Sunday, April 3, 2011

వీలైతే నాలుగు కవితలు, కుదిరితే ఓ నవల.....!


ఎందుకో
పదాలంటే మోహం,
పదార్చంటే వ్యసనం;
అనిపిస్తుంది,
ఈ పానమొక వరం,
పేర్పొక పరవశం;
పద్యమో, గద్యమో,
ఎక్కితే హృద్యమే;
భవమో, అనుభవమో,
అంతా అతిశయమే;
భక్తి, రక్తి
మానవాళికి శక్తి,
యే...దైనా మొత్తానికో మంచి భుక్తి;
చలమో, చేతన్ భగతో,
కుటుంబరావో, కీట్సో,
ఓ హెన్రీ యో, యుద్దనపూడో,
R K నారయణో, ఆదివారం అనుబంధమో....
మీరు చదివి చూడండి
వీలైతే నాలుగు కవితలూ, కుదిరితే ఓ నవల....!

1 comment:

  1. జస్ట్ ఇందాకే ఓ కవిత చదివానబ్బీ...ఇంకో మూడూ మిగిలున్నాయ్, అవి కూడా కానిస్తా ;)

    ReplyDelete