అవి BTech అయ్యాక, కొత్తగా IITలో చేరిన రోజులు. Kharagpurలో అన్నిటికంటే ముందు appreciate చేసినది high speed internet and huge LAN sharing (ఆ, అదే అదే, DC++!). అవునుమరి, నా BTech పూర్తయ్యేసరికి నేను internet illiterate అనే చెప్పుకోవాలి. మొత్తం BTech అంతా కలిపి చూసినా 2-3 గంటలకంటే internet వాడిఉండను, ఆ రకంగా నా పట్టా (degree) offlineలోనే పూర్తి అయినట్లు. ఇదంతా చదివి ఎప్పుడో భూమిపుట్టినపుడు చేశానని అనుకునేరు, కాదు, మొన్నామధ్య వైస్సార్ CM అయిన తర్వాతే మొదలయ్యింది నా BTech . అప్పటికి నాకున్న internet craze వల్ల Kharagpurలో full time onlineలోనే బతికేసే వాణ్ణి. Orkut, facebook, blogging అన్నీ అక్కడే మొదలు.
వీటన్నికంటే, విపరీతంగా ఆకట్టుకున్నది అక్కడి LAN sharing, DC++. అంటే ఏంటంటే, Simple గా, campusలోని computersని connect చేసి, అందరూ తమ తమ computersలో నుంచి, ఎంపిక చేసిన సమాచారం (files) అందరితో పంచుకునే ఒక వెసులుబాటు. ఈ వ్యవస్థ అప్పటికే చాలా పకడ్బందీగా నడుస్తూ ఉండేది. అలాగే, కొన్ని సంవత్సరాలుగా accumulate అయిన వివిధ రకాల సమాచారం sharingలో ఉండేది. ఎంత ఆశ్చర్యాన్ని కలిగించిందంటే, అక్కడలేనిది ఏమీ లేదనేంత rich database అనమాట అది. అన్ని భాషల నవలలు, కథలు, సినిమాలు (national, international, regional) , పాటలు, పాఠ్య పుస్తకాలూ, documentaries, pdfలోకి మార్చబడిన ప్రాంతీయ మేగజైన్లు (చందమామ నుంచి స్వాతి వరకు దాదాపు అన్ని తెలుగు magazines, అన్ని సంచికలు దొరికాయి నాకు అక్కడ), cricket videos, cartoons, video lectures, ఇంకా ఎన్నెన్నో లభించేవి. సినిమాల మీద PhD చేసే ఒకాయన అక్కడ ఉన్న తన friend hostel roomలో unofficialగా ఉంటూ, తనకి కావాల్సిన సినిమాలని collect చేస్కుంటూ కొన్ని నెలలు campusలోనే ఉన్నాడంటే అర్థంచేసుకోవచ్చు అక్కడి collection size గురించి. వీటన్నికన్నా ఎక్కువ porn కూడా దొరికేది, అది వేరే విషయం. నిజానికి ఇన్ని ఉన్నపుడు ఏం చేయాలో, ఎక్కడినుంచి మొదలు పెట్టాలో తెలియక తబ్బిబ్బయినంత పనైంది. సినిమా అంటే ఉన్న ప్రత్యేకాభిమానం వల్ల world cinemaలోకి తొంగిచూసే కిటికీ దొరికినందుకు సంతోషించి, వాటితోనే మొదలు పెట్టా. IMDB top 200 listతో మొదలైన ఆ సినిమోత్సవం రెండేళ్ల తర్వాత Kharagpur నుంచి వచ్చేవరకూ కొనసాగిందనే చెప్పాలి. అలా ఒకరోజు నేను ఎంపిక చేసి చూసిన సినిమా Philadelphia. USAలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అది. Unfairగా fire (wrongful dismissal) చేశారని ఒక lawyer (Andrew) తాను పనిచేసిన law firm మీద caseపెట్టి గెలుస్తాడు. చాలా అద్భుతమైన, తప్పకుండా చూడాల్సిన సినిమా.
ఇలాంటి హత్తుకునే సినిమాలు చూసినప్పుడు intensityని బట్టి కొంత సమయం కోల్పోతూ ఉంటాను, ఆ spell అంతా పోయి తిరిగి మాములు మనిషిని అవడానికి 1-2 రోజులు కూడా పడుతుంది ఒక్కోసారి. "అబ్బా! ఏమన్నా చెప్పాడా? అంతకన్నా గొప్పగా నటించాడుగా!" అనుకుంటూనే మరుసటిరోజు Embedded systems labకి వెళ్ళా. 3 గంటల తర్వాత కూడా ఆవాల్టి experiment పూర్తవలేదు. తీసుకున్న components అన్ని return చేస్తున్నపుడు అక్కడి lab technician అన్నాడు, "రేపు ఉదయం 11 నుంచి lab ఖాళీగా ఉంటుంది, నేను కూడా freeగానే ఉంటాను. కావాలంటే అప్పుడు వచ్చి పూర్తి చేస్కోండి" అని. అరే, ఈయన గమనిస్తూ ఉన్నాడన్నమాట. అయినా, experiment పూర్తిచేస్కోడానికి మేము ఆయన్ని అడగాలి కదా, ఎప్పుడు వచ్చి extra time చేస్కోవచ్చు అని, కానీ, ఆయనే చెబుతున్నాడు అడగకుండానే. ఆయనకేంటి అవసరం, అయన కేవలం technician, కావాల్సిన electronic componentsని studentsకి ఇవ్వడమే ఆయన బాధ్యత. అప్పటివరకు నేను చూసిన lab technicians అందరూ వాళ్ల బాధ్యతలే సరిగ్గా నిర్వర్తిస్తారని చెప్పలేని రకం. సాధారణంగా labs మధ్యాహ్నాలు ఉంటాయి. కాబట్టి, అయ్యేసరికి, ఈ technicians ఇంటికెళ్లే హడావుడిలో అందర్నీ తొందర పెడుతూ ఉంటారు. Experiment పూర్తయినా, కాకపోయినా, తొందరగా componentsని return చేయడమే వాళ్ళకి కావాలి. కానీ ఈయన మాత్రం differentగా ఉన్నాడు. Time అయ్యాక మేమే return చేసేవరకూ ఉండి, తర్వాత కూడా extra time మాకోసం ఇస్తా అంటున్నాడు. చెప్పడంకూడా ఎలాగ, సంతోషంగా నవ్వుతూ చెబుతున్నాడు. "తన jobని మరీ ఇంత seriousగా తీసుకుంటున్నాడేంటి ? ఈయన కూడా an excellent lab technician కదా!" అనుకుంటూ hostelకి బయల్దేరా. cycle తీసుకుంటూ ఆలోచిస్తున్నా, what makes us good at something? అని. Am I a good _____? ఏదైనా సరే, Am I a good Son? Am I a good Engineer? Am I a good Farmer? Am I a good boyfriend? Am I a good Cricketer? Am I a good Scientist? Am I a good citizen? Am I a good Plumber? Am I a good Student?
How to answer?
ముందురోజు చూసిన సినిమాలోని సన్నివేశం ఒకటి గుర్తొచ్చింది. Wrongful dismissalకి సంబంధించిన వాదప్రతివాదాల్లో, కింది సంభాషణ జరుగుతుంది. case పెట్టిన వ్యక్తి Andrewకి, తన తరపున వాదించే lawyer Joeకి మధ్య (courtలో అందరి ముందు) నడుస్తుంది.
Joe: Are you a good lawyer, Andrew?
Andrew: I am an excellent lawyer. (చాలా ధీమాగా, తృప్తిగా చెబుతాడు.)
Joe: What makes you an excellent lawyer? (అంతే ఇష్టంగా అడుగుతాడు Denzel Washington, భవిష్యత్తులో ఈ సన్నివేశాన్ని అసంఖ్యాకులు పదే పదే చూస్తారని ముందే తెలిసినట్లు!)
Andrew: I love the law. (small silence). I know the law. (small silence). And I excel at practicing it. (తప్పకూండా చూడండి, Academy Award వచ్చింది ఆ పాత్ర వేసిన Tom Hanksకి. ఈ scene మాత్రం కావాలంటే ఇక్కడ చూడొచ్చు)
Competent అయినప్పటికీ వేరే కారణం (Homosexuality and AIDS ) వల్ల unfairగా fire చేశారని నిరూపించేలా, చాలా సామాన్యమైన సన్నివేశంలా అనిపించినా, చాలా సార్వత్రికమైన సందేశం ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. తాను law studentగా సాధించిన ఘనతలు, medals, grades, ఆ తర్వాత careerలో గెలిచిన గొప్ప caseలు, సాధించిన achievementsని అర్హతలుగా చూపించి తానొక గొప్ప lawyer అని చెప్పుకోకుండా, అంతకంటే చాలా fundamental ingredients వల్ల తనకా యోగ్యత ఉందని చెప్పుకుంటాడు Andrew.
అవును, ఆ lawyer సమాధానంలో స్పష్టంగా ఉంది, అన్ని ప్రశ్నలకి సమాధానం. మొదట మనం చేస్తున్న పనిని ప్రేమించాలి. అంతేకదా!, ఇష్టంలేకుండా చేస్తున్న పనిలో గొప్ప achiever అవడం చాలా కష్టం, అరుదు. కేవలం ఇష్టం ఉన్నా సరిపోదు. చేస్తున్న పని గురించి పూర్తి అవగాహనా ఉండాలి. బాధ్యతలనెరిగి నడుచుకోవాలి. అప్పుడే ఆ పాత్రని సమర్థవంతంగా పోషించగలుగుతాం. ఇష్టమూ, అవగాహనా ఉన్నా సరిపోదు, అనుభవం పెరుగుతన్న కొద్దీ, ఆపనిలో మన నైపుణ్యం మెరుగవుతూ ఉండాలి కూడా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండకుండా, దినదిన ప్రవర్ధమానం చెందాలనమాట. అప్పుడే, one can become good at something, in fact anything. ఆ lab technician కూడా, తన పనిని ప్రేమించబట్టి proactiveగా ఉండి మమ్మల్ని గమనించడం, పిల్లలు మొహమాట పడే అవకాశముంది అని, extra time and help తానే offer చేయడం అనేవి automaticగానే అలవడి ఉండొచ్చు. అవే ఆయన్ని ఒక మంచి lab technicianగా (కనీసం నాకు) గుర్తుండిపోయేలా చేశాయి.
అలా ఆలోచించుకుంటూ hostel వైపు వెళ్తున్న నాకు, ఒకవారంలో జరగబోతున్న స్నాతకోత్సవం (convocation) కోసం ఏర్పాటుచేసిన పెద్ద posterలో, IIT Kharagpur logo ఎదురయ్యింది. అప్పటికే తెగ చూసేసి మురిసిపోయి ఉన్నా, ఈసారి కిందున్న motto "యోగః కర్మసు కౌశలం" ఒకసారి అలా తళుక్కున మెరిసింది. ఆహా! "చేసే పనుల (కర్మల) యందు కుశలత (skill, నైపుణ్యము) కలిగిఉన్నవాడే యోగి" అని భగవద్గీతలో పెద్దాయన చెప్పే ఉన్నాడుకదా అని గుర్తొచ్చి, "అయితే ఇవాళ అలాంటి ఒక కర్మయోగిని కలుసుకున్నా అనమాట" అనుకున్నా. ఆ mottoని అర్థంచేసుకోడం కోసం అప్పుడెప్పుడో ప్రయత్నం చేసినా, ఇప్పుడీ దెబ్బతో బాగా అర్థమైందనమాట. ఇంతకీ, "అప్పుడంటే ఎప్పుడు?" అనుకుంటున్నారా, ఎప్పుడంటే, offline పట్టా రోజుల్లో. ఎందుకంటే, నా previous university motto కూడా చాలా యాదృశ్చికంగా అదే!

This comment has been removed by the author.
ReplyDeleteAdbhutaha.. chala bagundi sir 👏👏 manchi feel vachindi
ReplyDelete