ఈ seriesలో "ఇదో" outlier అవుతుందేమోనని అనుమానమున్నా, ఎవరో ఒకరు చదువుకునేలా, కనీసం ఇక్కడన్నా రాయకపోతే, రాయైపోతానేమోనని రాస్తున్నా.
అంత సింపులేం కాదు, కానీ మంచి శార్మింగ్. ఈపాటికే ఎన్ని "కొండ"లెక్కేసిందోననే అనుమానం కలిగేలా అ(క)నిపిస్తుంది. ఏం మంత్రమో వేసేసింది. (ఏం మంత్రమో తెలీదనేం కాదు). లేకపోతే ఇదేంటి? ఇలాగ అరెష్టయి పోతున్నాను, వరష్టుగా.
పక్కనెవరు కూర్చుంటారో నాకు తెలీదా, కానీ ఎందుకు అడుగుతున్నాను? ఎందుకు పదే పదే పిల్లోన్నైపోతున్నాను? పనెందుకు బాగా చేస్తున్నాను? పొద్దున్నే పరిగెడుతున్నాను (I mean jogging). పనికేసుకెళ్లడానికి puma shoes కొన్నాను.
సింపుల్‌గా పిచ్చెక్కించేంత శార్మింగ్. చెప్పుకున్నాంగా ఆ మంత్రం, బెంగుళూరులోనే బేలూరు చూపించేస్తుంది ఈ బాలిక. ఆపై, నే శిలనైపోయి, ఇలా అక్షరాలు చెక్కుకోవడమే.
బాగా off the trackవెళ్లకుండా, ఈ పూటకి ఇక్కడే ఆగిపోదాం.
చెన్నకేశవా!