Tuesday, March 30, 2021

మా బానుమతి ఆంటీ సైలెన్సు (Episode-3)

(అన్ని Episodes ఇక్కడ దొరుకుతాయి.)
 
పక్కనింట్లో రోంత సప్పుడొచ్చినా, కొత్త కారు గేటుముందర ఆగినా మా ఆంటీ సేచ్చాండే పని ఆపేసి మరీ కిటికీలోంచి తొంగిసూడాల్సిందే. అందికే పక్కింట్లోకి వొచ్చిన బంధువులుగూడ ఆయమ్మను ఎచ్చరిచ్చారు 'బాగుండావా?' అని. ఆమద్య, జగ్గూ గాడి అక్కాబావ వాళ్లు రింగురోడ్డు పైన రోంత స్థలం కొన్న్యారని తెల్సింది మా అంటీకి, వాన్నే అడిగి కనుక్కుందిలే, 'పొద్దన్నుంచి యాడికో తిరుగుతానారే?' అని. 'కలుగులోంచి ఎలక చూసినట్లు చూసింటాది ఆంటీ' అనుకున్న జగ్గూకి సెప్పక తప్పలేదు, ఎక్కడ కొన్న్యారో, ఎంతకి కొన్న్యారో.

అప్పుడు కొట్టడం మొదులు బెట్టింది సుత్తి, వాడి నెత్తిమింద. వాళ్ల అల్లుడు వాళ్లకి శా...నా ఆస్తులు ఉండాయంట. మొత్తం ఎన్నుండాయో కూడా చెప్పలేమంట.  Income tax వాళ్లు వొచ్చారని ఆస్తుల లెక్కలు ఎవురికీ చెప్పరంట, ఆఖరికి పిల్లనిచ్చిన వీళ్లకు కూడా. అంతా ఇన్న్యాక, జగ్గూ గాడు "ఎన్నుండాయో, యాడుండాయో గూడా తెలీకుంటే ఎట్ల ఆంటీ, మట్టసంగ అడగండి, మీకేమన్నా టోకరా ఏసినారేమో అనిపిచ్చాంది సూచ్చాంటే" అన్న్యాడంట. ఆంటీకి కాల్తుంది కదా మరి, "Income tax గురించి మనకేం తెలుచ్చాదిలే జగ్గూ, వాళ్లకు దండిగా లెక్కుండాది గాబట్టి తెలుచ్చాది గాని" అనిందంట మూతిముడుసుకుంటా. 'నీ బడాయి బండ్లకెత్త' అనుకొని, "నాకు పనుండాదిలే ఆంటీ" అని ఆన్నుంచి లేసొచ్చినాడంట జగ్గూ గాడు. 

ఇది జరిగినాక రెండు వారాలకు జగ్గూ వాళ్ళక్కకి సీమంతం చేసినారు. బానుమతి ఆంటీ వచ్చిందిగానీ, శానా సైలెంటుగా ఉన్నింది. భోజనాల దగ్గరకూడా పేరు పెట్టకుండా తినింది అన్నీ. 'ఏమైందిబ్బా ఆంటీకి?' అనుకున్న్యారు సందులోని వాళ్లంతా. మరుసటిరోజు సాయంత్రం మిక్చరు కొండయ్య దగ్గర పార్సిల్ కట్టించుకుంటాంటే జగ్గూకి వాళ్ళ స్కూలు ఫ్రెండు తగిలి, ఒక వార్త చెప్పినాడు. జగ్గూ వాళ్ళ కాలనీలో ఉండే కాంట్రాక్టరు ఒకాయప్పకి ఈ ఫ్రెండు వాళ్ళు అప్పిచ్చారంట, ఆయన IP పెట్టి పరారయినాడంట. జగ్గూ వాళ్ళకేమైనా ఆ కాంట్రాక్టరు వాళ్లు తెల్సునేమోనని ఆ ఫ్రెండు అడిగినాడు, మరి రాబట్టుకోవల్ల కదా ఎంతోకొంత. తెల్దని చెప్పి ఇంటికొచ్చినాడు జగ్గూ. ఇంటికొచ్చేసరికి, హాలుమద్యలో పనిమనిషి పరక పట్టుకొని ఏదో చెబుతాంటే ఇంట్లోని అందురూ చాగంటి చెప్పే ప్రవచనం విన్నట్లు వింటానారు. తీరా చూస్తే, మిక్చరు అంగడికాడ జగ్గూ విన్న వార్తలే ఇక్కడకూడా వినపడతానాయ్. తనుకూడా వాళ్లతో కలిసి కూర్చున్న్యాడు జగ్గూ. TV9 దేవీ నాగవల్లిని మించిపోయిన ఈ పనిమంచి సంబరమెందిరా అంటే, మన బానుమతి ఆంటీ గూడ ఓ పదహైదు లచ్చలు ఇచ్చిందంట ఆ కాంట్రాక్టరుకి. 'ఓహో! ఆంటీకి పెద్ద టోకరా ఏసినారే' అనుకున్న్యాడు మన జగ్గూ. అసలే తనని పనినుంచి తీసేసినప్పటినుంచి ఈ పనిమంచికి బానుమతి ఆంటీ అంటే శానా కచ్చ. అందుకనే, ఆయమ్మ ఆనందానికి హద్దూపద్దూ లేకుండాపోయింది. 'ఇంగ సాల్లే పొయ్ పని చుస్కోపొమ్మని' చెప్పినా ఆయమ్మకి పోవాలని లేదు, కానీ, తొందరగా ఇక్కడ పని అయిపోజేసుకుంటే వేరే ఇండ్లల్లో కూడా చాటింపు వెయ్యొచ్చని గుర్తొచ్చి, ఆయమ్మ పనికి వంగింది. 

మిక్చరుతిని, టీతాగి, సందు చివర జనాలు షటిల్ ఆడుతూ కనపడితే వెళ్లి కూచున్నాడు జగ్గూ. ఆంటీకి కాంట్రాక్టరు టోకరా వేసిన సంగతి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తానాడు. కానీ, వాళ్ళింట్లో కూడా పనిమంచి చదివిన వార్తలు విన్న జగ్గూ ఫ్రెండుగాడు ఒకడు ఇదే విషయం మొదలుపెట్టినాడు, పోన్లే అని జగ్గూ కుదుటపడినాడు. ఆడుతున్న జనాలు కూడా ఆపేసిమరీ విన్నారు ఆ వార్తలు.

'అందుకేరా మొన్న మీ ఫంక్షన్లో సైలెంటుగా ఉన్నింది ఆంటీ' అన్నాడొకడు జగ్గూతో.
'ఎందుకుండదు మరి, అంకుల్ కి కూడా తెలీకుండా వడ్డీకి తిప్పిన లెక్కంటరా' ఇంకోడు చెబుతున్నాడు.
'పాపంరా, ఎవురితో చెప్పుకుని బాధపడుతుందో ఆంటీ?'
'అంకుల్ కి చెప్పుకోలేకపోతే, అల్లుడితో చెప్పుకుంటుందిలేరా!' 
'రేయ్ జగ్గూ, ఈసారి కలిసినప్పుడు, income tax గురించి కాదు, IP గురించి అడుగురా ఆంటీని'.  

---------------------------
* రోంత = రవ్వంత 
**ఎచ్చరించు = పలకరించు (e.g. బాగున్నారా? ఇదేనా రావడం? etc. )

Sunday, February 14, 2021

ఎడబాటన్నది ఎవరికి వేడుక?

నాజీవితంలో జరగని కొన్ని సన్నివేశాల్ని నేనే సృష్టించుకొని, నన్ను actorగా పెట్టి, నేనే దర్శకత్వం, రచన బాధ్యతలు కూడా వహించి, ఆయా సందర్భాల్లో కాసేపు జీవించి ఇలాగ పదిల పరచుకోవడం అనేది ఒక సరదా ఛాలెంజ్. మరి మనకి పూరి జగన్నాథ్ వచ్చి script ఇవ్వనప్పుడు, మనమే త్రివిక్రమ్ లాగా dialogues రాసుకొని, clap కొట్టుకోవాలి కదా. అలాంటి ఒక ఛాలెంజింగ్ breakup సన్నివేశం ఇక్కడ ప్రదర్శిస్తాను. నిజానికి నిజజీవితంలో breakup scene ఎంతమందికి ఇష్టముంటుంది? ఎడబాటన్నది ఎవరికి వేడుక? ఏదో నాలాంటి వాళ్లకి మాత్రమే మనలోని కళాకారుణ్ణి తృప్తి పరచుకోవడం కోసం తప్ప. అలాగే, article అవడంతో మీరు కేవలం చదవగలరు, నేను మరియు నాతో సన్నిహితంగా మెలిగిన వారు మాత్రమే ఈ sceneలో నన్నూహించుకొని నా నటనని అనుభవించగలరు. చుడండి మరి నా ferformance!


"ప్రేమించడం పిచ్చ easy, ఇప్పటికే నేను బొచ్చెడు మందిని ప్రేమించా"నని చెప్పుకుని తిరిగిన నేను, నీ పరిచయం తర్వాత ఒక్కరిని ప్రేమిస్తున్నాని అనుకోవడానికే సాహసించలేక పోతున్నా. ఎందుకంటే, నీకోసం తపించినంత నేనెవరికోసం, దేనికోసమూ తపించలేదు; లేనేమో కూడా! ప్రేమంటే అంతటి తపనా?

నీతలపుల్లో వసించి, విహరించి, పులకించినంతగా నన్నెవరూ, ఏ విషయమూ మైమరపించలేదు; ప్రేమంటే అంతటి మైమరపా?

ఇకమీద నిన్ను తలచుకున్నప్పుడల్లా, కారణాలేమైనా, ఒకటవలేకపోయామనే నిజం వేదనై నన్ను నిలువునా కలచివేస్తుంది. ప్రేమంటే వేదనా?

కానీ, నీ జ్ఞాపకాలు తీపి స్మృతులుగా జీవితాంతం నన్ను వెంటాడుతాయని మాత్రం తెలుస్తోంది. ప్రేమంటే ఆ మధుర స్మృతా?

ఇవన్నీ అవునోకాదో నాకు తెలీదు, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయో లేదో కూడా తెలీదు, కానీ నాకు మాత్రం ప్రేమంటే నువ్వే. ఒకానొక వసంతకాలపు సాయంత్రం ఈ కోటలోకి వీచి, గెలిచి వెళ్లిపోయిన సుగంధపు మరకలా గోడలమీద నువ్వుండిపోతావు, కూలిపోయేదాకా. 
----------

Title: సమ్మోహనం చిత్రంలోని 'కనులలో తడిగా' (రచయిత: రామజోగయ్య శాస్త్రి) పాట నుంచి.

Tuesday, November 17, 2020

నా కథ, మొదటిది!

నేను రాసిన 'సెకండ్ ఇన్నింగ్స్ ' అనే కథ, కౌముది అనే web monthlyలో (November, 2020) ప్రచురించబడింది.
  






Sunday, September 13, 2020

Agenda లేని నీరాగార నివిష్ట పాంథులమవుదాం!

Weekend కావడంతో, evening walkకి Amarతో కలిసి అలా కాలువ గట్టుకి వెళ్లా. అంతా నడిచి ఊరి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక interesting conversation నడిచింది. "మనిషి purest formలో ఎప్పుడు దొరుకుతాడు?" అని. 'Colleagues, relatives, neighbors, ఎరిగినవారు, చాలామంది friends కూడా ఏదో ఒక hidden agenda పెట్టుకొనే మాట్లాడుతున్న కాలమిది. మాటలెక్కడున్నాయి? అంతా Manipulation మయమే కదా. తెలిసినా తెలియనట్లు వ్యవహరించడం, కుదిరితే misinform చేసి ఇబ్బందికి గురిచేయడం, ఇందులో నాకేముంది అని ఆలోచించడం, వీలైనంత రాలగొడదాం అనుకోవడం, వాడు బాగుపడి పోతున్నాడే అని అసూయ, లేని బడాయిలు పోవడం, పబ్బం గడుపుకోవడానికి వీరి దగ్గర వారిని, వారి దగ్గర వీరిని తూలనాడటం, లేదా ఎవరి దగ్గర వారి భజన చేయడం, ఇవేకదా ఇవాళ జనాల మాటలు' అనుకున్నాం. "అవునన్నా, మనం నాగరికతలో ముందుకెళ్తున్నాం అనుకోడమేగానీ, actualగా ఇలాంటివన్నీ observe చేస్తే ఇంతేనా మన పరిపక్వత అనిపిస్తుందన్నా" అన్నాడు అమర్. 

సరదాగా ఎవరూ తెలీని ఊర్లోకెళ్లి, ఇంకా కుదిరితే, అక్కడి భాష తెలీని చోటికెళ్లి, టీకొట్టు దగ్గర టీనో, కాఫీనో తాగుతూ అక్కడ కూచున్న వాళ్లతో మాటకలిపితే, మనలోని స్వచ్ఛత బయల్పడుతుందేమో. వారెవరో, మనమెవరో. No hidden agenda. కాసేపటి తర్వాత జీవితంలో మళ్లీ కలిసే అవకాశమే ఉండదు. ఇంత చేయాలన్నమాట మనలోని స్వచ్చతని బయటకి తీయాలంటే. అప్పుడు మాట్లాడతాం మనిషిలాగా. ఉన్నది ఉన్నట్లు, అనిపించింది అనిపించినట్లు, దాయకుండా. అప్పు అడగరు కాబట్టి, మనం చేసే వ్యాపారంలో ఆదాయం ఎంతో చెబుతాం, వారికి దీని గురించి బయట ప్రచారం చేయాల్సిన పని ఉండదు కాబట్టి, ఆ వ్యాపారంలో మనం చేసే tricks గురించికూడా మాట్లాడతాం. రాసిపెట్టుకొని మళ్లీ మళ్లీ దీనిద్వారా వారిని exploit చేసే ఉద్దేశంతో కాకుండా genuineగా ఎదుటివారిమీది concernతో విషయాలు మాట్లాడతాం. తెలియని వాళ్లముందర బడాయికి పోవాల్సిన పనిలేదు, మరియు వాళ్లొచ్చి మనఊర్లో దండోరా వెయ్యరు కాబట్టి,  మన వృత్తిలోనో, సంసారంలోనో ఉన్న కష్ట నష్టాలు మాట్లాడటానికీ వెనుకాడం. ఎదుటివారి సమస్యలూ, ఆశక్తతల పట్ల  గెలిచేయాలని అనిపించదు, ఎత్తిపొడవాలని అనిపించదు.  Judge చేయాలనిపించదు, మనల్ని చేస్తారన్న consciousness ఉండదు. Ego ఊసే ఉండదు. కాళ్ళమీద పడదు కాబట్టి కాసేపు కడుపు చింపుకుంటాం. అసలక్కడ మనకి పేరే ఉండదు, శాస్త్రిగారు చెప్పినట్లు, అందరం, మనిషి అనే సంద్రాన కెరటాలైపోతాం. అప్పటివరకూ లోపల కప్పిఉంచిన మానవత్వంతో ఎగసిపడతాం. Rat race నుంచి relax అయ్యి, మనుషులమయ్యే ఆ కొంత సమయం కోసమే నేను మా జనాలని ప్రయాణాలు చేయడానికి, కొత్త చోట్లని, అక్కడి ప్రజలని, సంస్కృతులని తెలుసుకోడానికి తీసుకెళ్లేది. ప్రపంచంఎరిగిన వాళ్ళు, they don't hesitate to keep it real, కుంచించుకుపోయిన బుడగల్లాంటి ప్రపంచాల్లో బ్రతికేవారు they will end up living fake. అందువల్ల, సాటి ప్రజలతో deal చేసేటప్పుడు hidden agenda లేకుండా genuineగా జీవించడానికి ప్రయత్నిద్దాం. అందరం అందరితో, అలా టీకొట్టులో కలిసే జనాలతో ఉండేంత స్వచ్ఛంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం. 

Title గురించి:

శ్రీమద్భాగవతంలో,  ఒక సందర్భంలో, హిరాణ్యాక్షుడి శవం దగ్గర పడి ఏడుస్తున్న బంధు జనాలనుద్దేశించి, ఆయన అన్నగారైన హిరణ్యకశిపుడు ఇలా అంటాడు  

నీరాగార నివిష్ట పాంథుల  క్రియన్ సంసార సంచారుల్ వత్తురు, గూడి విత్తురు, సదా సంగంబు లేదొక్కచో !

నీరాగారము = చలివేంద్రము; నివిష్ట = ప్రవేశించిన; పాంథులు = బాటసారులు; క్రియన్ = లాగా; సంసార సంచారుల్ = సంసారాల్లోని జనాలు; వత్తురు=వస్తారు; కూడి = కలిసి; విత్తురు = విడిపోతారు; సదా = ఎల్లప్పుడూ; సంగము లేదొక్కచో = కలిసి ఉండరు;  

"చలివేంద్రంలో నీరు తాగడానికి వచ్చిన బాటసారులలాగా సంసారంలో మనుషులు కలుస్తారు, కాసేపు కలిసుంటారు, తర్వాత విడిపోతారు (చనిపోతారు), అంతేగానీ ఎల్లకాలమూ కలిసి ఉండరు" కాబట్టి ఇంక ఏడుపులు ఆపండి అంటాడు. కానీ, ఇంత చెప్పిన ఈ dirty fellow, అంతా అయ్యాక ఘోరమైన తపస్సు చేసి వరం అడుగుతాడు, ఏమని? మరణం లేకుండా. వీడి అసాధ్యం కూల! వీడు చెప్పిందేమిటి, చేసిందేమిటి? అది వేరే విషయం, మనమిప్పుడు చెప్పుకుంటున్న concept కొంచెం దూరం.

చెప్పొచ్చేదేంటంటే అధ్యక్షా, "నీరాగార నివిష్ట పాంథుల" లాగా మనం ఒకరితో ఒకరం మరింత స్వచ్ఛంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం. 

Friday, July 24, 2020

ప్రపంచం 'పని'చేయడం మానేసి చాలాకాలమైంది

ఎందుకంటే అది డబ్బులు సంపాదించడంలో చాలా బిజీగా ఉంది. అవును, పేరుకు మాత్రమే మనం సమాజంలో వివిధ రకాల 'పనులు' చూస్తూ ఉంటాం, కానీ, మనమందరం ఒకే పని చేస్తూ ఉన్నాం: డబ్బులు సంపాదించడం, ఆస్తులు వెనకేయడం. ఇప్పుడు అదే అందరి పని, మోజు, లక్ష్యం. ఆ కిక్కులో మనం మన 'పనులు' (professions)  ఎలా చేయాలో ఎప్పుడో మర్చిపోయాం. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, డబ్బులు సంపాదించడాన్ని,  సంపద పోగెయ్యడాన్ని నేను తప్పు పట్టడం లేదు, కేవలం, ప్రతీ వస్తు/సేవ వినిమయం దగ్గరా 24X7 పని చేసే complaint cells మరియు customer service ఎందుకు ఉన్నాయో ఆలోచించమంటున్నా, అంతే! 'విస్తరణ (expansion) మీదున్న importance, నాణ్యత (quality) మీద లేదేమో?' అంటున్నా. 

ఉదాహరణకి నాకే ఎదురైన ఒక సంఘటన చెప్పుకుందాం. మా అమ్మ కొన్ని సంవత్సరాల నుండి ఒక Mobile Phone వాడుతోంది. పల్లెటూరే అయినా tower ఉండటం వల్ల signals ఎప్పుడూ strongగా ఉండి అంతా సాఫీగా సాగింది, కొన్ని వారాల క్రితం వరకూ. కానీ, ఈ మధ్య calls వచ్చినపుడు మరియు చేసినప్పుడు ఒకటిరెండు rings అవగానే cut అవుతోంది, సరైన వివరణ లేకుండా. Restart చేయడం, SIM వేరే mobileలో వేయడం లాంటి అన్ని basic checks చేసి, issue SIMలోనే ఉందని తేల్చుకున్నాం. అయినా,  fix అవుతుందేమోనని కొన్నాళ్లు చూసి, అవ్వకపోవడంతో వేరే networkకి porting పెట్టా. పెట్టినరోజే source network వాడు call చేశాడు. చిత్రమేమిటంటే నేనేమీ చెప్పకుండానే, "sir, మీరు వాడుతున్న SIM card చాలా పాతది, ఏదో circuitry issuesఉన్నాయి, అందుకే మీ calls అన్ని automaticగా reject అవుతున్నాయి. కాబట్టి nearest storeకి వెళ్తే కొత్త SIM card ఉచితంగా ఇస్తారు, కావాలంటే మీరు onlineలో కూడా order చేయొచ్చు" అన్నాడు. 'మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే solve చేసేందుకు ప్రయత్నిస్తాం చెప్పండి, అలానే porting requestని cancel చేస్కోండి' అని చివర్లో request చేశాడు. "అలాకాదు భయ్యా, నేనేమీ చెప్పకుండానే SIM కార్డు issues ఉన్నాయ్, అందువల్ల ఫలానా సమస్యలు వస్తున్నాయి అని చెబుతున్నావే, ఇదేదో ముందే చెప్పిఉండాల్సింది కదా, ఇందాకే వేరే networkకి port చేశా, already first recharge కూడా చేశానే" అన్నా. అంటే, మా SIM cardకి ఏదో problem ఉందని తెలుసుకోగలడు, కానీ కొన్నివారాలు ఊరికే ఉండగలడు. అయితే, వేరే networkకి port అవుతున్నామని తెలిసిన వెంటనే తనే call చేసిమరీ విషయం ఏంటో వివరిస్తాడు వెళ్ళొద్దని request చేస్తాడు. 

అంతా విన్నాక, నేను అసంతృప్తి చెందానని, కుదరదని చెప్పేశా. సారాంశం: customer (business)ని కోల్పోతున్నపుడు వాళ్లు పెట్టుకున్న RED ALERT, అదే customerకి service provide చేయడంలో (కొన్ని వారాల వరకూ) ఇబ్బంది కలిగినపుడు పెట్టుకోలేదు, priorities అలా ఉన్నాయంటున్నా! మళ్లీ adsలో మాత్రం మంచి విశ్వాసమున్న జంతువుని చూపిస్తారు.

ఇలాంటి ఇంకో సంఘటన మందుల కొట్టులో కూడా జరిగింది నాకే. వాళ్లకి వాళ్ల sales target reach అవడమే కావాలి, వచ్చినవాడికి correct medicine ఇవ్వడంవాళ్ల 'పని' అని మర్చిపోయారు. జాగ్రత్తగా చూడకుండా ఇంకో medicine ఇచ్చిపంపారు. రెండుసార్లు. వాళ్లకి తెలియాలి, "apple బదులు pine-apple ఇవ్వలేదు, ఒక medicine  బదులు ఇంకోటి ఇచ్చారు" అని. చూసుకోకుండా వాటిని వేసుకుంటే ఏమవుతుందో మనకంటే వాళ్ళకే బాగా తెలుసు కదా? దీనిగురించి ఒక Doctorతో discuss చేశాక తెలిసింది, Exactగా prescribed medicine లేకపోయినా, కాస్త అటుఇటుగా ఉందని (customerకి చెప్పో చెప్పకుండానో) వేరే medicine ఇవ్వడానికి కూడా వీళ్లు వెనుకాడరని. Again, priorities!

ఇవన్నీ target driven corporate worldలో common అనుకుందామన్నా, మనచుట్టూ ఉండే మాములు జనాల్లోకూడా కనిపిస్తోంది ఈ attitude.  

మన parents వయసున్న పెద్దలు, చుట్టాలబ్బాయి (లేదా, సహోద్యోగి కొడుకు) ఏం పనిచేస్తాడో చెప్పలేరేమో గానీ, ఎంత సంపాదిస్తాడో మాత్రం చెప్పగలరు. ఎందుకంటే prioritiesలో 'పని' ఎప్పుడో వెనకబడింది, అసలది అక్కర్లేదు. అందుకనే, ఎక్కడైనా కలిసినప్పుడు పలకరించగానే, పనిచేసే ఊరు, జీతం మాత్రం అడుగుతారు. 'పని' గురించి అడగరు, అవసరంలేదు. ఏదో సినిమాలో అన్నట్లు, అవార్డులు ఎవరికి కావాలీ?, రివార్డులే మన అజెండా. (కానీ, ఇంకా బుర్రలు పాడుకాని అమాయకపు పిల్లలు మాత్రం అడుగుతారు). ఈ priorities మారుతున్న క్రమంలోనే కొన్ని వృత్తులకి  సమాజంలో మునుపున్నగుర్తింపు ఇప్పుడులేదు, అలాగే  గర్హ్యమైన ఇంకొన్ని వృత్తులు ఇప్పుడు కొత్త favorites అనడం అతిశయోక్తి కాదు. అంటే, వృత్తులు వాటి విశిష్టతని కోల్పోయాయా? అవునో-కాదో, మంచిదో-కాదో కూడా నాకు తెలీదు, కేవలం ఒక పరిశీలన. మనం ఫలానా 'పని' చేయడానికి, ఆ 'పని'కన్నా ఏమైనా 'పనే'తర కారణాలు బలంగా పనిచేస్తూ ఉండటాన్ని గురించి ఆలోచిద్దాం అంటున్నా. Especially, మనలో చాలామందికి ఇప్పుడు survival పెద్ద matter కాదు కాబట్టి. 

Again, నన్ను అపార్థంచేసుకో వద్దని మనవి, packagesని రివార్డులని తప్పుపట్టడంలేదు. అవన్నీ మంచిదే. కానీ, ప్రోత్సాహకాలు (incentives) ఎలాంటివైనా, 'పని'లో సృజనాత్మకత (creativity)ని, ఉత్పాదకత (productivity)ని పెంపొందించేందుకు ఉద్దేశింపబడినవని, అంతేకానీ, వాటికోసం ఆ  'పని'నే పణంగా పెట్టే attitude మాత్రం వినాశకారి అని నా అభిప్రాయం. Now, మనిషి జీవితం అనేది ఒక 'పని'లా చూస్తే (ఈ భూమ్మీదకి మనం అందుకోసమే వచ్చాం కదా!),  దానికి మనం పెట్టుకున్న ప్రోత్సాహకాలు, జీవించడం అనే 'పని'నే వెనక్కుతోసేశాయేమో ఎవరికి వాళ్లే తేల్చుకోవాలి. అది మాత్రం గుర్తుచేస్తున్నా!

Sunday, May 10, 2020

बाप बाप होता है, बेटा बेटा होता है

ఎప్పటికప్పుడు తండ్రులని outsmart చేశాం అనుకుని పప్పులో కాలేసే కొడుకులు కొంతమందైతే, accidentalగా దొరికిపోయిన కొడులకి తామెంత స్మార్టో చూపించే తండ్రులు కొంతమంది, వెరసి, बाप बाप होता है, बेटा बेटा होता है. అలాంటి కొన్ని real-life smart stories .

------------------------------------------------------
"ఎన్నిసార్లు చెప్పా లక్ష్మీ నీకు! వడ్డించే ముందే నెయ్యి కాచిపెట్టుకోమని, తీరా అడిగిన తర్వాత వెళ్లి వేడిచేసి పట్టుకురావడం అలవాటయి పోయింది నీకు. అందాకా plateలోకి తొంగిచూస్తూ ఉండమంటావా మమ్మల్ని?" కరోనా విధించిన lockdownలో కూడా, మధ్యాహ్నం భోజనాల దగ్గర భార్యమీద తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నాడు శ్రీనివాసరావు. Stove వెలిగించడానికి హడావిడిగా అగ్గిపెట్టె వెదుకుతున్న లక్ష్మికి సలహా ఇచ్చాడు, ఈమధ్యే M Tech పూర్తిచేసిన వాళ్ల ఒక్కగానొక్క కొడుకు అర్జున్, "ఒక lighter కొనుక్కోవచ్చుగా  mummy, stove దగ్గరే పడుంటుంది, అగ్గిపెట్టె కోసం అటూఇటూ వెళ్లకుండా".

"అందాకా, వీడి దగ్గర ఉన్న lighter తీస్కో లక్ష్మి, పనికొస్తుంది నీక్కూడా" నింపాదిగా అన్నాడు శ్రీనివాసరావు అర్జున్ ముఖంలోకి చూస్తూ.

తింటున్నది గొంతులో పడేసరికి, ఖల్లుమని దగ్గుతూ తండ్రివైపు షాకయ్యినట్లు చూస్తున్నాడు అర్జున్, తనకేం అర్థం కాలేదన్నట్లు.

"ఆపరా నీ నాటకాలు, పొద్దుటే నీ బ్యాగులో దొరికింది ఈ cigarette lighter. బ్యాగులన్నీ ఖాళీచేసి పైన cupboardలో పడేసినట్లు cutting ఇస్తే కనుక్కో లేరనుకున్నావా?" అని జేబులోంచి తీసి చూపించాడు.

అక్షరాలా తనదే. చేసేదేమి లేక, "అమ్మనా బాబోయ్, ఇంకా జాగ్రత్తగా ఉండాలనమాట నీతో" అనుకుంటూ, అమ్మకి అగ్గిపెట్టె వెదకడంలో సాయం చేయడానికి అన్నట్లు అక్కడి నుంచి లేచి వంటగదిలోకి వెళ్ళిపోయాడు.
------------------------------------------------------
సంతోష్ convocationకి Vizag నుంచి బెంగుళూరు వచ్చిన  తన family అందరూ evening flightకి return అవుతున్నారు. పొద్దున Convocation అయ్యాక, అక్కడే భోజనాలు అవజేసుకొని, Campus అంతా తిరిగి, అన్నిచోట్లా photos తీసుకొని, Messలో టీ, snacks తీస్కొని హాస్టల్లో తన roomకి వచ్చి ఒక్కొక్కరే రెడీ అయ్యారు.

Winterలో Europe వెళ్లి PhD join అయ్యేదాకా,  తనిప్పుడు అదే campusలో Research  Assistant గా work చేస్తున్నాడు. కాబట్టి, అమ్మానాన్న, పెద్దక్క బావ, చిన్నక్క కలిసి మొత్తం ఐదుగురికి మాత్రమే tickets book చేసారు.  అందరూ కలిసి airportకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూంటే, సంతోష్ వాళ్ళ నాన్న అన్నారు, "నేనూ సంతోష్ బండి మీద వస్తాం, మీరంతా Cab తీస్కొని వెళ్ళండి" అని. అలానే బయలుదేరారు అందరూ.

బండిమీద వెళ్తున్న  తండ్రీకొడుకులు దేవనహళ్ళి toll gate దాటేశారు. అప్పుడు, తండ్రి, "ఓసారి బండి ఆపరా !" అనేసరికి, side తీస్కొని కొద్దిదూరంలో ఆపేశాడు సంతోష్. ఏం జరుగుతోందో అర్థంకాక, "Flightకి time అవుతోంటే, ఇక్కడ ఆపమంటాడేంటి ఈయన?" అనుకున్నాడు సంతోష్. బండిదిగి, పక్కకివెళ్లి జేబులోంచి సిగరెట్, అగ్గిపెట్టె తీసి వెలిగించాడు తండ్రి. "ఓర్నీ, దీనికా!" అనుకున్నాడు సంతోష్.

ఓ ఐదునిముషాలు మెల్లిగా సిగరెట్ ఆస్వాదించిన తండ్రి, దాన్ని పడేసి, బండి దిగకుండా కూర్చున్న సంతోష్ దగ్గరికొచ్చాడు. Mobile phone jeans లోపల పెడుతూ, 'ఇంక బండితీనా?' అన్నట్లు చూస్తున్న సంతోష్ మొహంలోకి లోతుగా చూస్తూ, "ఇదిగో ఇదుంచు" అని ఇందాక అయన వాడిన అగ్గిపెట్టె చేతిలో పెట్టాడు. Flight ఎక్కేటప్పుడు ఇలాంటివి ఉండకూడదు కదా, అందుకని ఇచ్చారేమోలే అనుకున్నాడు సంతోష్. కాదన్నట్లు ఇంకా తీక్షణంగా చూస్తూనే ఉన్నాడు తండ్రి. 'ఏంటా?' అని దానివైపు చూసిన సంతోష్ ఇట్టే గ్రహించాడు, అది తన roomలో cricket kit అడుగున దాచిందని. కొన్ని క్షణాలు ఇద్దరూ మాట్లాడుకోలేదు. కానీ, అనాల్సినవన్నీ అనేసినట్లు ఒకరికి, వినాల్సిందంతా విన్నట్లు ఇంకొకరికి అనిపించింది. మెల్లిగా తండ్రిగారొచ్చి బండిమీద వెనకాల కూచున్నారు. బండి airport వైపు దూసుకెళ్లింది, సంతోష్ గుండెలమీద (జేబులో) ఉన్న అగ్గిపెట్టె మాత్రం తెగ అదురుతోంది.
------------------------------------------------------

పొద్దున్నే ఏడుగంటలయ్యి, మొహంమీద ఎండ పడేసరికి, మేడ మీద పడుకున్న చందు మెల్లిగా నిద్రలేచాడు. Lockdownకి ముందే చెల్లెలు engagementకని వచ్చి, తిరిగి Benguluru వెళ్ళలేక ఇంటినుంచే work  చేస్తున్నాడు. కళ్లు నులుముకుంటూ కిందకొస్తూ, మెట్లమీద కూచొని కాబోయే బావగారితో phoneలో మాట్లాడుతున్న చెల్లెల్ని దాటుకొని, కొత్తగా కొన్న plastic chairలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న నాన్నగారి ముందు, ఇంకో కుర్చీలో కూలబడ్డాడు. నిద్రమత్తులో ఉన్నా, తనవేపు కొత్తగా చూస్తున్న నాన్నగారిని గమనించాడు కానీ, ఏమీఅనలేదు. ఇంతలో, చట్నీకని కొబ్బరి తీస్తున్న అమ్మ చూసి, "లేచావా, coffee తెస్తా ఉండు" అని వంటింట్లోకెళ్లింది. వెనకాలే తనూ వెళ్లి అడిగాడు "ఏమైందమ్మా, నాన్నగారు ఎప్పటిలాగా Mobile phoneలో Jagan videos పెట్టుకోకుండా, పొద్దున్నే చిరాగ్గా అలా చూస్తున్నారు నన్ను?" అని. "అవునా, ఏమోరా తెలీదు, అడగకపోయావా?" అంది పాలు కాస్తున్న అమ్మ.  "ఏమోలే" అనుకుంటూ, గబగబా coffee తాగేసి, ready అవ్వడానికి bathroomలోకి దూరిపోయాడు. 

Tiffin అయ్యాక మేడమీది గదిలోకి వెళ్లి, teamతో daily objectives meeting కోసం TV పక్కన పెట్టిన తన laptop bag  తీస్కొని  మేడ ఎక్కేసాడు. ఓ పావుగంటయ్యాక, "అమ్మా, నా earphones కనపడట్లేదు, bagలోనే ఉండాలి తీసారా ఎవరైనా?" అంటూ కిందకొచ్చి వెదకడం మొదలు పెట్టాడు హడావుడిగా. "అవున్రా, మర్చిపోయా చెప్పడం, రాత్రి మీ నాన్నగారు పడుకునేముందు కూడా ఆ సోది వీడియోలు చూస్తూ విసిగిస్తున్నారని నేనే నువ్వు చెవిలో పెట్టుకునేవి తీసుకోమన్నాను. ఆ TV దగ్గరే పెట్టారేమో చూడు" అంది. "ఆ, దొరికింది లే" అని తీసుకోని వెళ్ళిపోయాడు మేడ మీదకి.

మధ్యాహ్నం భోజనాల టైమయ్యేసరికి అందరూ dining table దగ్గర హాజరవుతున్నారు. అమ్మ వంటింట్లోంచి ఒక్కోటీ table మీదకి సర్దుతోంది. ఇంతలో చందు water bottle తీసుకోబోతూ, పక్కనే ఉన్న వేడి రసం  గిన్నె తాకి "అబ్బా!" అని, ఉఫ్ఫుమంటూ  చెయ్యి ఊదుకున్నాడు. అంతా చూస్తున్న నాన్నగారు, "ఒళ్లు కాస్త దగ్గర పెట్టుకుంటే మంచిది" అన్నారు ఘాటుగా. 'అరే, ఇంత చిన్నదానికే అంతమాట ఎందుకబ్బా!' అనుకున్నారు మిగిలిన అందరూ, కానీ ఎవరూ ఏమీ అనలేదు. భోజనాలు నిశ్శబ్దంగా అయిపోయి, చందు fastగా మేడెక్కేసాడు.   

పొద్దున్నించీ ఈయనేంటి చిరాగ్గా ఉన్నాడు మనమీద, కొంపదీసి బడ్డీ కొట్టు దగ్గర సిగరెట్ కొంటున్నపుడు చూసిన ప్రభాకర్ uncle గానీ ఆపుకోలేక ఈయన దగ్గర పిత్తేశాడా? చెప్పేవాడైతే మొన్న పొద్దున్న walkingలోనే చెప్పేసేవాడేమో, ఇవాళ్టిదాకా ఎందుకు ఆగుతాడు? ఎందుకైనా మంచిది జాగ్రత్త పెంచాలి అనుకుంటూ, mobile charger కోసం laptop bagలో వెదుకుతున్నాడు. shampoo packet లాంటివి తగిలాయి, అవేంటో వెంటనే తనకి స్ఫూరించింది. కరెంటు షాక్ తగిలినట్లు, 'వీటిని చాలా లోపల ఉన్న చిన్న zipలో కదా దాచేది, బయటి zipలోకెలా వచ్చాయి?' అనుకున్నాడు. వెంటనే earphones గుర్తొచ్చాయి. 'కొంపదీసి, రాత్రి వాటిని తీసుకునేటప్పుడు నాన్నగారు వీటిని చూసేశారా? గుండె వేగం కొంచెం పెరిగింది. అయినా, ఒకే సరంగా ఉండాలి కదా, ఇలా మూడు separateగా ఉన్నాయేంటి?  F***, దొరికిపోయాం. చూసేశానని చెప్పడానికి, ఇలా వీటిని separateగా చింపేసి తన సంతకం వదిలాడనమాట, మన బాబు. Benguluruలో ఎక్కడైనా దొరుకుతాయి కదా, ఇలా bagలో maintain చేయాల్సిన కక్కుర్తి ఎందుకురా?' అని అప్పుడెప్పుడో వీటిని bagలో దాచిన సంగతి గుర్తొచ్చి, తనని తానే తిట్టుకున్నాడు. 'పోన్లే, చేసేదేముంది, చెల్లెలి పెళ్లయ్యాక, late లేకుండా రమ విషయం బయట పెడదాం. కానీ, ఈలోపు ఈయన మనల్ని తిరుగుబోతు అనుకోకుండా ఉంటే చాలు' అనుకున్నాడు.
------------------------------------------------------------------
ఇంకొన్ని ఇంకో రోజు. 

Thursday, April 30, 2020

మా బానుమతి ఆంటీ కరోనా కష్టాలు (Episode-2)

(అన్ని Episodes ఇక్కడ దొరుకుతాయి.)
 
బిడ్డ పెండ్లి ఆలబము వచ్చినాల ముంచి, మా ఆంటీకి నిద్దర్రాడంల్యా. సందులోండే అందరికీ జూపిచ్చి, "బిడ్డా అల్లుడూ బాగొచ్చినార్లే" అనిపిచ్చుకోవల్లని ఇంతవరకూ ఆశగా ఎదురుజూచ్చా ఉన్న్యాది. పా.....పం, తీరా వచ్చినాక, ఎవురికి జూపీడానికీ కాడంల్యా. ఏమంటే, కరోనా. ఎవురూ యాడికీ పోగుడ్దని గవర్నమెంటోళ్లు మొత్తుకొని జెప్తాండారు.

పాపం, ఈ కాయలా వచ్చి మా ఆంటీకి కాళ్ళూచేతులూ కట్టేసినట్టుండాది. యవ్వారాలన్నీ ఏటికిబోయినాయి. పొద్ధచ్చం ఇంట్లోనే ఉండల్ల. అల్లుడు జెప్పినాడని పనిమంచినిగూడా రావాకన్న్యారు. ఇంగెవురికి జెప్పుకుంటాదీ వాళ్ల బడాయి? ఆయ్మ సావు సెప్పలేం. కడుపుబ్బి పోతాంటాది ఈమంతన.

ఎట్టుండేది; ఎట్టైపోయింది ఆంటీ! అప్పట్లో, ఆరుబయట సాయంత్రం యవ్వారం మొదులుబెడితే, పొద్దుగునికి ఇంటాయన పిల్చినా పట్టిచ్చుకునేది కాదు. ఆయప్ప సావు ఆయప్పదే, ఈయమ్మ యవ్వారం ఈయమ్మదే. ఎప్పుడో ఆయప్పకున్న సుగరు సంగతి గుర్తొచ్చే, "రైసు కుక్కరు ఆన్ జెయ్ బ్బ అట్ట"  అంటుంది. ల్యాకుంటే, అయప్పే రొండు సెపాతీలు తిరగేసుకుంటాడు. ఇంకొన్నిసార్లు, బాగా లేటయితే బయటికిబొయ్ ఇడ్లీలు కట్టిచ్చక రమ్మంటాది, అంతేగాని, యవ్వారం దగ్గర కాంప్రమైజే కాదు. "మొగుడు దొడ్డమంచి గాబట్టి ఈయమ్మ యవ్వారాలు సాగుతానయ్" అనుకున్న్యారు సందంతా.

మరిప్పుడో, పొద్దన ముగ్గేసే టైములో ఎవురన్నా కనబడితే యాడ మాట్టాడాల్సి వచ్చుందోనని బెరిగ్గెన ముగ్గుగీకి లోపలికి పోతాది. ఖర్మగాలి ఎవరన్నా ఎచ్చరిచ్చే, రొండు మూడు పొడి మాటలు, అంతే. "మాయల్లుడు జెప్పినాడు" అనుకుంట మూతికి కొంగు అడ్డం పెట్టుకుంటాది ఆ మాట్లాడిన రోంచేపూగుడ. ఎప్పుడన్నా సాయంత్రం, బిడ్డా అల్లుడు వీడియో కాల్ జేచ్చే, సందంతా ఇనపడాలని కావాలనే కాంపౌండు లోకొచ్చి గెట్టిగా మాట్లాడతాది. ఒక్కోరోజు, మిద్దెక్కి మాట్లాడతాది, ఎక్కువమందికి ఇనపడతాదని. జగనన్న ఇంటింటికీ మాస్కులిచ్చినాక, అల్లుణ్ణి impress జెయ్యడానికి ఓరోజు ఇంకా పొద్దుండగానే మిద్దెక్కి మాస్కు కట్టుకొని మాట్లాడతాంటే, జగ్గుగాడు చూసి నవ్వినాడంట. అంతేనా, సందంతా అంటిచ్చినాడు. బైటికిపోతే పెట్టుకోవల్లగాని, మిద్దెపైనగూడ పెట్టుకుంటే నగరామల్ల! మరుసటిరోజు పొద్దన ముగ్గేచ్చా, బయటికి పోడానికి బండితీచ్చున్న జగ్గుగాణ్ణి నిలబెట్టి అడిగింది ఆంటీ. మాస్కు మ్యాటర్ కాదులే, దుబాయిలో ఉన్న జగ్గు అక్కాబావల గురించి. బాగున్నారని జెప్పి, అడగకపోతే బాగుండదు గాబట్టి, ఆంటీ వాళ్ల బిడ్డ అల్లుడి గురించి జగ్గు అడిగినాడు రివర్సులో. ఎన్నాళ్లనుంచో ఊదుకొని ఉందేమో కడుపు, "వాళ్లకేం, లెస్సగుండారు! మాయల్లుడు తెల్లార్దాన్నే లేసి రొంచేపు ఆఫీసు పంజేసుకుంటాడు, మల్ల రడీ అయ్యి, అక్కనిలేపి కార్ను ఫ్లేక్సు కలిపిచ్చాడు టిఫిన్ జెయ్యమని" అని దినచర్య మొత్తం జెప్పడానికి రడీ అయ్యింది. ఆంటీ సంగతి బాగా తెల్సుగాబట్టి, జగ్గుగాడు, "ఇడ్లి, దోశ ఏసేది నేర్సుకోమను ఆంటీ బావను, ఎన్నాళ్లని తింటాది అక్క కార్ను ఫ్లేక్సు, పాపం బోరు గొట్టదూ?" అని కిక్కుకొట్టి సర్రన వచ్చినాడంట ఆన్నుంచి.

సాయంత్రం సందుచివర క్రికెట్టు ఆడతా, మాకుజెప్పి భయపడినాడు పాపం, ఆంటీ వానిమింద కచ్చకట్టింటాదని. మొత్తానికి, మా జగ్గుగాడు వాళ్ల కారుని బుడ్డ కారు అన్నందుకు ఆంటీమింద ప్రతీకారం తీర్చుకున్న్యాడు. ఆంటీ మాత్రం ఎప్పుడు lockdown ఎత్తేచ్చారా, ఎప్పుడు యవ్వారాలు మొదలుపెడదామా అని ఎదురు జూచ్చాంది. సందులో జనమేమో lockdownలో కాలుష్యం, రొద ల్యాక బాగుపడ్డ సిటీల మాదిరి ఆయ్మ బెదడలేక బా...గుండారు. 

Tuesday, April 7, 2020

నవోఢోల్లస దిందిరా పరిచరిష్ణు

"ఏమిరా, ఏంజేచ్చానవ్ ?" phoneలో నా ప్రశ్న.

స్నేహితుడి సమాధానం, "ఏం జెప్పమంటావ్ లేరా, ఈ lock down వల్ల రాత్రి దూల తీరింది. motor cycle మీద కాసేపు, highway లో lorry మీద కాసేపు, private busలో ఇంకాసేపు, ఆ తర్వాత అర్ధరాత్రి mobile flash వెలుగులో రెండు గంటలు కాలినడక చేసి తెల్లవారుఝామున ఎప్పుడో ఇల్లు చేరారా నాయనా! పులుసు కారిపోయింది. ఇదిగో ఇప్పుడే లేశా."

"ఏమిరా అయ్యా, అంత వరకూ ఎందుకున్నావ్? college కూడా నడవడం లేదుగా, ముందే పోవాల కదా ఇంటికి!" మావోడూ సదువుజెప్పే ఉద్యోగమే.

"పొయ్యి ఉండాల, కానీ పోలేదు, ఇలా అవుతుందని అనుకోలేదులే."

"అయినా రెండు గంటలేగారా ఇంటికి ? అంతసేపు ఎందుకు పట్టింది?"

"మన ఇంటికి కాదురా, home minister ఇంటికి వచ్చా!" సిగ్గైపోయినాడు మనోడు. Cabinet minister అనుకునేరు, కాదు, వాడితో కాపురంచేసే minister.

"ఓ...హో! అదీ సంగతి. పోతావ్, నడ్సుకుంటూ అయినా  పోతావ్, దేక్కుంటూ అయినా పోతావ్! భరించలేని విరహం అసుమంటిది మరి."

 "ఆపరా రేయ్, కుక్కలు తోలుకుంటూ నడిసినా రా రాత్రి, bypass నుంచి ఇంటికి, పెద్ద సాహసమే చేశా."

"అవునా, 'చెలియా, చెలియా చెయ్ జారివెళ్లకే' అంటూ నాగార్జున లాగా పాట పాడుకుంటూ వెళ్ళావ్ అనమాట!"

"అంత లేదు, అదృష్టం బాగుండి ఏమీ కరవలేదు, safeగా చేరా, ఏమైనా అయ్యుంటే ఈ lock down timeలో పెద్ద ఇబ్బందయ్యేది. తెల్లవారుఝామున ఇల్లుచేరి door కొట్టేంతవరకూ కుదురులేదు ప్రాణానికి"

"ఎవరి ప్రాణానికో?"

"చెప్పకుండా వచ్చాగా, నా ప్రాణానికేలే. చెప్పుంటే ఇలా ఎందుకు రానిస్తారు ?"

"ఆ..హా! కొంచెం surprisinguu, ఇంకొంచెం thrilluu .... పులుపు తగ్గలేదురా నీకు, ఐదు quarterలయ్యాక కూడా (తాగేవి కాదులే) బానే maintain చేస్తున్నావ్."

"పూలుపూ సలుపూ కాదులేరా, lock down వల్ల అన్ని పనులూ వాయిదా పడ్డాయిగా, చేసేదేం లేదింక. "

"అందుకని వచ్చానంటావ్ అత్తారింటికి? నేనింకా, చాన్నాళ్లయిందిగా, చూడకుండా ఉండలేక వచ్చావ నుకున్నాలే; అదే, మీ అత్తమామల్ని."

"ఏడిశావ్ లే గానీ, నీకంతా బానేఉందా లేక అంటుకుందా ఈ కరోనా?"

"ఇప్పటికైతే no symptoms. Right timeలో వచ్చేసాం, ఈ రెండు వారాలు అక్కడ (UKలో) ఇరుక్కొని ఉండుంటే అంతే సంగతులు."

"హ్మ్, ఎక్కడున్నావ్ మనింట్లోనేనా? జాగ్రత్తగా ఉండరోవ్, పెద్దోళ్ళకి దూరంగా ఉండు కొన్నాళ్లు"

"మనింట్లో కాదుగా నేనుండేది" నేనైతే సిగ్గుపడలేదు.

"ఓ..హో! అంతా అత్తారిల్లే అనమాట! సర్లే, మొత్తానికి అలా plan చేశాం ఇద్దరం ఈ  lock down period. అత్తారింట్లో అల్లుళ్ళకి ఉండే treatment అసుమంటిది మరి. అయినా, నా సంగతి అటుంచు, మేము పాతబడి పోయాంలేగాని, నీకెలా సాగుతోందో చెప్పరా కొత్తపెళ్ళికొడకా? ఇలాగన్నా అల్లెం తినే అవకాశం దొరికిందిలే, enjoy చెయ్. లేకపోతే jobలు, projectలు అనుకుంటూ ఈ ముచ్చట్లేవి అయ్యేవికాదు, మొత్తానికి ఈ కాలానికి సుడిగాడివే, కరోనా కలిసొచ్చింది నీకలాగా."

"బాగుందిరోవ్, తిండి ఎక్కువ అవడం ఒకటి, home quarantine వల్ల బయటికి వెళ్లలేక పోవడం ఒకటి తప్ప rest all రమ్యంగా ఉందిరా అబ్బాయ్"

"ఉంటుందుంటుంది. అలాకాదూ, home quarantineలో కూడా ఒక roomకే పరిమితం అయ్యి, అందరికీ దూరంగా ఉండట్లేదా, government instructions అనుసారం. ఇలాంటి over action బానే చేస్తావుగా నువ్వు"

"ఎక్కడా? వీళ్లు, 'ఆఁ , ఏముందిలే, నువ్వు గిలి గట్రా ఏం పెట్టుకోవద్దు. ఏమేం కావాలో మొహమాట పడకుండా అడిగి చేయించుకో హాయిగా!' అని పిచ్చ light తీసుకున్నారు. రెండు మూడు రోజులు resist చేసే ప్రయత్నం చేశాగాని, అబ్బే, కుదర లేదు, విష్ణు అవతారం ఎత్తించారు మనచేత"

"విష్ణు అవతారమా?"

"ఆ, నవోఢోల్లస దిందిరా పరిచరిష్ణు, అని శ్రీమహావిష్ణువుకు పోతన వాడిన ఒక adjective.

నవోఢోల్లస దిందిరా పరిచరిష్ణు --> నవ + ఊఢ + ఉల్లసత్ + ఇందిరా + పరిచరిష్ణు
నవ = కొత్త, ఊఢ = వివాహిత, ఉల్లసత్ = ఉల్లసించు, ఇందిర = లక్ష్మీదేవి, పరిచరిష్ణు = పరిచరించ బడేవాడు[1]

కొత్త పెళ్ళికూతురికి మల్లే నిత్యం ఉల్లాసంగా ఉండే లక్ష్మీదేవిచేత  పరిచరించ (సేవించ) బడే వాడు అని అర్థం. ఆరకంగా, ఆయన భూలోకంలో అవతారాలు తీసుకోవడం కాదు, మనమే పెళ్ళైన కొత్తలో నవ వధువూ and family చేసుకునే సేవలందుకోవడం ద్వారా ఆ కొన్నాళ్ళూ ఆయన అవతారం స్వీకరిస్తాం అనమాట."

"దేవుడా! ఇంకేం, మొదలుపెట్టు నీ అవతార ప్రయోజనం. sorry, already పెట్టావ్ కదూ, కొనసాగించు సాగినన్నాళ్లు." అని కర్తవ్యబోధ చేసి call cut చేసాడు.
----------------------------------------------------------------------------------------------------------------
[1] కొంతమంది "పరిచరించే వాడు" అనే అర్థం అన్వయిస్తారు, అయినా ఆ పద్యం భావంలో పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే, ఈ సందర్భంలో సేవల స్వభావాన్ని (nature of the services) అర్థం చేసుకుంటే, సేవించడం, సేవించబడటం రెండూ సుఖదాయకములే, కాబట్టి అర్థం చెడదు.

Thursday, April 2, 2020

యోగః కర్మసు కౌశలం!

అవి BTech అయ్యాక, కొత్తగా IITలో చేరిన రోజులు. Kharagpurలో అన్నిటికంటే ముందు appreciate చేసినది high speed internet and huge LAN sharing (ఆ, అదే అదే, DC++!). అవునుమరి, నా BTech పూర్తయ్యేసరికి నేను internet illiterate అనే చెప్పుకోవాలి. మొత్తం BTech అంతా కలిపి చూసినా 2-3 గంటలకంటే internet వాడిఉండను, ఆ రకంగా నా పట్టా (degree) offlineలోనే పూర్తి అయినట్లు. ఇదంతా చదివి ఎప్పుడో భూమిపుట్టినపుడు చేశానని అనుకునేరు, కాదు, మొన్నామధ్య వైస్సార్ CM అయిన తర్వాతే మొదలయ్యింది నా BTech . అప్పటికి నాకున్న internet craze వల్ల Kharagpurలో full time onlineలోనే బతికేసే వాణ్ణి. Orkut, facebook, blogging అన్నీ అక్కడే మొదలు.

వీటన్నికంటే, విపరీతంగా ఆకట్టుకున్నది అక్కడి LAN sharing, DC++.  అంటే ఏంటంటే, Simple గా, campusలోని computersని connect చేసి, అందరూ తమ తమ computersలో నుంచి, ఎంపిక చేసిన సమాచారం (files) అందరితో పంచుకునే ఒక వెసులుబాటు. ఈ వ్యవస్థ అప్పటికే చాలా పకడ్బందీగా నడుస్తూ ఉండేది. అలాగే, కొన్ని సంవత్సరాలుగా accumulate అయిన వివిధ రకాల సమాచారం sharingలో ఉండేది. ఎంత ఆశ్చర్యాన్ని కలిగించిందంటే, అక్కడలేనిది ఏమీ లేదనేంత rich database అనమాట అది. అన్ని భాషల నవలలు, కథలు, సినిమాలు (national, international, regional) , పాటలు, పాఠ్య పుస్తకాలూ, documentaries, pdfలోకి మార్చబడిన ప్రాంతీయ మేగజైన్లు (చందమామ నుంచి స్వాతి వరకు దాదాపు అన్ని తెలుగు magazines, అన్ని సంచికలు దొరికాయి నాకు అక్కడ), cricket videos, cartoons, video lectures, ఇంకా ఎన్నెన్నో లభించేవి. సినిమాల మీద PhD చేసే ఒకాయన అక్కడ ఉన్న తన friend hostel roomలో unofficialగా ఉంటూ, తనకి కావాల్సిన సినిమాలని collect చేస్కుంటూ కొన్ని నెలలు campusలోనే  ఉన్నాడంటే అర్థంచేసుకోవచ్చు అక్కడి collection size గురించి. వీటన్నికన్నా ఎక్కువ porn కూడా దొరికేది, అది వేరే విషయం. నిజానికి ఇన్ని ఉన్నపుడు ఏం చేయాలో, ఎక్కడినుంచి మొదలు పెట్టాలో తెలియక తబ్బిబ్బయినంత పనైంది. సినిమా అంటే ఉన్న ప్రత్యేకాభిమానం వల్ల world cinemaలోకి తొంగిచూసే కిటికీ దొరికినందుకు సంతోషించి, వాటితోనే మొదలు పెట్టా. IMDB top 200 listతో మొదలైన ఆ సినిమోత్సవం రెండేళ్ల తర్వాత Kharagpur నుంచి వచ్చేవరకూ కొనసాగిందనే చెప్పాలి. అలా ఒకరోజు నేను ఎంపిక చేసి చూసిన సినిమా Philadelphia. USAలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అది. Unfairగా fire (wrongful dismissal) చేశారని ఒక lawyer (Andrew) తాను పనిచేసిన law firm మీద caseపెట్టి గెలుస్తాడు. చాలా అద్భుతమైన, తప్పకుండా చూడాల్సిన సినిమా.

ఇలాంటి హత్తుకునే సినిమాలు చూసినప్పుడు intensityని బట్టి కొంత సమయం కోల్పోతూ ఉంటాను, ఆ spell అంతా పోయి తిరిగి మాములు మనిషిని  అవడానికి 1-2 రోజులు కూడా పడుతుంది ఒక్కోసారి. "అబ్బా! ఏమన్నా చెప్పాడా? అంతకన్నా గొప్పగా నటించాడుగా!" అనుకుంటూనే మరుసటిరోజు Embedded systems labకి వెళ్ళా. 3 గంటల తర్వాత కూడా ఆవాల్టి experiment పూర్తవలేదు. తీసుకున్న components అన్ని return చేస్తున్నపుడు అక్కడి lab technician అన్నాడు, "రేపు ఉదయం 11 నుంచి lab ఖాళీగా ఉంటుంది, నేను కూడా freeగానే ఉంటాను. కావాలంటే అప్పుడు వచ్చి పూర్తి చేస్కోండి" అని. అరే, ఈయన గమనిస్తూ ఉన్నాడన్నమాట. అయినా, experiment పూర్తిచేస్కోడానికి మేము ఆయన్ని అడగాలి కదా, ఎప్పుడు వచ్చి extra time చేస్కోవచ్చు అని, కానీ, ఆయనే చెబుతున్నాడు అడగకుండానే. ఆయనకేంటి అవసరం, అయన కేవలం technician, కావాల్సిన electronic componentsని studentsకి ఇవ్వడమే ఆయన బాధ్యత. అప్పటివరకు నేను చూసిన lab technicians అందరూ వాళ్ల బాధ్యతలే సరిగ్గా నిర్వర్తిస్తారని చెప్పలేని రకం. సాధారణంగా labs మధ్యాహ్నాలు ఉంటాయి. కాబట్టి, అయ్యేసరికి, ఈ technicians ఇంటికెళ్లే హడావుడిలో అందర్నీ తొందర పెడుతూ ఉంటారు. Experiment పూర్తయినా, కాకపోయినా, తొందరగా componentsని return చేయడమే వాళ్ళకి కావాలి. కానీ ఈయన మాత్రం differentగా ఉన్నాడు. Time అయ్యాక మేమే return చేసేవరకూ ఉండి, తర్వాత కూడా extra time మాకోసం ఇస్తా అంటున్నాడు. చెప్పడంకూడా ఎలాగ, సంతోషంగా నవ్వుతూ చెబుతున్నాడు. "తన jobని మరీ ఇంత seriousగా తీసుకుంటున్నాడేంటి ? ఈయన కూడా an excellent lab technician కదా!" అనుకుంటూ hostelకి బయల్దేరా. cycle తీసుకుంటూ ఆలోచిస్తున్నా, what makes us good at something? అని.  Am I a good _____? ఏదైనా సరే, Am I a good Son? Am I a good Engineer? Am I a good Farmer? Am I a good boyfriend? Am I a good Cricketer? Am I a good Scientist? Am I a good citizen? Am I a good Plumber? Am I a good Student?
 How to answer?

ముందురోజు చూసిన సినిమాలోని సన్నివేశం ఒకటి గుర్తొచ్చింది. Wrongful dismissalకి సంబంధించిన వాదప్రతివాదాల్లో, కింది సంభాషణ జరుగుతుంది. case పెట్టిన వ్యక్తి Andrewకి, తన తరపున వాదించే lawyer Joeకి మధ్య (courtలో అందరి ముందు) నడుస్తుంది.

Joe: Are you a good lawyer, Andrew?
Andrew: I am an excellent lawyer. (చాలా ధీమాగా, తృప్తిగా చెబుతాడు.)
Joe: What makes you an excellent lawyer? (అంతే ఇష్టంగా అడుగుతాడు Denzel Washington, భవిష్యత్తులో ఈ సన్నివేశాన్ని అసంఖ్యాకులు పదే పదే చూస్తారని ముందే తెలిసినట్లు!)
Andrew: I love the law. (small silence). I know the law. (small silence). And I excel at practicing it. (తప్పకూండా చూడండి, Academy Award వచ్చింది ఆ పాత్ర వేసిన Tom Hanksకి. ఈ scene మాత్రం కావాలంటే ఇక్కడ చూడొచ్చు)

Competent అయినప్పటికీ వేరే కారణం (Homosexuality and AIDS ) వల్ల unfairగా fire చేశారని నిరూపించేలా, చాలా సామాన్యమైన సన్నివేశంలా అనిపించినా, చాలా సార్వత్రికమైన సందేశం ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. తాను law studentగా సాధించిన ఘనతలు, medals, grades, ఆ తర్వాత careerలో గెలిచిన గొప్ప caseలు, సాధించిన achievementsని అర్హతలుగా చూపించి తానొక గొప్ప lawyer అని చెప్పుకోకుండా, అంతకంటే చాలా fundamental ingredients వల్ల తనకా యోగ్యత ఉందని చెప్పుకుంటాడు Andrew.

అవును,  ఆ lawyer సమాధానంలో స్పష్టంగా ఉంది, అన్ని ప్రశ్నలకి సమాధానం. మొదట మనం చేస్తున్న పనిని ప్రేమించాలి. అంతేకదా!, ఇష్టంలేకుండా చేస్తున్న పనిలో గొప్ప achiever అవడం చాలా కష్టం, అరుదు. కేవలం ఇష్టం ఉన్నా సరిపోదు. చేస్తున్న పని గురించి పూర్తి అవగాహనా ఉండాలి. బాధ్యతలనెరిగి నడుచుకోవాలి. అప్పుడే ఆ పాత్రని సమర్థవంతంగా పోషించగలుగుతాం. ఇష్టమూ, అవగాహనా ఉన్నా సరిపోదు, అనుభవం పెరుగుతన్న కొద్దీ, ఆపనిలో మన నైపుణ్యం మెరుగవుతూ ఉండాలి కూడా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండకుండా, దినదిన ప్రవర్ధమానం చెందాలనమాట.  అప్పుడే, one can become good at something, in fact anything. ఆ lab technician కూడా, తన పనిని ప్రేమించబట్టి proactiveగా ఉండి మమ్మల్ని గమనించడం, పిల్లలు మొహమాట పడే అవకాశముంది అని, extra time and help తానే offer చేయడం అనేవి automaticగానే అలవడి ఉండొచ్చు. అవే ఆయన్ని ఒక మంచి lab technicianగా (కనీసం నాకు) గుర్తుండిపోయేలా చేశాయి.

అలా ఆలోచించుకుంటూ hostel వైపు వెళ్తున్న నాకు, ఒకవారంలో జరగబోతున్న స్నాతకోత్సవం (convocation) కోసం ఏర్పాటుచేసిన పెద్ద posterలో, IIT Kharagpur logo ఎదురయ్యింది. అప్పటికే తెగ చూసేసి మురిసిపోయి ఉన్నా, ఈసారి  కిందున్న motto "యోగః కర్మసు కౌశలం" ఒకసారి అలా తళుక్కున మెరిసింది. ఆహా! "చేసే పనుల (కర్మల) యందు కుశలత (skill, నైపుణ్యము) కలిగిఉన్నవాడే యోగి" అని భగవద్గీతలో పెద్దాయన చెప్పే ఉన్నాడుకదా అని గుర్తొచ్చి, "అయితే ఇవాళ అలాంటి ఒక కర్మయోగిని కలుసుకున్నా అనమాట" అనుకున్నా. ఆ mottoని అర్థంచేసుకోడం కోసం అప్పుడెప్పుడో ప్రయత్నం చేసినా, ఇప్పుడీ దెబ్బతో బాగా అర్థమైందనమాట. ఇంతకీ, "అప్పుడంటే ఎప్పుడు?" అనుకుంటున్నారా, ఎప్పుడంటే, offline  పట్టా రోజుల్లో. ఎందుకంటే, నా previous university motto కూడా చాలా యాదృశ్చికంగా అదే!

           


Friday, March 20, 2020

సిట్టింగులో సొరకాయ!

*****
హెచ్చరిక: పెద్దల మాటలు ఎక్కువగా దొర్లుతాయి కింద, కాబట్టి పిల్లలు చదవకపోతేనే మంచిది, పెద్దయ్యేదాకా.
****

మా సిట్టింగ్ సెట్టింగుల్లో చాలా తక్కువ మంది పిల్లలు మాత్రమే పానీయప్రియులు. maximum membersకి, అక్కడ చోటుచేసుకునే మాటల్లో munchingలా మాత్రమే పానీయాలతో పని. అంతేగానీ, lockdown సమయంలో ఎర్రగడ్డలో join అయ్యేంత పానీయోన్మాదం (addiction) లేదు. కానీ, already close friends మధ్య కూడా ఉండే చిన్న చిన్న inhibitionsని సైతం చెరిపెయ్యడంలో మాత్రం పానీయం పనితీరు భేష్. ఒక్కోసారి, ఆటలో అరటిపండులా 7up పట్టుకుని కూర్చునే participants కూడా పనికొస్తారు Infotainment (Information + Entertainment )కి.

ఇంత అనుభవం లేని కొంతమంది యువ మిత్రులు, అలాంటి ఒక అరటిపండు మిత్రుని గురించి ఒక వారం నాతో అన్నారు, "ఏంది మచ్చా నీకు ఆ'యప్ప' అంటే అంత లవ్వు? ఎప్పుడు కూచున్నా పట్టుకొస్తావు. ఆయనేమో బిజీ బిజీ అని పోజుకొడుతున్నా invite చేస్తావు. cool drink, stuff, బిర్యానీ పెట్టి girlfriend treatment ఇస్తున్నావ్. మనకవసరమంటావా ఈ పానకంలో పూడక ?" అని.

అప్పుడు చెప్పా వాళ్లతో, ఒక light fix చేస్తూ, "అరే, మీరు సరిగ్గా చూడ్డం లేదురా భయ్, ఆయన పానకంలో పూడక కాదు, మన సిట్టింగులో సొరకాయ! " అని. అర్థంకాక నావైపు చూస్తున్న వాళ్ళకి చెప్పా,"Actually మన అరటిపండు మచ్చా దగ్గర చాలా matter ఉంది, సమయం వచ్చినపుడల్లా చెప్పుకుందాం" అని.

ఆతర్వాత ఒకానొక వారం....

అప్పటికే celebration start అయ్యి ఓగంట (అనగా, రాత్రి 8 కావస్తోంది). "ఏంది మచ్చా ఈ చందుగాడు, సాయిగాడు? ఒక్కోసారి వీళ్ల statusలు చూస్తే *మోగాళ్ళేమో అనిపిస్తుంది నాకు" తలుపు తోసుకొని, mobile చూసుకుంటూ లోపలికొస్తున్న మా అరటిపండు మిత్రుడు ప్రశ్నిస్తున్నాడు, లోపలున్న మమ్మల్ని.

"అయితే మాత్రం నీకేమైంది మచ్చా! ****, నిన్నేం పట్టుకోడం లేదుగా వాళ్ళు. మరింకేంటి నీబాధ?" అని మా మిత్రునికి బాగా అలవాటైన అక్షింతలు వేశాడు Shan, మాలో ఒకడు. "f ***ing *మోఫోబిక్ మచ్చా!" అంటూ మిత్రునివైపు point చేస్తూ, మిగిలిన మా అందరి వైపు చూసి confirm చేశాడు.

"అరే, మరిట్లా పెట్టుకుంటారారా ఎవరన్నా status? నాకేం ఫోబియాలు లేవురా నాయనా, just out of curiosity అడుగుతున్నా అంతే" అన్నాడు మా మిత్రుడు. "అయినా ఏంది మచ్చా ఈ shan గాడు, నేననేసరికి భుజానేసుకొని వస్తాడు?" అంటూ నాకు complaint చేశాడు bag పక్కనపెట్టి, plateలో ఉన్న chicken ముక్క తీసుకుంటూ.

"అదేం లేదులే మచ్చా, shanది tough love అంతే. పిల్లల్లే మచ్చా, light తీస్కో" అన్నాన్నేను.

"వీళ్లు పిల్లలేంది మచ్చా? పిచ్చాపాటీకి రావట్లేదుగా నీదగ్గరికి, పీపాలు పట్టుకొని వస్తున్నారు. mehiగాడేమోగాని, shan గాడు మాత్రం పిల్లోడుగాదులే మచ్చా, పెద్ద పెద్ద పనులే చేస్తున్నాడని talk వచ్చింది campusలో" ఓరకంట చూస్తూ, sound రాకుండా నవ్వుతూ, tease చేస్తున్నాడు మిత్రుడు.

"Thanks మచ్చా!" glass పైకెత్తుతూ Mehi కృతజ్ఞత చూపించాడు, పిల్లోడు అన్నందుకు.

"అమ్మాయి,అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు మచ్చా, చిల్లర start చేస్తారు నీలాంటోళ్లు. F***king hypocrites మచ్చా! ఇలాంటి campusలో ఉంటూ కూడా ఇంత scrapలాగా ఎలా think చేస్తారు మచ్చా మీరు? I pity you మచ్చా" అంటూ ఆవేశంగా glass ఖాళీచేశాడు shan.

"ఒరే, అందులో ఏం కలపలేదురా" అంటూ చేయెత్తి ఆపబోయాడు Mehi, కానీ, వాడికాసంగతి తెలిసే ఉంటుందని గుర్తొచ్చి ఆగిపోయాడు.

ఇంతలో మళ్ళీ shan, "నువ్వే better మచ్చా, మెల్లిగా వెనకాల నుంచి cycle bell కొట్టి acknowledge చేసావ్ చుసాన్రోయ్ అని, అదో సరసం" నాకు compliment. "కానీ ఇదేంది మచ్చా, scrap behavior. స్కూల్ పిల్లలు better మచ్చా, బొక్క లాగా" మా మిత్రునికి మళ్ళీ అక్షింతలు.

"అపరా రేయ్! దొరికిపోయినప్పుడల్లా గట్టిగా అరిసి cover చేస్తాడు మచ్చా వీడు. Good offence is the best defense మచ్చా వీడికి" అని నాకూ, shanకూ ఇద్దరికీ ఒకేసారి మా మిత్రుని సమాధానం.

"ఇయన్నీ కాదుగానీ, నీ romantic achievements గురించి చెప్పు మచ్చా, మొన్నే తెలిసింది sachinలాగా చాలా earlyగా అరంగేట్రం చేసావని" Mehi అడిగాడు మా మిత్రుణ్ణి, comedy tensionని clear చేస్తూ.

"నాకేముంటాయ్ లేరా, local college మాది. మీలాగా మెట్రోల్లో చదవలేదు మేము" అని మిత్రుని తోసిపుచ్చుడు.

"ఇదిగో, ఈ పుచ్చిపోయిన సమాధానాలే మానుకోమనేది, మర్యాదగా పిల్లలు అడిగినప్పుడు, చెప్పేదానికేమైంది మచ్చా?" నా చిరాకు.

"over action మచ్చా, scrap behavior ఎక్కడికిపోతుంది మచ్చా?" shan support నాకు. "అయినా, మొన్నటి story మీరందరూ నమ్మినా, నేను నమ్మడం లేదు మచ్చా. Ribbon cutting చేశా అంటాడుగానీ, ఏం చేశావ్, ఎలా చేశావ్ అంటే చెప్పడం లేదు. ఏదో అలా అయిపొయింది లేరా అని దాటేస్తున్నాడు. చేసినోడైతే చెప్పాలిగా మచ్చా. I am telling you, you are all fooled మచ్చా, అంతా fake".

"నీ ఇష్టంరా భయ్. నమ్మితే నమ్ము, లేకుంటే లేదు; అందుకే మచ్చా ఈ నాయాళ్లకి ఏం చెప్పకూడదు" మళ్ళీ మా ఇద్దరికీ మిత్రుని సమాధానం.

"లేదులే మచ్చా, I believe you. నీమీద కన్నా నాకు అమ్మాయిలమీద నమ్మకం. C Centersలోనే  numerous bold episodesకి అవకాశం ఉంది మెట్రో నగరాల్లో కంటే ." మరోసారి  భరోసా ఇచ్చా మన మిత్రునికి.

"సర్లే మచ్చా, ఇంకేమైనా ఉంటే చెప్పు adventures. ఇది జరిగి చాలా రోజులైందిగా, తర్వాత anymore girlfriends?" మళ్ళీ Mehi గారం గుడుస్తున్నాడు.

"లేదురా, ఈ long distance workout అవ్వక, light తీస్కున్నప్పటి నుంచి, Jio పుణ్యమా అని, dataనే అన్నీ" మిత్రుని నిరుత్సాహం.

"నువ్వు దుప్పటి కప్పుకొని CBN పచ్చ videos చూడటానికే సరిపోదేమోగా daily limit" నేను.

"నువ్వు మరీ మచ్చా, *****!" మిత్రుని అసహనం.

"అవన్నీ కాదు మచ్చా, let's focus, we were looking for some adventures" నా మార్గదర్శనం.

"ఇప్పుడు కాదు మచ్చా, రాజధానిలో ఉన్నపుడు adventures అంటే. మా friendగాడు ఒకడు ఉండేవాడు మచ్చా. మాంచి summerలో ప్రతివారం marketకి వెళ్లి కొనేవాడు మచ్చా సొరకాయ. కానీ, ఎప్పుడూ సొరకాయ కూర మాత్రం వండేవాడు కాదు మచ్చా roomలో. ఏమయిందిరా అంటే, ఎప్పటికప్పుడు ఏదోటి చెప్పేవాడు మచ్చా, పురుగు పట్టిందనో, చిన్నది కదా నేను officeకి వెళ్ళినప్పుడు ఒక్కణ్ణే వండుకొని తినేసాననో, కోస్తూ కింద పడేసాననో, ముదిరి పోయిందనో, ఇలాగా ఏదోటి చెప్పేవాడు. నాకేమో doubt వచ్చేది, వీడి వ్యవహారమేదో తేడాగా ఉందే కొంచెం అని. తర్వాత ఓ weekend మెత్తగా దువ్వి, encourage చేస్తే చెప్పాడు మచ్చా, వాడి summer scam. తల దగ్గర cut చేసి వాడుకునే వాడంట మచ్చా ఒంటరిగా ఉన్నపుడు relax అవ్వడానికి." case solve చేశాక media ముందుకొచ్చి చెప్పే CID DSP లాగా కళ్లు గర్వంతో మెరుస్తుండగా చెప్పాడు మా మిత్రుడు.

pin drop silenceలో, చేస్తున్న పని ఆపేసి మరీ వింటున్నాం మేమంతా. "F*** మచ్చా, truly original మచ్చా" Mehi కితాబు, glass పైకెత్తి. "Yes మచ్చా, it f***ing deserves a toast మచ్చా" అంతవరకూ silentగా ఉన్న BBTకూడా కదిలిపోయాడు episodeలోని creativityకి. "Good one రే" Shan నుంచికూడా  compliments. ఇంక మిగిలింది నేనే అన్నట్లు అందరూ నావైపే చూస్తున్నారు నా response కోసం.

"ఏంటో మచ్చా, ఇలాంటి తుత్తర episodes అన్నింటిలోనూ, చెప్పేవాడి friend గాడే heroగా  ఉంటాడు, it doesn't look like a coincidence to me" నా అనుమానం.

ఒక్కసారిగా అందరూ, భుజం మీదకి తలవాల్చి, దుబాయ్ శీను సినిమాలో రవితేజ లాగా "దొరికిపోయావ్ మచ్చా" అన్నట్లు మా మిత్రుని వంక చూసేసరికి, "obviously, it's an open secret" అని తేల్చేశాడు మా మిత్రుడు విజయ గర్వంతో నవ్వుతూ. "ఇంక బిర్యానీలు open చెయ్యండి. late అవుతోంది" అని తొందరపెట్టాడు.

"ఏదేమైనా మచ్చా, I like your curiosity, essential for a scientist, keep it up!" Shan genuine complimentకి తబ్బిబైపోయాడు మా మిత్రుడు.

"చెప్పానా, మనమిత్రుడు ఆటలో అరటిపండూ కాదు, పానకంలో పూడకా కాదురా భయ్, sittingలో సొరకాయ అని" పిల్లల అనుమానాన్ని నివృతి చేశాన్నేను.

"ఓహో, నీకీ adventure ముందే తెలుసా?" BBT ఆశ్చర్యం.

"నిన్ను నమ్మకూడదు మచ్చా,  ఎప్పుడూ ఇలాగే ఇరికిస్తావ్, ****" మా మిత్రుని అక్షింతలు నాకు.

అదీ, సిట్టింగులో సొరకాయ story.

Saturday, March 7, 2020

మా బానుమతి ఆంటీ బడాయి (Episode-1)

(అన్ని Episodes ఇక్కడ దొరుకుతాయి.)
 
 మా సందులో ఒగ ఆయ్మ ఉండాది, ఆయ్మ పేరు బానుమతి. మేమంతా బానుమతి ఆంటీ అంటాం. ఆయ్మ బడాయి బండ్లమీద పోతాదనుకో. అంటే, ఆంటీ శానా బడాయి పడ్తాది అని అర్తం.  గోరోజనం అంటారుజూడు అది. ఈపుద్దు ఆయ్మ కత జెప్తా, బో... కామెడీగుంటాది. తులసి సిన్మాలోండే  కోకాపేట ఆంటీకి యామాత్రం తగ్గదు మాంటీగూడ. జీవిత చెరిత్ర మాదిరిగాకుండా, నాకు మతికుండే తమాసలు మాత్తరం మాట్టాడుకుందాం.

ఈమద్యనే వాల్ల పెద్దబిడ్డ  రింకూ రెడ్డి పెండ్లి ఐంది. ఓయ్మ! సెప్పవట్టదులే ఆయ్మ సెకలూ, ఆయ్మ బిడ్డ సెకలు.  ఓ రెణ్ణెల్ల ముందర మాసందులో ఇంగో పాప పెండ్లిగుడక ఐంది. ఆ పాప పేరు బుజ్జి. ఇంగజూడు, వాల్ల దగ్గరకే పొయ్ వీల్ల పెండ్లి గురించి బడాయి పడ్తాంది. ఆంటీ వాల్లు బానే ఉన్నోల్లేగాని, బుజ్జి వాల్లు ఇంగా రొంత ఎక్కువ ఉన్నోల్లు, కాబట్టి పెండ్లి గ్రాండుగా జేసినారు. బుజ్జి పెండ్లిలో బాగా పిల్సుకున్న్యారు గాబట్టి దగ్గరదగ్గర ఓ మూడువేల మంది కల్సినారు. అంతగాకపోయినా రింకూ రెడ్డి పెండ్లికి కూడా బానే వచ్చినారు జనం. ఐనాగాని, బానుమతి ఆంటీ "బుజ్జి పెండ్లి కంటే మా రింకూ పెండ్లికే బాగా వచ్చినారుగదా!" అని బుజ్జి వాల్లనే అడుగుతుంది. మరి తెల్సి అడుగుతుందో, తేలీక అడుగుతుందోగానీ, ఆంటీకి గట్స్ ఎక్కువేబ్బ. 'ఆయ్మతో ఎందుకులేబ్బా, తలకాయ నొప్పి' అని, "వచ్చిన్న్యారులే ఆంటీ" అని సెప్తారు.

ఆఁ, అసలీ సంగద్దెలిస్తే బానుమతి ఆంటీ ఎంత కామెడీ విలనో అర్తమైతాది మీకందరికి.  బుజ్జి పెండ్లి ముందురోజు ఇంటికొచ్చిన బందువులతో "రిసెప్షన్ లో  ఏస్కోడానికి గిల్టు నగల సెట్టు తెచ్చుకుంటాననిందే బుజ్జి, తెచ్చుకుందా?" అని అడిగిందట. అసలు విసయమేందంటే, ఆ పాప, పెండ్లికని బెంగుళూరుకుబొయ్, పద్నాలుగు లచ్చలు పెట్టి డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ కమ్మలు, గాజులు తెచ్చుకుందని తెలిసి, ఓర్సలేక, ఎట్టైన గబ్బుపట్టిచ్చాలని పతకం పడిందనమాట ఆంటీ. సూసినారా, పెద్ద కంచు గదా!

జగ్గూ వాల్లక్క మొగుడు దుబాయిలో పన్జేచ్చాడు, రింకూ మొగుడు అమెరికాలో జేచ్చాడు. దాన్నిగూడ వదల్లేదు ఆంటీ. "బొంగులే, దుబాయేముంది, ద.....గ్గెర, అమెరికాకు పొయ్యే ఇమానాలన్నీ దుబాయిమీదనే పోవాలంట" అని సందులో వాల్లకు ప్రపంచపటం జూపిచ్చింది. అల్లుడు ఎంత దూరంలో పన్జేచ్చే అంత గొప్ప, మా ఆంటీకి.

తల్లే అనుకుంటే, బిడ్డ ఇంగొగాకు ఎక్కువే సదివింది, బడాయిలో. మొగం మీదుండే గుల్లలు దాసిపెట్టడానికి దిన్నం బెత్తెడెత్తు ఏస్కుంటుంది మేకప్పు. సందులోకి వొచ్చిందంటే గుప్పున కొట్తాది సందంతా సెంటువాసన. మొన్నటిదాకా హై హీల్స్ ఏసుకుంటాన్న్యాది, రొంత ఎత్తు తక్కవలే. పెళ్లికి ముందు సడెన్గా ఓరోజు సందులోకొచ్చి "హై హీల్స్ ఆరోగ్యానికి మంచివి కాదంట, మానేద్దామనుకుంటాన" అనింది. 'ఈమ్మికి ఇంత సడెన్గా ఆరోగ్యమెందుకు గుర్తొచ్చిందబ్బా?' అని ఆలోచిస్తే తెల్సింది మరుసటి రోజు, 'రింకూ రెడ్డేగాదు, కాబోయే మొగుడుగూడ పొట్టేనని'. 'ఓరి నీ ఏషాలో!' అనుకున్నాం మా సందంతా.

ఆంటీ వాల్ల కుండేది సిన్న ఆల్టో కారు. జగ్గూ వాల్ల కారు పెద్ద SUV. అయినాగాని మన అంటీ, "ఆఁ, మన కార్లేముందిలే జగ్గూ, బుడ్డ కార్లు!" అని మూడు లచ్ఛల ఆల్టోని, పదమూడు లచ్చల SUVని  ఒకగాటికే కట్టేసింది. జగ్గూ గానికి యాన్నో కాలిందిగానీ, పాపం ఏమంటాడు, "నీకు బాతెల్సు ఆంటీ కార్ల గురించి" అని ఊరకున్న్యాడు.

పాపం, ఆ మద్య మాసిన్నమ్మ బిడ్డ రమ్య, డ్రస్ మెటీరియల్ తెచ్చుకోంటే సూసి, "ఇంగా ఎవరేసుకుంటానారు రమ్యా ఇట్లా, ఇప్పుడందరూ టాపులేసుకుంటాంటే!" అనింది. 'అందరూ' అంటే ఆయ్మ కూతుర్లు అని అర్తం. ఇట్లుంటాయి మా బానుమతి ఆంటీ లీలలు.

ముద్దుగా మా సందులో "News channel" అని పిల్చుకుంటారు మా బానుమతి ఆంటీని. ఎందుకంటే అందరి యవ్వారాలు ఆయ్మకే గావల్ల. అంతేనా, నాన్స్టాపుగా నస కూడా పెడ్తాంటాది కాబట్టి.

మీసందులో గుడక ఓ బానుమతి ఆంటీ ఉండాది గదా! 

Thursday, January 30, 2020

నాకు భయమేస్తోంది, రేపు నాకు పెళ్లి !

చిన్నప్పుడు ఇంట్లోనో, బళ్ళోనో చెప్పినపని చేయకపోతే, "నీకుందిలే, మీ అమ్మ నీకు పెళ్లి చేస్తుంది!", "సోషల్ ఐవారు నీ పెళ్లి చేస్తాడు!"  అని భయపెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు, 'కావాలి, కావాలి!' అనుకొని మరీ చేసుకుంటున్న పెళ్లి వల్ల వేస్తోంది భయం.

అవును, పెళ్లంటే ఎవరి నిర్వచనాలు వాళ్లకున్నా, అందరూ నిర్ద్వందంగా  అంగీకరించేది, 'అదొక పెద్ద మార్పు' అని. ఉదాహరణకి, ఇకమీద ఎప్పుడు పడితే అప్పుడు, ఏదిపడితే అది తినలేం. ఇంకొకరు తిన్నారోలేదో తెలుసుకొని కూచోడం ఇంతవరకూ అలవాటు లేని పని.

అప్పుడెప్పుడో Steve Harvey చెప్పాడు, "మగవాళ్ళకి పెళ్లయ్యాక, I like *** కాస్తా , we hate *** అవుతుం"దని.  ఆ dashలో ఏ బుజ్జిముండని కుర్చోపెట్టాలో అని తలచుకుంటేనే భయమేస్తోంది. "నన్నొద్దు, please, నన్నొద్దు!" అని మనకున్న అన్ని మాం....చి అలవాట్లు, ఇష్టాలు, tasteలు, preferenceలు వేడుకుంటున్నాయ్.

కాళ్ళు చేతులు ఆడటం మొదలైనప్పటి నుంచి ఆడుతున్న Cricketని ఆపాల్సివస్తే? ఇంకేమన్నా ఉందా, ball తగిలి వేళ్ళు విరిగినప్పుడు కూడా ఆపలేదే!

మీసం రాకముందటి నుంచే మొదలైన మరో hobby, 'సౌందర్యారాధన' సంగతేంటి?

పనికిమాలిన పరిచయాలనుంచి, పనిగట్టుకొని మరీ పలకరించే friends వరకూ అన్నీ affect అవుతాయిగా.

అన్నదమ్ముల అనుబంధం సినిమా కాస్తా, దాయాదుల పోరై, కురుక్షేత్రంగా convert అవుతుందా?

వీణపాటలు వినడం కుదరక పోతే? మామ feel అవడూ?

మనకి నచ్చే సొరకాయ, బీరకాయలే వాళ్ళకి నచ్చాలని లేదుగా!

"తల్లా, పెళ్ళామా?" సినిమాకి రోజూ tickets కొన్నట్లే కదా పెళ్లంటే! కాదా?

Sitting settingలకి, సంభాషణలకీ ఇక సెలవా? దేవుడా! సగం జీవితం వాటితోనే కదా మన romancing; మిగిలిన సగం జీవితానికీ సరిపడా promise చేస్తుందా ఈ పెళ్లి? అబ్బే, అనుమానమే సుమా!

నంజుకోడానికి సరైన మాటలు లేకపోతే మనకి టీ-కాఫీలు కూడా సహించవే, ఇకమీద మనం తినే సగంపైగా భోజనాలు కేవలం ఒకే వ్యక్తితో కదా, manage చేయగలమా?

కొండలూ గుట్టలూ ఎక్కలేమా, No more trekking ? Oh my God! మన "Heights are Healthy" ఉద్యమం ఇక ముందుకు నడవదా?

Cycleకి, Bikeకి bye-bye చెప్పాల్సిందేనా? మనకి కారుల్లో ప్రపంచం సరిగా కనపడదే! గాలి తగలందే soul చిక్కదే!

కొన్ని కొన్ని conversationsలో replacement సాధ్యపడని బూతుల సంగతేంగానూ? కొన్నాళ్లే అయినా, వాడకుండా ఉండగలమా? weekend శివగాడో, KKనో call చేస్తే, చాటుగానే మాట్లాడాలా? లేక censor చేయాలా? నా మాటలకి నేనే కత్తెరేయాలా?

హతవిధీ! ఎంతటి కాలము దాపురించునో కదా! వైవాహికములనిన మావంటి స్వేచ్చా జీవులకి వెరపు గాక ఇంకేమి!

Tuesday, December 3, 2019

Best scrap

"మనలోని వెధవని వెలికితీసి చూపించేవాళ్లే మన best friends" అని ఒక పెద్దాయన ఎపుడో చెబితే విన్నట్టు గుర్తు. ఆ వెధవని మనకే చూపిస్తారనుకున్నా, కాని, బయటి ప్రపంచానికని తెలీలేదు. Thanks to some of my scrap friends, నాకు బాగా కావాల్సినవారి ముందు (మరి వారేగా మన ప్రపంచం) బాగా embarrass అయిన సందర్భాలు కొన్నున్నాయి. అందులో కొన్ని comedyగా ఉన్నవి చెప్పుకుందాం.

సన్నివేశం-1

ఆ మధ్య PhD రోజుల్లో, ఏదోపని మీద బెంగుళూరొచ్చిన మా అన్న నన్ను కలిసి, ఒక రాత్రి IIScలో నాతో ఉండి పొద్దున్న ఇంటికి వెళ్లేలా plan చేసుకున్నాడు. అందరు తెలుగు యువకుల్లాగే, రాత్రి భోజనానికి దగ్గర్లోని మంచి బిర్యానీ దొరికే restaurantకి వెళదామని KKకి call చేసి రమ్మన్నా, మా home restaurant Akshaya Deluxeకి వెళదామని. బండేసుకుని వచ్చాడు. ముగ్గురం కలిసి, BEL roadలో traffic వాళ్ళకి కట్టిన చలానాలు బాగా గుర్తుండటం వల్ల, మత్తికేరే సందుల్లోంచి వెళ్ళాం, అదో సరదా.

అందరూ, ఆ వయసులో chic magnet అవ్వాలనుకుంటారు, అదేంటో నేను cop magnet అయ్యా. బెంగుళూరులో bike trip వెళ్లిన 90+% సమయాల్లో నేను నడిపిన బండిని traffic cops ఆపారు, (కనీసం) అన్ని వందలూ వదిలాయి, అంత కన్నడ practice కూడా అయింది. 5-6 bikes కలిసి వెళ్లినా, అందరూ తప్పించుకున్నా, నాకు మాత్రం hi చెప్పితీరే వాళ్లు మామలు.  అన్ని సరిగ్గా ఉన్న సందర్భాల్లో కూడా, insurance expire  అయిందని కొన్నిసార్లు,  అది కూడా సరిగ్గా ఉన్నపుడు, bike history check చేసి ఇంతకు ముందు మన వెధవలు చేసిన signal jumpsకి నాతో కట్టించుకునే వాళ్ళు fine. తిరుపతి దేవుడిలాగా  క్రితం జన్మలో ఏ cop దగ్గరో, అప్పుచేసి ఏదో ఘనకార్యం చేసినట్లున్నా, దాని వడ్డీ ఇప్పుకూడా కట్టించుకుంటున్నారు. అలా నేను మా జనాల్లో notorious అయ్యా, cop magnet లాగా.


Akshayaకి reach అయ్యి, ఎముకలు ఉండే బిర్యానీ, లేని బిర్యానీ, మిరియం chicken order చేసి కూచున్నాం. ఇంతలో మనవాడు KK మొదలు పెట్టాడు. మా అన్న doctor అని తెలిసి ఆ directionలో సంభాషణ మొదలుపెట్టడం మంచిదే, ఒక విధం. కానీ, మన వాడికి వాళ్ల నియోజక వర్గం doctor గారి అక్రమాలు, దారుణాలు పూనాయో ఏమో కానీ, ఇవాళ్టి సమాజంలో doctors చేస్తున్న మోసాలు, medical expenses మధ్య తరగతి సమాజంపై గుదిబండలా మారిన తీరు గట్రా మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడికి, మా అన్నే వెనకుండి అంతా నడిపిస్తున్నట్లు.  Hospital chains తో (నిస్సహాయ స్థితిలో కూడా కావొచ్చు) doctors కుమ్మక్కై జనాలని ఎలా ఇబ్బందికి గురిచేస్తున్నారో ఒక అర్ణబ్ గోస్వామి rangeలో దేశసేవ చేస్తున్నవాడిలా  feel అయ్యి వివరిస్తున్నాడు ఆయనకే.

"ఏందిరా అయ్యా ఇది, మొదటిసారి lifeలో కలవడం ఆయన్ని; మొదటి మాటలు  గొప్ప encouragingగా, memorableగా లేకపోయినా పర్లేదు, కానీ, పనిలేని TV channel వాళ్ళు పిలిచి చేసే పనికిమాలిన interviewకి ఏమాత్రం తీసిపోకుండా ఉందేంది సామి నీ పనితీరు" అని నేను  భయపడుతున్నా. అయినా, మన వాడు మెదడు ఇందాక వచ్చేప్పుడు labలోనే పెట్టివచ్చినట్లు  రెచ్చిపోతున్నాడు ferformanceతో. ఆపుదామని conversation divert చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తున్నాడు. అక్కడికి మా అన్నేదో ఇటీవలే అక్రమమేదో చేసి పట్టుబడినట్లు class పీకుతున్నాడు. Food వచ్చినా, నేను గిచ్చినా, వినే స్థితిలో లేడు. అసలు మేము కలిసేదే సంవత్సరానికి ఏ 3-4 సార్లో (PhD మరియు medicine పుణ్యమా అని). అలాంటిది, plan చేస్కోకుండా కుదిరింది కదాని కలవడానికి వస్తే, ఇదీ నా ద్వారా  ఆయన పొందిన welcome.

అప్పుడప్పుడే PG గట్రా అవజేస్కొని, "హమ్మయ్య! ఇప్పటికి కొంచెం free అయ్యాం" అనుకుంటూ పాపం మాములు సమాజంలోకి వస్తున్న time ఆయనకి. మనదేముంది భయ్యా, EAMCET రాస్తే చాలు Engineer అయిపోయినట్లే, అన్ని కాలేజీలు, సీట్లు, reimbursements. మధ్య తరగతిలో పుట్టి, Open categoryలో government medical seat సంపాదించి, doctor అవ్వాలంటే ఎంత కష్టమో ఎలా మరిచిపోయాడో మన scrap మచ్చా అని ఆలోచిస్తున్నా. అవునులే, 21 ఏళ్లకే డిగ్రీ తెచ్చుకొని, ఏ branchలో BTech చేసినా వచ్చే 30వేల software ఉద్యోగం ఒకటి తెచ్చుకుని, హైదరాబాద్, బెంగుళూరుల్లో ఆఫీసుల్లో కూచుని FBలో pics upload చేస్కుంటూ మర్చిపోయామేమోలే అనుకుంటున్నా. వెనక పుట్టిన పిల్ల బచ్చాగాళ్లందరూ engineering చేసి ఉద్యోగాలు చేస్తూ, పండగలకి ఇంటికొచ్చినపుడు పల్లెల్లో touch screen phonesతో హడావుడి చేస్తున్నా, పాపం ఆరేళ్ళ డిగ్రీ అవజేసుకుని, దానివల్ల గొప్ప పని (surgery), సంపాదన కుదరదని, కోటి రూపాయలు పోసి private PG seat కొనలేక, సమాజాన్ని, కుటుంబాన్ని, వెలివేసి, హైదరాబాద్ పద్మారావు నగర్లో తలుపులేసుకుని, entranceకి prepare అయ్యి seat కొట్టి, మూడేళ్ళకి ఆ torture కూడా అవజేసుకొని ఇంకో సంవత్సరం rural service పేర మళ్ళీ సమాజానికే almost free సేవ చేయడానికి రెడీ అవుతున్న అయన మనల్ని చూడటానికి వచ్చి, బిర్యానీ ఒకటి పెట్టించరా అంటే, నేనేమో మాంచి scrapని serve చేస్తున్నానా, ఛీ దీనమ్మ జీవితం! అనుకుంటున్నా. అబ్బే, మచ్చా ఇవేమి పట్టించునే స్థితిలో లేడు. అదేదో అమ్మాయి ముందర impression కోసం కష్టపడుతున్నట్లు లేని జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ పరువు తీస్తున్నాడు. తీరా చూస్తే, ఆ మధ్య health center కెళ్లడానికి G బద్ధకం వల్ల, 'మచ్చా మీ అన్నని అడిగి prescription కనుక్కో మచ్చా' అన్నపుడు మాత్రం ఈ so called doctors చేసే అక్రమాలు గుర్తురావు. ఇలా చెప్పుకుంటూ పోతే మచ్చా చేసిన చిల్లర చాలానే ఉంది, but point అర్థమైంది కదా!

సన్నివేశం-2

ఇంకొన్నాళ్ళకి, PhD చివరి రోజుల్లో, సరదాగా friendsని తీస్కుని ఇంటికి వెళ్దాం, సీమ చూపిద్దాం అనిపించి, దగ్గరే (200 Kms) కాబట్టి,  one dayకి zoom car ఒకటి book చేసి రచ్చ చేద్దాం అని decide అయ్యాం. అప్పటికి మా gangలో ఒక pro driver (BBT), ఒక amateur driver (Mehi), ఇంకో trainee driver (Shan), మరియు నేనూ ఉన్నాం.  ఒకానొక ఆదివారం అంతా సిద్ధం చేసుకొని, అనంతపురం మీదుగా వెళ్లాలని పొద్దున్నే start అయ్యాం. ఎందుకంటే, అప్పటికి అనంతపురం General Hospitalలో పనిచేస్తున్న మా అన్నని కూడా ఎక్కించుకొని, అందరం కలిసి మధ్యాహ్నం భోజనం timeకి మాఊరెళ్ళొచ్చని. హమ్మయ్యా, ఈసారి మన KK మచ్చా లేడులే అని కంగారులేకుండా వెళ్తున్నాం. అంతా బానే ఉంది, highwayలో lightగా మబ్బుకప్పిన environmentలో memorable trip సాగుతోంది. Pro-driver, amateur-driver ఎక్కువగా నడుపుతున్నారు, కొద్దిగా attitude ఉన్న trainee driver (shan) just కాసేపు నడిపి నాతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. మిగిలిన drivers rideని enjoy చేస్తున్నారు. ఇంతలో అనంతపురం వచ్చాం. అప్పుడేదో flyover construction జరుగుతోంది, రోడ్డుమీద traffic గట్టిగా ఉంది, ఇలాంటి conditionsలో practice చేస్తేనే improve అవుతాం అని Mehi కొంచెం risk ఉన్నా తానే drive చేస్తున్నాడు. పెద్దవాడు కాబట్టి, సాహసం కంటే consequence గుర్తొచ్చి BBT కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ, మేమందరం Mehiని support చేస్తూంటే కాదనలేక uncomfortableగానే ఒప్పుకున్నాడు. ఎటువంటి incidents జరగకుండానే hospital చేరుకున్నాం. Parkingలో car పెట్టి, మా అన్న luggage carలో నింపుకున్నాం. అంతా అయ్యాక, driver seat లో ఉన్న Mehi దగ్గరికొచ్చి BBT "ఇంక లే మచ్చా, నేను తీస్తా car" అని అడిగాడు. "లేదులే మచ్చా, నేనే continue చేస్తా బానే తీస్తున్నా కదా!' అన్నాడు Mehi. car parking నుంచి reverse చేస్తే guide చేయాలని అందరం బయట ఉన్నాం, ఇదంతా చూస్తూ. అక్కడ మొదలైంది రచ్చ. "కొత్త బిచ్చగాడు పొద్దెరగడ"నే చందాన driver seatలో settle అయిన Mehi excitedగా drive చేయాలనీ,  "ఇందాక cityలో driveచేయనివ్వడమే చాలా ఎక్కువ నీకు" అన్న ఉద్దేశంలో BBT, ఒకరంటే ఒకరు నేనే drive చేస్తా అని గొడవ start చేసారు. చిన్నపిల్లలు కొట్టుకున్నట్లు seriousగా పోట్లాడుకుంటున్నారు మాటలతో. బయటున్న trainee driver shan "come on Mehi, తగ్గొద్దు అస్సల!" అని serious గా encourage చేసి, కామెడీగా నా వైపు చూస్తూ, "సమ్మగుందా?' అని నాలుక బయటపెట్టి తల అడ్డంగా ఊపుతున్నాడు, silent గా నవ్వుతూ.

చూస్తుండగానే వాతావరణం వేడెక్కింది. ఇద్దరి దగ్గరికెళ్లి, వీలైనంత మెల్లిగా సర్ది చెప్పడానికి try చేశా. పిచ్చ light తీసుకున్నారు ఇద్దరు నన్ను. "అంతా చూస్తున్న అన్న ముందర Already  వీళ్ల పిల్లతనం వల్ల మన పరువు పోయింది, ఇప్పుడు సర్దిచెబుదాం అని వెళ్లి విఫలమై ఇంకా అయ్యాం" అని బాధ పడటం తప్ప అక్కడ నేను చేయగలిగేదేం లేదని అర్థమైంది. వీళ్ళు మాత్రం రచ్చ ఆపడం లేదు, ఉన్న పరువునైనా కాపాడుకోవాలంటే ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నా, shan మాత్రం encourage చేస్తూ ఇద్దరినీ ఎగదోస్తున్నాడు. ఇంతలో driver door దగ్గరున్న BBT carకి ఉన్న keys లాక్కొని Mehiని దిగమంటున్నాడు. "నువ్వు keys తీసుకుంటే మాత్రం నేను దిగుతాననుకున్నావా, పిచ్చ light, తీస్తే నేనే తియ్యాలి, లేకుంటే నువ్వు  keysతో, నేను steeringతో ఆడుకోవాల్సిందే" అంటున్నాడు Mehi. "ఓర్నీ పాసుకూలా, ఇదేం బేరం రా నాయనా! మిమ్మల్ని బెంగుళూరు నుంచి తెచ్చిమరీ మా సీమలో వెధవని అవుతున్నా" అనుకుంటూ ఓసారి మా అన్న వైపు చూసా, ఏ భావాలూ లేకుండా blank గా ఉన్నాడు, "మీరే తేల్చుకోండి" అన్నట్లు.  అప్పుడే, లోపల parkingలో ఉన్న car తీసుకోడానికి senior doctor ఒకాయన ఈ sceneని చీల్చుకుంటూ వెళ్తూ మా అన్నకి Hi చెప్పాడు. మిగిలిన వాళ్ళమెవరం అది పట్టించుకునే స్థితిలో లేము, అయన car బయటికి వెళ్ళడానికి మా car అడ్డంగా ఉంది, so మాదాకా వచ్చి wait చేస్తున్నాడు, తీస్తామని. మనవాళ్ళు coolగా "ఇంకా చర్చలు కొలిక్కిరాలేదు, నీ ఖర్మ, చావు అలాగే!" అన్నట్లు వదిలేసారు ఆయన్ని. ఇప్పటి వరకూ నన్నే ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మా అన్నని కూడా పెడుతున్నారు.  "ఏంది మచ్చా, ఇప్పుడేం చేయాలి?" అని shanని అడిగితే, "మనకున్న best chance Mehiనే" అన్నాడు. So, fastగా Mehi దగ్గరికెళ్లి, "మచ్చా, తప్పదు, పరిస్థితిని అర్థం చేస్కో"  అనంగానే, చాలా చిరాగ్గా driver seat లోంచి లేచి, fastగా వెనక్కెళ్ళి కూచున్నాడు పాపం. నా ఆరేళ్ళ పరిచయంలో, తనని అంత చిరాగ్గా నేనెప్పుడూ చూడలేదు. Sittingలో 9:45PMకి ఉన్నసరుకు సరిపోక ఇంకా తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు వద్దని ఆపినప్పుడు కూడా, ఉన్నదాన్నే మెల్లిగా తీసుకుందాంలే అనుకున్నాడు గానీ, ఇంత చిరాకు పడలేదు పాపం. మొత్తానికి, BBT car reverse చేసి ఆ doctorని పంపించాడు. అందరం car ఎక్కి కూచున్నాక మా ఊరికి ప్రయాణమయ్యాం. అన్న "దున్నపోతుల్లా ఎదిగినా పిల్ల చేష్టలు పోలేదు, ఎదవలకి" అనుకుంటున్నాడేమో అనుకుంటూ నేను BBTని guide చేస్తున్నా. ముందే మా అన్నముందు ఏమీ censor చేయాల్సిన అవసరంలేదని తెలుసుకున్న shan, ఇందాకటి గొడవ గురించి ఇద్దర్ని దొబ్బడం మొదలుపెట్టి sadistic pleasureని enjoy చేస్తున్నాడు. కాసేపటికి city దాటాక BBT car ఆపి, Mehi ని drive చేయమనేసరికి "హమ్మయ్యా, ఇద్దరి మొహాలు చూడలేకపోయాం, పోన్లే ఇప్పటికైనా రాజీ పడ్డార"ని ఉపిరిపీల్చుకున్నాం. వెనకాల చేరిన BBT, మగవాళ్ల సమస్యలైన prostate cancer గురించి చర్చించడం మొదలుపెట్టేసరికి, "నీకవసరమేలే మచ్చా" అని చురకేశాడు shan.

అరగంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకొని, చికెన్, మటన్, సంగటి, పూరీ, పులావ్ అన్నీ దొబ్బితిని, మాడీ (మేడ) పైకెళ్లి, పుచ్చకాయలు తినేసి, వెంటనే పక్కేసాం. అలసిపోయి ఉన్నాడేమో BBT తొందరగానే నిద్రపోయాడు. ఇంతలో మా family friend ఒకాయన వచ్చి, "పొలాల్లో కుంటలు అన్నీ నిండుగా, కళ కళ లాడుతున్నాయి, ఈత కొడతారా?"అని అడిగేసరికి, మాకు sugar ఆగలేదు. మరి BBT చూస్తే నిద్రపోతున్నాడు, ఇప్పుడెలా అని ఆలోచిస్తుండగా, return ప్రయాణం ఆరోజు రాత్రికే కాబట్టి, ఒక active driver అవసరం అనుకొని, ఆయన rest తీస్కోడమే మంచిదని, పైగా, BBTకి ఈత రాదని మాకు ఇదివరకే తెలుసు కాబట్టి, మేము మాత్రమే పొలాల్లోకి వెళ్లిపోయాం మా అన్నతో కలిసి. అరగంట తర్వాత మా family friend bike మీదనుంచి BBT ఆవేశంగా దిగుతూ కనిపించే సరికి, సర్లే చూద్దామని వచ్చాడేమో అనుకున్నాం. మగ సూర్యకాంతంలాగా మీదపడి మాటలతో కరిచేస్తున్నాడు. "ఏంది మచ్చా, నన్ను పడుకోబెట్టి మీరు మాత్రమే ఇలా enjoy చేయడానికి వచ్చేస్తారా?" అని కడిగేస్తున్నాడు. మేమనుకున్న reason చెప్పి, disturb చేయకుండా వచ్చాంలే అని చెబుతున్నా వినకుండా అవసరంలేనంత అల్లరి, scene create చేస్తున్నాడు. తీరా చూస్తే, తాను కూడా ఈత కొట్టడానికి, పెద్ద తాడు కూడా తెచ్చుకున్నాడు. 5 feet లోతులో నిల్చుని, మమ్మల్ని (particularగా నన్ను) ragging చేస్తున్నాడు. "సర్లే మచ్చా, మర్చిపో ఇంక, వచ్చావ్ గా happyగా enjoy చెయ్" అంటే వినడే, అరగంట దాకా, "నన్ను మోసం చేసారు, వదిలేసి వచ్చారు, నేనంటే మీకు లెక్కేలేదు, మీరంతా కుమ్మక్కయ్యారు" అంటున్నాడు. అందరూ కలిసి holidayకి friend ఊరికి వచ్చారు, వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ జనాల ముందు,  ఇంత రచ్చ బాగోదనే ఆలోచనే లేకుండా, సావగొట్టాడు. Hospital దగ్గర చిల్లర, ఇక్కడ అల్లరి కలిసి, మొత్తానికి, అన్న అనేసుకుని ఉంటాడు "వీడూ, వీడి friends, బాగున్నారా బాబు" అని సిగ్గుతో సచ్చిపోయినంత పనైంది నాకు. చివరికి, "మచ్చా, నన్ను క్షమించు, నీ కాళ్ళమీద పడమంటావా? అప్పుడైనా ఆపుతావా?" అంటే, అప్పటికి, అరవడం ఆపేసి, లోపల గొణగడం మొదలు పెట్టాడు మా నానమ్మ లాగ. అక్కడ కాసేపు ఆడుకొని, ఇంకో scenery దగ్గరికెళ్లి అక్కడ కూడా భవిష్యత్తులో post చేయడం కోసం ఇంకొన్ని pics తీసుకున్నాక కాస్త normal మనిషి అయ్యాడు. ఇంటికెళ్లి, coffee తాగుతూ, car hire duration extend చేసుకొని, మిగిలిన వంటలు దార్లో తినడానికి pack చేసుకొని కుండపోత వర్షంలో start అయ్యాం. 30Kms వరకూ, అస్సలు visibilityయే లేకపోయినా, BBT wonderfulగా drive చేసాడని Mehiనే compliment ఇచ్చాడు. అప్పటికి ఆ కథ సుఖాంతమైంది.

కానీ, నాకు మాత్రం 2008లో TCSలో select అయినప్పుడు, offer letter ఇస్తూ HR అన్న మాటలు గుర్తొచ్చాయి. "Welcome to TATA family, ఇవాల్టినుంచి మీరందరూ members of the TATA family. వీధిచివర అంగట్లో పాల pocket కొన్నపుడు, busలో conductor చిల్లర ఇచ్చినపుడు కూడా thanks చెప్పడం దగ్గర్నుంచి, professional and personal lifeలో మన valuesని reflect చేయాలి మీ behaviour" అన్నాడు. మరి మేమేం చేసాం, భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన పరిశోధనా సంస్థగా జనాల్లో తెలిసిన TATA Instituteని (IISc పాత పేరు) represent చేస్తూ కూడా చాలా scrapగా behave చేశామ్, చిల్లర రచ్చ చేశాం. ఇదంతా చెప్పాననుకో, "ticket ఇవ్వకుండా తక్కువ డబ్బులు తీస్కొని వాళ్ల జేబుల్లో వేసుకునే బెంగుళూరు conductorsకి చెప్పలేదేమోగానీ, complimentaryగా ఉంచుకోమని whiskey గ్లాసులిచ్చిన మత్తికేరే spirits వాడికి చెప్పాంలే మచ్చా Thanks!" అంటారు మావాళ్లు.

ఇంతకీ, best friends గురించి పైన చెప్పిన పెద్దాయన ఎవరోకాదు, మా అన్నే. So, problem లేదు, ఆయనకి తెలుసు best friends అంటే ఎలా ఉంటారో.

Tuesday, November 26, 2019

మర్చిపోవాల్సింది, మర్చిపోకూడనిదీ రెండూ మేలే!

నీతులూ సూక్తులూ చెప్పడం నాకూ ఇష్టముండదు, వీలైనంత వరకూ హాస్యం రాయడానికే  తపిస్తాను, కష్టం కూడా కాబట్టి. అయినా, కొన్నిసార్లు జీవితం కూడా comedyతో కప్పి చెప్పలేనంత serious అవుతుంది, తప్పదు, మరి మిగిలిన రసాలని కూడా ఆస్వాదించాలి కదా!

ఎక్కడో చదివానో, ఎవరో చెబితే విన్నానో, లేదా, నా ఆలోచనల ఫలితంగా మనసులో రాసిపెట్టుకున్నానో, తెలీదు కానీ, "మనం జీవితంలో మర్చిపోవాల్సింది, మర్చిపోకూడనిదీ కూడా మేలే" అని ముద్రపడి పోయింది. కొంచెం confusingగా ఉంది కదా, ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం.

మొన్నామధ్య, ఒకానొక important conferenceకి work submit చేద్దామని, team అందరం బాగా కష్టపడుతున్నాం. Servers సచ్చిపోతున్నాయ్, జనాలు రాత్రుళ్లు కూడా work చేస్తున్నారు, deadline వరకూ కొంచెం relaxedగా ఉండటం వల్ల  last minuteలో అందరం కొంచెం హడావుడి పడాల్సివచ్చింది.  Anyway, నేను కూడా బాగా burnout అయ్యి ఉన్నా. శనివారం  పొద్దున, officeలో ఉండగా,  program run చేసి, gapలో Facebook check చేస్తున్నా. ఇంతలో ఒక message వచ్చింది, గుర్తుపట్టా, కాకినాడలో junior, మా branch కాదు, పెద్ద పరిచయం కూడా లేదు. ఈ messageకి ముందు ఎప్పుడు మాట్లాడానో అని చూస్తే, last message 2010లో, దాదాపు దశాబ్దం గడిచింది. "ఏంటబ్బా, ఇంత suddenగా ఈ message?" అనుకొని reply ఇవ్వడం start చేశా.  సారాంశం ఏంటంటే, తను ఈ weekendకి Edinburghలో ఉన్నట్లు, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని Facebookలో check చేస్తే, నేను దొరికాను, so, నాకు వీలైతే కలుద్దామని. తానున్న hotel మా officeకి కొంచెం దగ్గరే, కానీ, ఎక్కడైనా మంచి Biryani దొరికే చోట lunchకి కలుద్దాం అని అడిగాడు.  సర్లే, మనం కూడా ఎలాగూ lunch తెచ్చుకోలేదు, officeకి దగ్గర్లో ఉండే Tanjore restaurantకి రమ్మని చెబుదాం అనుకొని location share చేశా. Time fix చేసుకున్నాక, bye చెప్పి, తన profile చూడటం మొదలు పెట్టా. Amazon Germany(Berlin)లో work చేస్తున్నాడు, అంతకు ముందు Amazon  India, ఇంకా ముందు IIT Madrasలో CSE MTech, ఆ ఇంకా ముందు కాకినాడ JNTU CSE BTech. Impressive అనుకొని, పెద్దగా పరిచయంలేని వాడుకదా, అసలే wifeని వెంటబెట్టుకొని Scotland చూద్దామని వచ్చాడు, meeting awkwardగా ఉంటుందేమో అని కొంచెం అనుమానపడ్డా. అయినా, తనే propose చేసాడు కదా కలుద్దామని, so పర్లేదులే అనుకొని convince అయ్యా. Time అయ్యాక office నుంచి వెళ్లి restaurantలో కలిశా.

సీమవాడు కూడా అవ్వడం చేత, ఇంకొంచెం connectivity పెరిగి, బాగా తొందరగానే comfort zoneలో  పడింది conversation. ఏదో తెలీని welcoming తెలుస్తోంది నాకు ఇద్దరి body languageలో. Abroadలో ఉన్నారు కదా, మన జనాలు కనిపించేసరికి కొంచెం connect అయ్యారేమోలే అనుకున్నా. అసలే Berlinలో Indian food దొరకడం లేదంట, మొహం వాచి ఉన్నారు ఇద్దరు. chicken, lamb, biryani, masala dosa, నా prawns, ఇలా order చేసిన list పెద్దగానే ఉంది. "Green sauce, red sauce తిని తిని నాలుక చచ్చిపోయిందండి, UK చాలా better, ఇక్కడ Indian foodకి ఇబ్బందే లేదు, మా దగ్గర అస్సలు దొరకడం లేదు, వేరే cityకి వెళ్లి తిని వస్తూ ఉంటాం అప్పుడప్పుడు" అన్నారు. జగన్ policies నుంచి, Europeలో living వరకూ ఏదీ వదలకుండా discuss చేసాం, particularగా, పెళ్లయ్యాక వాళ్లు Germanyకి move అవడం, ఆ అమ్మాయి ఉద్యోగం, difference in life style, working conditions,etc.

అన్నీ అయ్యాక, "సార్ (కాకినాడలో juniors, seniorsని ఆలా పిలిచేవాళ్ళు) మిమ్మల్ని ఇవాళ కలవడానికి ఒక particular reason ఉంది" అన్నాడు.

"అవునా, చెప్పు, ఏంటది!"

"ఇంత suddenగా వీడెందుకు message చేశాడు, కలుద్దాం అంటున్నాడు, మనకి ఆమాత్రం పరిచయం కూడా లేదే అని అనుకోలేదా మీరు?"

"In fact అనుకున్నా, but, వేరే countryలో ఉన్నాం కదా అని, weekend, కలవడం కూడా easy కదా, Benguluruలో లాగా 2 గంటలు ప్రయాణం చేయక్కర్లేదు అని పిలిచావేమో అనుకున్నా"

"Actually, నా BTech final yearలో మీరు నాకు చాలా పెద్ద help చేసారు, అప్పటినుంచీ మీకు Thanks చెప్పడం కుదరలేదు నాకు. మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇక్కడెక్కడో, ఇలా unexpectedగా కలిసి చెప్పే అవకాశం దొరికింది"

"ఓ!"

"నేను 2010లో GATE రాసినప్పుడు, నా hall ticketలో పేరు తప్పుగా వచ్చింది. Sadly, examకి 2 days ముందు realise అయ్యా నేను. అసలే నేను panic party, అందులో, నా friends కొంతమంది rank వచ్చినా కూడా ఈ issue వల్ల admission అప్పుడు ఇబ్బంది అవుతుంది అని భయపెట్టారు. ఒక్కసారి, కష్టపడి prepare అయ్యిందంతా waste అని బాధపడ్డాను. ఏం చేయాలో తెలీలేదు."

"ఓ, అవునా!"

"మన కాకినాడ Kharagpur administration zoneలోకి  వస్తుంది కాబట్టి, అక్కడి officeని reach అయ్యి, correct చేస్కోవచ్చు అని తెలిసింది. Phone ద్వారా try చేశా, కుదరలేదు. అక్కడ నాకు తెలిసిన వాళ్ళుకూడా ఎవరూ లేరు. RR Nagar friend ఒకడు, వాడికి తెలిసిన senior ఉన్నాడని చెప్పి, రోజంతా నానా చాకిరీ చేయించుకొని, hand ఇచ్చాడు. వాడితో పని అవ్వదని decide అయ్యి, ఏంచేసినా ఒక్కరోజే ఉంది  అని బాధపడుతూ ఉంటే, మా classmate, మీ junior, kamalakar reddy (మా junior ఎలా అయ్యాడో అర్థమైందనుకుంటా) విషయం తెలుసుకొని వాడే నా దగ్గరికొచ్చి Kharagpurలో ఉన్న మీ contact ఇచ్చాడు. మీకు call చేసి, help అడగ్గానే, అక్కడి office కెళ్లి, మాట్లాడి, forms చూపించి correct చేసిన hall ticket ఆ రోజే mail చేయించారు."

"Really! caste గ్రూపులు ఇలాకూడా ఉపయోగపడ్డాయన్నమాట!"

"ఆ! కొత్త hall ticket చూసుకొని, ప్రశాంతంగా పడుకున్నా ఆరోజు. Next day exam కూడా సరిగ్గా రాయగలిగా"

"Honestly, నాకివేమీ గుర్తులేవు, ఇంత జరిగిందా?"

"నేనేం ఆశ్చర్యపోను, మీ వరకూ just ఒక గంట పని, Kharagpur GATE officeకి వెళ్లి explain చేసి correct చేయించి ఉంటారు, అంతే, ఆ తర్వాత మర్చిపోవచ్చు. నేను కదా అక్కడ sufferingలో ఉన్నది, ఆ తర్వాత బయటపడినది. కాబట్టి, నాకు అది పెద్ద విషయం. ఆ correction వల్లే GATE rank వచ్చింది, ఐఐటీఎం లో చదివాను, amazonలో place అయ్యాను, తర్వాత Germany వచ్చాను అని చెప్పడం లేదు, అసలు అది admission అప్పుడు issue అయ్యేదోలేదో కూడా confirmగా తెలీదు. మహా ఐతే, next year రాసేవాణ్ణేమో, but, ఆ panic momentలో, కలిగిన reliefకి value ఉందిగా. పరిచయం లేకపోయినా, మీ junior చెప్పాడని help చేసారు, నేను కూడా నావైపు story, మరియు నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా, దేశంకాని దేశంలో, అనుకోకుండా ఇప్పటికి, ఇలా కుదిరింది."

"You are welcome!"

అనుకొని, దగ్గర్లో ఉన్న మా officeకి తీసుకెళ్లి, అక్కడి నుంచి కొన్ని దర్శనీయ ప్రదేశాలవైపుకి guide చేసి, next day కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి, మళ్లీ కలవడానికి decide అయ్యి, వీడ్కోలు తీసుకున్నాం ఆవాళ్టికి.


అవును, మనం జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడనిది, "మనం పొందిన మేలు", వెంటనే మర్చిపోవాల్సింది "మనం చేసిన మేలు". ఇదన్నమాట పై confusionకి వివరణ.  Also, చిన్న helpయే కదా, మనం చేయకపోయినా పర్లేదు, ఇంకెవరైనా చేస్తారులే , పెద్ద farak పడదు అనుకోకూడదన్నమాట, ఏమో, అవతలి వాళ్లకి అది ఎంత పెద్దదో!  కాబట్టి, వీలైనంత చేద్దాం మేలు!

Thursday, October 31, 2019

ప్రపంచం పెద్దదే, కానీ, మన ప్రపంచమే చిన్నది!

సాయంత్రం 7, UKలో. Indiaలో దాదాపు అర్ధరాత్రి. ఏం తినడమో తెలియక, తేల్చుకుంటుండగా phone మోగింది. చూసి, ఇప్పుడప్పుడే అయ్యేది కాదులే అనుకొని, earphonesతో answer చేసి వంటగదిలోకి బయల్దేరా.

'ఏం రా, ఏం జేచ్చానావ్?' అని మా శివగాడు మొదలు పెట్టాడు. ఆ మధ్య వాడికి పెళ్ళైపోయినప్పటి నుంచి, వాళ్ళ home minister పడుకున్నాక, ఇలా అర్ధరాత్రి మాత్రమే, దొంగగా ఇంటి బయటికొచ్చాకనే కుదురుతుందట పాపం వాడికి. Affair నడపటానికి కాదు, call చేయడానికి. మరి మావి sprintలు కాదుగా,  marathonలు. 'ఏం జేచ్చాం రా? ప్రపంచం పెద్దదే, కానీ, మన ప్రపంచం చిన్నది' అనుకున్నాం.

కుశల ప్రశ్నలు, చిన్న చిన్న comedyలు ఐపోయాక, 'ఏం రా, ఇంతకీ మచ్చున్న పిల్ల దొరికిందా?' అని వేట గురించి వాకబు చేశాడు. నా గురించి అనుకుంటున్నారేమో, కాదు. ఇంకో friend, కొంచెం entertainer, అయన గురించిన enquiry ఇది. 'అప్పుడేనా? time పడ్తాదిరా, మొన్న మాట్లాడినప్పుడు, "మనల్ని చేసుకోవాలంటే ఒకటి కాదు, minimum మూడు మచ్చలు ఉండాలి bro" అన్నాడు' అని చెప్పా.

'అంతేలే, ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి' అని తమాషా చేసాడు మావోడు.

అర్థం కాలేదా, బాగా జరుగుతూ ఉంటే ఉగాది పండగ జరుపుకున్నట్లు ఆరు రుచులతో ఆర్భాటంగా రచ్చ చేస్తాం, జరగకపోతే, simpleగా "శివరాత్రి కదా, ఉపవాసం ఉంటున్నాం, ఏమీ వండుకోలేదు" అని cover చేస్తాం! అంటున్నాడు.

మరి మనం కూడా వనితావేటలోనే ఉన్నాం కదా, అందువల్ల, 'ఈ మధ్య master pieceలు ఏమన్నా తగిల్నాయా?' అని అడిగాడు.

'ఆ! మొన్నొకటి తగిలింది రోయ్, అద్భుతం' 

'ఇంగేం late, కానీ చెప్పు, ఏమంటా ఆ పాప ఏషాలు?'

'మనం తట్టుకోలేం రేయ్. Phone చేసారు మాట్లాడాలని. అబ్బే, మొగమాటమే లేదు పిల్లకి. మాటవరసకైనా మొదటిసారి కూడా మీరు అనడం లేదురా ఆయమ్మి. 'నీ' hobbies ఏంటి, 'నీ' job ఎలా ఉంటుంది, అన్నీ, నీ నీ నే. ఓపక్క, నేనేమో, 'మీ' hobbies ఏంటి, 'మీ' familyలో ఎంతమంది ఉంటారు? అంటూ, మీ మీ అని ఒత్తి పలుకుతాన్యాగాని tube ఎలగడం లేదురా సామి!'

'already, profile చూసేసి దగ్గర ఐపోయిందేమోలేరా, indirectగా చెప్తాంది, నీకు అర్థమై చావడంలే'

'ఆ, అయ్యా, శానా ఖాళీగా ఉండాం ఈడ, రావొచ్చు'

'సర్లెరా, ఇయన్నీ సిన్న సిన్న విషయాలు, continue'

'పెద్ద విషయాలు గూడ మాట్లాడింది రోయ్. hobbies అంటే ఏం చెప్పిందో తెల్సా, "hobbies అంటే పెద్దగా ఏం లేవు, shopping చేస్తా" అనింది. సరదాగా పొద్దుపోనప్పుడల్లా hobby లాగా shoppingలు చేస్తే, తండ్రులు, boyfrineds, మొగుళ్లు, మొన్న కనిపించావు ******చావు అని పాడుకోవాల్సిందేగా ఇంక!'

'సరేలేరా, ఈ కాలం పిలోల్లు ఉద్యోగాలు జేచ్చా  సంపాదిచ్చానారు, ఖర్చుపెట్టుకుంటారు, మాములే'

'అయ్యా, ఈయమ్మి ఉద్యోగం జెచ్చాందని ఎవుర్జెప్పినారు? ఖాళీగానే ఉంది ఇంటికాడ, shoppingలు చేసుకుంటూ'

'ఓహో! qualifications ఏమిటో?'

 'BTech Civil'

'ఓ, ఐతే కష్టమేలే, but, govt. jobs ఉండాయిగారా, ప్రయత్నించలేదంటా?'

'బెంగుళూరులో ఒక సంవత్సరం software engineering చేసిందంట Accentureలో, నచ్చక వదిలేసి, రెండేళ్లగా ఇంటికాడే ఉందంటబ్బా' 

 'బాగా బలిసిన familyనా?'

'అంటే, job మానేసి ఇంటికాడ ఉంటే బలిసినోళ్ళేనా?'

'అట్ట కాదులేరా, just కనుక్కుందామని అడిగా. అయ్యా, అమ్మా ఏం చేస్తారంట?'

'అయ్యా అమ్మ ఇద్దరు working అంటరా. మంచి positionలోనే ఉండారు. ఇంకోటి గుర్తొచ్చింది ఉండు. వంట వచ్చా అని అడిగితే. ఉహు, రాదు, అమ్మే వండుతుంది, అని కిల కిల నవ్వుతోందిరా బాబు'

'రేయ్, నువ్వు మరీ లేరా. ఈ కాలంలో వంట వార్పు ఎంతమందికొస్తాయి.'

'రెండేళ్ల బట్టి ఇంటికాన్నే ఉంది ఖాళీగా. అయ్యా అమ్మ ఇద్దరు పొద్దన్నే officeకి పోవాల అని తెలుసు. వంటలో help జేస్తే అమ్మకి easyగా ఉంటుందని తెలీట్లేదురా ఆయమ్మికి, ఇవి interest ఉండదు కానీ, shopping ఐతే hobbyలాగ చేస్తారు. what is the point of higher education?'

'hmm, ఏం ఉద్యోగాలు వాళ్ళవి?'

'అయ్య CA, అమ్మ LICలో  సేచ్చానారంట. Busyగానే ఉంటారని చెప్పారు మరి'

'ఓ, wait, పాప BTch చేసినేది యాడ?'

'CBIT'

'పాపకి CA చేస్తోన్న సెల్లెలుందికదా?'

'అవున్రా, నీకెట్ట తెల్సు?'

'పాప extraordinary height ఉందా?'

'ఓరినీ పాసుకులా! అవున్రోవ్ 5 9' అంట'

<< ఆపకుండా ఓ నిమిషం నవ్వు>>

'రెండేళ్లప్పుడు నాకు తగిలింది ఈ ఆణిముత్యం. Railwaysలో చేస్తున్నపుడు govt. job అల్లుడు కావాలని contact అయ్యారులే. height మరీ ఎక్కువని light తీసుకున్నాం. అదృష్టం బాగుంది, miss ఐంది. అంటే ఇంకా marketలోనే ఉందన్నమాట.'

మావోడు, ఇలాంటి అల్లరి చాల చేసినవాడు. ఇంకా చేస్తున్న వాడు. పెళ్ళైపోయి మూడు quarterలు అయినా, ఇంకా matrimony account maintain చేస్తున్నాడు. ఎందుకా, ముఖ్య కారణం మన parents generationలో పిల్లల మధ్య ఎక్కువ ఎడం పాటించనందుకు (తమ్ముడుగాడి కోసం అని చెబుతున్నాడు; ఎండాకాలం రాగానే ఏడాది మారిందని class పుస్తకాలు తమ్ముడికో చెల్లెలికో ఇచ్చినట్లు, వీడి పెళ్లి అవగానే అదే accountలో చినబాబుకి కూడా కానిచేద్దామని). కానీ, అసలు కారణం entertainment కోసం, అని నా అనుమానం. LOL. 

మొత్తానికి, నిజమే భయ్యా! ప్రపంచం పెద్దదే, కానీ, మన ప్రపంచమే చిన్నది!

Friday, October 4, 2019

మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా!

మొన్నామధ్య సామజ వరగమనా పాట వింటుంటే, "మనసుమీద వయసుకున్న అదుపు చెప్ప తగునా!" అనే expression వినగానే, ఒక తృప్తి అనుభవించినట్లినిపించి, సహజమైన చిరునవ్వు లాగా వ్యక్తమయ్యా, నాకు నేనే. మరి conceptకి connect అయితే అంతే కదా!

దేనిగురించైనా, "చెప్పనలవికాదు!" అనడమే దానిగురించి గొప్పగా చెప్పడం. అదో అలంకారం. ఆరకంగానే, "చెప్పడం అవుతుందా?" అని అడగటం కూడా. ఇదంతా day-to-day కవిత్వం.

శాస్త్రిగారి భావం, "చెప్పలేమురా నాయనా, it's immense" అని అర్థమైనా, "అలాంటివి చెప్పడమే కదా కవిత్వం!" అని సరదాగా challenge స్వీకరించి చేస్తున్న సాహసమిది.


అపుడెపుడో, ఓ పాత పాటలో, "మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా" అని అడిగితే, "అద్దమంటి మనసు ఉంది, అందమైనా వయసు ఉంది" అని మహానటి అభినయించగా, 'అందమైన వయసా?' అని అలోచించి, అదేదో  అర్థమైనట్లుగా అనిపించినప్పుడు కలిగిన కుదుపుతో మొదలైన 'ఆ' అదుపు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అంటే, ఎంతో చెప్పడం కుదరదని అర్థం, అయినా కొంత చెప్పుకుందాం.

శ్రీచైతన్య నుంచి విడుదలయ్యాక, engineeringలో, అమ్మాయిలంటే కచ్చి ఉన్న ఒక maths lecturer, classలోని top-3 beautiesలో ఓపిల్లని board దగ్గరికి వచ్చి లెక్కచేయమంటే, ఆరోజు బోర్డుముందర సాక్షాత్కరించిన geography, తద్వారా నాలో కట్టలు తెంచుకున్న chemistry, 'మనసు'లో దాచుకునేందుకు, తొలకరి 'వయసి'చ్చిన ఒకానొక చెరిగిపోని జ్ఞాపకం!

కొత్తగా ప్రపంచం పరిచయం అవుతున్న కాకినాడ రోజుల్లో, phoneలో మాట్లాడిన ప్రతిసారి, పెట్టేసేముందు, నాన్నకి దూరంగా వచ్చి, లోగొంతుకలో "సక్కగ దార్లోపోయి, సక్కగ దార్లో రా, పక్క సూపులు సూడకుండా!" అని అమ్మ ఇచ్చే regular warningలో వినిపించేది కూడా 'ఆ' అదుపు పట్ల భయమే!

"మహా మహా ఋషులకే తప్పలేదు జీవితం reset చేసుకోవడం erotic episodes తర్వాత. ఇక మనమెంత" అనుకుంటూ handsetలో history clear చేసిన ప్రతిసారి 'ఆ' అదుపేగా మనల్ని ఆడించేది.

"Engineeringలో stamp (just pass marks) కోసం చదవడానికి కూడా దొరకని time, స్వాతిలో వచ్చే సరసమైన కథలనుంచి, కాళిదాసు కుమార సంభవం వరకూ మళ్లీ మళ్లీ చదవడానికి మాత్రం ఎలా దొరికేదో?" అని ఆలోచిస్తే అర్థమవదా 'ఆ' అదుపు!

ఇంతెందుకు, నర్తనశాల సినిమా చూస్తూ, "పతివ్రతల పొందుకోరి పాపాగ్నిలో పడి భస్మం అవ్వొద్ద"ని ఉదాహరణలతో పాంచాలి హెచ్చరిస్తే, "ఏడిశావ్!అయినా సరే, భరించరాని ఈ విరహాగ్నికన్నా, మాకా పాపాగ్నే సమ్మతము" అని కీచకుడు అప్పుడే చెప్పేశాడే 'ఆ' అదుపు గురించి. అదంతాచూస్తూ, "ఔరా!" అనుకున్నప్పుడే అర్థమైందిగా అందరికీ అదేంటో.

ఒకానొక timeలో "ఏం రాస్తున్నావ్ రా, articles నిండా, నువ్వూ , నీ కామం తప్ప. మనసుని divert చెయ్ కొంచెం" అని ఒక స్నేహితుడి honest feedback. ఇదైతే, అదుపుతప్పుతున్నావేమో చూసుకోమని, 'ఆ'యొక్క అదుపు గురించి అరిచిమరీ చెప్పడం. నిజమేమరి, "నవరసాలా?అన్నెందుకు?" అని 'వయసు'కి నచ్చిన రసరాజం ఒక్కటే జీవితాన్ని రసవత్తరం చేసేదని 'మనసు'ని నమ్మించిన 'ఆ' అదుపుని గురించి ఎంత చెప్పినా చెప్పినట్లు కాదేమో!

Sunday, September 22, 2019

First Interview - The Face off

ఇంతలో, welcome చెబుతున్న uncleని చూసి , "మరీ అంచు పంచెలు expect చేయలేదులేకానీ, ఇలా night pants, T-shirtని కూడా expect చెయ్యలేదే" అనుకున్నా, బాగా... chill అవుతున్న అయన్ని చూసి. "సర్లే, అవంత important కాదులే, uncle అంటే ముసలాడనుకున్నా, పర్లేదు" అనుకొని, hallలో ఉన్న sofa setలో (sofa కాకుండా, oppositeలో) విడిగా ఉండే (రెండింటిలో) ఒక chair మీద కూచున్నా. అయన నాకెదురుగా sofaమీద కూచున్నాడు, మధ్యలో teapoy ఉంది. ఒకట్రెండు నిముషాలు కుశల ప్రశ్నలూ, పొద్దున్న జరిగిన defence గురించి అడిగి, kitchenలో నుంచి వచ్చిన తన భార్యని పరిచయం చేశాడు. నవ్వుతూ వచ్చి, ఆవిడ నాకు కొద్ధి దూరంలో left side, మా ఇద్దరినీ face చేస్తూ కూచున్నారు. ఇంతలో, లో...పలి నుంచి ఇంకో జంట వచ్చారు. "వీళ్లెవరో?" అనుకుంటూ చూస్తుండగానే, uncle పరిచయం చేశాడు, వీళ్లు తన అక్కాబావలని. అనగా, candidateకి అమ్మానాన్నలు అనమాట. పైకి లేచేందుకు ప్రయత్నిస్తూ "నమస్కారం అండి!" అని పైకని, "ఆహా!, చేశాడుగా uncle మనల్ని గట్టిగా!" అని లోపలనుకున్నా. "పర్లేదు బాబు కూచోండి" వాళ్ళ reply. వాళ్లు మరీ chill బట్టలు కాకుండా, officeకి వేసుకెళ్ళేవే కట్టుకున్నారు.

"Candidate వాళ్ల family APలో ఉంటుంది, వాళ్లంతా ఎందుకు, ముందు తను నీతో మాట్లాడాలంటోంది, బెంగుళూరులో మా ఇంట్లో కలిసి మాట్లాడుకోండి, పెద్దోళ్ల కథ తర్వాత చూద్దాం అని simpleగా tempt చేసి పిలిపించి, అందరి ముందు పడేసి, అడ్డంగా book చేశావుగా uncle" అనుకుంటున్నా. ఇంతలోనే అంతా వినిపించినట్లు ఓ నవ్వు నవ్వి, "నీకు తక్కువ time ఉంది కదా, పెళ్లికి attend అయ్యి వెళ్ళిపోతా అన్నావని, వీళ్లు కూడా వస్తామన్నారు నిన్న; ఇవాళ పొద్దున్నేreach అయ్యారు" అని సంజాయిషీ ఇచ్చాడు uncle. ఏమంటాం, "ఓహో!" అని ఊరుకున్నాం. ఇంతలో ఇంకొకరొచ్చారు hallలోకి, "తను వీళ్లబ్బాయి" అని అతణ్ని కూడా పరిచయం చేశాడు uncle, "ఈయన (candidateకి తమ్ముడు) ఈ రాష్ట్రంలోనే  చదువుకుంటున్నాడు, పొద్దుటే వచ్చాడు" అని. Uncle లాగే night dressలో chill కొడుతున్న brotherకి కూడా ఓ హాయ్ చెప్పేసి, ఇంకెవరైనా వస్తారేమోనని చూస్తుండగా,  uncle పిల్లలిద్దరూ వచ్చారు. వాళ్ళు మరీ చిన్నపిల్లలు, పాపం, అందుకని పరిచయం చేయలేదు. "పోన్లే భయ్యా, బామ్మలు, తాతయ్యలు కూడా వస్తారేమో అని భయపడ్డా. మొత్తానికి, మాంచి sketch వేసి, నన్ను బోనులోకి లాగి అందరూ చుట్టుముట్టారుగా, let's get started" అని దీర్ఘశ్వాస ఒకటి తీసుకున్నా. నా ఎదురుగా sofa మీద, uncle, అయన పక్కన candidate వాళ్ళ నాన్న, hallకి కొద్దిగా దూరంగా, dining table దగ్గర వాళ్ళ అమ్మ, నాకు ఎడమపక్కన uncle భార్య, ఆమె పక్కన candidate వాళ్ళ brother కూచున్నారు.  అందరూ నన్నే చూస్తున్నారు, చూడటంకాదది, తినడం అన్నా తక్కువే. "VIP treatment భయ్యా, అడిగావుగా, enjoy మాడి!" ఎవరో వెటకారిస్తున్నట్లు వినిపించింది. కొత్తగ్గా వయసొచ్చిన కాకినాడరోజుల్లో, అప్పుడప్పుడూ కొద్దిగా insensitiveగా చేసిన సౌందర్య అన్వేషణ మరియు ఆరాధన యొక్క కర్మఫలమేమో అనుకున్నా.

ఇంతలో uncle instruction మీద refreshments arrangements మొదలయ్యాయి. వాళ్ళావిడ మంచినీరూ, T తేవడానికి వెళ్లారు, దాంతోపాటు రవ్వలడ్డు కూడా (తెచ్చాకే తెలిసాయిలెండి items ఇవని). "హ్మ్, మీ ప్రస్థానం ఏమిటో మాట్లాడుకుందామా?" అని నన్నే మొదలుపెట్టమన్నాడు uncle. "ఉండు, మన family గురించి చెబుదాం, పరిచయాలకి continuation లాగా ఉంటుంది" అని వాళ్ల బావగారు కల్పించుకొని వాళ్ల వంశం రెండువైపులా (అనగా, వారిది, వాళ్ళావిడ వాళ్ళది) చెప్పుకుంటూ వచ్చారు. మాంచి హుషారుగా ఉన్నాడాయన. అటువైపు, ఇటువైపు కూడా ఉద్యోగస్తులమే, పేరుమోసిన వాళ్ళమేనన్న కించిత్ 'ఇది' ధ్వనించింది. తప్పేంకాదు, చెప్పుకోడానికే కదా కలుసుకుంది, కాబట్టి, అంతా attentiveగా విన్నా. అలా పెద్దలగురించి అయ్యాక, పిల్లల దగ్గరికొచ్చేసరికి, "ఇద్దర్ని వేరే రాష్టాల్లో చదివించాం" అని ఈసారి ఇంకొంచెం 'ఇది'గా చెప్పేసరికి, చాలా సహజంగానే అనుమానమొచ్చింది, "బహుశా EAMCETలో మంచి seat రాలేదేమో ఇద్దరికీ" అని. అక్కడికే వస్తున్నా అన్నట్లు, "ఇద్దరికీ seat వచ్చినా, మంచి చదువులకోసం, communication skills కోసం (నేనూ, మీరూ కూడా సరిగ్గానే విన్నాం) అని అలా plan చేశా" అన్నాడు. Particularly అబ్బాయి medical seat గురించి, "సీమలోని famous private collegeలో government seat వచ్చినా, బయటే prefer చేశాం" అన్నాడు.  "సర్లే భయ్యా! seriousగా తీస్కోవద్దు, ఏదో కాలం బాలేదు,  ఇప్పుడంతా మితిమీరిన marketing నడుస్తోంది కదా అని, ఎవర్ని నమ్మాలో నమ్మకూడదో తెలీక అనుమానించా అంతే!" అనుకున్నా, పైకి ఊకొడుతూ. ఏదేమైనా, ఈ setup అంతేలా ఉంది. తప్పదు ఎవరికైనా. Generalగానే జనాలు personal brandingకి పరాకాష్ఠ చూపిస్తున్నారు. ఇదంతా అర్థమైనట్లు uncle వారి బావగారిని ఆపేసి, ఇంక నా గురించి చెప్పామన్నారు.

నా స్వార్థపూరిత ప్రయోజనం నడిపిస్తుండగా, నేనేమీ జంకకుండా (#NoFilters), సంక్షిప్త సుందరంగా, సమాచారం మాత్రమే వెల్లడయ్యేలాగా (show-offలా కనపడకుండా) CV బయటపెట్టా, వ్యక్తిగతము, వృత్తిగతమూనూ. నాకంటే రెట్టింపు ఉత్సాహంగా విన్నారు అందరూ, I liked it. విజయవాడ శ్రీచైతన్యలో, "లెక్కలు చేయడం ఒక art" అంటూ blackboard, chalk piece రెండూ తానే అయ్యి class చెప్పే KSగారి period అంత animatedగా (+ve గానే; uncle గారి బావగారి వల్ల) నడిచింది ఆ episode. అపుడు మరోసారి, పొద్దున్న KK అడిగిన questions కనిపించాయి కళ్ళముందు. "మరేం పర్లేదు, process important participants అందరికీ" అనుకొని proceed అయ్యా.

ఇలాగా family విషయాలు, professional plans గట్రా మాట్లాడుకున్నాక, ఒకట్రెండు నిమిషాల pause వచ్చేసరికి, నాకేదో అర్థమైనట్లుగా "main round interview ఎక్కడై ఉంటుందబ్బా!, పెరడూ గట్రా ఉండవుకదా ఇలాంటిచోట్ల!" అనుకుంటున్నా. మరి మనకేమో కొత్త; సినిమాల్లో అలాగే చూపిస్తారు కదా, పెరట్లోనో, balconyలోనో అవుతాయి meetings అని expect చేస్తున్నా. తనకోసమే ఈ Pre-planned pause అన్నట్లు, దగ్గర్లోవున్న bedroom నుంచి అంతా follow అవుతున్న candidate, మేమంతా ఉన్న hallలోకి enter అయ్యింది. ఓహో! అంటే అన్నిసార్లు ఈ ఆడంగులే లోపలికెళ్ళి  తీసుకురావాలనేం లేదన్నమాట అనుకుంటుండగా, "మీరిద్దరూ మాట్లాడుకోండి, మేము అలా పక్కకెళతాం" అంటూ uncle అనేసరికి అందరూ లేచి dining వైపు వెళ్తున్నారు, ఒక్కరు తప్ప, uncle wife. ఆవిడ అక్కడే కూచున్నారు. పక్కనున్న brother వెళ్లిపోగా, ఆ placeలో కొత్త శాల్తీ settle అయ్యింది. "అనగా, మనకి లభించే maximum privacy ఇంతే అనమాట!" అని అర్థంచేసుకుంటూ, dining table దగ్గర, చెవులిటు పడేసి వాళ్ళల్లో వాళ్లే ఏదో మాట్లాడుకుంటున్నట్లు కనిపించిన జనాన్ని చూసి, "This is cheating భయ్యా! మరీ రోడ్డుమీదకి కాకపోయినా, కొంచెం దూరమైనా వెళ్లాలిగా"  అనుకొని, వెంటనే, "wait, ఈ pre-meditated షాట్లే ఆడకూడదు, let's face it! ఇవాల్టికి బెంగుళూరే గ్వాలియర్, మనమే దేవుడు; స్టెయిన్, పార్నెల్ పిచ్చ light; ఓ అద్భుతానికి అవకాశమో, సాక్ష్యమో ఇచ్చినట్లు feel అయిన కల్లిస్ లాగా uncle కూడా feel అవ్వాల్సిందే ఈ పూటకి," అనుకొని, హాయ్ చెప్పా.

"చదువుకోడం కాకుండా ఇంకేమైనా చేస్తారా మీరు?" మొదటి ప్రశ్న. అంచనా లేని pitch కదా, ఈ unexpected bounceకి కొంచెం surprise అయ్యాం. Offend అయ్యాం అనుకున్నారో ఏమో, "అంటే, అలా కాదు, మీకున్న illustrious academic careerకి కొంచెం ఎక్కువ dedication కావాలేమో కదా! అందుకని other hobbiesకి time దొరకదేమో అని అలా అడుగుతున్నా" damage control exert చేశారు. (కంగారు పడకండి, exact language ఇది కాదు, భావం చెడిపోకుండా నేను అందమైన పదాలతో decorate చేశా, ఎంతైనా మనగురించి కదా!) .

"అలా ఏం లేదు, in fact నేనింకా, నా career కోసం ఇవ్వాల్సినంత time ఇవ్వడంలేదని feel అవుతుంటా" అన్నా.

"Seriously, with a PhD, you are saying you don't study enough?" అన్నట్లు చూసేసరికి,

"Damn Yes, I am not kidding. మనకున్న cotton businessల వల్ల research output is taking a toll. కవిత్వం చదవాలి, cricket ఆడాలి, రోడ్డుమీద పడి రాచకార్యాలు చేయాలి, cycling, biking, కొత్తగా zoom-car-ing, trekkingలు చేయాలి, friendships కావాలి, dark sides చూడాలి, simpleగా, nuclear science నుంచి nude woman దాకా అన్నీ నాకే కావాలి, ఇంకెప్పుడు careerకి ఉపయోగపడే పనులుచేసేది. నోట్లో స్పూను, దాంట్లో నిమ్మకాయ పెట్టుకొని, Balance Balance అంటూ పరుగెత్తడానికి ప్రయత్నిస్తున్నాం", కంగారు పడకండి, ఆవేశంగా అన్నీ లోపలే అనుకున్నా, పైకి ఏమీ అనలేదు.

"I mean, చిన్న చిన్న hobbies గట్రా ఉంటాయి కదా" అని, పైనున్న listలోంచి, చెప్పుకోగలిగినవి మాత్రమే, చెప్పాల్సిన విధంగా చెప్పడం జరిగిందనమాట.

Suddenగా ఇంకో విషయం గుర్తొచ్చింది, Indiaకి వచ్చేముందే శర్మగారని, ఒకానొక  wise friendతో పెళ్లి గురించి కొంచెం gyan ఇవ్వమంటే, "పెద్ద పెద్ద shockingలకి ready ఉండు" అన్నారు. "ఎందుకని?" అంటే, చెప్పారు, "మీ(family) దగ్గరికి pilot profile కానీ, సినిమాలో పనిచేసే assistant director profile కానీ, జిల్లా కలెక్టర్ (IAS) profile కానీ వచ్చిందనుకో ఎలా feel అవుతారు?" అని అడిగారు. నా surprise cum shockని అర్థంచేసుకొని, ఆయనే అన్నారు మళ్లీ,  "కొద్దిగా uncomfortableగా feel అయ్యి, match అవ్వమేమోలే అని hesitate చేస్తారు కదా, అలానే, నీలాంటి, SEEMINGLY studious, PhD profile చూస్తే, typical family, ఇంకా particularగా, BTech and software engineer అమ్మాయిలు అలానే feel అవరంటావా?" అన్నారు.

"నిజమేనేమో, మనం కొంచెం కొత్తగా, unfamiliarగా అనిపించొచ్చేమో. Ultimateగా,  academic jobని, లేదా, కంపెనీల్లో scientist jobని కూడా దూరంగానే feel అవుతారా?"

"నీ చేతుల్లోనే ఉంది, IITలు, IIScలు, scientist, research papers, academic conferenceలు, postdocలు గట్రా అంటూ భయపెడితే  వాళ్లకి తెలీని కొత్త ప్రపంచం అనుకొని risk feel అవ్వొచ్చు మరి, familyలో ఇవి తెల్సిన వాళ్లు ఉంటే, no problem. కొద్దిగానైనా తెలిసిన జీవితంలోకి అడుగుపెట్టాలని అనుకుంటారు కానీ, పూర్తిగా unfamiliar terrain కోరుకోరుగా. Anyway, play it simple, Good luck!" అని కొంచెం జ్ఞానదానం చేశారు. In this case, it seems, he was close.

Back to Gwalior...

ఆ తర్వాత, interestలు, likingలు, time passలు, friends,  అలవాట్లు, వేషధారణలు, professional plans అబ్బో, అన్ని variations ఎదుర్కోవాల్సి వచ్చింది. Workshop paperలో మన researchని beautify చెయ్యకుండా, disadvantagesని cover చేయడాలు గట్రా పెట్టుకోకుండా, pros cons అన్నీ వీలైనంత  nakedగా చూపించినట్లే చర్చలు నడిచాయి. Entertainment value మెండుగా ఉందని గుర్తించినా, పాఠకులు నిరుత్సాహపడతారని తెలుస్తున్నా, కొన్ని limitations వల్ల ఈ విషయం ఇలా తెగ్గొట్టాల్సి వస్తోంది. కానీ, రుచి తెలుసుకోవడం కోసం ఒక మెతుకు చూద్దాం. నేనడిగిన ఒక ప్రశ్నకి నా దగ్గరున్న జనాలు "దానిగురించెందుకు నీకెందుకు?" అన్నట్లు చూశారు, dining table దగ్గర జనాలు అందరూ "ఏం చెబుతాడో విందాం" అన్నట్లు silent అయిపోయారు. వాళ్లు initialగా ఇచ్చిన informationతో నాకు సమాధానం దొరకలేదు, అందుకే particularగా అడగాల్సి వచ్చిందీ ప్రశ్న: "మీ parents పెళ్లి మేనరికమా?" అని.  మనకెందుకా? నేను next generationకి ఇచ్చే ఆస్తిపాస్తులంటూ పెద్దగా ఏమీ ఉండదు, ఆరోగ్యం, చదువు మాత్రమే ఇవ్వాలని అనుకుంటా. అక్కడ మాత్రం రాజీపడను, అందుకోసమే అడిగా. మరి ఆరకంగా, candidate ఆరోగ్యం కూడా మనకి important కదా! Genuineగానే అనిపించిందేమో, జనాలెవరూ Affect అయినట్లు అనిపించలేదు.

మంచి పరిణామమేంటంటే, "At least కొంతమంది candidates homework చేసి వస్తున్నారు interviewsకి. వాళ్లకేం కావాలో స్పష్టత ఉన్నట్లుగా ఉంటోంది" అని బయట talk. People would like to believe that nothing is obvious, అందువల్ల, "ఫలానా వేషధారణ మీకేమైనా అభ్యంతరమా?", "నేను Job చేయడం గురించి మీ expectations ఏంటి, మీ family expectations ఏంటి?", "నాకున్న ఫలానా interest గురించి మీ అభిప్రాయమేంటి?" లాంటి ప్రశ్నలు అవలీలగా అడిగేస్తున్నారు. In fact, అందరూ ఉండటం వల్ల అడగలేకపోయిన ఒకానొక ప్రశ్నని (అదేమిటో మీ ఊహకి వదిలేస్తున్నా), తర్వాత uncle ద్వారా message చేయించి మరీ అడిగారు నా caseలో, అదీ మరి పరిస్థితి.  Completeness కోసం concluding remark: semi-privateగా నడిచినందువల్ల ఈ గంట timeకి, U certificate మాత్రమే సాధ్యపడింది. అనగా, old ball వల్ల వచ్చే reverse swingని face చేయాల్సిరాలేదు.

ఆవిధంగా, diplomaticగా కార్యక్రమం ముగించుకొని, dinnerకి late అవుతోందని సెలవు తీసుకునేందుకు ready అయ్యా. ఈమాటు మాత్రం వారికోరికని మన్నించి, వారి వాహనంలోనే  వెనుదిరుగ వలెనని నిశ్చయించుకొని బయలుదేరితిమి. వారి చోదకుడు తెలుగు నెరిగినవాడు, మరియు, మా సందర్శనార్థము బహు చక్కగా ఎరిగిన వాడునూ అవడంచేత,  మమ్ములను మిక్కిలి గౌరవముతో వ్యవహరించినాడు. వారి రెడ్ల (యజమానుల) యెడల ఆతని సానుకూల్యతని, స్వామిభక్తిని వ్యక్తపరిచినాడు. సర్లెమ్మని, మా ఆలోచనలని మరోవైపు మళ్లించడం కోసం, "music ఏమైనా ప్లే చేస్తారా" అని రిక్వెస్ట్ చేస్తే, "తప్పకుండా" అని, జేబులో ఉన్న, personal collection pen-drive insert చేస్తూ, "కొంచెం పాత పాటలు, పర్లేదా!" అన్నారు పాపం నొచ్చుకుంటూ, "అయ్యో దానికేముంది, నేను కూడా వింటా ఆనందంగా" అన్నా.

"ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాక్కున్నావో వెన్నెల గువ్వా, వెన్నెల గువ్వా, ఇవ్వాళే చూశా నిన్ను వెన్నెల గువ్వా, వెన్నెల గువ్వా " అంటున్నారు ఇంకో రెడ్డిగారు పాటలో. "అయ్యో, లేదండి (SV)కృష్ణారెడ్డిగారు, మనకి ఇంకా time ఉంది ఈ పాట పాడటానికి" అనుకుంటూ ఆ journey కొనసాగించాం New BEL roadకి.


PS: పనులుచేస్తేనే పొరపాట్లూ జరుగుతాయి. కాబట్టి, ఏమైనా పొరపాటుగా అనిపిస్తే, వాటివెనకాల ఉన్న "పనిచేయాలన్న నా పట్టుదలని" పెద్దమనసుతో అర్థంచేసుకొని, పొరపాట్లని క్షమిస్తారని (anonymous participantsతో సహా) ప్రజలందరికీ మనవి. విచ్చలవిడిగా వాడుకోనిచ్చినందుకు KKకి ధన్యవాదాలు. 

Friday, September 20, 2019

First Interview - Gradual Building up


అలా 9:30కి తయారవ్వడం మొదలుపెట్టి, అయ్యాక, ఎక్కువ time లేదు కాబట్టి, ఈ పూట ప్రకృతిలో coffee skip చేసి, directగా department దగ్గర దిగేసరికి 10:30. 

"ఏంది మచ్చా, నీకన్నా ఆడోళ్లు నయం, గంటసేపు ready అయ్యావ్" time చూస్తూ KK విసుక్కున్నాడు.

"మా మతం భోజనాన్ని ఆస్వాదించడాన్ని తప్పుపట్టిందేమోగాని, స్నానాన్ని ఆస్వాదించమనే చెప్పింది మచ్చా" అన్నా.

"ఇట్టాంటివి బాగ చెబుతావ్ సామి నువ్వు!" అనుకుంటూ నన్ను వదిలిపెట్టి labకి వెళ్ళిపోయాడు. ఆయన ఏడుపు మయాంక్ దగ్గర attendanceకి late అయ్యిందని. అనవసరంగా acknowledge చేశా thesisలో, campusలోనే ఉండి, colloquiumకి, defenceకి రెంటికీ రాలేదు, ఏం ఉపయోగం?  

ఇంతలో, Mr. Kanhar "ಚೆನ್ನಾಗಿದ್ದಿರಾ Sir?" అనుకుంటూ security postలోంచి బయటికొచ్చాడు నవ్వుకుంటూ. "ಚೆನ್ನಾಗಿದ್ದಿನಿ Sir, ನೀವು ಹೇಗಿದ್ದಿರಾ?" అని క్షేమసమాచారం పంచుకొని, late అవుతోందని, తర్వాత మాట్లాడదాం అని చెప్పి తొందరగా departmentలోపలికి బయలుదేరా. "ಸರಿ sir, ಆಮೇಲೆ ಮಾತಾಡೋಣ" అంటూ ప్రసన్నంగా departmentలోకి సాగనంపాడు.

ఆయనెవరా? అయన SERC/CDS దగ్గర security guard, కనీసం 3-4 ఏళ్లుగా, అప్పటికి. PhD రోజుల్లో Late nights roomకి వచ్చేముందు కా...సేపు మాట్లాడితే చాలు, పాపం, తెగ సంబరపడిపోతాడు. ఒడిశా నుంచి వచ్చి, నెలకి కేవలం 8వేల జీతానికి పనిచేస్తూ, అందులోనే ఎంతోకొంత మిగిల్చి ఇంటికి పంపాలని బాగా ఇరుకు గదుల్లో ఉంటూ, ఏదో తింటూ, చాలామందే (post-office వెనకాల) బతుకుతున్నారని చెప్పేవాడు. ఏదోరకంగా సాయపడాలనే చిన్న ఇది వల్ల, friend చేసుకున్నా. అడిగి మరీ, నా institute wifi credentials share చేశా, అవసరమైతే తన friends (other guards) కూడా share చేయమని చెప్పా. IPL season అప్పుడు అయన ఆనందం చూడాలి (MSD fan). Security guard కాబట్టి ప్రతిరోజు న్యూజ్ (అయన యాసలో News) చూడాలి, workout చేయాలి అనేవాడు, చేసేవాడునూ. ఒకానొక శనివారం సాయంత్రం చీకటిపడ్డాక lab meeting ముగించుకొని ఆత్రంగా hostelవైపు (ఇంకో meetingకని) వెళ్లబోతుంటే duty చేస్తూ కనిపించాడు. Shift (second) అయిపోయాక M-blockలో నా room దగ్గరికి రమ్మని చెప్పా. 10:15కి, roomలో, మనోళ్లందరూ మూడు-నాలుగు రౌండ్స్ అవగొట్టి, మాంచి రచ్చరచ్చగా ఉన్నపుడు door కొట్టాడు. Open చేసిన మనోళ్లు, noise ఎక్కువై, securityకి అనుమానమొచ్చి check చేస్తున్నాడేమో అనుకొని కంగారుపడ్డారు. ఇప్పుడీయన గడ్డము పట్టుకొని బతిమాలుకోమన్నట్లు cornerలో ఉన్న నావైపు చూసారు, మరది నా రూమ్ కదా! కంగారు పడొద్దని చెప్పి, door వేయమని, ఆయన్నికూడా మాతో కూచోబెట్టుకొని, order చేసిన extra paradise single mutton biryani ఇచ్చి తినమన్నా. మా చేతుల్లో ఉన్న గ్లాసులు చూసి, security అయ్యిఉండి students చేస్తున్న ఇంత రచ్చలో involve అవడానికి ఆయనకి భయమేసి, just 2నిముషాలు కూచుని వెళ్తా, ఇంటికెళ్లి తింటా అన్నాడు పాపం. సరే అని ఇచ్చి పంపించాం, అందరూ relax అయ్యారు. ఆ తర్వాత జరిగిన IDCCలో security teamకి, practiceకి kit, matchesకి bats ఏ team supply చేసిందో మీరు easyగానే guess చేయొచ్చు.

సరే, back to present(ation)...

MRC దగ్గర తమిళ్ T తాగుతూ ఇదంతా చూస్తున్న మా lab-mate Ramగాడు, తాగడం అవజేసి, నా వెంటరాగా department లోపలికి enter అయ్యాం. Guideని కలవడం కంటే ముందు, officeలోకెళ్ళి, staff కోసం తెచ్చిన chocolates ఇవ్వడం చూసి, "మెట్ల దగ్గరినుంచి, మాట్లాడే మైకు దాకా మంచి కర్మ మూటగడుతున్నట్లు ఉన్నావ్!" అన్నాడు మావాడు. "మంచిదేగా" అనుకుంటూ ముందుకెళ్ళాం.

మన exam time తెలిసినందువల్ల "Good luck with your presentation!" అని సాయంత్రం కలవాల్సిన (interview) జనాల దగ్గరినుంచి message. కంగారు పడకండి, candidate నుంచి కాదు, వాళ్ళ uncle దగ్గరినుంచి (వాళ్ళ ఇల్లే interview location). comedy వరకు OKకానీ, అంత romance promise చేయలేం storyలో; just to set the expectations right. 

ఉన్న అరగంటలో slides చూడటం గట్రా పెట్టుకోలేం అని, తొందరగా guideకి ఓసారి కనిపించి, presentationకి set-up arrange చేస్తా అని చెప్పి, labలోకెళ్లి lab-matesకి కేవలం కనిపిం(చాననిపిం)చి అట్నుంచటే auditoriumకి బయలుదేరా. నావెంటే మా lab సైన్యమంతా వచ్చింది, అది rule, lab presentationsకి attendance mandatory. Laptop, projector set చేస్కుని మన శ్రేయోభిలాషుల ఆశీస్సులతో  దివ్యంగా కార్యక్రమం ముగించుకొని, guide, examinerతో faculty clubలో భోంచేసి, మళ్లీ departmentలో submit చేయాల్సిన forms అన్ని చేసి, hostelకి వచ్చేసరికి 3PM.

"ఛ! Interviewకి ఖచ్చితంగా lateగానే వెళ్లే"దని decide అయిపోయా. Immediateగా బయలుదేరినా easyగా 4 దాటేస్తుంది, మరి మనం స్నానం చేసి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంతలో మళ్ళీ వాళ్లే, ఈసారి call, వాళ్ళ vehicle పంపిస్తాం location share చేయమని. ఇదిగిదిగో, ఇదే VIP treatment అంటే. సెలవులకి ఇంటికెళ్తూ, "అర్ధరాత్రి bus ఉంది మచ్చా, bikeలో Hebbal police station దగ్గర దింప"మని అడిగే అలవాటుపడిన మనకి (Uber/Olaకి ముందు; పదిదాటాక బెంగుళూరులో city బస్సులు ఉండవని అలవాటు పడిన జీవితాలు), pick-upకి car పంపిస్తామంటే, "ఈ చిన్న చిన్న ఆనందాలే కదా జీవితమంటే" అనుకుంటాం. ఇదివరకే, మనమిచ్చే talks/tutorials కోసం company vehicles hostelకొచ్చి మరీ pick-up చేసుకున్న సందర్భాలున్నాయి. Concept same అయినా, context వేరబ్బా! Convince అవ్వండి.

స్వభావరీత్యా చాలా అల్పసంతోషులం కాబట్టి, అదేంవద్దని, "almost start అయిపోయా" అని సొల్లుచెప్పి, ready అవ్వడానికి సిద్ధమవుతున్నా. అవుతూనే ఆలోచిస్తున్నా, "అయినా, ఈ uncle ఏందీ, ఆయనేమో American citizen అంటాడు, candidate ఏమో కొంచెం modern అంటాడు, మొదటి round interviewకి family రచ్చ లేకుండా, సుబ్బరంగా ఏ cafeలోనో arrange చేయొచ్చు కదా! మనకి ఏ anxiety లేకుండా ఉండేది" అనుకుంటున్నా. "అయినా, ఇదే betterలే, మనకి జనాలతో అనుభవం అయినట్లు ఉంటుంది, పైగా, only aunt and uncle అన్నాడుగా, పెద్ద జనాలు ఉండరు కాబట్టి OK" అనుకుంటూ cab ఎక్కేసరికి 3:45PM. బెంగళూరు trafficలో ఈదుతూ interview locationకి వెళ్లేసరికి 4:35PM. Rich gated community, ఇంటిముందు Audi car, దానిపక్కన safari dressలో driver, ఇంటిలోపల తళతళలాడుతున్న furnishing, ఓడియమ్మ, uncle రచ్చ చేసాడుగా,  అవున్లే, green card అంటున్నాడు, companyకి GM అంటున్నాడు, ఈ మాత్రం శబ్దం చేస్తాడులే అనుకుంటున్నా. ఇంతలో....

(సశేషం)