తమ్ముళ్లూ, తొందర పడండ్రోయ్ !, లేకపోతే
సముద్రమంత ప్రేమ, సాములోరి సెంబులో నీరైపో గలదు సుమా!!
-------------------------------------------------------------------------------------------- 1
అబ్బే,
నల్లపూసలు గుచ్చుకోకుండా నిద్దరెలా పడుతుంది చెప్పు !!
**************************************
జనాభీష్టం మేరకు, జరిగిన కథ:
ఒకానొక sitting setting పీకేసి, pack-up చెప్పాక :
మావోడికి నిద్దరట్టడం లేదు, నా చావుకొచ్చింది.
ఎందుకడద్ది, King Arthur లో Keira Knightleyలా ఉంటదట మరి మావోడి Queen. ( ఆడే అన్నాళ్లెండి ).
ఒకవేళట్టినా, అది నిద్దరగాదంట.
'అదేంట్రా ??' అన్నట్టు చూశాక, పై లాగా అన్నాడనమాట.
------------------------------------------------------------------------------------------- 2
మర్చిపోకొరేయ్, మనసు as it is manifest అయిపోద్ది. అదే secret, మరింకేం లేదు.
-------------------------------------------------------------------------------------------- 3
ఒకడు : వీడేంట్రా, నడకబావుందనీ, పాదాలు బావున్నాయనీ, gold medals వచ్చాయని ఇంత bend అవుతాడు ?
మావాడు : అప్రాచ్యపు వెధవ !!
ఏమంటివి ఏమంటివి ? ఇప్పుడు కొత్తగా bend అవ్వడమా ?
ఈఫిల్ లాంటి ఈగో tower ఏనాడో ఒదిగిపోయింది, ఉరగలోకపు వీధుల్లో, కడు ఒయ్యారంగా !!
కాగా నేడు కొత్తగా bendu bendu అంటూ bore కొట్టకు...!! కూచో !!
ఉంకోడు : ఎవర్రా అది??, సావగొడుతున్నావ్!!
మళ్లీ మావాడు : ఎవరా...
నా రే వనంలో పూసిన రంగుల కల, రావణంలో విభీషణంలా !! చాలా !?!?
------------------------------------------------------------------------------------------- 4
మళ్లీ దీనమ్మ జీవితం,
ఎందుకు బాధవుతుందో మరెందుకు బాగవుతుందో అస్సలు అర్థంకాదు ;
తడి ముద్దులు - పిడి గుద్దులు,
Houseflies - Butterflies అన్నీ ఉండే తీరాలనుకుంటా !!
------------------------------------------------------------------------------------------- 5
"ఏంట్రా నీ బాధ ?, ఇందాకట్నుంచీ silentగా సావగొడుతున్నావ్ !!"
"నా బాధంతా ఏంటంటే, ఆ వచ్చేవాడు నా బంగారం విలువ తెలుసుకుంటాడో లేదో, తెలుసుకున్నా గుర్తుంచుకుంటాడో లేదో ఒకవేళ గుర్తుంచుకున్నా behave చేస్తాడో లేదో !?!? అని"
-------------------------------------------------------------------------------------------- 6