Saturday, May 29, 2010


It's not that i'm on the brink
to put all this ink
but for us to make a link
for you are there, in my every blink
and it's just you, all that i think
but the strength in me, is going to shrink
that day, they'll have me to sink
till then, i'm there, in the days you painted pink....!

Tuesday, May 18, 2010

నువ్వే.....!


నిను పిలిచే భాష రాక,
నీకై చెప్పే ఊసులు లేక,
నిన్నలరించే విధములు తెలియక
నాలో నేనె నీకై రాసుకున్న కవితవు నువ్వే.....!

Tuesday, April 6, 2010

తప్ప....!

నా లోపలి నన్ను నాకు పరిచయం చేసిన నీకు నేనేమిచ్చుకోను,
ఆ నన్ను తప్ప
నీ వాడు కాని ఆ నన్ను తెలుసుకొని, కలుసుకొని నేనేంచేయగలను,
నిన్ను స్మరించడం తప్ప
నువ్వింక నను మెచ్చవని, నన్నింక నీకిచ్చుకోలేనని తెలిసి నొచ్చుకోవదం తప్ప....!

ఎవ్వరివో, నువు నాకెవ్వరివో


వేసవి వెన్నెలవో, ఆశల అల్లరివో
తేనెల తుంపరవో, పాటల పేటికవో
ఎవ్వరివో, నువు నాకెవ్వరివో
జిలుగుల జవ్వనివో, వెలుగుల వేకువవో
అడగని అలజడివో, ఎరుగని ఎదసడివో
ఎవ్వరివో, నువు నాకెవ్వరివో
వరించు వరానివో, ఫలించు వ్రతానివో
తేలించు తీరానివో, కేళించు కాలానివో
ఎవ్వరివో, నువు నాకెవ్వరివో
మరపించు మధురానివో, చలిపెంచు అధరానివో
కనిపించు కానుకవో, ఊరించు వేడుకవో
ఎవ్వరివో, నువు నాకెవ్వరివో
సంబరాల సంక్రాంతివో,అంబరాన ఇనకాంతివో
దీవించు దైవానివో, దరిజేరు దీపానివో
గ్రహించు పాణివో,పాలించు రాణివో
ఎవ్వరివో, నువు నాకెవ్వరివో

Sunday, April 4, 2010

అవలేనేమో అన్న ని




అన్న ని కాని అన్ననైనా, ఈ అవని అంత ఆత్మీయతనందించిన దానవు
అన్న ని కాని అన్ననైనా, ఆకాశమంత అనురాగ సాగరాన్నీదించిన దానవు
యెన్ని జన్మల ఋణముందో ఈ అనురాగపు వీపున;
అవలేనేమో అన్న ని ఎన్నేళ్లున్నా,నువ్వనక "అన్నా" అని, "నేనున్నా"నని ..!

Monday, March 29, 2010

నువ్వే నువ్వే........


నను నడిపే ఆశవి నువ్వే

నను నిలిపే శ్వాసవి నువ్వే
నన్నూరించే రేపువి నువ్వే
నన్నలరించే నేటివి నువ్వే
నను పిలిచే గెలుపువి నువ్వే
నన్నొదార్చే తలపువి నువ్వే
నాకైన పిలుపువి నువ్వే
నాదైన వలపువి నువ్వే
నను తొలిచే బాధవి నువ్వే
నే తలచే(వలచే) రాధవి నువ్వే
నాలోని ప్రాణం నువ్వే
నాలోని బాణం నువ్వే
నాకున్న మోహం నువ్వే
నాదైన మోదం నువ్వే
నాలోని భారం నువ్వే
నేకన్న కల,
నాకన్నుల అల,
నేనున్న వల నువ్వే ......
నను వెదకడం లోనే నేను తప్ప, వెదకిన నేనంతా నువ్వే.. ...

Wednesday, March 24, 2010

రాలేవా ?

రాగాలు పల్లవించ రాలేవా నాలో
భావాలు బాధించ చెబుతున్న నీతో
బతుకు బంధాలు నెరపగ ఆశ నాలో
గేయాన్ని స్రవించు గాయనివైనావె, వలపు గానానివి కాలేవా నాకై
రాలేవా ? ఉండి పోలేవా మనమై.....?