Wednesday, June 23, 2010

కలగన్నానుగానీ....!


రాధ లాంటి రాగబంధమౌతావని కలగన్నానుగానీ,
ఇలా బాధ మిగుల్చు వాస్తవానివౌతావను కోలేదు;
నీ ప్రేమ చినుకులకు పల్లవించు కొత్త జన్మనౌతానను కున్నానుగానీ,
అవిలేక ఇలా మోడువారుతానను కోలేదు;
ప్రతిదినం నీ పరిష్వంగాన పసిపాప నౌదామనుకున్నానుగానీ,
ఇలా పరితపిస్తానను కోలేదు;
అనుక్షణం నీ అనురాగా న్నాస్వాదిస్తాననుకున్నాను గానీ,
ఇలా అలమటిస్తానను కోలేదు;
మనోవేదికపై నా అభిమానార్చనల నిన్నలరిస్తానని కలగన్నానుగానీ,
ఇలా మౌనంగా రోదిస్తానని కాదు...!

2 comments:

  1. చాలా బావుంది....
    >>నీ ప్రెమ చినుకులకు పల్లవించు కొత్త జన్మనౌతానను కున్నానుగానీ,
    అవిలేక ఇలా మోడువారతానను కోలేదు <<

    ReplyDelete