Saturday, July 3, 2010

విధ్వంసమే...!


సురాగమవ్వని నినాదమే శాంతి,
వివాదమెరుగని ప్రదేశమే జగాన భ్రాంతి;

కనులు కనలేని కలయే కాబోలు కాంతి,
సువాదమవ్వని నినాదమే జనాన క్రాంతి;

లోకమాతకు కడుపుకోతే జాతిపూసే పసిడిపూత,
ఎల్లకాలపు రక్త చరితే జనులెరిగిన జాతి చరిత;

కత్తి పట్టిన కరాలే, కాలమొసగిన వరాలు
మోసమో, ద్వేషమో, రోషమో, కాల దోషమో అన్నింటా రుధిరమే,
మహియంతా కాల మహిష విధ్వంసమే...!

No comments:

Post a Comment