నువు సంపాదించుకునే ధన'మది'
నువు సాధించుకునే నిధాన'మది'
నువ్వెంతగానో ఇదయ్యే ను'వ్వది'
నిన్నే పెట్టుబడిగా పెట్టి పొందే ప్రతిఫల'మది'
'అది' అనర్ఘమైనప్పుడే నువు అమూల్యమయ్యేది
నువు చూడని పెళ్లిల్లు, చేయని పండగలు 'అది'
ఆడని Matchలు కూడా 'అదే'.
మరి చూస్కో, 'అదె'లా ఉండాలో....!
సమయాన్నంతా వెచ్చించి తెచ్చుకునే 'అది', తేలిపోతే,
నీ సమయానికేదీ ఇది,
మరొక్కసారి చూస్కో, 'అదె'లా ఉండాలో,
ఇంక చేస్కో అందంగా 'అది'.