Tuesday, December 8, 2015

మంచింగ్ మాటలు - రెండో పొట్లం!!



ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తానని అనుకుంటున్నావు కదూ!
లేదు లేదు, నువ్వు లేని నాగురించి జాలిపడతాను. నీకంటే ముందే నన్ను ప్రేమించడం మొదలుపెట్టానుగా మరి!!

--------------------------------------------------------------------------------------------------------------------- 1

ను"వ్వెలా" ఉన్నావో రాయడం నా ఉద్దేశం కాదు, "అలా" ఉన్నావేంటని మాత్రం అడుగుతాను, అప్పుడప్పుడు.

--------------------------------------------------------------------------------------------------------------------- 2

ఒకడు: ఎప్పుడూ "అమ్మాయి" గురించేనా, "అమ్మ" గురించి కూడా చెప్పరా ఓసారి. నాకోసం.

<<<<<<<<       నేనేదో చేస్తున్నా      >>>>>>>>

ఇంకోడు: ఏంట్రా, బానే కూచున్నావ్‌గా ఇంతవరకూ, ఇప్పుడు సర్దుకుంటున్నావెందుకు?
నేను: అమ్మ గురించి అంటున్నారు కదా! ఒళ్లు దగ్గర పెట్టుకుంటున్నా.
మొదటివాడు: థ్యాంక్స్ రా!

--------------------------------------------------------------------------------------------------------------------- 3

Tuesday, March 24, 2015

నా కల


నాకు పుట్టిందే. నా రక్తమాంసాలు తిని బతుకుతుంది.
కానీ, నన్ను బ్రతికిస్తుంది.

Monday, March 23, 2015

కల



ఏది నేనో?, ఏది కానో?
నాదేదో?, కానిదేదో?
తెలుసుకోడానికి ఇరవయ్యేళ్లు నిజంగా సరిపోతాయా?
నాకైతే ఇప్పటికీ అనుమానమే,
నాకేం కావాలో?, నేనేం ఇవ్వగలనో?

ఇండియాలో ఇంజినీరయ్యాకే
జనాలు ఏదోటి అవ్వాలని అనుకోవడం మొదలెడతారంట!
నేను ఇంజినీరయి అఫిషియల్‌గా ఆరోఏడు.

కాలిబాటనొచ్చానో,
గాలివాటునొచ్చానో
ఇంకా వెదుక్కుంటున్నా,
నాలోపలే, చీకట్లో. 

ఇంతలో,
అల వైకుంఠపురంబులో, ఆమూల సౌధంబులో..,
అన్న చందంగా,
ఎప్పుడో సంచరించినట్ల నిపించిన ఏదో మూలన,
నూనెలేనట్లు అలమటిస్తున్న దీపమొకటి అగుపడితే, అటెళ్లా.

నే వెలిగించినదే, నేనూ గుర్తు పట్టా.
గుర్తొచ్చింది, తరచూ ఇక్కడికి వస్తూ ఉన్నట్లుగా.

కానీసారి కొత్తగా,
ఆ దీపం బాధపడింది, మళ్లీ వచ్చేసరికి తానుండదేమోనని; 
నాకు భయమేసింది. 

అంతలోనే మెలకువొచ్చింది, కానీ భయమాగలేదు.

(తెలుగు తోట 2015లో ప్రచురించబడింది)