మూలాలకి కట్టుబడి batting చేయాలి అని test cricket గురించి చాలా చిన్నప్పుడు news paperలో ఎవరో చెబితే చదివినట్టు గుర్తు. 'మూలాలు' (Fundamentals), చాలా ప్రత్యేకమైన మాట అనిపిస్తుంది నాకు. Cricket లాంటి sportsలోనే కాదు, తర్వాత రాసిన చాలా పరీక్షల్లో problems solve చేస్తూ over action వల్ల చేతులు కాల్చుకున్నప్పుడు, researchలో అంతుచిక్కని ప్రశ్నలకి సమాధానాలు వెదుకుతూ తెల్లవారుఝాముల్లో తల బద్దలు కొట్టుకున్నప్పుడు, బంధుమిత్రుల దగ్గరినుంచి సమాజంలోని పలురకాల వ్యక్తులతో వ్యవహారాలు చక్కబెట్టాల్సి వచ్చినప్పుడు, ఇలా జీవితంలో అన్ని సందర్భాల్లోనూ, సమస్య ఎదురైనప్పుడల్లా, fundamentals నుంచి సమాధానం కోసం వెదకడం బాగా సహాయపడింది నాకు. Clarity వచ్చి, ముందుకెళ్లడం సాధ్యపడింది చాలాసార్లు. So, ఆరకంగా, జీవితం మొత్తాన్ని కూడా ఒక ప్రశ్నలాగానో, ఒక gameలాగానో, ఒక ప్రక్రియలాగానో అనుకుంటే, same సూత్రం దీనికి కూడా వర్తిస్తుంది కదా! జీవితంలో ఏ సమయంలోనైనా, "ఏం చేస్తున్నా? ఎక్కడ నిలుచున్నా? సరిగ్గానే సాగుతోందా ప్రయాణం?" ఇలాంటి ప్రశ్నలు ఉదయించినపుడు, వెంటనే, ఒక్కసారి "అసలు ఇపుడు ఎటువైపు వెళ్తున్నా? దేనికోసం అని వెతుకుతున్నా? ఎటు వెళ్లాలని అనుకున్నా? అటువైపే వెళ్తున్నానా?" అని నన్ను నడిపించే (నా జీవిత) మూలాల్ని మరొక్కసారి గుర్తుచేసుకోవడం అలవాటు అయ్యింది.
ఓయమ్మ నీకుమారుడు
మాయిండ్లను పాలు పెరుగు మననియడమ్మ,
పోయెదమెక్కడికైనను
మాయన్నుల సురభులాన మంజులవాణి
I think, మనలో చాలామందికి, చిన్నప్పటినుంచే, మనకి జీవితంలో ఏం కావాలో, ఆలోచించడం మొదలు పెడతాం. అంటే, నా ఉద్దేశం 'మన జీవిత పరమార్ధం ఏమిటి?' అని కాదు. ఎప్పటికప్పుడు, మనకి ఏదోటి నచ్చేసి, నాకిది కావాలి, నేను కూడా ఇలా చేస్తాను, నేనెప్పటికైనా ఇది అవ్వాలి,అనిపించే ఆలోచనలమాట. స్పష్టత లేకపోయినా, అవే ఆ తర్వాత నచ్చకపోయినా, ఇంకేవో ఎక్కువగా నచ్చడం మొదలైనా, వాటిని పొందడానికి మనం ప్రయత్నించక పోయినా, ఇలాంటి ఆలోచనలు కలగడం ఐతే సామాన్యమే (అనుకుంటున్నా). కానీ, కొంతమందికి చాలా చిన్నప్పుడే, జీవితం చివరి వరకు నడిపించేంత గట్టి ఇష్టాలు ఏర్పడినా ఆశ్చర్యం లేదు. మనం చాలా మంది interviews చూసినప్పుడు, ఎంతవరకూ నిజమో తెలియదు కానీ, వారి ఇప్పటి స్థితికి, చాలా చిన్నప్పుడే పడిన బీజాల గురించి చెబుతూ ఉంటారు. ఈ మూలాలు అంతటి అమూల్యమైనవి అనమాట. నేను celebrityని కాకపోయినా, interview ఇవ్వకపోయినా, మనందరం మన జీవితాలని నడిపించే మూలాలని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోవడం మంచిదని అనిపించి, పైగా, ఇవాళ అలాంటి ఒక అవకాశం, అవసరం వచ్చింది కాబట్టి, ఆ పని చేస్తున్నా.
చాలా చాలా తక్కువమందికే దక్కే అదృష్టం, అవకాశం నాకు దక్కింది. అదేంటంటే, నాకు మా నాన్న, వాళ్ళ నాన్న, అంటే మా అబ్బ కూడా చదువు చెప్పారు, నా చిన్నప్పుడు. మా ప్రాంతంలో, తండ్రివైపు తాతని అబ్బ అంటారు. అవును, నేనంటోంది, జీవితంలో పాఠాలు కాదు, తరగతి గదిలోపాఠాల గురించే. నేను మాఊరి high school (ఉన్నత పాఠశాల)లో చదువుకున్నపుడు మా నాన్న, primary school (ప్రాథమిక పాఠశాల)లో ఉన్నపుడు మా అబ్బ (ప్రయివేటు masterగా) నాకు చదువు చెప్పినవాళ్లే. నేను పుట్టిన 3 రోజులు అటుఇటుగా మా అబ్బ మా ఊరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదవీవిరమణ చేసాడంట (verify చెయ్యలేదు, చిన్న జ్ఞాపకం అంతే). So, బడిలో పాఠాలు చెప్పలేదు, కేవలం ప్రయివేటులోనే. దాదాపు పాతికేళ్ల నా సుదీర్ఘమైన academicsలో, నాకు చాలా మంది మంచి ఉపాధ్యాయులు ఎదురుపడ్డారు, అది ఇంకో అదృష్టం, ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. మళ్ళీ, distract అయ్యేలోపే, మూలాల దగ్గరికి వద్దాం. విషయం ఏంటంటే, నేను ఉహించుకుంటున్న, తద్వారా నిర్మించుకుంటున్న నా జీవితానికి, మూలాలు, నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు మరియు వారు నాపై వదిలిన ముద్రలు. అలా నన్ను ప్రభావితుణ్ణి చేసిన చాలామంది ఉపాధ్యాయుల్లో, మొదటివాడు మా అబ్బ. అవును, నేనోదో sentimentalగా ఉంటుందని చెప్పడంలేదు, నిజంగానే అయన నన్ను influence చేసిన teacher. మా అబ్బ అవడంవల్ల తరగతి పాఠాలతో పాటు, బయటకూడా నేను ఆయనతో గడిపిన సమయం గుర్తుండి పోయింది. ఇవాళ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం, కాబట్టి, నా బాధ్యతగా నా గురువుల్ని తలచుకొని, నాకు ఒకానొక ఆత్మీయ గురువు, ఇంకోరకంగా, తొలి గురువు లాంటి మా అబ్బని మరింత దగ్గరగా (zoomలో) తలుచుకునే ప్రయత్నం చేస్తున్నాను.
చిన్నప్పటి నుంచి, మావూళ్ళో మరియు చుట్టుపక్కల ఒకటి రెండు దగ్గరి పల్లెల్లో కూడా, మా cousins అందరికి గుర్తింపు, 'భైరవ కొండా రెడ్డి ఐవారు మనవళ్లు'గా, మా అబ్బ పేరుమీదే. అప్పట్లో, కొన్నిచోట్ల ఇప్పటికి, teachersని అయ్యవారు (ఐవారు) అనేవాళ్లు, గుళ్లో పూజారుల లాగ. మరియు, సమాజానికి teachers అంటే భయభక్తులు సమపాళ్లలో ఉండేవి. నా పేరుకూడా అయన పేరుమీదే రావడం (పెట్టడం కాదు) జరిగింది, అదంతా ఒక పెద్దకథ (కొంచెం ఇక్కడ ఉంది). అయన ఏమి చదువుకున్నారో నాకు తెలీదు, కానీ, నాకు తెలుగు, లెక్కలు చెప్పారు, English కూడా (నేను ఉన్నత పాఠశాలకి వచ్చాక). ఆ తర్వాత 'తెలుగు పంచాంగానికి primer' లాగా, పంచాంగం అంటే ఏంటి, ఎలా చూడాలి లాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేర్పించాడు. అయన పెళ్లి ముహుర్తాలు నుంచి, శంకుస్థాపనల వరకు చాలా చేయగలడు. మా ఊర్లో, గొల్ల అన్నదమ్ములు కట్టుకున్న పెద్ద మేడలకి శంకుస్థాపన చేస్తున్నప్పుడు, పడమటి దాని ఆయుస్సు (97 సంవత్సరాలు అని జ్ఞాపకం) calculate చేసింది నేనే, అయన సమక్షంలో, అప్పుడు నా వయసు ~10. చెప్పానుగా, he was my teacher in many ways. నాకు Englishలో articles (a, an, and the) విశదీకరించి చెప్పింది కూడా ఆయనే. ఎక్కడ శంకుస్థాపన, ఎక్కడ ఆంగ్ల వ్యాకరణం. ఇలాంటివి చాలానే.
తెలుగులో చల్దులారగించుట అనే పాఠం ఒకటి ఉండేది. అందులో, శ్రీమద్భాగవతం నుంచి శ్రీకృష్ణుని బాల్యంలోని కొన్ని లీలలు ఉండేవి. ఆ సందర్భంలో కింది పద్యం వచ్చింది
మాయిండ్లను పాలు పెరుగు మననియడమ్మ,
పోయెదమెక్కడికైనను
మాయన్నుల సురభులాన మంజులవాణి
చాలా సులభమైనదే, అంతా అర్థమైనట్లే ఉంది, సురభి అంటే ఆవు అని, ఆన అంటే ఒట్టు అని, కానీ, 'మా అన్నుల' సురభులు దగ్గర ఆగిపోయా, అక్కడే నాకు మా అబ్బకి చర్చ start అయింది. ఎక్కడనుకున్నారు, ఇంటి బయట, మా చిన్నాన్న park చేసిన ఎడ్లబండి కాఁడిమ్రాను మీద నేను seesaw ఆడుతూ ఆయనతో వాదిస్తున్నా, ఆ చివరి పాదం గురించి. ఆయన నడవలోనుంచి, "కాదురా, అన్నల ఆవులు, తమ్ముళ్ల ఆవులు కాదు, అన్నుల సురభులు అంటే, ఇష్టమైన ఆవులు అని అర్థం" అంటున్నాడు నవ్వుతూ. అబ్బే, నాకు పూర్తిగా అర్ధమైనట్లు లేదు (వాళ్ళ అన్నల ఆవుల మీద ఒట్టువేయ్యడం ఎందుకు? వాళ్ళకి ఆవులు ఉన్నాయిగా అనే ఆలోచిస్తున్నా, kiddish :-) ). అలానే ఉండిపోయింది. చాన్నాళ్ళకి, చంటి సినిమాలో 'అన్నుల మిన్నల, అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే' అనే పాట వినేప్పుడు, ఓరినీ, ఇదేకదా అప్పట్లో, అర్థంకాలేదు అని అనుకున్నా, అయన చాలా కష్టపడ్డాడు పాపం చెప్పడానికి అని. ఆ తర్వాత, ఆ పదం ఎక్కడ వచ్చినా, ఈ సన్నివేశం గుర్తుకొస్తుంది నాకు.
చాలామందే చదువుకునేవారు అయన ప్రయివేటులో. అందరం math puzzles, పొడుపు కథలు, ఇలా చాలానే నేర్చుకున్నాం. మా జేజి (నాయనమ్మ) అంటే మాత్రం పిల్లలకి హడలు, నెల మొత్తం ఎవర్నో ఒకరిని ఫీజు అడుగుతూనే ఉండేది, నన్ను కాదులెండి, మిగిలిన వాళ్లనే.
మా అన్నకి, కదిరిలో coaching తీసుకున్నాక, లేపాక్షి నవోదయ schoolలో seat వచ్చాక, నాకు (రాములయ్యగారి ప్రసాద్ గాడితో కలిపి) తానే, ఇంటి దగ్గరే coaching ఇచ్చి, exam crack చేయించాలని గట్టిగానే ప్రయత్నం చేశాడు పాపం. మాకున్న matterతో అదో సాహసమే అని చెప్పుకోవాలి. అయినా, ప్రయత్నించిన అయన సాహసం గురించి నేను మర్చిపోలేను. ఉత్తమ ఉపాధ్యాయునిగా ఆయనకి ఇంకెవరో అవార్డు ఇవ్వడం ఎందుకు, నేనుప్పుడో ఇచ్చేశా, ఆయనకున్న అంకితభావానికి. పులివెందులలో ఆ పరీక్ష రాస్తుంటే, this is true story, no kidding, ఆ invigilator, hall ticketలో నా పేరు చూసి (ఇంటి పేరుతో కూడా ఉంటుంది కదా) ఊరిపేరు అడిగికనుక్కొని, 'ఐవారు మనవడివా?' అని అడిగాడు. Exam అయ్యాక, రోడ్డుమీద ఆయన మమ్మల్ని చూసి, దగ్గరికొచ్చి పలకరించాడు మా అబ్బని, తెలిసిన వాడంట. ఇవన్నీ కేవలం accidents ఎందుకు కాదంటే, వాటి ప్రభావం అంతటితోనే మాసిపోకుండా, ఇన్నేళ్ళుగా నాలో ఇంకా బ్రతికే ఉన్నందుకు.
మనిషి వయసొచ్చాక చాలావాటి వెంట పరిగెత్తినా, ప్రపంచం తెలియని పసివయసులో మనమందరం వెంటపడేది 'ఏంటో ఇది, తెలుసుకుందాం' అనే జ్ఞానంకోసం. చుట్టూ అంతా కొత్తదైన సృష్టిలో, తెలియజెప్పి, మనలోని కుతూహలాన్ని (curiosity) తృప్తి పరచి, ప్రపంచం ఎంతో తెలిసిందనిపించి, ఇంకొంచెం తెలుసుకుందామనే కోరిక రగిలించే ఉపాధ్యాయులందరూ ధన్యజీవులే, మా అబ్బతో సహా!
ఏ స్థాయిలో విద్యగరిపినా, ఉపాధ్యాయులందరూ ధన్యజీవులే, కానీ, మూలాలు ఏర్పర్చిన ప్రాథమిక గురువులు ప్రత్యేకంగా ప్రాత:స్మరణీయులు కదా!
ఆ తర్వాత్తర్వాత మానాన్నతో కలుపుకొని, నిన్నమొన్న video lecturesలో బోధించిన పరిచయమేలేని ఆచార్యుల వరకూ ఎందరో మహానుభావులు, అందరూ గొప్పవారే నాకు. వారందరూ నా కలల జీవితానికి మూలాలు. నామటుకు, ఒక వయసు వచ్చాక తారసపడిన, విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో లోతైన విషయాలు బోధించే ఆచార్యులకన్నా, ఎక్కడో ఒక సాధారణ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పిన ఉపాధ్యాయులే నా జీవితాన్ని ఎక్కువ ప్రభావింపజేయ గలిగారేమో. ఎందుకంటే, వీరు పైనుండే శాఖల లాంటి వారు, మరి వారేమో వేరు మూలాలలాంటి వారు.
super
ReplyDeleteSuper darling
ReplyDeleteI thank my private teacher (Ramana Murthy Sir).
ReplyDeleteబహు బాగుంది రా కొండారెడ్డి..
ReplyDeleteVery nice and heart touching memory MKR . The way you expressed about basic roots of life in telugu is extraordinary.
ReplyDeleteVery nice and heart touching memory MKR . The way you expressed about basic roots of life in telugu is extraordinary.
ReplyDelete👌👏
ReplyDeleteచాలా బాగా express చేశారు Mr. K. నిజమే, చిన్నప్పుడు mind లో ముద్ర పడిపోయినవి జీవితాంతం గుర్తుంటాయ్. మన ప్రవర్తనలో మనకి తెలియకుండానే వాటి ప్రభావం ఉంటుంది. :)
ReplyDelete