తెలుగు ప్రేక్షకుల సౌకర్యార్థం, రాజమౌళి, చంబల్ లోయలో జరిగిన కథని తెలుగులోనే చూపించినట్లు, నేను మొన్న సెల్ ఫోన్లో, English లో టైప్ చేసిన సీన్లని తెలుగులోనే రాస్తున్నాను, చదువుకోండి.
Sunday కదాని, తనకో good morning message forward చేసి, ఈనాడు పేపర్ చదువుతున్నాను.
నిముషంలోపే reply వచ్చింది. open చేశాను.
"ఇంతకీ నేనెన్నోదాన్ని?"
అర్థంగాక, sent messagesకి వెళ్లి, పంపిన message ఒసారి చూసుకున్నా.అదో మామూలు morning message .
ఎక్కడో కొడుతున్నా, పొరపాటున పంపిందేమో అనుకుంటూ, "అబ్బే అర్థంగాల!!" అని పంపి champion పేజి open చేశాను. ఈ sachin retirement గురించి రాసేవాళ్లని చంపేయాలనుకుంటుండగా, నా korea mobile మోగింది, "అదే, నీ list లో నా నంబరెంత?" అని .
ఇపుడు కొద్దిగా అర్థమౌతున్నట్లే ఉన్నా,
"నా list తెలిసిందే గా ,అమ్మ నాన్న, అన్న నువ్వు, నీ దయవల్ల ఏమైనా కలిగితే ఈ list కి append చేసే ఆలోచన కూడా ఉంది :P , అయినా ఇవ్వన్నీ ఎందుకిప్పుడు?" అని పంపి, దాన్ని silent చేశాను.
ఈసారి "నువ్ Blog రాస్తావా?" అని reply.
ఓహో ఆ title లేని trailor ఈ సినిమా దా? అనుకుంటూ
"ఆ, అప్పుడప్పుడూ; ఎవరు చెప్పారు?"
"నువ్వెందుకు చెప్పలేదు?"
"చెప్పకూడదనేం కాదు, అలా...అంతే!" ఈ ఆదివారానికేదో అయ్యేట్లే ఉందనుకుంటూ అందమైన android లో send ని touch చేశా.
5 నిముషాలైనా mobile vibrate అవ్వకపొయేసరికి,నా mobile కి రావాల్సిన vibration నాకు మొదలయ్యింది.
"ఇంతకీ ఎవరు చెప్పారో చెప్పలేదు" అని ప్రయత్నం చేశా.
"ముందు నాకెందుకు చెప్పలేదో చెప్పు!!"
"నేను తెలుగులో రాస్తానుగా అందుకని, మా అత్తగారి భాష నేర్చుకుని, నీకొక love letter రాసి post చేద్దామనుకున్నాను. ఇంతలో నువ్వే తొందర పడ్డావ్..!, అయినా అదేమంత పెద్ద విషయం కాదుగదా !!"
"అంతేనా, నీ పాత love story ల గురించి తెలిసిపోతుందనా?"
Ready, reverse swing మొదలయ్యింది .
ఇంతకీ, దీనికి రాత్రికి రాత్రి దొరికిన ఆ భువన చంద్ర ఎవరో కనుక్కోవాలి అనుకుంటూ (రాత్రి 7గంట్లప్పుడు laptop లో alaipayuthey చూస్తున్నా అని message పెట్టిందిలెండి, అంటే అప్పటి వరకూ బానే ఉందికదా !!)
"అవి love story లేంటి? ఏదో time pass కి రాసుకున్నవి, comedy గా"అంటూ defence మొదలుపెట్టాను.
"ఆహా, చాలా simple and charming గా అబద్దాలు కూడా చెప్పగలరు sir మీరు!"
sir ఆ, ఎన్నమ్మా, sledging also started ఆ.....! అన్నుకుని,
"ఏయ్, నిజంగానే అవన్నీ comedy గానే రాసినవి, అయినా, ఆ translate చేసిన వాళ్లు చెప్పలేదా funny గానే ఉన్నాయని?"
"ఆ, చెప్పారు, చెప్పారు, tenth class నుంచీ మీ పోరాటాలన్నీ చెప్పారు"
"కరక్టే, అవన్నీ కేవళం నా పోరాటాలే తప్ప,అందులో నీ ఆరాటానికేమీ అర్థం లేదు. ఆ time ని గుర్తు చేసుకోడానికి నేనెంచుకున్న ఒక మార్గం ఆ blog, అంతే"
మీరు చదువుతున్న screen మధ్యలోంచి I,L,N,A,T,V,E,R అక్షరాలు ఒక్కొక్కటే వచ్చి ఒకటి ఎడమవైపుకి, ఒకటి కుడి వైపుకు వెళ్లాయనుకోండి, ఏమౌతుంది?
ఇపుడు అదే అయింది అనమాట !!
No comments:
Post a Comment