Tuesday, January 21, 2014

Clearance Sale !!


యండమూరి వారిని, వారి 'వెన్నెల్లో ఆడపిల్ల' ఓ లేఖ రాయమంటుంది తనకి. తీరా రాశాక, Final Draft కంటే, ఆ ప్రయత్నంలో Dustbinలో పడిపోయిన చిత్తు కాగితాల్ని ఇష్టంగా పట్టుకెళ్తుంది.
అలాగే, నిన్ను(అంటే ఈ Blogని) చేరలేక, నాలోపలే దాగిపోయిన stockని ఇక్కడ present చేస్తున్నా,  పరికించు.


1. అయ్యో, మనకి ముహూర్తాలూ, మంగళసూత్రాలు ఎందుకూ ?
    మెడ చుట్టూ పెట్టే మూడు ముద్దులే, నే కట్టే మూడు ముళ్లు.
    నిన్నల్లే నా చేతులే, నీకు నల్లపూసలు.
    మద్దిచెట్టున్నేనూ, మల్లెతీగవి నువ్వు,
    మొదలెడదాం మరోచరిత్ర !


2. నేను కవితలెలా రాస్తానని ఒకడు అడిగాడు. నేను కేవలం నువు చేసే రచ్చని రాయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పా.
     Simpleగా  'నువ్వు సోకి మనసు  సొమ్మసిల్లింది ' అన్నాను. "అద్భుతః" అన్నారు, మా 'యలమూరి' వారు.

3. పూలు, పక్షులు, చంద్రుడు, మంచు, ఉదయం, దైవం ఇయన్నీ so called సౌందర్యాన్వేషకుల కిచ్చేశా.
     నాకు నువ్వు చాలనిపించి !!

4. కనిపించి కాల్చినా, కళ్లలోకి చూశాక చల్లారినా!
    మాటపోయి మూగనైనా, మనసు పాడి సేదతీరినా!!

No comments:

Post a Comment