Friday, November 22, 2013

నూటొక్కటి !!


కృష్ణశాస్త్రి వారికి ఆ యొక్క అప్రాప్త మనోహారిణి ప్రసాదించిన
                                               హృదయ దళనములొక్క శతము,
అరుదెంచిన జగద్పతిని అలుకబూని తాచిన సత్యభామ ఆపై  సైచిన
                                               వేదనయందొక్క సహస్రాంశము,
ఇవి,
ఊహించని నిన్నటి మీ దర్శన భాగ్యమున మాకొరిగిన వరవిశేషములు!!

Monday, November 18, 2013

ఉన్నాను వేచి !!


నీ రాకకై రోజులు వేచి,
హృదయాన కవన లతావితానముల పెంచి,
విరహపు విరులు పూయగా తుంచి,
నీవొస్తావని దారంతా పరచి,
మాలగా కూర్చి,
తోరణాలు తీర్చి,
ఉన్నాను వేచి,  నీకై కాచి !!
                           -/2/11.

పాపం, She broke-up with him !!


పిలుద్దామనుకుంటాను, పలకవేమొనని ఆగిపోతాను.
కలుద్దామనుకుంటాను, కరగవేమొనని కదలిపోతాను.
కవన కన్నీళ్లతో కాగితంపై ఇలా కాలమంతా కుమిలిపోతాను !

మరువ యత్నిస్తాను;
విఫలమేనని తెలిసినా,  మరళ మరళ యత్నిస్తాను. 
మది గది తలుపుల తరలే నీ తలపుల తరంగిణిలో ఇలా తరలిపోతాను !!
                                                                    -/9/10.