పిలుద్దామనుకుంటాను, పలకవేమొనని ఆగిపోతాను.
కలుద్దామనుకుంటాను, కరగవేమొనని కదలిపోతాను.
కవన కన్నీళ్లతో కాగితంపై ఇలా కాలమంతా కుమిలిపోతాను !
మరువ యత్నిస్తాను;
విఫలమేనని తెలిసినా, మరళ మరళ యత్నిస్తాను.
మది గది తలుపుల తరలే నీ తలపుల తరంగిణిలో ఇలా తరలిపోతాను !!
-/9/10.