సినిమాలూ,నవలల్లోనన్నా లవ్ సీన్లు చూన్నీవేఁ నన్ను,
చూసేంతవరకూ ఓటి, చూస్తున్నంత సేపూ ఇంకోటి, చూశాక మరో.....బాధ. సంపుతున్నావుగదే...!
అసలు ఏ ఉద్దేశంతో మొదలెడతానోగానీ,
చూస్తున్నంతసేపు నా లోపలి అవ్యక్తాస్పష్ట శూన్యం నా రక్తమాంసాల్ని మరింత తిని, తను విస్తరిస్తున్నట్లు తోస్తుంది.
కసిగా, కనీ...సం కనికరమైనా లేకుండా, ఆ కోల కళ్లతో కాటేసినపుడే కక్కుదామనుకున్నా, కుదర్లేదు.
ఆ నీ అందమైన అడుగుల్లోని అమాయకత్వానికి అమ్ముడుపోయినప్పుడైనా అందామనుకున్నా, అవలేదు.
ఇపుడు చెబుతున్నా విను, ఆ నా శున్యం మొత్తం నిపాల్సిన భాధ్యత నీదే, (మరీ...'అమ్మాయ 'కంగా చూడకలా , నేనూ సాయంజేస్తాలే.....! !!)