ఎప్పటికప్పుడు తండ్రులని outsmart చేశాం అనుకుని పప్పులో కాలేసే కొడుకులు కొంతమందైతే, accidentalగా దొరికిపోయిన కొడులకి తామెంత స్మార్టో చూపించే తండ్రులు కొంతమంది, వెరసి, बाप बाप होता है, बेटा बेटा होता है. అలాంటి కొన్ని real-life smart stories .
------------------------------------------------------
"ఎన్నిసార్లు చెప్పా లక్ష్మీ నీకు! వడ్డించే ముందే నెయ్యి కాచిపెట్టుకోమని, తీరా అడిగిన తర్వాత వెళ్లి వేడిచేసి పట్టుకురావడం అలవాటయి పోయింది నీకు. అందాకా plateలోకి తొంగిచూస్తూ ఉండమంటావా మమ్మల్ని?" కరోనా విధించిన lockdownలో కూడా, మధ్యాహ్నం భోజనాల దగ్గర భార్యమీద తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నాడు శ్రీనివాసరావు. Stove వెలిగించడానికి హడావిడిగా అగ్గిపెట్టె వెదుకుతున్న లక్ష్మికి సలహా ఇచ్చాడు, ఈమధ్యే M Tech పూర్తిచేసిన వాళ్ల ఒక్కగానొక్క కొడుకు అర్జున్, "ఒక lighter కొనుక్కోవచ్చుగా mummy, stove దగ్గరే పడుంటుంది, అగ్గిపెట్టె కోసం అటూఇటూ వెళ్లకుండా".
"అందాకా, వీడి దగ్గర ఉన్న lighter తీస్కో లక్ష్మి, పనికొస్తుంది నీక్కూడా" నింపాదిగా అన్నాడు శ్రీనివాసరావు అర్జున్ ముఖంలోకి చూస్తూ.
తింటున్నది గొంతులో పడేసరికి, ఖల్లుమని దగ్గుతూ తండ్రివైపు షాకయ్యినట్లు చూస్తున్నాడు అర్జున్, తనకేం అర్థం కాలేదన్నట్లు.
"ఆపరా నీ నాటకాలు, పొద్దుటే నీ బ్యాగులో దొరికింది ఈ cigarette lighter. బ్యాగులన్నీ ఖాళీచేసి పైన cupboardలో పడేసినట్లు cutting ఇస్తే కనుక్కో లేరనుకున్నావా?" అని జేబులోంచి తీసి చూపించాడు.
అక్షరాలా తనదే. చేసేదేమి లేక, "అమ్మనా బాబోయ్, ఇంకా జాగ్రత్తగా ఉండాలనమాట నీతో" అనుకుంటూ, అమ్మకి అగ్గిపెట్టె వెదకడంలో సాయం చేయడానికి అన్నట్లు అక్కడి నుంచి లేచి వంటగదిలోకి వెళ్ళిపోయాడు.

సంతోష్ convocationకి Vizag నుంచి బెంగుళూరు వచ్చిన తన family అందరూ evening flightకి return అవుతున్నారు. పొద్దున Convocation అయ్యాక, అక్కడే భోజనాలు అవజేసుకొని, Campus అంతా తిరిగి, అన్నిచోట్లా photos తీసుకొని, Messలో టీ, snacks తీస్కొని హాస్టల్లో తన roomకి వచ్చి ఒక్కొక్కరే రెడీ అయ్యారు.
Winterలో Europe వెళ్లి PhD join అయ్యేదాకా, తనిప్పుడు అదే campusలో Research Assistant గా work చేస్తున్నాడు. కాబట్టి, అమ్మానాన్న, పెద్దక్క బావ, చిన్నక్క కలిసి మొత్తం ఐదుగురికి మాత్రమే tickets book చేసారు. అందరూ కలిసి airportకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూంటే, సంతోష్ వాళ్ళ నాన్న అన్నారు, "నేనూ సంతోష్ బండి మీద వస్తాం, మీరంతా Cab తీస్కొని వెళ్ళండి" అని. అలానే బయలుదేరారు అందరూ.
బండిమీద వెళ్తున్న తండ్రీకొడుకులు దేవనహళ్ళి toll gate దాటేశారు. అప్పుడు, తండ్రి, "ఓసారి బండి ఆపరా !" అనేసరికి, side తీస్కొని కొద్దిదూరంలో ఆపేశాడు సంతోష్. ఏం జరుగుతోందో అర్థంకాక, "Flightకి time అవుతోంటే, ఇక్కడ ఆపమంటాడేంటి ఈయన?" అనుకున్నాడు సంతోష్. బండిదిగి, పక్కకివెళ్లి జేబులోంచి సిగరెట్, అగ్గిపెట్టె తీసి వెలిగించాడు తండ్రి. "ఓర్నీ, దీనికా!" అనుకున్నాడు సంతోష్.
ఓ ఐదునిముషాలు మెల్లిగా సిగరెట్ ఆస్వాదించిన తండ్రి, దాన్ని పడేసి, బండి దిగకుండా కూర్చున్న సంతోష్ దగ్గరికొచ్చాడు. Mobile phone jeans లోపల పెడుతూ, 'ఇంక బండితీనా?' అన్నట్లు చూస్తున్న సంతోష్ మొహంలోకి లోతుగా చూస్తూ, "ఇదిగో ఇదుంచు" అని ఇందాక అయన వాడిన అగ్గిపెట్టె చేతిలో పెట్టాడు. Flight ఎక్కేటప్పుడు ఇలాంటివి ఉండకూడదు కదా, అందుకని ఇచ్చారేమోలే అనుకున్నాడు సంతోష్. కాదన్నట్లు ఇంకా తీక్షణంగా చూస్తూనే ఉన్నాడు తండ్రి. 'ఏంటా?' అని దానివైపు చూసిన సంతోష్ ఇట్టే గ్రహించాడు, అది తన roomలో cricket kit అడుగున దాచిందని. కొన్ని క్షణాలు ఇద్దరూ మాట్లాడుకోలేదు. కానీ, అనాల్సినవన్నీ అనేసినట్లు ఒకరికి, వినాల్సిందంతా విన్నట్లు ఇంకొకరికి అనిపించింది. మెల్లిగా తండ్రిగారొచ్చి బండిమీద వెనకాల కూచున్నారు. బండి airport వైపు దూసుకెళ్లింది, సంతోష్ గుండెలమీద (జేబులో) ఉన్న అగ్గిపెట్టె మాత్రం తెగ అదురుతోంది.

పొద్దున్నే ఏడుగంటలయ్యి, మొహంమీద ఎండ పడేసరికి, మేడ మీద పడుకున్న చందు మెల్లిగా నిద్రలేచాడు. Lockdownకి ముందే చెల్లెలు engagementకని వచ్చి, తిరిగి Benguluru వెళ్ళలేక ఇంటినుంచే work చేస్తున్నాడు. కళ్లు నులుముకుంటూ కిందకొస్తూ, మెట్లమీద కూచొని కాబోయే బావగారితో phoneలో మాట్లాడుతున్న చెల్లెల్ని దాటుకొని, కొత్తగా కొన్న plastic chairలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న నాన్నగారి ముందు, ఇంకో కుర్చీలో కూలబడ్డాడు. నిద్రమత్తులో ఉన్నా, తనవేపు కొత్తగా చూస్తున్న నాన్నగారిని గమనించాడు కానీ, ఏమీఅనలేదు. ఇంతలో, చట్నీకని కొబ్బరి తీస్తున్న అమ్మ చూసి, "లేచావా, coffee తెస్తా ఉండు" అని వంటింట్లోకెళ్లింది. వెనకాలే తనూ వెళ్లి అడిగాడు "ఏమైందమ్మా, నాన్నగారు ఎప్పటిలాగా Mobile phoneలో Jagan videos పెట్టుకోకుండా, పొద్దున్నే చిరాగ్గా అలా చూస్తున్నారు నన్ను?" అని. "అవునా, ఏమోరా తెలీదు, అడగకపోయావా?" అంది పాలు కాస్తున్న అమ్మ. "ఏమోలే" అనుకుంటూ, గబగబా coffee తాగేసి, ready అవ్వడానికి bathroomలోకి దూరిపోయాడు.
Tiffin అయ్యాక మేడమీది గదిలోకి వెళ్లి, teamతో daily objectives meeting కోసం TV పక్కన పెట్టిన తన laptop bag తీస్కొని మేడ ఎక్కేసాడు. ఓ పావుగంటయ్యాక, "అమ్మా, నా earphones కనపడట్లేదు, bagలోనే ఉండాలి తీసారా ఎవరైనా?" అంటూ కిందకొచ్చి వెదకడం మొదలు పెట్టాడు హడావుడిగా. "అవున్రా, మర్చిపోయా చెప్పడం, రాత్రి మీ నాన్నగారు పడుకునేముందు కూడా ఆ సోది వీడియోలు చూస్తూ విసిగిస్తున్నారని నేనే నువ్వు చెవిలో పెట్టుకునేవి తీసుకోమన్నాను. ఆ TV దగ్గరే పెట్టారేమో చూడు" అంది. "ఆ, దొరికింది లే" అని తీసుకోని వెళ్ళిపోయాడు మేడ మీదకి.
మధ్యాహ్నం భోజనాల టైమయ్యేసరికి అందరూ dining table దగ్గర హాజరవుతున్నారు. అమ్మ వంటింట్లోంచి ఒక్కోటీ table మీదకి సర్దుతోంది. ఇంతలో చందు water bottle తీసుకోబోతూ, పక్కనే ఉన్న వేడి రసం గిన్నె తాకి "అబ్బా!" అని, ఉఫ్ఫుమంటూ చెయ్యి ఊదుకున్నాడు. అంతా చూస్తున్న నాన్నగారు, "ఒళ్లు కాస్త దగ్గర పెట్టుకుంటే మంచిది" అన్నారు ఘాటుగా. 'అరే, ఇంత చిన్నదానికే అంతమాట ఎందుకబ్బా!' అనుకున్నారు మిగిలిన అందరూ, కానీ ఎవరూ ఏమీ అనలేదు. భోజనాలు నిశ్శబ్దంగా అయిపోయి, చందు fastగా మేడెక్కేసాడు.
పొద్దున్నించీ ఈయనేంటి చిరాగ్గా ఉన్నాడు మనమీద, కొంపదీసి బడ్డీ కొట్టు దగ్గర సిగరెట్ కొంటున్నపుడు చూసిన ప్రభాకర్ uncle గానీ ఆపుకోలేక ఈయన దగ్గర పిత్తేశాడా? చెప్పేవాడైతే మొన్న పొద్దున్న walkingలోనే చెప్పేసేవాడేమో, ఇవాళ్టిదాకా ఎందుకు ఆగుతాడు? ఎందుకైనా మంచిది జాగ్రత్త పెంచాలి అనుకుంటూ, mobile charger కోసం laptop bagలో వెదుకుతున్నాడు. shampoo packet లాంటివి తగిలాయి, అవేంటో వెంటనే తనకి స్ఫూరించింది. కరెంటు షాక్ తగిలినట్లు, 'వీటిని చాలా లోపల ఉన్న చిన్న zipలో కదా దాచేది, బయటి zipలోకెలా వచ్చాయి?' అనుకున్నాడు. వెంటనే earphones గుర్తొచ్చాయి. 'కొంపదీసి, రాత్రి వాటిని తీసుకునేటప్పుడు నాన్నగారు వీటిని చూసేశారా? గుండె వేగం కొంచెం పెరిగింది. అయినా, ఒకే సరంగా ఉండాలి కదా, ఇలా మూడు separateగా ఉన్నాయేంటి? F***, దొరికిపోయాం. చూసేశానని చెప్పడానికి, ఇలా వీటిని separateగా చింపేసి తన సంతకం వదిలాడనమాట, మన బాబు. Benguluruలో ఎక్కడైనా దొరుకుతాయి కదా, ఇలా bagలో maintain చేయాల్సిన కక్కుర్తి ఎందుకురా?' అని అప్పుడెప్పుడో వీటిని bagలో దాచిన సంగతి గుర్తొచ్చి, తనని తానే తిట్టుకున్నాడు. 'పోన్లే, చేసేదేముంది, చెల్లెలి పెళ్లయ్యాక, late లేకుండా రమ విషయం బయట పెడదాం. కానీ, ఈలోపు ఈయన మనల్ని తిరుగుబోతు అనుకోకుండా ఉంటే చాలు' అనుకున్నాడు.
------------------------------------------------------------------
ఇంకొన్ని ఇంకో రోజు.