Sunday, June 23, 2013

ఆగిపోతూ......నే ఉన్నా..!!


ఎన్నో చెబుదామనుంటుంది, అంతా చెప్పినా  I Love you అనే అవుతుంది.
అందులో కొత్తేముందని ఆగిపోతాను.

అందరు మీ(అమ్మాయిల) కళ్లని చూడమంటారు, నాకేమో నీ పాదాలు చూస్తూ  Propose చేద్దామనుంటుంది.
పిచ్చోడనుకుంటావేమో అని ఆగిపోతాను.

నా ప్రేమ కనిపించీ కనిపించకుండా మాటలు కడదామనుంటుంది.
తీపి కాస్తా వెగటైపోతుందేమో అని ఆగిపోతాను.

ఇలా,
ఆగి,పోతూ......నే ఉన్నా, నీవైపుకే. 

Thursday, June 6, 2013

చెట్టు + చిరునవ్వు = చీమ


ప్రాణేశ్వరీ!  (Heavyగా ఉందా, తప్పలేదు, feeling అలాంటిది మరి)
"భరించరాని ఈ విరహాగ్ని కన్నా, ఆ పాపాగ్నే మాకు సమ్మతము" అనెప్పుడో SVR గారు అంటుంటే ఏమో అనుకున్నా, కష్టమే సుమా!!
మెడని వీలైనంతా వెనక్కి సాచి,కళ్లుమూసుకుని  ఆకాశం వంక చూస్తూ, పిడికిళ్లు బిగించిన రెక్కలు రెండూ విరిగిపోతాయెమో అనేంతగా విరుచుకుని, గుండెంతా నిండిన విరహాన్ని ఒక్క నిట్టూర్పుతో విశ్వంలోకి విసిరేస్తూ.....బానే ఉంది ఓ క్షణం.
కానీ, మరుక్షణం నిండిపోతావే, మదినిండా! కాస్తంత కనికరమైనా లేదు, కన్యకా నీకు!!
నీటి కొంగని చేప మింగడమంటే ఇదేగదా!
చెట్టంత మగాన్ని, చీమని నలిపేసినట్టు నలిపేశావే, చిరునవ్వు ఖర్చుతో....!!  
నా చాతిని తవ్వి, గుండె ని తీసి గంతులేయిస్తున్నట్లుంది నాముందే (Gulmoharరోడ్డు లో),
మరీ అన్నిసార్లు కనిపించకు Please, చూస్తూ సచ్చిపోతానేమో...!