Mopuri K Reddy's
మనసు మథనతో మలచిన మాటల మూటలు మేరువులైనా, తనివి తీరదు .....!
Monday, September 26, 2011
తన లెక్కలు
కంటి నవ్వులు > వెన్నెల వరదలు,
పెదవి పలుకులు - చిలిపి చిలుకలు=0,
కాలి అడుగులు ≃ వలపు పిలుపులు,
మేని సొగసులు ≡ విరగబూసిన అడవి పూలు.
Wednesday, September 21, 2011
ఇక్కడంతే, ఇది బెంగుళూరు...!
వెలసి పోయిన వరుస రోజులు,
కురిపించును కరెన్సీ రాశులు;
పనితోనే పరిగెత్తును పగళ్లు,
మనకైనా పట్టదు మన ఒళ్లు;
ఏమంటే,
ఇక్కడంతే, ఇది బెంగుళూరు...!
Tuesday, September 20, 2011
కళకళ-విలవిల
ఎలుగెత్తి చాట ఏమున్నది ?
పేట పేటకో అవినీతి పాటగాక,
పూటపూటకో పాపపు మూటగాక;
ఓహో.....,
మనచరితపు ఘనకీర్తుల...., ఘనుల భుజకీర్తుల కళకళలా ?
మానహీన వర్థమానపు వర్తులంలో(ఇవాల్టికి ఓఎంసి గనులల్లో) చూడు వాటి విలవిలలు....!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)