నాజీవితంలో జరగని కొన్ని సన్నివేశాల్ని నేనే సృష్టించుకొని, నన్ను actorగా పెట్టి, నేనే దర్శకత్వం, రచన బాధ్యతలు కూడా వహించి, ఆయా సందర్భాల్లో కాసేపు జీవించి ఇలాగ పదిల పరచుకోవడం అనేది ఒక సరదా ఛాలెంజ్. మరి మనకి పూరి జగన్నాథ్ వచ్చి script ఇవ్వనప్పుడు, మనమే త్రివిక్రమ్ లాగా dialogues రాసుకొని, clap కొట్టుకోవాలి కదా. అలాంటి ఒక ఛాలెంజింగ్ breakup సన్నివేశం ఇక్కడ ప్రదర్శిస్తాను. నిజానికి నిజజీవితంలో breakup scene ఎంతమందికి ఇష్టముంటుంది? ఎడబాటన్నది ఎవరికి వేడుక? ఏదో నాలాంటి వాళ్లకి మాత్రమే మనలోని కళాకారుణ్ణి తృప్తి పరచుకోవడం కోసం తప్ప. అలాగే, article అవడంతో మీరు కేవలం చదవగలరు, నేను మరియు నాతో సన్నిహితంగా మెలిగిన వారు మాత్రమే ఈ sceneలో నన్నూహించుకొని నా నటనని అనుభవించగలరు. చుడండి మరి నా ferformance!
"ప్రేమించడం పిచ్చ easy, ఇప్పటికే నేను బొచ్చెడు మందిని ప్రేమించా"నని చెప్పుకుని తిరిగిన నేను, నీ పరిచయం తర్వాత ఒక్కరిని ప్రేమిస్తున్నాని అనుకోవడానికే సాహసించలేక పోతున్నా. ఎందుకంటే, నీకోసం తపించినంత నేనెవరికోసం, దేనికోసమూ తపించలేదు; లేనేమో కూడా! ప్రేమంటే అంతటి తపనా?
నీతలపుల్లో వసించి, విహరించి, పులకించినంతగా నన్నెవరూ, ఏ విషయమూ మైమరపించలేదు; ప్రేమంటే అంతటి మైమరపా?

ఇకమీద నిన్ను తలచుకున్నప్పుడల్లా, కారణాలేమైనా, ఒకటవలేకపోయామనే నిజం వేదనై నన్ను నిలువునా కలచివేస్తుంది. ప్రేమంటే వేదనా?
కానీ, నీ జ్ఞాపకాలు తీపి స్మృతులుగా జీవితాంతం నన్ను వెంటాడుతాయని మాత్రం తెలుస్తోంది. ప్రేమంటే ఆ మధుర స్మృతా?
ఇవన్నీ అవునోకాదో నాకు తెలీదు, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయో లేదో కూడా తెలీదు, కానీ నాకు మాత్రం ప్రేమంటే నువ్వే. ఒకానొక వసంతకాలపు సాయంత్రం ఈ కోటలోకి వీచి, గెలిచి వెళ్లిపోయిన సుగంధపు మరకలా గోడలమీద నువ్వుండిపోతావు, కూలిపోయేదాకా.
----------
Title: సమ్మోహనం చిత్రంలోని 'కనులలో తడిగా' (రచయిత: రామజోగయ్య శాస్త్రి) పాట నుంచి.