అదేదో చిరునవ్వు లాగా...నే ఉంటుంది.కానీ Actualగా చిరునవ్వు కాదు.
మొదట్లో కళ్లతో నవ్వుతోందేమోలే అనుకునేవాణ్ణి, అట్టే తెలిసిపోయింది, అదికూడా కాదని.
అబ్బే, ఇదేదో Abstract material అనుకున్నా, అందువల్లే అందంగా ఉందేమో అని కూడా అనుకున్నా.
కానీ, చాలా తేలిగ్గా(అంటే lightగా అనమాట), నెమ్మదిగా, చల్లగా ఉంటుంది. And భలే మెల్లగా గిల్లుతుంది కూడా.
simpleగా (క)అనిపించే గొప్ప సంపద అనమాట, మట్టితో చేసిన దేవుడి విగ్రహం లాగ.
తనకి తెలీ...కుండానే దోచుకోవలని నా(కళ్ల)కెంత ఆరాటమో ?!
తను hi చెబుతున్నపుడు చూడాలి(నాకే లెండి), "పోలా, అద్దిరిపోలా ?!" అనిపిండేస్తుంది, మళ్లీ 'అదే'.
ఆస్తులే..మక్ఖర్లేదు, అది చాలు.
రాత్రి(?) మూడింటికి పడుకున్నా, మళ్లీ పొద్దున్నే తొమ్మిదింటికి lab కొస్తుంటే, నేనెంత హార్డు వర్కరో అనుకుంటున్నారు మా జనాలు, పాపం ఎనిమిదింటికి mess లో మళ్లీ 'అదే' అని తెలీక.
పదో తరగతిలో తెలుగు వ్యాకరణం అర్థంకాలేదని ఏడ్చినట్టు గుర్తు (ఎవరూ చూడకుండా లెండి !!) , ఆ తర్వాత అర్థం కాకుండా అంత పని చేయిస్తోంది మాత్రం 'ఇదే'.
శాలా సూశామంటారేమో, పర్లేదు అలాగే బతికెయ్యండి, ఇటేపు రాకండి, ఇది మాత్రం నాకేనాకే.
కళ్లు కలిపినపుడు కదా, 'దాని' అసలు పనితనం;
ప్రపంచానికం....తటికి ప్రాణాలు పోయి, ఆ మొత్తం వచ్చి నాలో పొంగుతాయ్.
(ఇంకో మొత్తం ఇంకెక్కడైనా పొంగుతోందేమో అని నా అనుమానం, మీరేం entertain చెయ్యకర్లేదు).
No comments:
Post a Comment