చిన్నప్పుడు ఇంట్లోనో, బళ్ళోనో చెప్పినపని చేయకపోతే, "నీకుందిలే, మీ అమ్మ నీకు పెళ్లి చేస్తుంది!", "సోషల్ ఐవారు నీ పెళ్లి చేస్తాడు!" అని భయపెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు, 'కావాలి, కావాలి!' అనుకొని మరీ చేసుకుంటున్న పెళ్లి వల్ల వేస్తోంది భయం.
అవును, పెళ్లంటే ఎవరి నిర్వచనాలు వాళ్లకున్నా, అందరూ నిర్ద్వందంగా అంగీకరించేది, 'అదొక పెద్ద మార్పు' అని. ఉదాహరణకి, ఇకమీద ఎప్పుడు పడితే అప్పుడు, ఏదిపడితే అది తినలేం. ఇంకొకరు తిన్నారోలేదో తెలుసుకొని కూచోడం ఇంతవరకూ అలవాటు లేని పని.
అప్పుడెప్పుడో Steve Harvey చెప్పాడు, "మగవాళ్ళకి పెళ్లయ్యాక, I like *** కాస్తా , we hate *** అవుతుం"దని. ఆ dashలో ఏ బుజ్జిముండని కుర్చోపెట్టాలో అని తలచుకుంటేనే భయమేస్తోంది. "నన్నొద్దు, please, నన్నొద్దు!" అని మనకున్న అన్ని మాం....చి అలవాట్లు, ఇష్టాలు, tasteలు, preferenceలు వేడుకుంటున్నాయ్.
కాళ్ళు చేతులు ఆడటం మొదలైనప్పటి నుంచి ఆడుతున్న Cricketని ఆపాల్సివస్తే? ఇంకేమన్నా ఉందా, ball తగిలి వేళ్ళు విరిగినప్పుడు కూడా ఆపలేదే!
మీసం రాకముందటి నుంచే మొదలైన మరో hobby, 'సౌందర్యారాధన' సంగతేంటి?
పనికిమాలిన పరిచయాలనుంచి, పనిగట్టుకొని మరీ పలకరించే friends వరకూ అన్నీ affect అవుతాయిగా.
అన్నదమ్ముల అనుబంధం సినిమా కాస్తా, దాయాదుల పోరై, కురుక్షేత్రంగా convert అవుతుందా?
వీణపాటలు వినడం కుదరక పోతే? మామ feel అవడూ?
మనకి నచ్చే సొరకాయ, బీరకాయలే వాళ్ళకి నచ్చాలని లేదుగా!
"తల్లా, పెళ్ళామా?" సినిమాకి రోజూ tickets కొన్నట్లే కదా పెళ్లంటే! కాదా?
Sitting settingలకి, సంభాషణలకీ ఇక సెలవా? దేవుడా! సగం జీవితం వాటితోనే కదా మన romancing; మిగిలిన సగం జీవితానికీ సరిపడా promise చేస్తుందా ఈ పెళ్లి? అబ్బే, అనుమానమే సుమా!
నంజుకోడానికి సరైన మాటలు లేకపోతే మనకి టీ-కాఫీలు కూడా సహించవే, ఇకమీద మనం తినే సగంపైగా భోజనాలు కేవలం ఒకే వ్యక్తితో కదా, manage చేయగలమా?
కొండలూ గుట్టలూ ఎక్కలేమా, No more trekking ? Oh my God! మన "Heights are Healthy" ఉద్యమం ఇక ముందుకు నడవదా?
Cycleకి, Bikeకి bye-bye చెప్పాల్సిందేనా? మనకి కారుల్లో ప్రపంచం సరిగా కనపడదే! గాలి తగలందే soul చిక్కదే!
కొన్ని కొన్ని conversationsలో replacement సాధ్యపడని బూతుల సంగతేంగానూ? కొన్నాళ్లే అయినా, వాడకుండా ఉండగలమా? weekend శివగాడో, KKనో call చేస్తే, చాటుగానే మాట్లాడాలా? లేక censor చేయాలా? నా మాటలకి నేనే కత్తెరేయాలా?
హతవిధీ! ఎంతటి కాలము దాపురించునో కదా! వైవాహికములనిన మావంటి స్వేచ్చా జీవులకి వెరపు గాక ఇంకేమి!