ఒకడు : ఓరి బాబో, next week నుంచి వీణ్ని పిలవద్దురా. "అమ్మాయి", "అమ్మాయి" అని అస్తమానం bore కొడుతున్నాడు.
ఇంకోడు : భయ్యా, నీకర్థం కావడం లేదు భయ్యా!
ఇప్పుడూ, అమ్మాయి లేని జీవితం అంటే, tune చేయని lyric లాంటిది; నీకంత రసం లేదుగదా!
పోన్లే, సచిన్ లేని cricket లాంటిది భయ్యా; నీకదిగూడా తెలీదు కదా!
అయ్యో!
ఇలాగాదుకానీ, water కలపని పెగ్‌లాంటిది భయ్యా, అమ్మాయి లేని జీవితం.
ముందోడు : ఇదిగో ఇలాంటి సొల్లు చెప్పుకోడానికి తప్ప ఇంకెందుకూ పనికిరారు భయ్యా అమ్మాయిలు. వాళ్లు బొక్క భయ్యా అంటే వినరేందిరా మీరు!
అందరూ ఒకేసారి: next week నుంచి వీణ్ని రానివ్వద్దురా.
-----------------------------------------------------------------------------------------------------1
"ఎర్ర జాబిలి చేయి గిల్లడాలూ", "పిల్ల గాలి బుగ్గ నిమురడాలు" మీకున్నట్టే, "గళ్లసొక్కాలు గుండె నొక్కడాలు" మాకూ ఉంటాయ్.
-----------------------------------------------------------------------------------------------------2
ఒకడు : ఏరా, ఆ పిల్లతో మాట్లాడతా అన్నావ్ గా, మాట్లాడావా?
నేను : ఆ, మాట్లాడారా.
అందరు : మాట్లాడావా? ఏం మాట్లాడావ్?
నేను : హాయ్!
తను : హాయా? ఎవరు మీరు? ఏం కావాలి?
నేను : నేనా, నేను, నేనో స్వరపరచని సిరివెన్నెల సాహిత్యాన్ని, మీలాంటి ఓ మాంచి మెలడి కోసం వెయిటింగ్.
అందరు : ఆ, తనేమంది ?
నేను : ఏమంటుంది, నన్ను పైకి, కిందకి చూస్తూ వెళ్లిపోయింది.
-----------------------------------------------------------------------------------------------------3
No comments:
Post a Comment