Tuesday, October 17, 2017

"ఇది" ఐ లవ్యూ కాదు; అంతకు మించి!

ఎన్నిసార్లు చెబుతారు? "I Love You" అని. Bore కొట్టడం లేదా? ఇంకేం చెప్పలేమా? కొత్తగా, ఇంకొంచెం మెత్తగా, హత్తుకునేలా?

మరదే కదా జీవితం. కాదా ?
పార్కులా పరిమితంగా కాకుండా, అడవిలా అమితంగా జీవించాలన్నారుగా పెద్దాయనొకరు. కొత్తగా, creativeగా చెబుదాం.

ఓసారి seriousగా ఏడుద్దాం, (పర్లేదు, మనం కూడా ఏడొచ్చు). ఏడుపు చివర్లో చెబుదాం, ఇది కూడా "I Love you" లాంటిదేనని. కాదు, కాదు, అంతకన్నా ఎక్కువని. మరి మనం ఎవరి దగ్గర ఏడ్చాం గనక. ADలు ఏడెనిమిది ఏశాక, close friends దగ్గర కూడా ఏడవలేదే. మరది, మనం చెబుతున్నది.

Camp కెళ్లిన రోజు, reach అయ్యాక call చేసి చెప్పలేదని, మనమే call చేసి కోప్పడదాం. అవసరమైతే, కొట్లాడదాం. అంతా అయ్యాక, పడుకునే ముందు, "Bore కొడుతోంది, తొందరగా వచ్చేయ"మని message పెడదాం. Poetry లేకుండా, చాలా plain పదాలు వాడినా, పని జరిగిపోద్ది. Feeling అలాంటిది.

Youtube చూసి, కొత్త వంటలు నేర్చుకోమనడమే కాకుండా, జీవితానికి ఉపయోగపడే శానా సమాచారం వైపు చూసేలా encourage చేద్దాం. ఆ టూబేదో మనమే చూసి, ఎప్పుడన్నా పండక్కి, ఓ తాలింపు వండి తినిపిద్దాం. అంత శ్రమపడకపోయినా, simpleగా, ఓ Sunday, గోదావరిలాంటి సినిమా పెట్టి, ఆనంద్ లాంటి కాఫీ కలిపిద్దాం.

(ఇది ఆడోళ్లకి)
ఎప్పుడూ, జీతాలు పెంచే జంపులెయ్యమనడమే కాకుండా, జీవితాన్ని ఆస్వాదించేలా సహకరిద్దాం. ఆ జీతాలు తగలేసే Shoppingలు తగ్గించుకుందాం. Seriousగా ఓ Saturday, match ఆడమని అడుగుదాం. చూడ్డానికి మానమూ వెళ్దాం.

ఇలాగే అని కాదు, ఏలాగైనా.

కళ్లు ముసుకుని, మనసు తెలుసుకొని చూడాలేగానీ, సహస్రం దొరుకుతాయి, సరికొత్త మార్గాలు.

అదనమాట, ఆ నా "ఇది".