ఎప్పుడూ mess మూలల్లో ఒంటరిగా మురిసిపోడానికి అలవాటుపడిపోయిన మనసుకి మొన్న bumper offer తగిలింది. Enter అయ్యి, queue ఎలా ఉందో అని line వైపు చూసే సరికి చివర్లో కనిపించింది మన చూడిదార్. మరాపూటకి చేతులు కడగలేదు,ఈ లోపు ఎవరన్నా join అవుతారుగదా.
దగ్గరికి నడుస్తున్నకొద్దీ,
నే చూస్తున్న తన పాదాల (నిజంగానే) resolution పెరుగుతున్న కొద్దీ,
body లో ప్రతి cell dehydrate అయ్యేలాగా vibrate అవుతున్న కొద్దీ,
అణువణూవూ పొంగిన అమృతంతో వికసించిన ఈ నాయొక్క నేను, oh....!, I love him, మా ఊరి కోటలో కొలువున్న కోదండ రాములవారు కోప్పడినా (తన పాదాలనైనా ఇంతగా ధ్యానించలేదని).
శ్రీ సూర్యా మూవీస్ వారి telugu dubbed tamil సినిమా పాటలు తొలిసారి ఆలకించినప్పుడు,
straight drive four కొట్టినపుడు హుందాగా అభినందించే రాజేష్ అన్న లాంటి bowler తో ఆడినపుడు,
half-boiled omlete తో సంతకం (Signature) తీసుకున్నపుడు,....
ఇలాంటి listకి ఈ feeling కూడా append చేస్తూ..... ఉన్నాను,
ఈలోపు ఎక్కణ్నించీ వచ్చారో తెలీదు, ఈ భావకవులు మనసులో పడి బావులు తవ్వేస్తారు.అదో రాయలవారి సీమ, రాళ్లే దొరుకుతాయ్, రత్నాల్లాంటివి.
చపాతీల దగ్గర ఎప్పుడూ late చేసి చిరాకు పెట్టే mess వాడు, ఈ పూటకి మన friend .వాడి దయవల్లే line ఆగిపోయింది మరి.
ఇంతలో, "అందమైన వేళ్లు, మకుటాల్లాంటి గోళ్లు" అంటూ ఎక్కణ్నించో గోకుతాడు శివగణేశ్. మరి వాటి అందమటువంటిది.చూస్తూ సచ్చిపోవచ్చు.
కేవలం ఆ పాదాల్ని పెళ్లి చేసుకొవచ్చు.<చిరాగ్గా మొహం, మీదే లెండి>"పాదాల్ని పెళ్లి చేసుకొవడమేంటా"?
మరదేగా చెబుతోంది, పిచ్చెకిస్తాయని.
ఆ కాశీ తాడుంది జూశావూ,కళ్లని కట్టి పడెయ్యట్లేదూ...!
కళ్లు తిప్పుకోడానికి నేపడిన కష్టముంది జూశావూ,
wait wait, కాశీనాథుని విశ్వనాథ్ చూపించాక చూశారంటే, ఇప్పటికిప్పుడో నంది ఇచ్చేస్తారు, ఇలా... retire అయిపోయినా, ఇంకో ముప్పయ్యేళ్లకి Life time achievement అందిస్తారు.మరా freshness అటువంటిది.
ఇంతలో, అదేదో జలియన్ వాలాబాగ్ లో ఉన్న మమ్మల్ని జాలిగా చూసి, గేటు తాళాలు విసిరి నట్లు ఓ ముప్పయ్ చపాతీలు తెచ్చి పడేశాడు, ఆ mess వాడు.
అవో రెండేసుకుని వెళ్తున్న తనని చూసి, నాలోంచి ఇంకో నేను బయటికొచ్చి తనన వెనక వెళ్లట్లేదేంటా(ప్చ్, అదే, సినిమాల్లో హీరోయిన్, హీరో ని cross చేసి వెళ్లాక వాడిలోచి ఇంకోడు బయటికొచ్చి తనని follow అవుతాడు గదా, అలాగ..) అనుకుంటూ, ఓ మూడు చపాతీలు వేసుకుని ఓ మూలకెళ్లాను, చాలా మామూలుగా.
(సశేషమో, నిశ్శేషమో. చెప్పలేం )
makutallanti gollu ani cheti vellaku vadochu... kani kaali gollu penchukoru kada.. may not be apt emo kada..
ReplyDeleteagreed.
Delete