Sunday, January 27, 2019

ఆకాశ వీధిలో అలవాటులేని అడుగులు

New year మొదలయ్యాక, ఈ సంవత్సరం చేయాల్సిన అతిముఖ్యమైన పనులేంటా అని ఆలోచిస్తుండగా, "ఇంతవరకూ మోగించిన single hand చప్పట్లు చాలు, జీవితంలోకి Eastmanని invite చేయాల్సిన సమయం ఆసన్నమైంది, ఎదురుగా కనిపిస్తున్న speed breaker దగ్గర ఆగి, పక్క seat fill చేసుకుందాం" అని అంతర్వాణి,  అంతర్వేదిలో గోదావరిలాగా ప్రసన్నంగా వినిపించింది. పూర్తిగా convince అవడానికి పెద్దగా time పట్టలేదు. అనుకున్నదే తడవుగా, మరింక ఆలస్యం చేయకుండా, ఇంటికి phone చేసి, పెద్దలకి inform చేసి permission తెచ్చుకొని, నా ఈ ప్రయాణం సుఖమయం అవడానికి అవసరమైన సలహాలకోసం, అటువైపు వెళ్లిన నా friends కొంతమందితో మాట్లాడటం మంచిదని, ఆ పని కూడా అవజేసి, నన్ను నేను సిద్ధం చేసుకున్నాను.

అలా, one fine day, విశ్వామిత్రుల వెంట మిథిలకి పయనమైన రాములోరిని తలుచుకొని, 'వెడలెను కోదండపాణి' అని పాడుకుంటూ, అందాల తారలుండే ఆకాశవీధిలోకి అడుగుపెట్టాను. అదేదో అమ్మాయిల college అనుకునేరు. కాదు, కాదు. కన్యామణులుండే రాయాలనాటి సీమ, పరిమళములు వెదజల్లు పుష్పవ్రజంబు నెలవైన పూదోట, కాంతులీను తారకావళి వసించు గగన తలము. అర్థం కాలేదు కదూ! What I mean is,  the Matrimony website. All that I did is creating a profile in a regional matrimony website. Timeతో పాటు దానిమీద మన అభిప్రాయం మారే అవకాశం మెండుగా ఉందికావున, అదేంటో ఏమీ తెలియని రోజున నాకున్న feeling, పై linesలో record చేసి ఉంచాను. చూద్దాం, భవిష్యత్తులో నాకెలాంటి  అనుభవాలు ఎదురవనున్నాయో, నా అభిప్రాయం ఎలా మారుతుందో. సరే, ఆ రకంగా, అందాల తారక కోసం, online వీధిలోకి visa తీస్కొని enter అయ్యానన్నమాట. 

చాలా carefulగా, selectiveగా interest express చేస్తున్న రోజులు. There is no time for bullshitting  కదా!  ఇంకో fine day, ఒకానొక profile నన్ను ఆకట్టుకుంది. ఎలా అంటే, ఇంచుమించు ఇలాగ. ఎందుకంటే ఏం చెబుతాం? పైగా మిమ్మల్నె అడుగుతాం, 'గాడ్పేల విసరు? పరిమళములేల చిమ్ము పుష్పవ్రజంబు? సలిలేమేల పారు?' అని.  అంతే, అలా సహజంగా జరిగిపోతాయి. చదుకున్న పిల్ల, ఉద్యోగం చేసుకుంటోంది, మధ్య తరగతి background, చూడగానే ఆకట్టుకునే కళ్ళు, ముఖ వర్ఛస్సు ఇలాంటివేవో కలిసి అలా పన్జేస్తాయి. So, ఆలస్యమెందుకని interest express చేశా. 2-3 రోజులైనా ఎలాంటి reply రాకపోవడంతో ఇక బ్రహ్మాస్త్రం ప్రయోగించాల్సిందేనని decide అయిపోయా. మరి, ఆ pull అటువంటిది. ఈ ఆకాశంలో, తారలేకాదు, చందమామలు కూడా ఎక్కువగానే ఉంటారు, కాబట్టి మరీ ఆలస్యం కూడా చేయకూడదు. పైగా, మన message వాళ్లు చూడలేదేమో అనే అనుమానం లేకుండా confirm చేసుకుని (దానికి కూడా కొన్ని సౌకర్యాలు ఉంటాయి ఈ software ఆకాశంలో), ఇక అస్త్రం ప్రయోగించాల్సిందే అనుకున్నా. ఇంతకీ బ్రహ్మాస్త్రం అంటే ఎంటనేనా మీ అనుమానం. నేను premium memberని కాబట్టి, కొంతకాలం లోపు, కొన్ని profiles యొక్క contact numbers తెలుసుకోవచ్చనమాట.  ఇదే అవసరం, అవకాశం కాబట్టి నాల్గవ రోజున తన contact తెలుసుకునే ప్రయత్నం చేశా, but to my surprise, ఆ పిల్ల తను కావాలనుకుంటే మాత్రమే మిగిలిన జనాలు తన contact తెలుసుకోగలిగేలాగా బిగించేసింది. You see, simplest of software engineering. So, చేసేదేమీ లేక, అంతర్జాలంలో అన్ని రకాలుగా వెదికి వెదికి అలసిపోయాక, కేవలం తను పనిచేస్తున్న company మరియు ఊరు మాత్రమే సంపాదించగలిగాను. కానీ, సుఖమెంటంటే, ఆయొక్క companyలో మనకి 'జాన్ జిగిరి' ఒకడున్నాడు. మొన్నామధ్యే క్రిస్మస్ కి రెండు వారాల సెలవులు నాతోనే  spend చేశాడు. అప్పుడు మేము చేసిన అల్లరి గురించి ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. One అల్లరి at a time. వాడిముందు ఈ విషయం ఉంచితే, ఒకే company కాబట్టి internal portalలో contact (mail, number, etc) దొరకవచ్చు. ఇంకా luck ఉంటే, తనని తెలిసిన వారే దొరకవచ్చు అని నా ఆలోచన.

సరే అనుకుని, మా వాడికి call కొట్టి, ఇది భయ్యా matter అని, వాణ్ణి, గమ్యం సినిమాలో అల్లరి నరేష్ లాగా చూపించా వాడికే (కమలిని కోసం వెదుకుతున్న శర్వానంద్ కి help చేస్తాడు కదా).  అంతే, పది నిముషాల్లో నాకు whatsapp చేసాడు తన number. 'పండగ జేస్కో' అని ప్రోత్సాహం కూడా.  అలవాటు లేని పని కదా, ఓసారి అలోచించి దూకుదాం అని కళ్ళు మూసుకుని ఒక 5 deep breaths తీస్కొని, ఆలోచించడం మొదలు పెట్టా. Already, something unethical చేసేశా, తను నా మెసేజ్ చూసి కూడా, interest లేక neglect చేసి వుండొచ్చు అని తెలిసి కూడా, తన number, తన permission లేకుండా ఎక్కడినుంచో దొంగిలించా. Breach of privacy.  తర్వాత మీడియాలో చెప్పుకోడానికి, పుస్తకాల్లో రాయడానికి, సినిమాల్లో చూపించడానికి  బావుంటాయని temptingగా ఉన్నా, ఇలాంటి విషయాల్లో consult అయ్యే ఇంకో friendకి call చేసి, 'మచ్చి, ఇదు దాన్ ప్రచ్న, ఎన్న పన్రదు?' అని  మొత్తం చెప్పుకుంటే, వాడు గట్టిగ నవ్వేసి, "బావుంది, but, ఇలాగ office portalsలో దొరికే numbers updated ఉండవు, and more importantly, మనం ముందు తనకి తెలిసిన వారి ద్వారా నీ profile introduce చేసే ప్రయత్నం చేద్దాం. అది better, direct call చేసి deal చేయడం కంటే" అని, "ఈలోపు రేపు ఓసారి నేను wrong call లాగా ఆ numberకి call చేసి నీకు confirm చేస్తాను అది correct అవునో కాదో" అన్నాడు. వాడు, నేను, ఇందాకటి అల్లరి నరేష్, తన wife (తను కూడా same companyలో work చేస్తోంది) అందరం ప్రయత్నించాం, mutual friends ఎవరైనా దొరుకుతారేమోనని. అబ్బే, ఉపయోగం లేదు, రక్తాభిషేకం జరగాల్సిందే అన్నాయ్ పరిస్థితులు. అలాంటి వారెవరు దొరకలేదు. So, మా మచ్చాని ముందుకెళ్ళమన్నా. "ఇంకోసారి ఆలోచించుకో" అన్నాడు. "ఏం పర్లేదు, ప్రపంచంతో యుద్ధాలు చేయలేకపోయినా, తనకోసం comfort zone బయటకొచ్చి, కనీసం ఇలాంటివైనా  చేయాలికదా" అన్నా. Achillis next day చంపబోయే Hectorతో చెప్పినట్లు,  "నీ energy నాకు నచ్చింది,  నేడు పోయి, రేపటికి  readyగా ఉండు" అన్నాడు.   

మరుసటి రోజు నిద్రలేచి, phone తీస్కుని చూడగానే, మచ్చా నుంచి message, 'Dude, call me, urgent!' అని. వామ్మో, వీడేదో పెంట పూశాడు నాయనో అనుకుంటూ call చేశా. మచ్చా చెప్పడం మొదలు పెట్టాడు, "నిన్న తనకి call చేసి, నేను నీ relationship manager లాగా introduce చేసుకున్నా" అన్నాడు. Relationship manager అంటే, నాలాంటి youngsters (male and female) ఇలాంటి విషయాలు deal చేసేటప్పుడు, other partiesని contact అవడానికి, information gather చేస్కోడానికి, మనల్ని గొప్పగా చూపించుకోడానికి, మొహమాట పడకుండా ఆ పనులని outsource చేసుకుని మనకోసం చేసిపెట్టే matrimony website వాళ్ళ service provider అనమాట. "వీడి అసాధ్యం కూల! నాతో చెప్పిందేమిటి, వీడు చేసిందేమిటి" అనుకుంటుండగా. "నమ్మకం కోసం Broadband కోసం పెట్టించుకున్న landline నుంచి call చేశాలే" అని talent చూపించాడు. నిజమే, వీడి talent నాకు తెలుసుకాబట్టే ఇంత కార్యాన్ని, కర్ణుని నమ్మినట్లు నమ్మి అప్పగించా.  "ఇంతకీ తనేమందో సొల్లు మచ్చా", అని ఇష్టంగా విసుక్కుంటే,  మొదలు పెట్టాడు, నాకు మొదటి lesson, "తనకి ఇప్పట్లో పెళ్లి చేస్కునే interest లేదంట" అని, "ఏయ్, ఏం మాట్లాడుతున్నావ్, 26F నువ్వు, తెలుస్తోందా" అన్నా ఆవేశంగా. "ఓహ్, ఓహ్!" అనగానే, "సారీ, నిన్ను కాదులే, తననే. సొల్లు చెబుతోంది" అన్నా. "అవును, అందుకే, కొంచెం press చేసిచూశా, మంచి profile, ఓసారి చుడండి, మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు, మీ interest మారొచ్చు, నచ్చక కాదు, interest లేక అంటున్నారు కదా, ఇలాగ" అన్నాడు.  "మరేమంది?", "convince అవలేదు, So, మీకేమైనా relationship manager ఉంటే చెప్పండి నేను ఓసారి discuss చేస్తా" అనికూడా అన్నా.  "లేదు, అలా ఎవరూ లేరు" , "పోనీ, మీ పెద్దలతో మాట్లాడతా, చెప్పండి మీ profile ఎవరు manage చేస్తారు?" "మా అక్క, but, వద్దులెండి, I will get back if I want to" అని calmగానే చెప్పిందన్నాడు. హ్మ్, ఇంకేముంది, clarity వచ్చిందిలే అనుకుని, గజినీని గుర్తు తెచ్చుకుంటూ ఉండగా, చెప్పాడు మచ్చా, "నా profileలో ఈ contact number పెట్టలేదుకదా మీకెలా దొరికింది" అని అడిగిందంట. మావాడు ఘటికుడు కాబట్టి, తడుముకోకుండా, "అవును, profile primary contactలో వేరే number ఉంది, but, secondary contact లాగ మా recordsలో ఉంది" అని confidentగా cover చేశా అన్నాడు. But, I think it's clear, we were busted. Doesn't matter now. "Obviousగా, reason ఏంటి అనేది చెప్పలేం, but we did our job" అన్నాడు మచ్చా. అలా,  ఆకాశ వీధిలో నా మొదటి వాహ్యాళి అలవాటులేని అడుగులతో సాగిందన్నమాట. 

4 comments:

  1. Kondagadi chilipi chestalu start chesadu....

    ReplyDelete
  2. Start cheyyani. Neeku naaku kudaradhu kadha elago...

    ReplyDelete
  3. Pooraditey poyedem ledu bro.. eekantam tappa.. nice one

    ReplyDelete
  4. If you like her(family,place,background of family),proceed through family and relatives to approach her and her family... Good luck..

    ReplyDelete