ఇంతలో, welcome చెబుతున్న uncleని చూసి , "మరీ అంచు పంచెలు expect చేయలేదులేకానీ, ఇలా night pants, T-shirtని కూడా expect చెయ్యలేదే" అనుకున్నా, బాగా... chill అవుతున్న అయన్ని చూసి. "సర్లే, అవంత important కాదులే, uncle అంటే ముసలాడనుకున్నా, పర్లేదు" అనుకొని, hallలో ఉన్న sofa setలో (sofa కాకుండా, oppositeలో) విడిగా ఉండే (రెండింటిలో) ఒక chair మీద కూచున్నా. అయన నాకెదురుగా sofaమీద కూచున్నాడు, మధ్యలో teapoy ఉంది. ఒకట్రెండు నిముషాలు కుశల ప్రశ్నలూ, పొద్దున్న జరిగిన defence గురించి అడిగి, kitchenలో నుంచి వచ్చిన తన భార్యని పరిచయం చేశాడు. నవ్వుతూ వచ్చి, ఆవిడ నాకు కొద్ధి దూరంలో left side, మా ఇద్దరినీ face చేస్తూ కూచున్నారు. ఇంతలో, లో...పలి నుంచి ఇంకో జంట వచ్చారు. "వీళ్లెవరో?" అనుకుంటూ చూస్తుండగానే, uncle పరిచయం చేశాడు, వీళ్లు తన అక్కాబావలని. అనగా, candidateకి అమ్మానాన్నలు అనమాట. పైకి లేచేందుకు ప్రయత్నిస్తూ "నమస్కారం అండి!" అని పైకని, "ఆహా!, చేశాడుగా uncle మనల్ని గట్టిగా!" అని లోపలనుకున్నా. "పర్లేదు బాబు కూచోండి" వాళ్ళ reply. వాళ్లు మరీ chill బట్టలు కాకుండా, officeకి వేసుకెళ్ళేవే కట్టుకున్నారు.
"Candidate వాళ్ల family APలో ఉంటుంది, వాళ్లంతా ఎందుకు, ముందు తను నీతో మాట్లాడాలంటోంది, బెంగుళూరులో మా ఇంట్లో కలిసి మాట్లాడుకోండి, పెద్దోళ్ల కథ తర్వాత చూద్దాం అని simpleగా tempt చేసి పిలిపించి, అందరి ముందు పడేసి, అడ్డంగా book చేశావుగా uncle" అనుకుంటున్నా. ఇంతలోనే అంతా వినిపించినట్లు ఓ నవ్వు నవ్వి, "నీకు తక్కువ time ఉంది కదా, పెళ్లికి attend అయ్యి వెళ్ళిపోతా అన్నావని, వీళ్లు కూడా వస్తామన్నారు నిన్న; ఇవాళ పొద్దున్నేreach అయ్యారు" అని సంజాయిషీ ఇచ్చాడు uncle. ఏమంటాం, "ఓహో!" అని ఊరుకున్నాం. ఇంతలో ఇంకొకరొచ్చారు hallలోకి, "తను వీళ్లబ్బాయి" అని అతణ్ని కూడా పరిచయం చేశాడు uncle, "ఈయన (candidateకి తమ్ముడు) ఈ రాష్ట్రంలోనే చదువుకుంటున్నాడు, పొద్దుటే వచ్చాడు" అని. Uncle లాగే night dressలో chill కొడుతున్న brotherకి కూడా ఓ హాయ్ చెప్పేసి, ఇంకెవరైనా వస్తారేమోనని చూస్తుండగా, uncle పిల్లలిద్దరూ వచ్చారు. వాళ్ళు మరీ చిన్నపిల్లలు, పాపం, అందుకని పరిచయం చేయలేదు. "పోన్లే భయ్యా, బామ్మలు, తాతయ్యలు కూడా వస్తారేమో అని భయపడ్డా. మొత్తానికి, మాంచి sketch వేసి, నన్ను బోనులోకి లాగి అందరూ చుట్టుముట్టారుగా, let's get started" అని దీర్ఘశ్వాస ఒకటి తీసుకున్నా. నా ఎదురుగా sofa మీద, uncle, అయన పక్కన candidate వాళ్ళ నాన్న, hallకి కొద్దిగా దూరంగా, dining table దగ్గర వాళ్ళ అమ్మ, నాకు ఎడమపక్కన uncle భార్య, ఆమె పక్కన candidate వాళ్ళ brother కూచున్నారు. అందరూ నన్నే చూస్తున్నారు, చూడటంకాదది, తినడం అన్నా తక్కువే. "VIP treatment భయ్యా, అడిగావుగా, enjoy మాడి!" ఎవరో వెటకారిస్తున్నట్లు వినిపించింది. కొత్తగ్గా వయసొచ్చిన కాకినాడరోజుల్లో, అప్పుడప్పుడూ కొద్దిగా insensitiveగా చేసిన సౌందర్య అన్వేషణ మరియు ఆరాధన యొక్క కర్మఫలమేమో అనుకున్నా.
ఇంతలో uncle instruction మీద refreshments arrangements మొదలయ్యాయి. వాళ్ళావిడ మంచినీరూ, T తేవడానికి వెళ్లారు, దాంతోపాటు రవ్వలడ్డు కూడా (తెచ్చాకే తెలిసాయిలెండి items ఇవని). "హ్మ్, మీ ప్రస్థానం ఏమిటో మాట్లాడుకుందామా?" అని నన్నే మొదలుపెట్టమన్నాడు uncle. "ఉండు, మన family గురించి చెబుదాం, పరిచయాలకి continuation లాగా ఉంటుంది" అని వాళ్ల బావగారు కల్పించుకొని వాళ్ల వంశం రెండువైపులా (అనగా, వారిది, వాళ్ళావిడ వాళ్ళది) చెప్పుకుంటూ వచ్చారు. మాంచి హుషారుగా ఉన్నాడాయన. అటువైపు, ఇటువైపు కూడా ఉద్యోగస్తులమే, పేరుమోసిన వాళ్ళమేనన్న కించిత్ 'ఇది' ధ్వనించింది. తప్పేంకాదు, చెప్పుకోడానికే కదా కలుసుకుంది, కాబట్టి, అంతా attentiveగా విన్నా. అలా పెద్దలగురించి అయ్యాక, పిల్లల దగ్గరికొచ్చేసరికి, "ఇద్దర్ని వేరే రాష్టాల్లో చదివించాం" అని ఈసారి ఇంకొంచెం 'ఇది'గా చెప్పేసరికి, చాలా సహజంగానే అనుమానమొచ్చింది, "బహుశా EAMCETలో మంచి seat రాలేదేమో ఇద్దరికీ" అని. అక్కడికే వస్తున్నా అన్నట్లు, "ఇద్దరికీ seat వచ్చినా, మంచి చదువులకోసం, communication skills కోసం (నేనూ, మీరూ కూడా సరిగ్గానే విన్నాం) అని అలా plan చేశా" అన్నాడు. Particularly అబ్బాయి medical seat గురించి, "సీమలోని famous private collegeలో government seat వచ్చినా, బయటే prefer చేశాం" అన్నాడు. "సర్లే భయ్యా! seriousగా తీస్కోవద్దు, ఏదో కాలం బాలేదు, ఇప్పుడంతా మితిమీరిన marketing నడుస్తోంది కదా అని, ఎవర్ని నమ్మాలో నమ్మకూడదో తెలీక అనుమానించా అంతే!" అనుకున్నా, పైకి ఊకొడుతూ. ఏదేమైనా, ఈ setup అంతేలా ఉంది. తప్పదు ఎవరికైనా. Generalగానే జనాలు personal brandingకి పరాకాష్ఠ చూపిస్తున్నారు. ఇదంతా అర్థమైనట్లు uncle వారి బావగారిని ఆపేసి, ఇంక నా గురించి చెప్పామన్నారు.
నా స్వార్థపూరిత ప్రయోజనం నడిపిస్తుండగా, నేనేమీ జంకకుండా (#NoFilters), సంక్షిప్త సుందరంగా, సమాచారం మాత్రమే వెల్లడయ్యేలాగా (show-offలా కనపడకుండా) CV బయటపెట్టా, వ్యక్తిగతము, వృత్తిగతమూనూ. నాకంటే రెట్టింపు ఉత్సాహంగా విన్నారు అందరూ, I liked it. విజయవాడ శ్రీచైతన్యలో, "లెక్కలు చేయడం ఒక art" అంటూ blackboard, chalk piece రెండూ తానే అయ్యి class చెప్పే KSగారి period అంత animatedగా (+ve గానే; uncle గారి బావగారి వల్ల) నడిచింది ఆ episode. అపుడు మరోసారి, పొద్దున్న KK అడిగిన questions కనిపించాయి కళ్ళముందు. "మరేం పర్లేదు, process important participants అందరికీ" అనుకొని proceed అయ్యా.
ఇలాగా family విషయాలు, professional plans గట్రా మాట్లాడుకున్నాక, ఒకట్రెండు నిమిషాల pause వచ్చేసరికి, నాకేదో అర్థమైనట్లుగా "main round interview ఎక్కడై ఉంటుందబ్బా!, పెరడూ గట్రా ఉండవుకదా ఇలాంటిచోట్ల!" అనుకుంటున్నా. మరి మనకేమో కొత్త; సినిమాల్లో అలాగే చూపిస్తారు కదా, పెరట్లోనో, balconyలోనో అవుతాయి meetings అని expect చేస్తున్నా. తనకోసమే ఈ Pre-planned pause అన్నట్లు, దగ్గర్లోవున్న bedroom నుంచి అంతా follow అవుతున్న candidate, మేమంతా ఉన్న hallలోకి enter అయ్యింది. ఓహో! అంటే అన్నిసార్లు ఈ ఆడంగులే లోపలికెళ్ళి తీసుకురావాలనేం లేదన్నమాట అనుకుంటుండగా, "మీరిద్దరూ మాట్లాడుకోండి, మేము అలా పక్కకెళతాం" అంటూ uncle అనేసరికి అందరూ లేచి dining వైపు వెళ్తున్నారు, ఒక్కరు తప్ప, uncle wife. ఆవిడ అక్కడే కూచున్నారు. పక్కనున్న brother వెళ్లిపోగా, ఆ placeలో కొత్త శాల్తీ settle అయ్యింది. "అనగా, మనకి లభించే maximum privacy ఇంతే అనమాట!" అని అర్థంచేసుకుంటూ, dining table దగ్గర, చెవులిటు పడేసి వాళ్ళల్లో వాళ్లే ఏదో మాట్లాడుకుంటున్నట్లు కనిపించిన జనాన్ని చూసి, "This is cheating భయ్యా! మరీ రోడ్డుమీదకి కాకపోయినా, కొంచెం దూరమైనా వెళ్లాలిగా" అనుకొని, వెంటనే, "wait, ఈ pre-meditated షాట్లే ఆడకూడదు, let's face it! ఇవాల్టికి బెంగుళూరే గ్వాలియర్, మనమే దేవుడు; స్టెయిన్, పార్నెల్ పిచ్చ light; ఓ అద్భుతానికి అవకాశమో, సాక్ష్యమో ఇచ్చినట్లు feel అయిన కల్లిస్ లాగా uncle కూడా feel అవ్వాల్సిందే ఈ పూటకి," అనుకొని, హాయ్ చెప్పా.
"చదువుకోడం కాకుండా ఇంకేమైనా చేస్తారా మీరు?" మొదటి ప్రశ్న. అంచనా లేని pitch కదా, ఈ unexpected bounceకి కొంచెం surprise అయ్యాం. Offend అయ్యాం అనుకున్నారో ఏమో, "అంటే, అలా కాదు, మీకున్న illustrious academic careerకి కొంచెం ఎక్కువ dedication కావాలేమో కదా! అందుకని other hobbiesకి time దొరకదేమో అని అలా అడుగుతున్నా" damage control exert చేశారు. (కంగారు పడకండి, exact language ఇది కాదు, భావం చెడిపోకుండా నేను అందమైన పదాలతో decorate చేశా, ఎంతైనా మనగురించి కదా!) .
"అలా ఏం లేదు, in fact నేనింకా, నా career కోసం ఇవ్వాల్సినంత time ఇవ్వడంలేదని feel అవుతుంటా" అన్నా.
"Seriously, with a PhD, you are saying you don't study enough?" అన్నట్లు చూసేసరికి,
"Damn Yes, I am not kidding. మనకున్న cotton businessల వల్ల research output is taking a toll. కవిత్వం చదవాలి, cricket ఆడాలి, రోడ్డుమీద పడి రాచకార్యాలు చేయాలి, cycling, biking, కొత్తగా zoom-car-ing, trekkingలు చేయాలి, friendships కావాలి, dark sides చూడాలి, simpleగా, nuclear science నుంచి nude woman దాకా అన్నీ నాకే కావాలి, ఇంకెప్పుడు careerకి ఉపయోగపడే పనులుచేసేది. నోట్లో స్పూను, దాంట్లో నిమ్మకాయ పెట్టుకొని, Balance Balance అంటూ పరుగెత్తడానికి ప్రయత్నిస్తున్నాం", కంగారు పడకండి, ఆవేశంగా అన్నీ లోపలే అనుకున్నా, పైకి ఏమీ అనలేదు.
"I mean, చిన్న చిన్న hobbies గట్రా ఉంటాయి కదా" అని, పైనున్న listలోంచి, చెప్పుకోగలిగినవి మాత్రమే, చెప్పాల్సిన విధంగా చెప్పడం జరిగిందనమాట.
Suddenగా ఇంకో విషయం గుర్తొచ్చింది, Indiaకి వచ్చేముందే శర్మగారని, ఒకానొక wise friendతో పెళ్లి గురించి కొంచెం gyan ఇవ్వమంటే, "పెద్ద పెద్ద shockingలకి ready ఉండు" అన్నారు. "ఎందుకని?" అంటే, చెప్పారు, "మీ(family) దగ్గరికి pilot profile కానీ, సినిమాలో పనిచేసే assistant director profile కానీ, జిల్లా కలెక్టర్ (IAS) profile కానీ వచ్చిందనుకో ఎలా feel అవుతారు?" అని అడిగారు. నా surprise cum shockని అర్థంచేసుకొని, ఆయనే అన్నారు మళ్లీ, "కొద్దిగా uncomfortableగా feel అయ్యి, match అవ్వమేమోలే అని hesitate చేస్తారు కదా, అలానే, నీలాంటి, SEEMINGLY studious, PhD profile చూస్తే, typical family, ఇంకా particularగా, BTech and software engineer అమ్మాయిలు అలానే feel అవరంటావా?" అన్నారు.
"నిజమేనేమో, మనం కొంచెం కొత్తగా, unfamiliarగా అనిపించొచ్చేమో. Ultimateగా, academic jobని, లేదా, కంపెనీల్లో scientist jobని కూడా దూరంగానే feel అవుతారా?"
"నీ చేతుల్లోనే ఉంది, IITలు, IIScలు, scientist, research papers, academic conferenceలు, postdocలు గట్రా అంటూ భయపెడితే వాళ్లకి తెలీని కొత్త ప్రపంచం అనుకొని risk feel అవ్వొచ్చు మరి, familyలో ఇవి తెల్సిన వాళ్లు ఉంటే, no problem. కొద్దిగానైనా తెలిసిన జీవితంలోకి అడుగుపెట్టాలని అనుకుంటారు కానీ, పూర్తిగా unfamiliar terrain కోరుకోరుగా. Anyway, play it simple, Good luck!" అని కొంచెం జ్ఞానదానం చేశారు. In this case, it seems, he was close.
Back to Gwalior...
ఆ తర్వాత, interestలు, likingలు, time passలు, friends, అలవాట్లు, వేషధారణలు, professional plans అబ్బో, అన్ని variations ఎదుర్కోవాల్సి వచ్చింది. Workshop paperలో మన researchని beautify చెయ్యకుండా, disadvantagesని cover చేయడాలు గట్రా పెట్టుకోకుండా, pros cons అన్నీ వీలైనంత nakedగా చూపించినట్లే చర్చలు నడిచాయి. Entertainment value మెండుగా ఉందని గుర్తించినా, పాఠకులు నిరుత్సాహపడతారని తెలుస్తున్నా, కొన్ని limitations వల్ల ఈ విషయం ఇలా తెగ్గొట్టాల్సి వస్తోంది. కానీ, రుచి తెలుసుకోవడం కోసం ఒక మెతుకు చూద్దాం. నేనడిగిన ఒక ప్రశ్నకి నా దగ్గరున్న జనాలు "దానిగురించెందుకు నీకెందుకు?" అన్నట్లు చూశారు, dining table దగ్గర జనాలు అందరూ "ఏం చెబుతాడో విందాం" అన్నట్లు silent అయిపోయారు. వాళ్లు initialగా ఇచ్చిన informationతో నాకు సమాధానం దొరకలేదు, అందుకే particularగా అడగాల్సి వచ్చిందీ ప్రశ్న: "మీ parents పెళ్లి మేనరికమా?" అని. మనకెందుకా? నేను next generationకి ఇచ్చే ఆస్తిపాస్తులంటూ పెద్దగా ఏమీ ఉండదు, ఆరోగ్యం, చదువు మాత్రమే ఇవ్వాలని అనుకుంటా. అక్కడ మాత్రం రాజీపడను, అందుకోసమే అడిగా. మరి ఆరకంగా, candidate ఆరోగ్యం కూడా మనకి important కదా! Genuineగానే అనిపించిందేమో, జనాలెవరూ Affect అయినట్లు అనిపించలేదు.
మంచి పరిణామమేంటంటే, "At least కొంతమంది candidates homework చేసి వస్తున్నారు interviewsకి. వాళ్లకేం కావాలో స్పష్టత ఉన్నట్లుగా ఉంటోంది" అని బయట talk. People would like to believe that nothing is obvious, అందువల్ల, "ఫలానా వేషధారణ మీకేమైనా అభ్యంతరమా?", "నేను Job చేయడం గురించి మీ expectations ఏంటి, మీ family expectations ఏంటి?", "నాకున్న ఫలానా interest గురించి మీ అభిప్రాయమేంటి?" లాంటి ప్రశ్నలు అవలీలగా అడిగేస్తున్నారు. In fact, అందరూ ఉండటం వల్ల అడగలేకపోయిన ఒకానొక ప్రశ్నని (అదేమిటో మీ ఊహకి వదిలేస్తున్నా), తర్వాత uncle ద్వారా message చేయించి మరీ అడిగారు నా caseలో, అదీ మరి పరిస్థితి. Completeness కోసం concluding remark: semi-privateగా నడిచినందువల్ల ఈ గంట timeకి, U certificate మాత్రమే సాధ్యపడింది. అనగా, old ball వల్ల వచ్చే reverse swingని face చేయాల్సిరాలేదు.
ఆవిధంగా, diplomaticగా కార్యక్రమం ముగించుకొని, dinnerకి late అవుతోందని సెలవు తీసుకునేందుకు ready అయ్యా. ఈమాటు మాత్రం వారికోరికని మన్నించి, వారి వాహనంలోనే వెనుదిరుగ వలెనని నిశ్చయించుకొని బయలుదేరితిమి. వారి చోదకుడు తెలుగు నెరిగినవాడు, మరియు, మా సందర్శనార్థము బహు చక్కగా ఎరిగిన వాడునూ అవడంచేత, మమ్ములను మిక్కిలి గౌరవముతో వ్యవహరించినాడు. వారి రెడ్ల (యజమానుల) యెడల ఆతని సానుకూల్యతని, స్వామిభక్తిని వ్యక్తపరిచినాడు. సర్లెమ్మని, మా ఆలోచనలని మరోవైపు మళ్లించడం కోసం, "music ఏమైనా ప్లే చేస్తారా" అని రిక్వెస్ట్ చేస్తే, "తప్పకుండా" అని, జేబులో ఉన్న, personal collection pen-drive insert చేస్తూ, "కొంచెం పాత పాటలు, పర్లేదా!" అన్నారు పాపం నొచ్చుకుంటూ, "అయ్యో దానికేముంది, నేను కూడా వింటా ఆనందంగా" అన్నా.
"ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాక్కున్నావో వెన్నెల గువ్వా, వెన్నెల గువ్వా, ఇవ్వాళే చూశా నిన్ను వెన్నెల గువ్వా, వెన్నెల గువ్వా " అంటున్నారు ఇంకో రెడ్డిగారు పాటలో. "అయ్యో, లేదండి (SV)కృష్ణారెడ్డిగారు, మనకి ఇంకా time ఉంది ఈ పాట పాడటానికి" అనుకుంటూ ఆ journey కొనసాగించాం New BEL roadకి.
PS: పనులుచేస్తేనే పొరపాట్లూ జరుగుతాయి. కాబట్టి, ఏమైనా పొరపాటుగా అనిపిస్తే, వాటివెనకాల ఉన్న "పనిచేయాలన్న నా పట్టుదలని" పెద్దమనసుతో అర్థంచేసుకొని, పొరపాట్లని క్షమిస్తారని (anonymous participantsతో సహా) ప్రజలందరికీ మనవి. విచ్చలవిడిగా వాడుకోనిచ్చినందుకు KKకి ధన్యవాదాలు.