బెంగుళూరు,
13/8/13.
13/8/13.
ఇదిగో నిన్నే,
ఎన్నెల్లో ఆడుకునే ఆడపిల్లల్ని నేంజూల్ల (నీకసైన్మెంట్లతోనే తీరిక లేదనుకుంటాలే, ఇంక ఆటలేమాడుకుంటావ్ !),
వర్షంలో తడిసే సంద్రాన్నీ నేంజూల్ల (గొడుగున్నట్టుందిగా మనకు),
నడిరాత్రి సంద్రపు సడిగూడ నేనిన్ల (మాటాడి సస్తేగా ఎపుడన్నా; నన్నేలే!!).
పాలకడలి కెరటాల్నేంతాకల (ఆ నీ చెప్పులేంజేసుకున్నాయో గదా!),
పైడి కొండన్నేంతడమల (ఆ చూడిదార్ సంగతేం చెబుతాం!!),
ప్రబంధాల్నీ నేన్జదవల (పన్జరిగితే, చదవడమేం ఖర్మ, నేనే ఓటి రాహేద్దును గదా!!!)
"ఐతేంట"ంటున్నావా ?? చెబుతున్నా, సదువుకో,
నీ నడక (ఓ రెండడుగులంత) రేపిన రచ్చలో, (Actualగా, ఒకడుగనే రాద్దును, కానీ, అడుక్కీ అడుక్కీ, మధ్యన, నడక్కే అందం తెచ్చే ఓ చి.....న్న pause ఉంటుంది జూశావు, అదొచ్చి నా కళ్లలో కూచుంది. తన గురించి రాయక పోతే సంపేస్తానంటోంది.) బయల్పడిన పై నా దౌర్భాగ్యాన్ని, ప్రపంచానికి ప్రదర్శించుదామని ఈ నా ప్రయత్నం.
"ఐతే నాకు రాయడమేంటం"టున్నావా?
అయ్యో అమ్మాయీ!!, నువ్వేగా మరి నా ప్రపంచం.
నీ
నేను