ఒకసారేమో అవసరం; బాధ పడ్డప్పుడు వెళ్లి బోరుమన్నావ్ చూడు, అపుడు;
ఒకసారేమో ఇష్టం; సంతోషంలో చెవిలో చేరి జోరీగవైనావు చూడు, అపుడు;
ఇంకోసారి వ్యసనం; అదే weakness, అశక్తత;
అన్నీ నీవే;
బాగా ఆలోచించు,
నీ బాధలోనే, నీకవసరమయ్యారు;
నీ సంతోషంలోనే, నీకిష్టమయ్యారు;
నీ weakness వల్లే, నీకు వ్యసనమయ్యారు;
అంతా నువ్వే, అన్నీ నీవే;
ఆమాత్రం దానికి, అలక దేనికి?
అలిగేది ఆడోళ్లు కాదు. అబలులు;
బలం లేని మనసులు;
స్వార్థంతో శుష్కించిన మనసులు;
తేల్చుకో మరి నువ్వెవరో...!
No comments:
Post a Comment