వేసవి వెన్నెలవో, ఆశల అల్లరివో
తేనెల తుంపరవో, పాటల పేటికవో
ఎవ్వరివో, నువు నాకెవ్వరివో
జిలుగుల జవ్వనివో, వెలుగుల వేకువవో
అడగని అలజడివో, ఎరుగని ఎదసడివో
ఎవ్వరివో, నువు నాకెవ్వరివో
వరించు వరానివో, ఫలించు వ్రతానివో
తేలించు తీరానివో, కేళించు కాలానివో
ఎవ్వరివో, నువు నాకెవ్వరివో
మరపించు మధురానివో, చలిపెంచు అధరానివో
కనిపించు కానుకవో, ఊరించు వేడుకవో
ఎవ్వరివో, నువు నాకెవ్వరివో
సంబరాల సంక్రాంతివో,అంబరాన ఇనకాంతివో
దీవించు దైవానివో, దరిజేరు దీపానివో
గ్రహించు పాణివో,పాలించు రాణివో
ఎవ్వరివో, నువు నాకెవ్వరివో
No comments:
Post a Comment