upకి car పంపిస్తామంటే, "ఈ చిన్న చిన్న ఆనందాలే కదా జీవితమంటే" అనుకుంటాం. ఇదివరకే, మనమిచ్చే talks/tutorials కోసం company vehicles hostelకొచ్చి మరీ pick-up చేసుకున్న సందర్భాలున్నాయి. Concept same అయినా, context వేరబ్బా! Convince అవ్వండి.

స్వభావరీత్యా చాలా అల్పసంతోషులం కాబట్టి, అదేంవద్దని, "almost start అయిపోయా" అని సొల్లుచెప్పి, ready అవ్వడానికి సిద్ధమవుతున్నా. అవుతూనే ఆలోచిస్తున్నా, "అయినా, ఈ uncle ఏందీ, ఆయనేమో American citizen అంటాడు, candidate ఏమో కొంచెం modern అంటాడు, మొదటి round interviewకి family రచ్చ లేకుండా, సుబ్బరంగా ఏ cafeలోనో arrange చేయొచ్చు కదా! మనకి ఏ anxiety లేకుండా ఉండేది" అనుకుంటున్నా. "అయినా, ఇదే betterలే, మనకి జనాలతో అనుభవం అయినట్లు ఉంటుంది, పైగా, only aunt and uncle అన్నాడుగా, పెద్ద జనాలు ఉండరు కాబట్టి OK" అనుకుంటూ cab ఎక్కేసరికి 3:45PM. బెంగళూరు trafficలో ఈదుతూ interview locationకి వెళ్లేసరికి 4:35PM. Rich gated community, ఇంటిముందు Audi car, దానిపక్కన safari dressలో driver, ఇంటిలోపల తళతళలాడుతున్న furnishing, ఓడియమ్మ, uncle రచ్చ చేసాడుగా,  అవున్లే, green card అంటున్నాడు, companyకి GM అంటున్నాడు, ఈ మాత్రం శబ్దం చేస్తాడులే అనుకుంటున్నా. ఇంతలో....

(సశేషం)

Thursday, September 19, 2019

First Interview - Prologue

ఏం, తొలిప్రేమలే చెప్పుకోవాలా? తొలి interview మాట్లాడుకోకూడదా?

సాగరసంగమం సినిమా గురించి మాట్లాడుతూ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇలా అన్నారు ఓచోట "అదొక failure story. Success storyని ఎవరైనా చెబుతారు. పోనీ, hero failure అని చివరిదాకా దాస్తారా అంటే, సినిమా మొదటి sceneలోనే ప్రేక్షకులకి అర్థమైపోతుంది, hero పెద్ద failure అని. K. విశ్వనాథ్ గారు, ఆ failure storyనే ఎంతో గొప్పగా చెప్పి hit చేశారు. అంతేనా, సంవత్సరాలు గడిచినా, మళ్ళీ మళ్ళీ చూసేలా చేశారు" అని. అలాగే, నేను కూడా ముందే చెబుతున్నా, నాకు ఇదే చివరి interview కాదు. అయినా, మొదటిది ఎంతైనా ప్రత్యేకం; కనీసం, నాకు.

February 14, ప్రేమికుల దినోత్సవం, తెల్లవారుఝామున 5, Mekhri circle, lightగా చలి, phoneలో మాట్లాడుతున్నా "బుద్ధి బుర్ర లేవు మచ్చా నీకు, airport నుంచి వస్తున్నా అని తెలుసు, junctionలో,  RT nagar వైపు ఉన్నా అని చెప్పినా, సావగొడుతున్నావ్ ఎక్కడ, ఎక్కడ అని".

"సర్లే మచ్చా, నిద్దట్లో ఉన్నా, పొద్దున్నే మొదలు పెట్టావ్" అంటూ, నేను ఉన్నవైపు వచ్చాడు KK తన bike మీద.

రెండు పెద్ద bags మధ్యలో వేసుకొని బండి start అయ్యింది, IISc campus వైపు. విశాలమైన ఆ road మీద వెళ్తోంటే బెంగుళూరులో ఉన్నప్పుడు enjoy చేసిన road trips, ఆ early morning empty roads, చలి,..... ఆ సమయాలు అన్నీ గుర్తుచేసుకునే లోపే hostel వచ్చేసింది, దిగి, KK గది లోపలికెళ్ళి ఫటాఫట్ కాలకృత్యములు తీర్చుకొని, హడావుడిగా, మళ్ళీ బండివేసుకుని బయలు దేరాము, ఈసారి నేను తీసా. త్రివేణి టీకొట్టు దగ్గర ఆగి, ఇంకా చీకటి ఉండగానే పనులకి వెళ్లే వాళ్లతో కలిసి T తాగితే, ఆ feel వేరబ్బా, try చేయండి, highly recommended, యశ్వంతపూర్ soul చిక్కుతుంది ఆ timeలో అక్కడ. ఇప్పటికీ, ఆ టీకొట్టు వల్ల ఆ roadకి (triveni road) పేరొచ్చిందో, ఆ road వల్ల కొట్టుకి పేరొచ్చిందో తెలీదు, ఒకరిద్దరిని అడిగినా, "అవునా, good observation" అని పులిహార కలిపారే తప్ప, వివరం చెప్పలేదు. ఆ కొట్టువాన్నే అడుగుదామంటే, వాడు ఎక్కడలేని busy, very unwelcoming. అందువల్ల ఎప్పుడూ కుదరలేదు.

"ఏంది మచ్చా నువ్వు, 11కి Thesis defence అంటున్నావ్, 4కి first interview అంటున్నావ్? Night friendsతో dinner అంటున్నవ్, ఇప్పుడీ match ఆడటం అంత అవసరమా? Scotland నుంచి 12 గంటల flight తీస్కొని  వచ్చావు హాయిగా rest తీస్కొని freshగా కనిపించకుండా, నిద్రా, పాడు లేకుండా, match ఆడేసి, defence అవజేసుకొని, నిద్దర మొఖంతో ఇంటర్వ్యూ ఇవ్వడం, ఇంత అల్లరి ఎందుకంటావ్?" అన్నాడు KK.

"హ్మ్, defend చేసుకున్న thesisకి సార్థకత చేకూరాలంటే, అంకితమిచ్చిన teamకి ఈ match ఆడాల్సిందే! అయినా ఓసారి ఆలోచించు మచ్చా, సరిగ్గా, external examinerకి వీలయ్యేలాగా మరియు మనం match ఆడే working day (Thursday)నే defence plan చేసి, అంతేనా, సాయంత్రం schedule చేసిన interview participantsకి కూడా set అయ్యేలా కుదిరి, వీటన్నిటినీ meet అయ్యేలా, airindia flight plan చేసి, ఇదంతా చూస్తుంటే మనపాలిటి దశావతారం cinema story లాగా కనపడట్లా నీకు?" అనేసరికి,

"అవును మచ్చా , కొంపదీసి ప్రకృతి కూడా సహకరించి సాయంత్రం interview set అవుద్దంటావా? పనిలో పని, మీవోడి పెళ్లి అయ్యాక నువ్వు కూడా చేసుకొని తీసుకెళ్తావా ఏంది?" అని KK ఆశ్చర్యపోయాడు.

"ఏడిసావ్, logic miss అయ్యావ్, సరిగ్గా చూడు, events అన్నీ, మనం plan చేసినవే, butterfly effects ఏం లేవిక్కడ, నీతో comedy చేస్తున్నా అంతే. Actually, సాయంత్రం interview కూడా నాకు net practice లాంటిది, serious interview కాదు. వాళ్ళ సంగతేమోగానీ, నాకు ముందే తెలుసు నేను రిజెక్ట్ చేస్తానని, అయినా, ముఖ్యంగా అనుభవం కోసం మరియు కాసేపు VIPలాగా feel అవ్వడం కోసం ఈ exercise" అన్నా.

"దారుణం మచ్చా నువ్వు, ఆమాత్రం దానికి ఇంటర్వ్యూ attend అవ్వడం దేనికి, అంతమందికి time బొక్క" అరిచాడు KK. "అరె, చెప్పాగా, experience and  VIP treatment. నావరకూ నాక్కావలసినవి దొరుకుతాయి, నో failure. For 50% parties, it is success. in fact, at least 50% parties అనాలి, వాళ్ళకి కూడా కలిసి మాట్లాడాక దాని ఉపయోగం పట్ల సంతృప్తి కలగొచ్చు. మనం నచ్చడమో నచ్చకపోవడమో జరుగుతాయి కదా!" అనగానే,

"కరెక్టేప్పా, నువ్వేమో నీ సరదా తీర్చుకోడానికి వెళ్లి, వాల్లేమో seriousగా నిన్ను కావాలనుకుంటే, అప్పుడేంది పరిస్థితి, అనవసరంగా వాళ్ళకి time and effort బొక్కకదా! " intelligent ప్రశ్నయేగా అన్నట్లు teasingగా చూశాడు నావైపు, T గ్లాసు మూతికి అంటించుకుంటూ.

"see, this is all part of the game! process మీద concentrate చేద్దాం, result మీద కాదు, వాళ్ళైనా, మనమైనా. ఏమో, నా preliminary feeling అలా ఉంది, చూద్దాం, అనుకున్నదానికంటే differentగా ఉంటే, practiceని matchలాగా మార్చేద్దాం."  అని vivaలో questionకి సమాధానం చెప్పినట్లు చెప్పా.

"ఇంతకీ, already ఎందుకు డిసైడ్ అయ్యావ్ reject అని, candidate చూడటానికి నచ్చలేదా, profile బాలేదా?"

"candidate అందం కంటే ఆరోగ్యం ముఖ్యం మచ్చా మనకి. On the positive side, family looks interesting"

"ఏంది మచ్చా, profileలో medical reports కూడా పెడతారా! " ఈసారి వెకిలి నువ్వుకూడా add చేసాడు teasing చూపుకి.

"అదే మరి; photos, bio-data share చేస్తారు కదా మచ్చా! కేవలం వాటితోనే ఆగిపోకుండా, profileలోని detailsతో internet మీద, మన contacts మీదా పడిపోతే, ఎంతోకొంత unedited, raw information దొరకబట్టొచ్చనమాట! "

 "అక్కడ పచ్చి నిజాలు దొరుకుతాయంటావ్!"

"దొరికే chance (మాత్రమే) ఉంది అంటున్నా, అంతే. ఎందుకంటే, interviewకి కూచునే ముందే, అందరూ వాళ్ళ వాళ్ళ online జీవితాలని, గట్టిగా edit చేసి, colouring ఇస్తారు, part of the homework." ఇప్పటికి ఇది చాలు, time అవుతున్నట్లు ఉంది, పద అని మళ్ళీ campusలోకి పయనమయ్యాం.

NBH వెనకాల bike park చేసి, gymkhana వైపు bridge మీదకి పరుగుపరుగున వెళ్ళాం. అప్పటికే ఆరుంబావు దాటేసి పావుగంట అయ్యింది. Matchకి lateగా వెళ్లడం తప్పలేదు ఆవాళ్టికి. Match అయ్యాక, A-messలో కలిసి పొంగల్ తింటానని friendకి ఇచ్చిన మాట గుర్తున్నా, for old times sake, teamతో C-messలో omelette, అందాలు నంజుకుంటూ breakfast తీరిగ్గా అవజేసి, hostelకి వచ్చేసరికి 9:30 అయ్యింది.

 (సశేషం)

Thursday, September 5, 2019

వేరు మూలాలు

మూలాలకి కట్టుబడి batting చేయాలి అని test cricket గురించి చాలా చిన్నప్పుడు news paperలో ఎవరో చెబితే చదివినట్టు గుర్తు. 'మూలాలు' (Fundamentals), చాలా ప్రత్యేకమైన మాట అనిపిస్తుంది నాకు. Cricket లాంటి  sportsలోనే కాదు, తర్వాత రాసిన చాలా పరీక్షల్లో  problems solve చేస్తూ over action వల్ల చేతులు కాల్చుకున్నప్పుడు, researchలో అంతుచిక్కని ప్రశ్నలకి సమాధానాలు వెదుకుతూ తెల్లవారుఝాముల్లో తల బద్దలు కొట్టుకున్నప్పుడు, బంధుమిత్రుల దగ్గరినుంచి సమాజంలోని పలురకాల వ్యక్తులతో వ్యవహారాలు చక్కబెట్టాల్సి వచ్చినప్పుడు, ఇలా జీవితంలో అన్ని సందర్భాల్లోనూ, సమస్య ఎదురైనప్పుడల్లా, fundamentals నుంచి సమాధానం కోసం వెదకడం బాగా సహాయపడింది నాకు. Clarity వచ్చి, ముందుకెళ్లడం సాధ్యపడింది చాలాసార్లు. So, ఆరకంగా, జీవితం మొత్తాన్ని కూడా ఒక ప్రశ్నలాగానో, ఒక gameలాగానో, ఒక ప్రక్రియలాగానో అనుకుంటే, same సూత్రం దీనికి కూడా వర్తిస్తుంది కదా! జీవితంలో ఏ సమయంలోనైనా, "ఏం చేస్తున్నా? ఎక్కడ నిలుచున్నా? సరిగ్గానే సాగుతోందా ప్రయాణం?" ఇలాంటి ప్రశ్నలు ఉదయించినపుడు, వెంటనే, ఒక్కసారి "అసలు ఇపుడు ఎటువైపు వెళ్తున్నా? దేనికోసం అని వెతుకుతున్నా? ఎటు వెళ్లాలని అనుకున్నా?  అటువైపే వెళ్తున్నానా?" అని నన్ను నడిపించే (నా జీవిత) మూలాల్ని మరొక్కసారి గుర్తుచేసుకోవడం అలవాటు అయ్యింది.

I think, మనలో చాలామందికి, చిన్నప్పటినుంచే, మనకి జీవితంలో ఏం కావాలో,  ఆలోచించడం మొదలు పెడతాం. అంటే, నా ఉద్దేశం 'మన జీవిత పరమార్ధం ఏమిటి?' అని కాదు. ఎప్పటికప్పుడు, మనకి ఏదోటి నచ్చేసి, నాకిది కావాలి, నేను కూడా ఇలా చేస్తాను, నేనెప్పటికైనా ఇది అవ్వాలి,అనిపించే ఆలోచనలమాట. స్పష్టత లేకపోయినా, అవే ఆ తర్వాత నచ్చకపోయినా, ఇంకేవో ఎక్కువగా నచ్చడం మొదలైనా, వాటిని పొందడానికి మనం ప్రయత్నించక పోయినా, ఇలాంటి ఆలోచనలు కలగడం ఐతే సామాన్యమే (అనుకుంటున్నా). కానీ, కొంతమందికి చాలా చిన్నప్పుడే, జీవితం చివరి వరకు నడిపించేంత గట్టి ఇష్టాలు ఏర్పడినా ఆశ్చర్యం లేదు. మనం చాలా మంది interviews చూసినప్పుడు, ఎంతవరకూ నిజమో తెలియదు కానీ, వారి ఇప్పటి స్థితికి, చాలా చిన్నప్పుడే పడిన బీజాల గురించి చెబుతూ ఉంటారు. ఈ మూలాలు అంతటి అమూల్యమైనవి అనమాట. నేను celebrityని కాకపోయినా, interview ఇవ్వకపోయినా, మనందరం మన జీవితాలని నడిపించే మూలాలని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోవడం మంచిదని అనిపించి, పైగా, ఇవాళ అలాంటి ఒక అవకాశం, అవసరం వచ్చింది కాబట్టి, ఆ పని చేస్తున్నా. 

చాలా చాలా తక్కువమందికే దక్కే అదృష్టం, అవకాశం నాకు దక్కింది. అదేంటంటే, నాకు మా నాన్న, వాళ్ళ నాన్న, అంటే మా అబ్బ కూడా చదువు చెప్పారు, నా చిన్నప్పుడు. మా ప్రాంతంలో, తండ్రివైపు తాతని అబ్బ అంటారు. అవును, నేనంటోంది, జీవితంలో పాఠాలు కాదు, తరగతి గదిలోపాఠాల గురించే. నేను మాఊరి high school (ఉన్నత పాఠశాల)లో చదువుకున్నపుడు మా నాన్న, primary school (ప్రాథమిక పాఠశాల)లో ఉన్నపుడు మా అబ్బ (ప్రయివేటు masterగా) నాకు చదువు చెప్పినవాళ్లే. నేను పుట్టిన 3 రోజులు అటుఇటుగా మా అబ్బ మా ఊరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదవీవిరమణ చేసాడంట (verify చెయ్యలేదు, చిన్న జ్ఞాపకం అంతే). So, బడిలో పాఠాలు చెప్పలేదు, కేవలం ప్రయివేటులోనే. దాదాపు పాతికేళ్ల నా సుదీర్ఘమైన academicsలో, నాకు చాలా మంది మంచి ఉపాధ్యాయులు ఎదురుపడ్డారు, అది ఇంకో అదృష్టం, ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. మళ్ళీ, distract అయ్యేలోపే, మూలాల దగ్గరికి వద్దాం. విషయం ఏంటంటే, నేను ఉహించుకుంటున్న, తద్వారా నిర్మించుకుంటున్న నా జీవితానికి, మూలాలు, నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు మరియు వారు నాపై వదిలిన ముద్రలు. అలా నన్ను ప్రభావితుణ్ణి చేసిన చాలామంది ఉపాధ్యాయుల్లో, మొదటివాడు మా అబ్బ. అవును, నేనోదో sentimentalగా  ఉంటుందని చెప్పడంలేదు, నిజంగానే అయన నన్ను influence చేసిన teacher. మా అబ్బ అవడంవల్ల తరగతి పాఠాలతో పాటు, బయటకూడా నేను ఆయనతో గడిపిన సమయం గుర్తుండి పోయింది. ఇవాళ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం, కాబట్టి, నా బాధ్యతగా నా గురువుల్ని తలచుకొని, నాకు ఒకానొక ఆత్మీయ గురువు, ఇంకోరకంగా, తొలి గురువు లాంటి మా అబ్బని మరింత దగ్గరగా (zoomలో) తలుచుకునే ప్రయత్నం చేస్తున్నాను.

చిన్నప్పటి నుంచి, మావూళ్ళో మరియు చుట్టుపక్కల ఒకటి రెండు దగ్గరి పల్లెల్లో కూడా, మా cousins అందరికి గుర్తింపు, 'భైరవ కొండా రెడ్డి ఐవారు మనవళ్లు'గా, మా అబ్బ పేరుమీదే.  అప్పట్లో, కొన్నిచోట్ల ఇప్పటికి, teachersని అయ్యవారు (ఐవారు) అనేవాళ్లు, గుళ్లో పూజారుల లాగ. మరియు, సమాజానికి teachers అంటే భయభక్తులు సమపాళ్లలో ఉండేవి. నా పేరుకూడా అయన పేరుమీదే రావడం (పెట్టడం కాదు) జరిగింది, అదంతా ఒక పెద్దకథ (కొంచెం ఇక్కడ ఉంది). అయన ఏమి చదువుకున్నారో నాకు తెలీదు, కానీ, నాకు తెలుగు, లెక్కలు చెప్పారు, English కూడా (నేను ఉన్నత పాఠశాలకి వచ్చాక). ఆ తర్వాత 'తెలుగు పంచాంగానికి primer' లాగా, పంచాంగం అంటే ఏంటి, ఎలా చూడాలి లాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేర్పించాడు. అయన పెళ్లి ముహుర్తాలు నుంచి, శంకుస్థాపనల వరకు చాలా చేయగలడు. మా ఊర్లో, గొల్ల అన్నదమ్ములు కట్టుకున్న పెద్ద మేడలకి శంకుస్థాపన చేస్తున్నప్పుడు, పడమటి దాని ఆయుస్సు (97 సంవత్సరాలు అని జ్ఞాపకం) calculate చేసింది నేనే, అయన సమక్షంలో, అప్పుడు నా వయసు ~10. చెప్పానుగా, he was my teacher in many ways. నాకు Englishలో articles (a, an, and the) విశదీకరించి చెప్పింది కూడా ఆయనే. ఎక్కడ శంకుస్థాపన, ఎక్కడ ఆంగ్ల వ్యాకరణం. ఇలాంటివి చాలానే. 

తెలుగులో చల్దులారగించుట అనే పాఠం ఒకటి ఉండేది. అందులో, శ్రీమద్భాగవతం నుంచి శ్రీకృష్ణుని బాల్యంలోని కొన్ని లీలలు ఉండేవి. ఆ సందర్భంలో కింది పద్యం వచ్చింది 

ఓయమ్మ నీకుమారుడు 
మాయిండ్లను పాలు పెరుగు మననియడమ్మ, 
పోయెదమెక్కడికైనను 
మాయన్నుల సురభులాన మంజులవాణి

చాలా సులభమైనదే, అంతా అర్థమైనట్లే ఉంది, సురభి అంటే ఆవు అని, ఆన అంటే ఒట్టు అని, కానీ,   'మా అన్నుల' సురభులు దగ్గర ఆగిపోయా, అక్కడే నాకు మా అబ్బకి చర్చ start అయింది. ఎక్కడనుకున్నారు, ఇంటి బయట, మా చిన్నాన్న park చేసిన ఎడ్లబండి కాఁడిమ్రాను మీద నేను seesaw ఆడుతూ ఆయనతో వాదిస్తున్నా, ఆ చివరి పాదం గురించి. ఆయన నడవలోనుంచి, "కాదురా, అన్నల ఆవులు, తమ్ముళ్ల ఆవులు కాదు, అన్నుల సురభులు అంటే, ఇష్టమైన ఆవులు అని అర్థం" అంటున్నాడు నవ్వుతూ. అబ్బే, నాకు పూర్తిగా అర్ధమైనట్లు లేదు (వాళ్ళ అన్నల ఆవుల మీద ఒట్టువేయ్యడం ఎందుకు? వాళ్ళకి ఆవులు ఉన్నాయిగా అనే ఆలోచిస్తున్నా, kiddish :-) ). అలానే ఉండిపోయింది. చాన్నాళ్ళకి, చంటి సినిమాలో 'అన్నుల మిన్నల, అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే' అనే పాట వినేప్పుడు, ఓరినీ, ఇదేకదా అప్పట్లో, అర్థంకాలేదు అని అనుకున్నా, అయన చాలా కష్టపడ్డాడు పాపం చెప్పడానికి అని. ఆ తర్వాత, ఆ పదం ఎక్కడ వచ్చినా,  ఈ సన్నివేశం గుర్తుకొస్తుంది నాకు. 

చాలామందే చదువుకునేవారు అయన ప్రయివేటులో. అందరం math puzzles, పొడుపు కథలు, ఇలా చాలానే నేర్చుకున్నాం. మా జేజి (నాయనమ్మ) అంటే మాత్రం పిల్లలకి హడలు, నెల మొత్తం ఎవర్నో ఒకరిని ఫీజు అడుగుతూనే ఉండేది, నన్ను కాదులెండి, మిగిలిన వాళ్లనే. 

మా అన్నకి, కదిరిలో coaching తీసుకున్నాక, లేపాక్షి నవోదయ schoolలో seat వచ్చాక, నాకు (రాములయ్యగారి ప్రసాద్ గాడితో కలిపి) తానే, ఇంటి దగ్గరే coaching ఇచ్చి, exam crack చేయించాలని గట్టిగానే ప్రయత్నం చేశాడు పాపం. మాకున్న matterతో అదో సాహసమే అని చెప్పుకోవాలి. అయినా, ప్రయత్నించిన అయన సాహసం గురించి నేను మర్చిపోలేను. ఉత్తమ ఉపాధ్యాయునిగా ఆయనకి ఇంకెవరో అవార్డు ఇవ్వడం ఎందుకు, నేనుప్పుడో ఇచ్చేశా, ఆయనకున్న అంకితభావానికి. పులివెందులలో ఆ పరీక్ష రాస్తుంటే, this is true story, no kidding, ఆ invigilator, hall ticketలో నా పేరు చూసి (ఇంటి పేరుతో కూడా ఉంటుంది కదా) ఊరిపేరు అడిగికనుక్కొని, 'ఐవారు మనవడివా?' అని అడిగాడు. Exam అయ్యాక, రోడ్డుమీద ఆయన మమ్మల్ని చూసి, దగ్గరికొచ్చి పలకరించాడు మా అబ్బని, తెలిసిన వాడంట. ఇవన్నీ కేవలం accidents ఎందుకు కాదంటే, వాటి ప్రభావం అంతటితోనే మాసిపోకుండా, ఇన్నేళ్ళుగా నాలో ఇంకా బ్రతికే ఉన్నందుకు.

మనిషి వయసొచ్చాక చాలావాటి వెంట పరిగెత్తినా, ప్రపంచం తెలియని పసివయసులో మనమందరం వెంటపడేది 'ఏంటో ఇది, తెలుసుకుందాం' అనే జ్ఞానంకోసం. చుట్టూ అంతా కొత్తదైన సృష్టిలో, తెలియజెప్పి, మనలోని కుతూహలాన్ని (curiosity) తృప్తి పరచి, ప్రపంచం ఎంతో తెలిసిందనిపించి, ఇంకొంచెం తెలుసుకుందామనే కోరిక రగిలించే ఉపాధ్యాయులందరూ ధన్యజీవులే, మా అబ్బతో సహా!

ఏ స్థాయిలో విద్యగరిపినా, ఉపాధ్యాయులందరూ ధన్యజీవులే, కానీ, మూలాలు ఏర్పర్చిన ప్రాథమిక గురువులు ప్రత్యేకంగా ప్రాత:స్మరణీయులు కదా!

ఆ తర్వాత్తర్వాత మానాన్నతో కలుపుకొని, నిన్నమొన్న video lecturesలో బోధించిన పరిచయమేలేని ఆచార్యుల వరకూ ఎందరో మహానుభావులు, అందరూ గొప్పవారే నాకు. వారందరూ నా కలల జీవితానికి మూలాలు. నామటుకు, ఒక వయసు వచ్చాక తారసపడిన, విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో లోతైన విషయాలు బోధించే ఆచార్యులకన్నా, ఎక్కడో ఒక సాధారణ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పిన ఉపాధ్యాయులే నా జీవితాన్ని ఎక్కువ ప్రభావింపజేయ గలిగారేమో. ఎందుకంటే, వీరు పైనుండే శాఖల లాంటి వారు, మరి వారేమో వేరు మూలాలలాంటి వారు.